Love affaiir
-
ఒంటరితనం భరించలేక.. యువతి తీవ్ర నిర్ణయం..!
సంగారెడ్డి: ఒంటరితనం భరించలేక యువతి తనువు చాలించిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెంకు చెందిన నూనె ధనూజ(21) రెండు నెలల క్రితం బ్రాంచ్ పోస్టు ఉమెన్‌గా ఉద్యోగం సాధించింది. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా చందుర్తి మండలం మర్రిగడ్డకు వచ్చింది. రెండు నెలలుగా మర్రిగడ్డలో అద్దె ఇంట్లో ఉంటూ విధులు నిర్వర్తిస్తుంది. ఈక్రమంలో వరుసకు బావ అయిన రాకేశ్‌ను ప్రేమిస్తుంది. ఒంటరితనంతో బాధపడుతున్నానని రాకేశ్‌తో చెప్పుకోగా.. ఉద్యోగానికి రాజీనామా చేసి రమ్మనడంతో గత నెల 31న రాజీనామా పత్రాన్ని సమర్పించింది. రెండు రోజులగా స్థానికంగా లేని ధనూజ శుక్రవారం మర్రిగడ్డలో అద్దెకుంటున్న ఇంటికి సామగ్రి తీసుకెళ్లేందుకు వచ్చింది. అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూనే తల తిప్పుతుందని చెప్పి ఫోన్ కట్ చేసింది. వెంటనే రాకేశ్ మర్రిగడ్డలోని తెలిసిన వ్యక్తులకు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. శనివారం తెల్లవారుజామున మర్రిగడ్డకు చెందిన మరొక వ్యక్తికి రాకేశ్ ఫోన్ చేసి ధనూజ ఇంటికెళ్లి చూసి రావాలని కోరాడు. సదరు వ్యక్తి వెళ్లి పిలువగా గదిలో నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇంటి పైకప్పు ఎక్కి చూడగా ఉరివేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి నూనె మమత ప్రేమ వ్యవహారమే తన కూతురు మరణానికి కారణమని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేయసిని దూరం చేశాడనే..
హైదరాబాద్: తన ప్రేయసిని దూరం చేయడమే కాకుండా మరొకరికి ఇచ్చి పెళ్లి చేశాడని కక్ష పెంచుకున్న ఓ యువకుడు తన అనుచరులతో కలిసి ఓ యువకుడిపై కత్తులతో దాడి చేసిన ఘటనలో జూబ్లీహిల్స్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ శ్రీరాం గోపి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన జబాన్ రాహుల్ వెంకటగిరిలో నివాసం ఉంటూ సమీపంలోని సాంక్చువరీ బార్ అండ్ కిచెన్‌లో చెఫ్‌గా పని చేస్తున్నాడు. ఏడాది క్రితం అదే ప్రాంతానికి చెందిన రేఖారాణి అనే యువతి అదే ప్రాంతంలో అద్దెకు ఉంటున్న సంజీవ్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే వారి మధ్య విభేదాలు రావడంతో ఆమె కేశవ్ అనే మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఒడిశాకు వెళ్లి పోయింది. వీరి పెళ్లికి రాహుల్ సహకారం అందించాడు. అప్పటి నుంచే రాహుల్‌పై కక్ష పెంచుకున్న సంజీవ్ అతడిపై దాడికి పథకం వేశాడు. నాలుగు రోజుల క్రితం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న రాహుల్‌ను సంజీవ్‌తో పాటు అతడి అనుచరులు ధన్‌కుమార్ బారం, మహేశ్వర్ అడ్డగించి కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. వీరి సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా ఎస్సైతో ప్రేమ.. ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూనే గదిలోకి వెళ్లి
తమిళనాడు: మహిళా ఎస్ఐతో ప్రేమ వ్యవహారంలో మనస్పర్థలు రావడంతో ఎస్ఐ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన తిరుపత్తూరు జిల్లాలో జరిగింది. వివరాలు.. ధర్మపురి జిల్లా ఆరూర్‌కు చెందిన రాజ్‌కుమార్(27) 2021లో సబ్ ఇన్స్పెక్టర్గా చేరారు. ఏడు నెలలుగా తిరుపత్తూరు జిల్లా వానియంబాడి టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈయన తిరుపత్తూరు జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా సబ్ ఇన్స్పెక్టర్ను ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమకు రాజ్‌కుమార్ తల్లిదండ్రులు వ్యతిరేక తెలిపారు. మంగళవారం రాత్రి రాజ్‌కుమార్‌తో పాటు ఇన్స్పెక్టర్ దురైరాజ్, కానిస్టేబుల్ విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో రాజ్‌కుమార్‌కు ప్రియురాలికి ఫోన్ చేశారు. పోలీస్‌స్టేషన్ బయటకు వెళ్లి వీడియో కాల్లో మాట్లాడారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన రాజ్‌కుమార్ ఫోన్లో మాట్లాడుతూనే స్టేషన్‌లోపలికి వెళ్లి తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. గమనించిన సహ పోలీసులు తలుపులు తెరిచి ఆయన్ను కిందకు దించారు. డీఎస్పీ విజయకుమార్‌కు సమాచారం అందజేశారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. -
బావతో ప్రేమ.. అంతా బాగుంది అనుకునేలోపే చివరికి!
విజయనగరం: ప్రియుడు లేని లోకంలో తాను జీవించలేనని, తన జీవితం వ్యర్థమైపోయిందని మనస్తాపం చెందిన ఓ యువతి గన్నేరుపిక్కలు తిని ఆత్మహత్యకు పాల్పడింది. గుమ్మలక్ష్మీపురం మండలంలో జరిగిన ఈ విషాద సంఘటనపై ఎల్విన్‌పేట ఎస్సై ఎస్.షన్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డొంగరికిక్కువ గ్రామానికి చెందిన కోలక కిశోర్ పాముకాటుకు గురై చికిత్సపొందుతూ వారం క్రితం మృతిచెందాడు. వరుసకు బావ అయిన కిశోర్‌తో ప్రేమలో ఉన్న అదే గ్రామానికి చెందిన తాడంగి పుష్పవతి (19) కిశోర్ మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గన్నేరుపిక్కలు నూరి మింగేసింది. అపస్మారక స్థితిలో ఉన్న పుష్పవతిని గుర్తించిన కుటుంబసభ్యులు కురుపాం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్య సేవల అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి తండ్రి చిన్నప్పుడే చనిపోగా తల్లి లక్ష్మి అన్నీ తానై చూసుకునేది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పురుగు మందు తాగి యువకుడు.. బొబ్బిలి: మండలంలోని రెడ్డియ్యవలసకు చెందిన సొంగలి గణేష్(21) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. డిగ్రీ పూర్తిన గణేష్ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఏమైందో ఏమో కానీ బుధవారం రాత్రి పురుగు మందు తాగేశాడు. ఈ విషయం గుర్తించిన కుటుంబసభ్యులు బొబ్బిలి సీహెచ్‌సీకి గణేష్‌ను తీసుకురాగా ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సిఫార్సు మేరకు విజయనగరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలపై కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చీమల మందు తాగి వ్యక్తి.. పాచిపెంట: భార్య మందలించిందని మనస్తాపానికి గురైన వ్యక్తి చీమల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం పాచిపెంట మండలంలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పద్మాపురం పంచాయతీ పిండ్రంగివలస గ్రామానికి చెందిన డి.రాజు మద్యానికి బానిసై భార్యతో తరచు గొడవపడేవాడు. ఈ క్రమంలో పదిరోజులక్రితం భార్యతో గొడవ పడగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. బుధవారం ఉదయం మద్యం తాగిన రాజు భార్య వద్దకు వెళ్లి ఇంటికి రావాలని కోరగా నిరాకరించింది. దీంతో మనస్తాపం చెంది సాయంత్రం చీమల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సాలూరు ఏరియాఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై ముసలయ్య తెలిపారు. -
యువతి ప్రాణం తీసిన ప్రేమోన్మాది
అన్నానగర్: యువతిని గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన ధర్మపురిలో చోటుచేసుకుంది. ఓల్డ్ రైల్వే లైన్ ప్రాంతానికి చెందిన భువనేశ్వరన్ కుమార్తె హర్ష (23) బుధవారం ఉదయం అతియామాన్కోట పోలీస్‌స్టేషన్ పరిధిలోని కదురన్ కోటై నరసింగపురం కొంబై అటవీ ప్రాంతంలో హత్యకు గురైంది. పక్కనే ట్రావెల్ బ్యాగ్ పడి ఉంది. అటుగా వెళుతున్న ప్రజలు అదియమాన్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హర్ష మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ధర్మపురి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఆ ప్రాంత ప్రజలను విచారించారు. మంగళవారం సాయంత్రం ఆ ప్రాంతంలో ఓ యువకుడు హర్షతో మాట్లాడుతుండగా వాగ్వాదానికి దిగాడని తెలిపారు. కాగా యువకుడిని పెళ్లి చేసుకోవడానికి హర్ష ఇంటి నుంచి వెళ్లిందని.. అయితే అతను నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో గొంతు కోసి హత్య చేసి పారిపోయాడని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రియుడి కోసం గాలిస్తున్నారు. -
కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన హీరోయిన్, రొమాంటిక్ పిక్స్ వైరల్
ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్. నటిగా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటామని ప్రకటించిన అమీ నుంచి ఇప్పటివరకు ఏ సమాచారం లేదు. అయితే అమీ జాక్సన్ బ్రిటీష్ నటుడు ఎడ్వెస్ట్విక్తో డేటింగ్లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ వార్తలపై ఏనాడు రియాక్ట్ కాలేదు ఆమె. చదవండి: పొలిటికల్ లీడర్‌ను పెళ్లాడిన హీరోయిన్ తాజాగా ఆ పుకార్లనే నిజం చేస్తూ కొత్త ప్రియుడిని పరిచయం చేసింది. ఎడ్వెస్ట్విక్తో ప్రేమలో ఉన్నట్టు వాలంటైన్స్ డే సందర్బంగా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఎడ్వెస్ట్వీక్తో దిగిన పలు రొమాంటిక్ పిక్స్‌ను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ వాలంటైన్స్ డే బేబీ, నీ అంతులేని ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని జత చేసింది. దీంతో ఆమె పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు క్యూట్ కపుల్ అంటూ హార్ట్ ఎమోజీలతో స్పందిస్తూంటే మరికొందరు ఆమె తీరుపై విమర్శిస్తున్నారు. పెళ్లి కాకుండానే సహజీవనం, బిడ్డకు జన్మనివ్వడం.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమయాణం ఏంటని తప్పుబడుతున్నారు. చదవండి: బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్.. ఆ స్టార్ డైరెక్టర్‌ను ఉద్దేశించేనా? View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) -
సీఐతో మహిళా ఎస్ఐ ప్రేమ వ్యవహారం.. సీపీ సంచలన నిర్ణయం
వరంగల్ క్రైం: మహిళా ఎస్ఐ పెళ్లయి నెలరోజులైంది. కానీ, అంతకుముందు ఉన్న పరిచయం కారణంగా ఓ ఇన్స్పెక్టర్తో కలిసి ‘హద్దులు’వీురింది. వీరి ప్రేమ వ్యవహారం భర్తకు తెలియడంతో బట్టబయలైంది. అదేవిధంగా లైంగిక వేధింపులతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన యువతిని మరో ఎస్ఐ.. పట్టించుకోకుండా రాజీపడాలి్సందిగా ఉచిత సలహా ఇచ్చా డు. వీరి చర్యలను సహించని సీపీ రంగనాథ్ మంగళవారం ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు. కమిషనరేట్ పరిధిలో ఇక ఏమి జరిగినా కఠిన చర్యలు తప్పవన్న సంకేతం ఇచ్చారు. వచ్చిన నెలరోజుల్లోనే దిద్దుబాటు చర్యలకు దిగడంతో నిబంధనలు అతిక్రమించే పోలీసుల్లో భయం పట్టుకుంది. క్రమశిక్షణకు మారుపేరు పోలీస్ శాఖ. కానీ కొంతమంది అధికారులు హద్దు మీరి ప్రవర్తించడం ఆ శాఖకు తలవంపులు తెచ్చిపెడుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుగొండ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, దామెర సబ్ ఇన్స్పెక్టర్ హరిప్రియలు హద్దు మీరి ప్రవర్తించడంతో ఇరువురిని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేయడం కమిషనరేట్ పరిధిలో సంచలనం కలిగించింది. ఎస్ఐ హరిప్రియకు ఇటీవల పెళ్లయ్యింది. కానీ.. ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై హరిప్రియ మధ్య కొంత కాలంగా ప్రేమాయణం సాగుతోంది. ఆమె ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో ఫోన్లో వాట్సాప్ చాటింగ్ గమనించాడు. దీని ఆధారంగా సీపీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో విచారణ చేపట్టిన సీపీ.. వాస్తవమని తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. రాజీ కుదుర్చుకోండని ఉచిత సలహా.. సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పి.పున్నంచందర్ ఓ యువతి ఫిర్యాదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనపై వేటు పడింది. స్టేషన్ పరిధిలో ఉండే ఓ యువతి కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్పందించాలి్సన ఎస్సై పున్నంచందర్ నిందితుడిపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతోపాటు రాజీ పడాలని ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన అధికారులు సీపీకి నివేదిక సమర్పించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నెల రోజుల్లో ఐదుగురిపై వేటు.. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా డిసెంబర్ 3న బాధ్యతలు స్వీకరించిన సీపీ రంగనాథ్.. నెల రోజుల్లోనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐదుగురిపై వేటు వేయడం కమిషనరేట్‌లో కలకలం సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ దొంగతనం విషయంలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా దొంగ పరారయ్యాడు. ఈ వ్యవహారంలో కానిస్టేబుల్ మోహన్ నాయక్‌పై సస్పెన్షన్ వేటు పడగా, అడ్మిన్ ఎస్సై సంపత్‌ను ఏఆర్‌కు అటాచ్డ్ చేశారు. తాజాగా ముగ్గురిని సస్పెండ్ చేశారు. గతంలోనూ ప్రేమాయణాలు.. కమిషనరేట్‌లోని పోలీస్ అధికారుల ప్రేమాయణాలు కొత్తేమి కాదు. మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు సీబీసీఐడీలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్పై సుబేదారి పోలీసులు అక్రమాస్తులు, నేరపూరిత బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. సీబీ సీఐడీ ఇన్స్పెక్టర్, రవి, తన మహిళా సహోద్యోగి అయిన ఇన్స్పెక్టర్తో కలిసి హనుమకొండలోని రాంనగర్‌లోని ఆమె ఇంట్లో ఉండగా భర్త అయిన మహబూబాబాద్ సీఐ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీబీసీఐడీ ఇన్స్పెక్టర్, మహిళా ఇన్స్పెక్టర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. గీసుకొండ మండలంలో సంబరాలు గీసుకొండ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు పడిందన్న సమాచారంతో గీసుకొండ మండలం మణుగొండ, కొమ్మాలగ్రామాల్లో యువకులు బాణసంచా కాల్చి సీపీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. -
చెల్లెలిని ప్రేమించాడన్న కోపంతో ఓ అన్న..
జమ్మికుంట(హుజూరాబాద్): చెల్లెలిని ప్రేమించాడన్న కోపంతో ఓ అన్న.. తన బంధువును కత్తితో గొంతు కోసి, అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లికి చెందిన మంద సంతోష్(30), మోత్కులగూడెంకు చెందిన జీడీ శివకృష్ణ అలియాస్ చిరంజీవి బంధువులు. వీరు పేయింటింగ్ వర్క్ చేస్తుంటారు. సంతోష్‌కు గతంలో పెళ్లి జరిగింది. కానీ అతని భార్య కాపురానికి రావడం లేదు. ఈ క్రమంలో అతను శివకృష్ణ చెల్లెలితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లిపోయారు. తన చెల్లెలు అదృశ్యమైందని శివకృష్ణ గత అక్టోబర్ 24న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరుపుతున్న క్రమంలో సంతోష్ ఆమెతో జమ్మికుంట చేరుకున్నాడు. వీరి ప్రేమ వ్యవహారంపై ఇరు కుటుంబాల మధ్య పంచాయితీ జరగడంతో సమస్య పరిష్కారమైంది. కానీ సంతోష్ ఆ తర్వాత కూడా ఆమెతో సఖ్యతగా ఉంటున్నాడని శివకృష్ణ అనుమానించాడు. ఈ నేపథ్యంలో అతను బుధవారం మరో ముగ్గురితో కలిసి పేయింటింగ్ పనులు చేశాడు. రాత్రి గాంధీచౌక్‌లోని సో హాన్ వైన్స్ పర్మిట్ రూమ్‌లో నలుగురూ మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో సంతోష్ అక్కడికి వచ్చి, వారితో కలిసి మద్యం సేవిస్తుండగా శివకృష్ణ కత్తితో ఒక్కసారిగా అతని గొంతు కోశాడు. ఈ ఘ టనతో పక్కనున్నవారు ఉలిక్కిపడ్డారు. సంతోష్‌ను తీసుకొని, పోలీస్‌స్టేషన్‌కు పరుగు పెట్టారు. అప్పటి కే తీవ్ర రక్తస్రావం జరిగి, అతను అపస్మారక స్థితి లోకి వెళ్లాడు. పోలీసులు తమ వాహనంలో జమ్మికు ంట ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందా డు. శివకృష్ణ పోలీసులకు లొంగిపోయాడు. -
షైనీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా?
విజయనగరం క్రైమ్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయత్పూర్కు చెందిన చింపి షైనీ (20)స్థానిక తోటపాలెంలో ఆదివారం వేకువజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. చింపి షైనీ విశాఖలోని ప్రైవేట్హోటల్లో పనిచేస్తోంది. ఆమె మరో ఇద్దరు యువతులతో కలిసి విజయనగరంలోని తోటపాలెం షిర్డీసాయినాథ్ కాలనీలో నెలరోజుల క్రితం అద్దెకు దిగింది. వారు ముగ్గురూ శనివారం రాత్రి పార్టీ చేసుకుని అర్ధరాత్రి 2.30 గంటలకు నిద్రలోకి జారుకున్నారు. ఆదివారం ఉదయం 6.30గంటల ప్రాంతంలో ఇంటి యజమాని చూసేసరికి షైనీ బెడ్రూంలో కిటికికీ చున్నీ బిగించుకుని ఉరివేసుకుంది. అయితే ఆమె అనాథ. ఆత్మహత్యకు ప్రేమవ్యవహారం కారణమై ఉంటుందా? లేక ఏదైనా వ్యవహారంలో మనస్తాపం చెందిందా? ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటియజమాని ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్సై విజయ్ సంఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేసి కేసు నమోదు చేశారు. -
నిఖిల్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమా?
సూర్యాపేట క్రైం/చిలుకూరు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన చిలుకూరు మండలం ఆర్లెగూడెం గ్రామ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్, అడ్వకేట్ ధరావత్ భాస్కర్ కుమారుడు నిఖిల్(24) హైదరాబాద్‌లో ఉంటూ ఇటీవల ఎల్ఎల్బీ పూర్తిచేశాడు. దసరా సెలవులకు హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వచ్చాడు. నిఖిల్ ఈ నెల 9వ తేదీన సాయంత్రం తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. అదే రోజు రాత్రి 11గంటల సమయంలో ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఫోన్ చేసి చాలా సమయం అవుతున్నా ఇంటికి చేరుకోలేదు. దీంతో నిఖిల్ తల్లి అతడికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆ రోజు నుంచి తమ కుమారుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు వెతుకుతున్నారు. కాగా మంగళవారం ఉదయం ఆర్కే మేజర్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం కొట్టుకుని వస్తుండగా రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం తెలుసుకున్న నిఖిల్ తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని చనిపోయింది తమ కుమారుడేనని నిర్ధారణ చేసుకున్నారు. ప్రేమ వ్యవహారంతోనే తన కుమారుడిని హత్య చేశారని మృతుడి తండ్రి భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా కోదాడ రూరల్ సీఐ నాగదుర్గాప్రసాద్ తెలిపారు. కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనట్లు పేర్కొన్నారు. ముమ్మరంగా పోలీసుల విచారణ.. నిఖిల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిఖిల్ శరీరంపై తీవ్రంగా గాయాలుండడంతో మృతికి గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిఖిల్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమంటూ అతని తల్లితండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండుళ్లుగా సూర్యాపేటకి చెందిన ఒక వ్యాపారి కుమార్తెతో ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లుగా సమాచారం. అయితే కులాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు నిఖిల్ అక్క తెలిపారు. దీనిపై అమ్మాయి తండ్రిని పోలీసులు విచారించి పంపినట్లు సమాచారం. దీనితో పాటు గతంలో అదే అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి నిఖిల్‌తో అమ్మాయి సన్నిహితంగా ఉండడంతో అతనే హత్య చేసినట్లుగా అమ్మాయి తల్లితండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. దీనితో పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని సీఐ రాజశేఖర్ తెలిపారు. -
ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థినిని తుపాకీతో కాల్చి పరార్!
పాట్నా: తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ ప్రేమోన్మాది 15 ఏళ్ల బాలికను దారికాచి తుపాకీతో కాల్చాడు. మెడపై తూటా దిగటంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది బాధితురాలు. ఈ దుశ్చర్య బిహార్ రాజధాని పాట్నాలో బుధవారం జరిగింది. బాలికపై తుపాకీ పేల్చుతున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బ్యూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రపురి ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది. కూరగాయలు విక్రయించే వ్యక్తి కుమార్తె 9వ తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రేమించాలని వెంటపడుతున్నాడు. అతడి ప్రేమను తిరస్కరించిందనే కోపంతో తుపాకీతో వచ్చాడు. బాలిక అతడితో మాట్లాడకుండా వెళ్లగా వెనక నుంచి మెడపై కాల్చాడు. తూటా దిగటంతో బాలిక అక్కడే పడిపోయింది. ఆ తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. యువతి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణంగా పోలీసులు తెలిపారు. Bihar| A vegetable vendor’s daughter shot yesterday in Indrapuri locality of Sipara area of Beur PS in Patna. Injured girl who was shot in the neck is undergoing treatment in a private hospital. Matter is being said to be a love affair: Patna Police (Visuals: CCTV footage) pic.twitter.com/kHbddcU2L1 — ANI (@ANI) August 18, 2022 ఇదీ చదవండి: లఖింపుర్‌లో 72 గంటల ఆందోళన.. యూపీకి 10వేల మంది రైతులు -
పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం
Is Amy Jackson Confirms Her Relationship With Ed Westwick: ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే బ్యూటీఫుల్ హీరోయిన్ అమీ జాక్సన్. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటామని ప్రకటించిన అమీ నుంచి ఇప్పటివరకు ఏ సమాచారం లేదు. అయితే అమీ జాక్సన్ బ్రిటీష్ నటుడు ఎడ్వెస్ట్విక్తో డేటింగ్లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ వార్తలపై ఏనాడు రియాక్ట్ కాలేదు అమీ. ఇదివరకు లండన్‌లో అతనితో చెట్టాపట్టాలేసుకోని తిరిగిన ఫొటోలు వారు ప్రేమలో ఉన్నారని చెప్పకనే చెప్పినట్లైంది. తాజాగా ఎడ్వెస్ట్విక్తో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అయిన ఈ ఫొటోలు చూస్తుంటే వారు ప్రేమలో ఉందన్న వార్తలు దాదాపు కన్ఫమ్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్ View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) -
తండ్రి ఉసురు తీసిన ‘తనయుడి ప్రేమ’
డిండి: కుమారుడి ప్రేమ వ్యవహారం తండ్రి ఆత్మహత్యకు దారితీసింది. నల్లగొండ జిల్లా డిండికి చెందిన మాధమోని కృష్ణయ్య(38), సైదమ్మ దంప తులకు కుమారుడు సాయి, ఇద్దరు కుమార్తెలు. సాయి చేపలవేట సాగిస్తూ ఆర్నెల్లుగా తల్లిదం డ్రులకు దూరంగా నాయనమ్మతో కలిసి ఉంటు న్నాడు. సాయి అదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతోన్న బాలికను మూడేళ్లుగా ప్రేమిస్తు న్నాడు. కాగా, సదరు బాలికకు ఇంట్లో పెళ్లి సం బంధాలు చూస్తుండటంతో ఏప్రిల్ చివరి వారంలో సాయి, బాలిక కలిసి శ్రీశైలం పారిపోయారు. ఇరు కుటుంబాల సభ్యులు వారిద్దరినీ డిండికి తీసుకొచ్చి కుల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి.. ఇలాంటిది పునరావృతం కావొద్దని సర్ది చెప్పారు. మళ్లీ పారిపోయారు.. బాలికకు మే 3న నిశ్చితార్థం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో సాయి, సదరు బాలిక మే 2న రాత్రి మళ్లీ ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో సాయిపై బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. సాయి, సదరు బాలిక తమ సెల్ఫోన్లు ఇంట్లోనే వదిలి వెళ్లడంతో వారిని గుర్తించటం పోలీ సులకు కష్టంగా మారింది. ఫిర్యాదు చేసి నెలరోజులు దాటినా తమ కుమార్తె ఆచూకీ కనిపెట్టడం లేదని బాలిక తల్లి తన బంధువులతో కలిసి పోలీసులపై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో కృష్ణయ్య, సైదమ్మ దంపతులను ప్రతీరోజు స్టేషన్‌కు పిలిపించి తమ కొడుకు ఆచూకీ చెప్పాలని పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చారు. ఒత్తిడి తట్టుకోలేక.. ఒకవైపు తన కొడుకు జాడ తెలియక, మరోవైపు బాలిక తల్లి, బంధువుల సూటిపోటిమాటలు, పోలీ సుల ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణయ్య శనివారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి కృష్ణయ్య ను నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కృష్ణయ్య మృతితో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు బాలిక తల్లిపై, వారి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. బాలిక తల్లి, బంధువుల వేధింపులతో పాటు పోలీసుల ఒత్తిడి కారణంగానే కృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. అయితే సాయి ఆచూకీ తెలిస్తే తమకు చెప్పాలని మాత్రమే కృష్ణయ్య, సైదమ్మ దంపతులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించామని పోలీసులు చెబుతున్నారు. -
‘జెలెన్ స్కీ’తో పుతిన్ కూతురు డేటింగ్.. భర్తతో విడాకుల తర్వాత..
ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పుతిన్ ఆరోగ్యంపై పలు వార్తలు చక్కర్లుకొడుతుండగా.. ఆయన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ విషయాలు గురించి తెలుసుకునేందుకు ప్రపంచం చాలా ఆశక్తి కనబర్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అందరినీ షాక్‌కు గురిచేసింది. పుతిన్ కూతురుకు సంబంధించిన సీక్రెట్ లవ్ ఎఫైర్ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. పుతిన్ కుమార్తె, మాజీ డ్యాన్సర్ కేథరినా టిఖోనోవా.. జర్మనీలోని మ్యూనిచ్కు చెందిన బ్యాలెట్ డ్యాన్సర్ ఇగోర్ జెలెన్స్కీ(52)తో డేటింగ్లో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా కేథరినా- ఇగోర్ జెలెన్స్కీలకు ఓ బిడ్డ కూడా పుట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు బయటకు వచ్చాయి. వీరి లవ్ స్టోరికి సంబంధించిన కొన్ని వివరాలను కూడా బహిర్గతం చేశాయి. అయితే, పుతిన్ కూతురు కేథరినా 2017-19 మధ్య కాలంలో తన ప్రియుడిని కలిసేందుకు ఏకంగా 50 సార్లు జర్మనీకి వెళ్లినట్టు రష్యా స్వతంత్ర మీడియా సంస్థ ‘ఐస్టోరిస్(iStoris)’ ఓ ప్రకటనలో పేర్కొంది. మాస్కో నుంచి జర్మనీకి వెళ్లిన పత్రాలు కూడా బయటకు వచ్చాయి. ఇదిలా ఉండగా.. అంతకుముందే కేథరినా టిఖోనోవా.. రష్యన్ యంగ్ బిలియనీర్ కిరిల్ శామాలోవ్(40)ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2017లో వివాహం బంధం నుంచి విడిపోయారు. ఇక, కేథరినా ప్రియుడు ఇగోర్ జెలెన్స్కీ ప్రముఖ డ్యాన్సర్ కాగా.. 2022 ఏప్రిల్ వరకు బేరిషెస్ స్టాట్స్బాల్ డైరెక్టర్‌గా ఉన్నారు. వ్యకిగత కారణాల వల్ల జెలిన్స్కీ ఏప్రిల్ 4న ఆ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు, జెలెన్స్కీ రష్యన్ నేషనల్ కల్చరల్ హెరిటేజ్ ఫౌండేషన్ యొక్క పర్యవేక్షణ బోర్డులో కూడా పనిచేస్తున్నారు. ఇక, ఉక్రెయిన్‌లో రష్యా దాడుల తర్వాత పుతిన్ ఒలింపిక్ పతక విజేత జిమ్నాస్ట్ అలీనా కబెవాతో ఉన్న సీక్రెట్ లవ్ స్టోరి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. Katerina Tikhonova, 35, #Putin's younger daughter, has been in a relationship with a 52-year-old ballet dancer in Germany, and is now pregnant with his child. His name is Igor Zelensky, so Putin's grandchildren will presumably carry that name. https://t.co/8hAXpGGNyf — Kyle Orton (@KyleWOrton) May 21, 2022 ఇది కూడా చదవండి: మరోసారి వార్తల్లో నిలిచిన చైనా.. వీడియో వైరల్ -
మాట్లాడుకుందామని యువతిని లాడ్జికి రమ్మన్నాడు.. ఆ తర్వాత..
సాక్షి, విశాఖపట్నం: ఒక యువతిపై ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన విశాఖ పట్నంలో కలకలంగా మారింది. హర్షవర్ధన్ రెడ్డి అనే యువకుడు.. యువతిని మాట్లాడేందుకు రమ్మని లాడ్జికి రమ్మన్నాడు. ఈ క్రమంలో లాడ్జికి చేరుకున్న యువతిపై.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తన ప్రేమను నిరాకరించినందుకే హర్షవర్ధన్ రెడ్డి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన విశాఖలోని శ్రీ రాఘవేంద్ర లాడ్జిలో నిన్న సాయంత్రం జరిగింది. హన్మకొండకు చెందిన యువకుడు హర్షవర్ధన్ రెడ్డి, విశాఖకు చెందిన సదరు యువతి పంజాబ్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఈ క్రమంలో యువకుడు నిన్న యువతిని లాడ్జికి రమ్మన్నాడు. వారి మధ్య గొడవ సంభవించినట్లు తెలుస్తోంది. దీంతో యువకుడు యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. లాడ్జిరూమ్ నుంచి పొగలు రావడంతో.. సిబ్బంది మంటలను ఆర్పేశారు. పోలీసులకు సమాచారం అందించి.. గాయపడిన ఇద్దరిని విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నా చావుతోనైనా కుటుంబానికి రక్షణ కల్పించండి
సాక్షి, బయ్యారం: ‘ప్రేమించిన పాపానికి నాపై లైంగిక దాడికి యత్నించారు. కిడ్నాప్ కూడా చేయబోయారు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్తున్న మా నాన్నను అన్యాయంగా జైలుకు పంపారు. నాతో పాటు నా కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. నా చావుతోనైనా కుటుంబానికి రక్షణ కల్పించండి సారూ. అమ్మా.. నాన్నా మీరు క్షేమంగా ఉండటం కోసం నేను వెళ్లిపోతున్నా’.. అంటూ ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం పత్యాతండాలో చోటుచేసుకుంది. సూసైడ్‌నోట్‌లో మృతురాలు పేర్కొన్న వివరాలు ప్రకారం... పత్యాతండాకు చెందిన ధర్మసోత్ సునీత (20), అదే తండాకు చెందిన మాళోత్ శివ ప్రేమించుకున్నారు. ఈ విషయం శివ తల్లిదండ్రులకు తెలియడంతో వారు సునీత బంధువులతో అసభ్యకరంగా మాట్లాడారు. ఇంట్లో ఎవరూ లేని సమయం లో శివ సైతం సునీతపై లైంగిక దాడికి యత్నించాడు. కుదరకపోవడంతో సునీతను కిడ్నాప్ చేయడానికి చూశాడు. విషయం సునీత తన తండ్రి బిచ్చకి, సర్పంచ్ కి తెలిపింది. దీంతో సునీత తండ్రి .. శివతో పాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గత నెల 24న పోలీస్ స్టేషన్ కు బయలుదేరాడు. అయితే పథకం ప్రకారం శివ అతని బంధువులు సునీత తండ్రిని అడ్డుకున్నారు. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి బిచ్చనే జైలుకు పంపించారు. ఆధారాలు లేవన్న కారణంతో శివకు సంబంధించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. బిచ్చ జైలుకు వెళ్లడంతో సునీత కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. దీంతో మానసికంగా కుంగిపోయిన సునీత ‘శివతో పాటు అతని బంధువులు తన కుటుంబ సభ్యులను చంపేందుకు ప్రయత్నిస్తున్నారు’అంటూ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుతోనైనా వారిని జైలుకు పంపాలని సూసైడ్ నోట్ లో పేర్కొంది. చదవండి: (భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని..) న్యాయం చేయాలని ఆందోళన.. కాగా, సునీత కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె బంధువులు బయ్యారం పోలీస్‌స్టేషన్ వద్ద ఆదివారం ఆందోళనకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ యోగేష్ గౌతమ్ మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 8 మందిపై కేసు నమోదు యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మాళోత్ శివతో పాటు 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు. ఇదిలా ఉండగా.. మృతురాలు సూసైడ్ నోట్లో తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదని ఆరోపించటంపై ఎస్సైను వివరణ కోరగా, తమకు వచ్చిన ఫిర్యాదుపై తండాలో విచారణ నిర్వహించామని, కేసు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. -
హీరోయిన్‌కు అల్లు శిరీష్ స్పెషల్ గిఫ్ట్, స్పెషలేంటో?
అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ 2013లో ఇండస్ర్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి రూమర్స్ లేవు. అయితే గత కొంతకాలంగా హీరోయిన్ అను ఇమాన్యుయేల్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ సెట్లోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరేస్తూ ఇద్దరూ కలిసి కాఫీ షాపులు, పార్టీలు అంటూ కెమెరాలకు చిక్కుతున్నారు. అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే శిరీష్..ఇమాన్యుయేల్‌తో ఇంత క్లోజ్‌గా మూవ్ అవ్వడంతో వీరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందంటూ ప్రచారం సాగుతోంది. ఇక ఇటీవలె అను ఇమాన్యుయేల్ బర్త్‌డే సందర్భంగా అల్లు శిరీష్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. హ్యాపీ బర్త్‌డే సైకో అంటూ అల్లు శిరీష్ స్పెషల్ విషెస్ చెప్పారు. ఇప్పడు మరోసారి వీరిద్దరి టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ప్రయసిగా ప్రచారంలో ఉన్న అను ఇమాన్యుయేల్‌కు అల్లు శిరీష్ ప్రత్యేకంగా గిఫ్ట్ పంపారు. ప్రెట్టీ లిటిల్ సైకో అంటూ టీషర్ట్‌పై ప్రింట్ చేయించి అను ఇమాన్యుయేల్‌కు పంపాడు. దీనిపై స్పందించిన ఈ భామ..సైకో అని ఉన్నా దీన్ని క్లాంపిమెంట్గానే తీసుకుంటానని చెబుతూ అల్లు శిరీష్‌ని వియర్డో అంటూ సంభాషించింది. దీన్ని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన శిరీష్..వియర్డోనా...మనలో చాలా కామన్ విషయాలు ఉన్నాయి అంటూ స్వీట్‌గా ఈ భామపై సెటైర్ వేశారు. అంతేకాకుండా ఎనీవే యూ ఆర్ వెల్కమ్ మై ఫేవరేట్.. అంటూ షేర్ చేశారు. ప్రస్తుతం అల్లు శిరీష్-అను ఇమాన్యుయేల్ మధ్య జరిగిన ఈ చాట్ సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. శిరీష్ తన పోస్టులో మై ఫేవరెట్...అంటూ గ్యాప్ ఇవ్వడంతో వీరి మధ్య ఏదో ఉందని, అందుకే ఇంత క్లోజ్‌గా నిక్ నేమ్స్ కూడా పెట్టుకున్నారని నెట్టింట ప్రచారం సాగుతోంది. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటిదాకా శిరీష్ స్పందించలేదు. చదవండి: కొన్నాళ్లుగా హీరోయిన్‌తో రిలేషన్షిప్లో ఉన్న అల్లు శిరీష్! తమ్ముడికి కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్.. కారణం ఇదే -
యువకుడి సూసైడ్: ప్రేయసి చిత్రం గుండెలపై..
సాక్షి, హైదరాబాద్ : ప్రేమించిన యువతితో గొడవ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడో యువకుడు. ఈ సంఘటన అల్వాల్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిలకలగూడాకు చెందిన వంశీకృష్ణకు అల్వాల్‌కు చెందిన ప్రవళికతో కొన్ని నెలల క్రితం ఫేస్బుక్లో పరిచయమైంది. ప్రవళిక సికింద్రాబాద్‌లోని ఎస్ బ్యాంకులో పని చేస్తుండగా.. వంశీ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫేస్బుక్లో పరిచయమైన నాటినుంచి వంశీ ఆమెను ప్రేమించసాగాడు. ఆమె చిత్రాన్ని తన గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ( మన్యంలో మావోయిస్టుల ఘాతుకం) అయితే ఆదివారం ఇద్దరి మధ్యా గొడవ చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన వంశీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. నిన్న రాత్రి బాలాజీనగర్‌లోని స్నేహితులతో గడిపి ఇంటికి వచ్చేశాడు. ఈ ఉదయం విధులకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి భూదేవీ నగర్ రైల్వే ట్రాక్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అత్యంత విషమంగానే ప్రియాంక పరిస్థితి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా కేజీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ సాధన మాట్లాడుతూ ‘ఈఎన్టీ నిపుణుల పర్యవేక్షణలో ప్రియాంకకు మెరుగైన వైద్యం అందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇక తనకు తానుగా గాయం చేసుకున్న శ్రీకాంత్ కోలుకుంటున్నాడు’ అని తెలిపారు. కక్షగట్టి పథకం ప్రకారం.. నగరంలోని థామ్సన్ వీధిలో ప్రియాంక, శ్రీకాంత్ పక్క పక్క ఇంట్లో ఉంటున్నారు. డిగ్రీ చదువుతున్న ప్రియాంక, శ్రీకాంత్‌తో ఏడాదికాలంగా స్నేహంగా ఉంటోంది. ఈ దశలో శ్రీకాంత్ ప్రవర్తనపై అనుమానం వచ్చి అతడికి దూరంగా ఉండాలని ప్రియాంకకు ఇటీవల ఆమె తల్లిదండ్రులు చెప్పారు. దాంతో ఆమె శ్రీకాంత్‌తో దూరంగా ఉంటూ వస్తోంది. ఈ దశలో శ్రీకాంత్ ఆమెపై కక్షగట్టి పథకం ప్రకారం ఇవాళ (బుధవారం) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియాంకపై దాడికి పాల్పడ్డాడు. మంచం కింద దాక్కొని ఆమెపై కత్తితో దాడి చేసి గొంతుకోశాడు. అనంతరం అతను కూడా చాకుతో కొన్ని గాట్లు పెట్టుకున్నాడు. ( చద్ది బిర్యానీ పెట్టిందని వదినను..) ఒక్కసారిగా జరిగిన పరిణామంతో ప్రియాంక కేకలు వేస్తూ మెట్లు దిగుతుండగా కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో శ్రీకాంత్‌ను కూడా కేజీహెచ్‌కు తరలించారు. ప్రేమను నిరాకరించడంతో శ్రీకాంత్ ఓ పథకం ప్రకారం ప్రియాంకను కడతేర్చేందుకు ఈ దాడికి పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కేసు నుంచి తప్పించుకోవడానికి అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కూడా పేర్కొంటున్నారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ ప్రేమ్ కాజల్ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక కేసులో సాక్ష్యాలను పోలీసులు సేకరిస్తున్నారు. అందులో భాగంగా ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్‌తో పాటు దిశ పోలీసులు కూడా పరిశీలించారు. దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ విషయంలో శ్రీకాంత్ కక్షతో దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రేమను నిరాకరించిందని కోపంతోనే ప్రియాంకపై శ్రీకాంత్ హత్యాయత్నం చేసినట్లు ఏసీపీ ప్రేమ్ కాజల్ తెలిపారు -
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో..
సాక్షి, మందమర్రి: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని ప్రియురాలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం మందమర్రిలో చోటు చేసుకుంది. ప్రియుడిపై అమ్మాయి తరుఫున వారు దాడికి పాల్పడ్డారనే ఆరోపణపై ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. ఎస్సై భూమేష్ తెలిపిన వివరాల ప్రకారం... మందమర్రికి చెందిన సాయిప్రసన్న భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిడ్నాపల్లికి చెందిన సాగర్ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని సాయిప్రసన్న అడుగడంతో సాగర్ నిరాకరించాడు. దీంతో మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో రెండ్రోజుల క్రితం అమ్మాయి బంధువులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువురిని పిలిపించగా వారు పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో సాయంత్రం కావడంతో పంచాయతీని మరో రోజుకు వాయిదా వేశారు. దీంతో మనస్తాపానికి గురైన సాయిప్రసన్న కిరోసిన్ వంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్థానికులు అడ్డుకుని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అబ్బాయిపై అమ్మాయి తరుఫు వారు దాడి చేశారని ఫిర్యాదు చేయగా ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రేమపేరుతో గర్భవతిని చేశాడు.. పెళ్లి చేయాల్సిందే
సాక్షి, కరీంనగర్: ప్రేమ పేరుతో మోసం చేశాడని కరీంనగర్ జిల్లాలో ఓ యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి గర్భవతిని చేసిన యువకుడితో వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మానకొండూరు మండలం ఖాదర్ గూడెంకు చెందిన సురేష్, చెంజర్లకు చెందిన యువతి రవళి ప్రేమించుకున్నారు. కొద్దిరోజుల క్రితం పెళ్లి చేసుకోవాలని కోరడంతో సురేష్ నిరాకరించాడు. దీంతో ఆ యువకుడి స్వగ్రామమైన ఖాదర్ గూడెంకు చేరుకున్న యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగింది. సురేష్‌తో తనకు పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తోంది. లేకుంటే దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడంతో స్థానికులు ఆమెను వారించే ప్రయత్నం చేస్తున్నారు. (తమిళనాడు ప్రేమజంట అదృశ్యం) కాగా.. యువతకి ఇప్పటికే ఇద్దరితో వివాహం అయిందని మూడో వ్యక్తిగా సురేష్‌ని ప్రేమించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. పది రోజుల క్రితం గ్రామపంచాయతీ ముందు ఇదేవిధంగా యువతి ఆందోళనకు దిగగా పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అబ్బాయి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో యువతి ఫిర్యాదు మేరకు సురేష్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఆదివారం రోజున తాను మూడు నెలల గర్భవతిని అంటూ సురేష్‌తో పెళ్లి జరిపించే వరకు కదలనని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతుంది. -
వారిద్దరి ప్రేమాయణం సోషల్‌మీడియాలో వైరల్
నటుడు, దర్శకుడు ఎస్జే.సూర్య నటి ప్రియభవానీ శంకర్‌ని ప్రేమిస్తున్నట్లు, అయితే ఆమె ఆయన ప్రేమను తిరష్కరించినట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రసారం వైరల్ అవుతోంది. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన నటి ప్రియాభవానీశంకర్. మేయాదమాన్ చిత్రంతో పరిచయం అయిన ఈ అమ్మడు ఆ చిత్ర విజయంతో పేరు తెచ్చుకుంది. ఈ తరువాత కార్తీతో నటించిన కడైకుట్టి సింగం వంటి చిత్రాల సక్సెస్ ప్రియభవానీశంకర్ పేరు మరింత ప్రాచుర్యం పొందింది. అయితే ఆ తరువాత సోలో హీరోయిన్గా ఎస్జే.సూర్యకు జంటగా నటించిన మాన్స్టర్ చిత్ర విజయం మరింత పాపులర్ చేసింది. చదవండి: నా గురించి అసత్య ప్రచారం చేస్తున్నారు: రష్మిక ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటించే అవకాశం వరించే స్థాయికి చేరుకుంది. కాగా ఇప్పుడు మరోసారి ఎస్జే.సూర్యతో కలిసి బొమ్మై అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా ఆమె పేరును నటుడు ఎస్జే, సూర్యనే సిఫారసు చేశారనే ప్రచారం జరిగింది. దీంతో ఎస్జే.సూర్య, నటి ప్రియభవానీశంకర్ల మధ్య ప్రేమాయణం జరుగుతుందనే ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటివరకూ ఈ ప్రచారంపై పెదవి విప్పని నటుడు ఎస్జే.సూర్య తాజాగా స్పందించారు. ఆయన తన ట్విట్టర్లో పేర్కొంటూ కొందరు ఫూల్స్ తాను నటి ప్రియభవానీశంకర్కు ఐలవ్యూ చెప్పినట్లు, దాన్ని ఆమె నిరాకరించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. చదవండి: సినిమాగా నయన, విఘ్నేశ్‌శివన్ ప్రేమకథ నిజానికి మాన్స్టర్ చిత్రం నుంచే నటి ప్రియభవానీశంకర్ తో పరిచయం తమ మధ్య మంచి స్నేహంగా మారిందన్నారు. ప్రియభవానీశంకర్ మంచి నటి అని పేర్కొన్నారు. తమ మధ్య స్నేహం తప్ప మరేదీ లేదని స్పష్టం చేశారు. తమ స్నేహాన్ని ఏదేదో ఊహించుకుంటూ తప్పుడు ప్రచారం చేయవద్దు అని అని వదంతులకు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కాగా నటుడు ఎస్జే.సూర్య ఇప్పటికీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అన్నది గమనార్హం. అయితే ఈ వ్యవహారంపై నటి ప్రియభవానీశంకర్ మాత్రం మౌనం దాల్చింది. -
ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తా
సాక్షి, గౌతంనగర్ : తనను ప్రేమించాలని ఓ యువతిని వేధించడమే కాకుండా ఆమె ఉద్యోగం చేస్తున్న ప్రాంతానికి వెళ్ళి ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరిస్తున్న ఓ యువకుడిని మల్కాజిగిరి పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ హరీష్ తెలిపిన మేరకు..వసంతపురి కాలనీకి చెందిన సంగ శ్రీనివాస్(25) ప్రైవేటు ఉద్యోగి. కాగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఓ యువతి(20)ని కొంతకాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని, లేకపోతే నీ కుటుంబ సభ్యులను యాసిడ్‌పోసి చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆ యువతి ఉద్యోగం చేసే ప్రాంతానికి వెళ్ళి బెదిరింపులు చేయడంతో యువతి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీనివాస్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ప్రేమ పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే
సాక్షి, నవాబుపేట: ప్రియురాలి అన్న తమ పెళ్లికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ యువకుడు అతడిని దారుణంగా హత్య చేశాడు. మండల పరిధిలో చిట్టిగిద్ద గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నవాబుపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శిరీష నిందితుల వివరాలు వెల్లడించారు. నవాబుపేట మండల పరిధిలోని చిట్టిగిద్ద గ్రామానికి చెందిన షేక్ సోహెల్(20) ఈ నెల 14న గ్రామ శివారులో హత్యకు గురయ్యాడు. ఈ మేరకు మృతుడి తల్లి ఫరీదాబేగం ఫిర్యాదుతో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కృష్ణ మరికొంత మంది సిబ్బందితో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు రంభించారు. గ్రామస్తుల సమాచారం మేరకు మృతుడి పెద్దమ్మ కొడుకు ఎల్లకొండ గ్రామానికి చెందిన తొంట అమీర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా సోహేల్‌ను తానే హత్య చేసినట్లుగా అంగీకరించాడు. హత్య జరిగిందిలా.. సోహెల్ చిన్న చెల్లెలు, అమీర్ గత ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి విషయమై సోహెల్ ను అడగ్గా నిరాకరించాడు. దాంతో సోమేల్ బతికుండగా మా పెళ్లి కాదు, అతన్ని అంతం చేయాలని అమీర్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలి యని సోహేల్ తనకు ఆరోగ్యం బాగాలేదు మహారాష్ట్రలోని దర్గాకు వెళ్లాలి. కొంత డబ్బు ఇవ్వమని అమీర్‌ను అడిగగా.. అందుకు అమీర్ ఒప్పుకున్నాడు. ఈ నెల 13న సాయంత్రం అమీర్ మృతుడికి ఫోన్ చేసి డబ్బులు ఇస్తా అని చెప్పడంతో సోహెల్ ఎల్లకొండకు వెళ్లాడు. తిరిగి వీరు నవాబుపేటకు వచ్చి వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి చిట్టిగిద్ద గ్రామ శివారులోని లింగంపల్లి గుట్ట వద్దకు వెళ్లారు. అతిగా మద్యం సేవించిన సోహెల్ తాను కాసేపు విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. ఇదే అదునుగా భావించిన అమీర్ అక్క డే ఉన్న డ్రిప్‌పైపుతో సోహెల్ గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతుడి పోన్ తీసుకొని అక్కడి నుంచి ఏమీతెలియనట్లు ఇంటికి వెళ్లాడు. గ్రామస్తుల సమాచారంతో విచారణ చేపట్టగా అ మీర్ నేరాన్ని అంగీకరించాడని, హత్యకు ఉపయోగించిన డ్రిప్‌పైపు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శిరీష తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కృష్ణ ఉన్నారు. -
ప్రేమ.. చంపేసింది
‘‘పెద్దగా చదువుకోలేదు.. కానీ చేతిపని ఉన్నోడు.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో సీలింగ్ పని చేస్తుంటాడు... హైదరాబాద్‌లో ఒక యువతిని గాఢంగా ప్రేమించాడు. ప్రేమికురాలి కోసమని పనిమానేశాడు. కాంట్రాక్టు పనుల కోసం పెట్టుబడి పెట్టాలని ఇంట్లో చెప్పి తండ్రితో అప్పులు చేయించి మరీ పెద్దమొత్తంలో డబ్బులు తీసుకువెళ్లేవాడు. వేలకు వేలు డబ్బులు ప్రియురాలికి సమర్పించుకుంటూ ఉండేవాడు. చివరికి నీపై ప్రేమేలేదని ఆ యువతి చెప్పింది... తాను నిజాయితీగా ప్రేమిస్తే ఆమె మోసం చేసిందని వేదనతో కుమిలి పోయాడు.. ఆమె లేకపోతే బతికి ఉండడమే వేస్ట్ అనుకున్నాడు. స్నేహితులు ఎంత నచ్చజెప్పినా వినకుండా కాలువలోకి దూకి ప్రాణం తీసున్నాడు’’ ఏలూరు టౌన్ : ఏలూరు హనుమాన్‌నగర్ కృష్ణా కాలువలో ఒక యువకుడు దూకాడనే సమాచారం మంగళవారం ఏలూరు పట్టణంలో కలకలం రేపింది. స్నేహితుడు చూస్తుండగానే పరుగెత్తుకుంటూ వెళ్లి కాలువలోకి దూకేయటంతో అతడు హతా శుడయ్యాడు.తేరుకుని వెళ్లి స్నేహితుడిని కాపాడేందుకు కాలువలోకి దూకాడు. కానీ బురదలో ఇరుక్కుపోవటంతో భయపడి వెనక్కి వచ్చేశాడు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా కొద్దిసేపటికి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.35 నిమిషాల వరకూ కృష్ణకాలువలో అగ్నిమాపక అధికారి వీవీ రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది తీవ్రస్థాయిలో గాలించారు. బోటు, లైఫ్ జాకెట్లు వేసుకుని సిబ్బంది కాలువలో జల్లెడపట్టారు. జిల్లా అసిస్టెంట్ అగ్నిమాపక అధికారి యాగంటి హనుమంతరావు కుమారుడు శివతేజ కాలికి మృతదేహం తగలటంతో మిగిలిన సిబ్బంది కాలువలో దూకి బయటకు తీసుకువచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రేమ కాటేసింది : ఏలూరు దొండపాడుకు చెందిన జొన్నాదుల రాజు (28) పదో తరగతి వరకూ చదువుకున్నాడు. తండ్రి కృష్ణ తాపీపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు రాజు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వర్కు చేస్తుంటాడు. గత కొంతకాలంగా కాంట్రాక్టు వర్కులు ఒప్పుకుని ఊర్లు తిరుగుతూ పనులు చేస్తుండేవాడు. ఇటీవల రాజుకు ఒక యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారటంతో ఆమెతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉండే యువతి కోసమే వేలాది రూపాయలు అప్పులు చేస్తుండేవాడని స్నేహితులు చెబుతున్నారు. ఇంట్లో వారితో కూడా కాంట్రాక్టు పనుల కోసమని చెప్పి అప్పులు చేయించి మరీ తీసుకువెళ్లి యువతికి ఖర్చు చేసేవాడని అంటున్నారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసిమరీ ప్రేమగా చూసుకుంటూ, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న తరుణంలో ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆ యువతిని తీసుకువచ్చి తనతో పెళ్లి చేయకపోతే రైలుకింద పడి చనిపోతానని ఇంట్లో వాళ్లని రెండు రోజుల క్రితం బెదిరించినట్లు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం బలవంతంగా హైదరాబాదు నుంచి తీసుకువచ్చారు. హనుమాన్ నగర్లో సంఘటనా స్థలానికి ఎదురుగా నివాసం ఉంటున్న స్నేహితుడు యార్లగడ్డ రమేష్ వద్ద ఉంటున్నాడు. ఉదయం నుంచి పూటుగా మద్యం సేవిస్తున్న రాజు మంగళవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో పరుగెత్తుకుంటూ వెళ్లి కృష్ణా కాలువలోకి దూకేశాడు. రక్షించేందుకు కాలువలోకి దూకిన అతని స్నేహితుడు రమేష్ బురదలో ఇరుక్కుపోవటంతో భయపడి బయటకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అగ్నిమాపక అధికారులు, సిబ్బంది రెండున్నర గంటలు శ్రమించి రాజు మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు.