Vladimir Putin Daughter Katerina Reveals About Her Dating With Zelensky, Details Inside - Sakshi
Sakshi News home page

Vladimir Putin Daughter Katerina: ‘జెలెన్‌ స్కీ’తో పుతిన్‌ కూతురు డేటింగ్‌‌.. ఆమె అక్కడికి 50 సార్లు అందుకే వెళ్లిందా..?

Published Sun, May 22 2022 6:21 PM | Last Updated on Sun, May 22 2022 6:43 PM

Vladimir Putin Daughter Katerina Dating With Zelensky - Sakshi

ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పుతిన్‌ ఆరోగ్యంపై పలు వార్తలు చక్కర్లుకొడుతుండగా.. ఆయన పర్సనల్‌ లైఫ్‌, ఫ్యామిలీ విషయాలు గురించి తెలుసుకునేందుకు ప్రపంచం చాలా ఆశక్తి కనబర్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ అందరినీ షాక్‌కు గురిచేసింది. పుతిన్‌ కూతురుకు సంబంధించిన సీక్రెట్‌ లవ్‌ ఎఫైర్‌ న్యూస్‌ ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

వివరాల ప్రకారం.. పుతిన్‌ కుమార్తె, మాజీ డ్యాన్సర్ కేథరినా టిఖోనోవా.. జర్మనీలోని మ్యూనిచ్‌కు చెందిన బ్యాలెట్ డ్యాన్సర్ ఇగోర్ జెలెన్స్కీ(52)తో డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా కేథరినా- ఇగోర్ జెలెన్స్కీలకు ఓ బిడ్డ కూడా పుట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు బయటకు వచ్చాయి. వీరి లవ్‌ స్టోరికి సంబంధించిన కొన్ని వివరాలను కూడా బహిర్గతం చేశాయి. అయితే, పుతిన్‌ కూతురు కేథరినా 2017-19 మధ్య కాలంలో తన ప్రియుడిని కలిసేందుకు ఏకంగా 50 సార్లు జర‍్మనీకి వెళ్లినట్టు రష్యా స్వతంత్ర మీడియా సంస్థ ‘ఐస్టోరిస్(iStoris)’ ఓ ప్రకటనలో పేర్కొంది. మాస్కో నుంచి జర్మనీకి వెళ్లిన పత్రాలు కూడా బయటకు వచ్చాయి.

ఇదిలా ఉండగా.. అంతకుముందే కేథరినా టిఖోనోవా.. రష్యన్‌ యంగ్‌ బిలియనీర్‌ కిరిల్‌ శామాలోవ్‌(40)ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2017లో వివాహం బంధం నుంచి విడిపోయారు. ఇక, కేథరినా ప్రియుడు ఇగోర్ జెలెన్స్కీ ప్రముఖ డ్యాన్సర్ కాగా.. 2022 ఏప్రిల్ వరకు బేరిషెస్ స్టాట్స్‌బాల్ డైరెక్టర్‌గా ఉన్నారు. వ్యకిగత కారణాల వల్ల జెలిన్స్కీ ఏప్రిల్ 4న ఆ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు, జెలెన్స్కీ రష్యన్ నేషనల్ కల్చరల్ హెరిటేజ్ ఫౌండేషన్ యొక్క పర్యవేక్షణ బోర్డులో కూడా పనిచేస్తున్నారు. ఇక, ఉక్రెయిన్‌లో రష్యా దాడుల తర్వాత పుతిన్ ఒలింపిక్ పతక విజేత జిమ్నాస్ట్ అలీనా కబెవాతో ఉన్న సీక్రెట్‌ లవ్‌ స్టోరి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: మరోసారి వార్తల్లో నిలిచిన చైనా.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement