విజయనగరం: ప్రియుడు లేని లోకంలో తాను జీవించలేనని, తన జీవితం వ్యర్థమైపోయిందని మనస్తాపం చెందిన ఓ యువతి గన్నేరుపిక్కలు తిని ఆత్మహత్యకు పాల్పడింది. గుమ్మలక్ష్మీపురం మండలంలో జరిగిన ఈ విషాద సంఘటనపై ఎల్విన్‌పేట ఎస్సై ఎస్.షన్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డొంగరికిక్కువ గ్రామానికి చెందిన కోలక కిశోర్ పాముకాటుకు గురై చికిత్సపొందుతూ వారం క్రితం మృతిచెందాడు. వరుసకు బావ అయిన కిశోర్‌తో ప్రేమలో ఉన్న అదే గ్రామానికి చెందిన తాడంగి పుష్పవతి (19) కిశోర్ మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గన్నేరుపిక్కలు నూరి మింగేసింది. అపస్మారక స్థితిలో ఉన్న పుష్పవతిని గుర్తించిన కుటుంబసభ్యులు కురుపాం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్య సేవల అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి తండ్రి చిన్నప్పుడే చనిపోగా తల్లి లక్ష్మి అన్నీ తానై చూసుకునేది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
పురుగు మందు తాగి యువకుడు..
బొబ్బిలి: మండలంలోని రెడ్డియ్యవలసకు చెందిన సొంగలి గణేష్(21) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. డిగ్రీ పూర్తిన గణేష్ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఏమైందో ఏమో కానీ బుధవారం రాత్రి పురుగు మందు తాగేశాడు. ఈ విషయం గుర్తించిన కుటుంబసభ్యులు బొబ్బిలి సీహెచ్‌సీకి గణేష్‌ను తీసుకురాగా ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సిఫార్సు మేరకు విజయనగరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలపై కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చీమల మందు తాగి వ్యక్తి..
పాచిపెంట: భార్య మందలించిందని మనస్తాపానికి గురైన వ్యక్తి చీమల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం పాచిపెంట మండలంలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పద్మాపురం పంచాయతీ పిండ్రంగివలస గ్రామానికి చెందిన డి.రాజు మద్యానికి బానిసై భార్యతో తరచు గొడవపడేవాడు. ఈ క్రమంలో పదిరోజులక్రితం భార్యతో గొడవ పడగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. బుధవారం ఉదయం మద్యం తాగిన రాజు భార్య వద్దకు వెళ్లి ఇంటికి రావాలని కోరగా నిరాకరించింది. దీంతో మనస్తాపం చెంది సాయంత్రం చీమల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సాలూరు ఏరియాఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై ముసలయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment