 
													మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్న నాటి నుంచి వ్లాదిమిన్ పుతిన్ ప్రతీరోజు వార్తల్లో నిలుస్తున్నారు. ఇదే సమయంలో పుతిన్.. కుటుంబ సభ్యు గురించి కూడా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక, తాజాగా పుతిన్ రహస్య కుమార్తె తన పేరు మార్చుకుని పారిస్ లో ఉంటున్నారని సమాచారం. ఈ మేరకు పలు కథనాలు వెలువడ్డాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి మరో విషయం బయటకు వచ్చింది. పుతిన్, సెత్వాన్ క్రివోనోగిఖ్ కుమార్తె ఎలిజావేటా క్రివోనోగిఖ్ పేరు బయటకు వచ్చింది. ఎలిజావేటా ప్రస్తుతం తన పేరు మార్చుకుని లాయిజా రోజోవా అనే పేరుతో పారిస్ లో ఉంటున్నారని ఉక్రెయిన్ కు సంబంధించిన మీడియా పలు కథనాల్లో వెల్లడించింది. అయితే, ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రోజోవా రహస్యంగా పారిస్ లో ఉంటున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. వ్యాపారవేత్త అయిన సెత్వాన్ క్రివోనోగిఖ్(49) పుతిన్ భాగస్వామిగా ఉన్నారని మీడియాలో పలు కథనాలు వెల్లడయ్యాయి. ఇక, అంతకుముందు కూడా పుతిన్ మరో కూతురు కేథరిన్ టిఖోనోవా గురించి కూడా ప్రపంచానికి తెలిసింది. కేథరినా ఒక డ్యాన్సర్(జిమ్నాస్టిక్). ఆమె రష్యాకు చెందిన బిలియనీర్ ను వివాహం చేసుకుంది. వారిద్దరూ 2017లో విడిపోయారు.
🚨 Vladimir Putin has an illegitimate daughter living under a pseudonym in Paris where she works as a DJ: pic.twitter.com/twtwfxWqyM
— Emmanuel Rincón (@EmmaRincon) November 29, 2024

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
