Putin calls murder of ally's daughter 'dastardly crime: రష్యా రాజధాని మాస్కో సమీపంలో కారు బాంబు దాడిలో పుతిన్ సన్నిహితుడి కుమార్తె మృతి చెందిన సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ హత్యను భయంకరమైన హత్యా నేరంగా పిలిచారు. వృత్తిపరమైన విధి నిర్వహణలో తన మిత్రుడు అలెగ్జాండర్ డుగిన్ కుమార్తె డార్యా డుగిన్ చూపించిన తెగువ, నిస్వార్థపూరితమైన సేవను ప్రశంసించారు. అంతేకాదు ఆమెకు మరణాంతరం ప్రతిష్టాత్మకమైన దేశ పురస్కార అవార్డును పుతిన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు అలెగ్జాండర్ డుగిన్ టెలీగ్రామ్ యాప్‌లో...తన కూతురు తన కళ్లముందే అత్యంత పాశవికంగా హత్య చేయబడింది. అయినప్పటికీ తమ హృదాయాలు ప్రతీకార కాంక్షను కోరుకోవు. తమకు కావల్సింది ఉక్రెయిన్ పై గెలుపు. తన కుమార్తె తన భావి జీవితాన్ని విజయ పీఠానికి అంకితం చేసింది. కాబట్టి రష్యా బలగాలు ఇప్పుడైన గెలిచేందుకుకు సిద్ధంకావాలంటూ సందేశం పంపిచారు.
తన కూతురు అందమైన ఆర్థోడాక్స్ మహిళ, రష్యా సెంట్రల్ టీవికి యుద్ధం గురించి సమాచారం అందించే టీవీ రిపోర్టర్, తత్వవేత్త అంటూ కూతురు గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. అలెగ్జాండర్ రష్యాన్ మాట్లాడే భూభాగాలను ఏకీకృతం చేసేందుకు ఈ హింసాత్మక యుద్ధానికి తెరలేపాడంటూ పలు విమర్శులు ఉన్నాయి. పైగా అతడి కుమార్తె కూడా ఉక్రెయిన్ పై జరుపుతున్న ప్రత్యేక సైనిక చర్యకు మద్దతు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఉక్రెయిన్ స్వాత్రంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది. ఈ తరుణంలో రష్యా ఏదైన విధ్యంసక చర్యకు పాల్పడే ప్రమాదం ఉందంటూ బలగాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ హెచ్చరికలు జారీ చేశారు.
(చదవండి: పుతిన్‌కు షాక్.. బాంబు దాడిలో ఉక్రెయిన్ యుద్ధ వ్యూహకర్త కుమార్తె దుర్మరణం!)
Comments
Please login to add a commentAdd a comment