మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు హెచ్చరికలు జారీ చేశాడు. శత్రు దేశంతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు ఆయుధాల సరాఫరాను పెంచవద్దని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. చెప్పిన మాట వినకుండా ఆయుధాలు సరాఫరా చేస్తే పాశ్యాత్య దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని హెచ్చరించాడు. ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా ప్రమాదకరమని, దీని ద్వారా మానవతా సంక్షోభాన్ని తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని అన్నారు. ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తున్న ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని అన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ను పూర్తిగా తమ వశం చేసుకునేంత వరకు రష్యా దాడులు ఆపేలా లేదు. ఇప్పటికే ఈ యుద్ధం ద్వారా రెండు దేశాలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది. అనేక మంది సామన్య ప్రజలు నలిగిపోతున్నారు. ఇక పరోక్షంగా యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ముడి చమురు, గోల్డ్, దిగుమతులు, స్టాక్ మార్కెట్‌ల పతనం అన్నింటిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో రష్యా యుద్ధం ఆపేలా ఉక్రెయిన్ సహా పలు దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం రావడం లేదు. ఇక యుద్ధం ఎప్పుడు ముగుస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చదవండి: ప్రధాని మోదీ పర్యటన.. కొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయం తీసుకున్న జపాన్ ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment