Vizianagaram District Latest News
-
రెల్లి కులస్తుల ఆందోళన
విజయనగరం టౌన్: జిల్లాను యూనిట్‌గా చేసి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, రెల్లి కులస్తులకు వర్గీకరణలో రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని, వర్గీకరణ అనేది కులగణన చేపట్టిన తర్వాతనే చేయాలని విజయనగరం రెల్లి సామాజిక వర్గం ప్రతినిధులు బంగారు దుర్గారావు, యర్రంశెట్టి వాలి, శ్రీను తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద ఆందోళన చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి రెల్లికులస్తులకు అన్యాయం చేయవద్దన్నారు. భావితరాలకు ఈ ఫలాలు అందాలంటే వర్గీకరణ విషయంలో తమకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో సామాజిక వర్గ ప్రతినిధులు రామారావు, సతీష్, రమణ, రఘు, సభ్యులు పాల్గొన్నారు. రిజర్వేషన్ శాతాన్ని పెంచాలంటూ డిమాండ్ -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
వీరఘట్టం/పాలకొండ రూరల్: మండలంలోని తూడి జంక్షన్ వద్ద సీఎస్పీ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మీసాల తిరుపతిరావు (39) అనే వ్యక్తి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై జి.కళాధర్ సోమవారం తెలిపారు. మృతుని భార్య సరస్వతి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బైక్‌పై వస్తున్న తిరుపతిరావును వెనుక నుంచి వస్తు న్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. తిరుపతిరావు మృతితో పాలకొండ మండలం పొట్లిలో విషాదఛాయలు అలము కున్నాయి. మృతుడికి భార్యతో పాటు హర్షవర్థన్, సుధీర్ అనే ఇద్దరు కుమారులున్నారు.పోలీసుల అదుపులో గంజాయి నిందితులు..?రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి పోలీస్ చెక్‌పోస్టు వద్ద ఫిబ్రవరి 10వ తేదీన ఒడిశా నుంచి తరలిస్తున్న 150 కిలోల గంజాయి పోలీసులకు పట్టుబడగా.. కారు వదిలేసి అందులో ఉన్న నిందితులు పరారైన సంగతి తెలిసిందే. వెంటనే ఈ వ్యవహారంపై సీఐ నారాయణరావు, ఎస్సై వి. ప్రసాదారావు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాపు చేపట్టడంతో నలుగురు నిందితులు దొరికి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అదుపులో ఉన్న నలుగురు నిందితుల్లో ఒకరు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు గ్రామానికి చెందిన వాడు కాగా.. ఇద్దరు విశాఖ జిల్లా అనందరంపురానికి చెందిన వారని తెలిసింది. అలాగే ఇంకొకరు విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన వ్యక్తి అని సమాచారం. వీరు ఈ గంజాయిని ఎక్కడి నుంచి తెస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళుతున్నారు..? అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితులను ఎస్పీ ఎదుట మంగళవారం హాజరుపరచనున్నట్లు సమాచారం.జోరుగా గ్రావెల్ తవ్వకాలుభామిని: మండలంలోని బురుజోల – పసుకుడి మెట్ట వద్ద గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మూడు రోజులుగా తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా జేసీబీలతో తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల సహాయంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తవ్వకాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.రైల్వే ట్రాక్‌పై మృతదేహంసీతానగరం: మండలంలోని సీతానగరం – గుమ్మిడివరం గ్రామాల మధ్య గల రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రైల్వే హెచ్‌సీ బి. ఈశ్వరరావు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైలు నుంచి జారిపడి మృతి చెందాడా.. లేక రైలు ఢీ కొనడం వల్ల ప్రమాదం జరిగిందా అన్న విషయమై పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలను బట్టి అతను ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన అరుణ బలేరా (40) సన్నాఫ్ మోహన్ బలేరాగా గుర్తించారు. -
ప్లేట్ కాంపోనెంట్ ప్రారంభం
విజయనగరం ఫోర్ట్: పట్టణంలోని రెడ్‌క్రాస్ సొసైటీలో సీఎస్ఆర్ నిధులు రూ.76.01 లక్షలతో ఏర్పాటు చేసిన ప్లేట్ లెట్స్ యూనిట్‌తో పాటు, ఎస్డీపీ యూనిట్‌ను రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్‌క్రాస్ విశేషమైన సేవలను అందిస్తోందన్నారు. కాంపోనెంట్ యూనిట్ ద్వారా ఉమ్మడి జిల్లాల్లో అవసరమైన వారికి రక్తంతో పాటు రెడ్ బ్లడ్ సెల్స్, ఫ్రెష్ ఫ్రోజెన్ ఫ్లాస్మా, ప్లేట్ లెట్స్, క్రయాప్రెసిపిరేట్, సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్‌ను సరఫరా చేస్తుందన్నారు. ఆరోగ్య వంతులంతా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు, రెడ్‌క్రాస్ చైర్మన్ కేఆర్డీ ప్రసాదరావు, కార్యదర్శి సత్యం, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎం.జయచంద్రనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ పోటీలకు కోమటిపల్లి యువకుడు
దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన దీసరి భానుప్రసాద్ అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికై నట్లు సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ (ఎస్బీకేఎఫ్) ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల విశాఖలో జరిగిన పోటీల్లో పాల్గొన్న భానుప్రసాద్ మొదటి స్థానం సాధించాడని పేర్కొన్నారు. ఏప్రిల్ 3 నుంచి 7 వరకు నేపాల్‌లో జరగనున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భానుప్రసాద్ తలపడనున్నాడన్నారు. ఇదిలా ఉంటే ప్రయాణ ఖర్చుల కోసం జనసేన జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మామిడి దుర్గాప్రసాద్ ఐదు వేల రూపాయలను భానుప్రసాద్‌కు అందజేశారు. -
స్లాట్ బుకింగ్స్‌తో రిజిస్ట్రేషన్లు
విజయనగరం రూరల్: రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం తీసుకు వచ్చిన స్లాట్ బుకింగ్ విధానాన్ని ఈ నెల రెండో తేదీ నుంచి విజయనగరం ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రారంభించనున్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ ఎ.నాగలక్ష్మి తెలిపారు. పట్టణంలోని దాసన్నపేటలో ఉన్న ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ ఏవీ కుమారితో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ క్రయ, విక్రయదారులకు సమయం వృథా కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చిందని చెప్పారు. ఈ విధానం వల్ల పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం ద్వారా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్లు ఎస్వీ ప్రసాద్, కేఏ షీలా, సిబ్బంది, క్రయ విక్రయదారులు పాల్గొన్నారు. -
నల్ల చట్టాలకు ఆమోదం తెలపడం బాధాకరం
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న ఈద్గాలో ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. వక్ఫ్ అమెండ్మెంట్ వంటి నల్ల చట్టాలకు టీడీపీ ఆమోదం తెలపడంపై ముస్లింలు ప్రశ్నించారు. ముస్లింను కేవలం ఓట్లకోసమే వినియోగించుకుంటారా? కష్టాల్లో సహాయంగా నిలబడరా అని ప్రశ్నించారు. ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ చట్టాలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం మద్దతు తెలపడం ఎంతవరకూ సమంజసమన్నారు. రంజాన్‌లో తమకు కావాల్సింది శుభాకాంక్షలు, ఇఫ్తార్ విందులు కాదని, బిల్లుపై వ్యతిరేకత చూపిస్తే అదే ఒక బహుమానమని పేర్కొన్నారు. -
● నమ్మండి.. ఇదే మా పాఠశాల..!
ఈ పూరిపాకే మా పాఠశాల. ఎండకాస్తే మాడిపోవాలి. వానొస్తే తడిచిపోవాలి. ఎన్నోసార్లు పాఠశాలకు భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నా పట్టించుకోవడం లేదు. పశు గోశాలలు నిర్మించడంపై చూపుతున్న శ్రద్ధ మా పాఠశాలపై లేదంటూ బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని బట్టివలస ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ‘బాబూ’.. ‘నాయినా’.. మీకు దండం పెడతాం.. మాకు పాఠశాల భవనం మంజూరు చేయండ ంటూ సోమవారం విజ్ఞప్తిచేశారు. గ్రామానికి చెందిన 8 మంది చిన్నారులు పాఠశాలలో 1, 2 తరగతులు చదువుతుండగా, మరో ఏడుగురు విద్యార్థులు 3వ తరగతి చదువుకోసం మూడు కిలోమీటర్ల దూరంలోని గోపాలరాయుడుపేట పాఠశాలకు వెళ్తున్నారు. ఇదే విషయంపై ఎంఈఓ చల్లా లక్ష్మణరావు స్పందిస్తూ పలు మార్లు పాఠశాల భవనం నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపించామని, నిధులు మంజూరు కాలేదన్నారు. మరో మారు ప్రయత్నిస్తానని చెప్పారు. – బొబ్బిలిరూరల్ -
పైడితల్లిని దర్శించుకున్న గానకోకిల
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారిని గానకోకిల, పద్మశ్రీ పి.సుశీల సోమవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేదపండితులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించిన అనంతరం ఆలయ ఇన్చార్జి ఈఓ కేఎన్‌వీడీవీ.ప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు ఆమెకు వేదాశీస్సులు, అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. విజయనగరంలోని గురునారాయణ కళాపీఠం వార్షికోత్సవ వేడుకలకు ఆమె హాజరయ్యారు. మంత్రి శ్రీనివాస్, నిర్వాహకుల చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. రామతీర్థంలో వసంతోత్సవాలు నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 6న శ్రీరామనవమిని పురస్కరించుకొని కల్యా ణ వసంతోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత మంగళాశాసనం, తీర్థ గోష్ఠి జరిపించారు. అనంతరం స్వామి సన్నిధిలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 40 మంది వేద పండితులు శ్రీమద్రామాయణ, సుందరాకాండ పారాయణాలు, దివ్య ప్రబంధ సేవాకాలం, లక్ష తులసీ దళార్చన, లక్ష కుంకుమార్చన నిర్వహించారు. యాగశాలలో గాయత్రీ రామాయణం, సంక్షేప రామాయణం, సుందరాకాండ హవనం జరిపించారు. కార్యక్రమంలో అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. సైకిల్‌పై భద్రాచలానికి.. నెల్లిమర్ల రూరల్: రాముడిపై తనకు ఉన్న అమితమైన విశ్వాసంతో ఓ భక్తుడు మండుటెండను సైతం లెక్క చేయకుండా భద్రాచలానికి సైకిల్‌పై పయనమయ్యాడు. తాను రాసిన రామ కోటిని భద్రాచలంలో స్వామికి సమర్పించేందుకు సెగలుకక్కుతున్న ఎండను సైతం లెక్క చేయలేదు. వయసు మీద పడినప్పటికీ అపారమైన భక్తి భావంతో రామనామాన్ని జపిస్తూ శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొత్తరకొండ గ్రామానికి చెందిన లంక ప్రకాశరావు సోమవారం రామతీర్థానికి చేరుకున్నాడు. గడిచిన 20 ఏళ్ల నుంచి సైకిల్‌పై భద్రాచలం రామయ్య సన్నిధికి వెళ్తున్నట్టు తెలిపారు. రెండు రోజుల కిందట పయనమై మార్గంమధ్యలో ఉన్న అరసవిల్లి సూర్యనారాయణస్వామిని దర్శించి.. సుమారు 200 కిలో మీటర్లు ప్రయాణం సాగించి రామతీర్థం చేరుకున్నట్టు చెప్పారు. రాత్రికి రామతీర్థంలో బస చేసి మంగళవారం ఉదయం బయలుదేరుతానని తెలిపారు. సింహాచలం, అన్నవరం, ద్వారపూడి మీదుగా సుమారు 429 కిలోమీటర్లు దూరంలో ఉన్న భద్రాచలానికి చేరుకుంటానన్నారు. -
సిద్ధం
వేసవిని ఎదుర్కోవడానికి● మే నెలాఖరు వరకూ తాగునీటికి ఢోకా లేదు ● జలాశయాలు, భూగర్భ జలాలు ఆశాజనకం ● తోటపల్లి, తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టులపై దృష్టి ● చురుగ్గా భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు ● కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి జూలైకల్లా సొంత క్యాంపస్ ● ‘రెల్లి’ భూముల్లో కేంద్ర గ్రేహౌండ్స్ శిక్షణ సంస్థ ● సాక్షి ఇంటర్వ్యూలో విజయనగరం కలెక్టరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో మార్చి నెల నుంచి సూరీడు మండిపోతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిపోతున్నాయి. రానున్న ‘వేసవి’ కాలాన్ని ఎదుర్కోవడానికి అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా ప్రజలకు అభయమిచ్చారు. తాగునీటి సరఫరా ప్రణాళికతో పాటు జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిని ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సాక్షి: ‘వేసవి’ సమస్యలపై ప్రణాళిక ఏమిటి? కలెక్టర్: జిల్లాలోని బోర్లన్నీ ఇప్పటికే శుభ్రం చేయించాం. తాగునీటి సరఫరా విషయానికొస్తే విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో రెండ్రోజులకోసారి, రాజాం మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో ప్రతిరోజూ ఇస్తున్నాం. ప్రస్తుతానికి తాగునీటికి కొరతలేదు. భూగర్భ జలాలు, జలాశయాల్లో నీటిమట్టం ఆశాజనకంగానే ఉన్నాయి. మే నెలాఖరు వరకూ ఢోకా ఉండదని అంచనా వేస్తున్నాం. మండల స్థాయిలో అధికారులతో సమీక్షిస్తున్నాం. ఎక్కడైనా సమస్య ఎదురైతే ట్యాంకర్లతో సరఫరా చేయాలని ఆదేశాలిచ్చాం. సాక్షి: విజయనగరం జిల్లా కేంద్రానికి పుష్కలంగా తాగునీరు అందించడానికి ఉద్దేశించిన తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి? కలెక్టరు: విజయనగరానికే కాదు త్వరలో ప్రారంభంకానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన నీటిని తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు నుంచే సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటికే 44 శాతం పనులు పూర్తయ్యాయి. మిగులు పనులు పూర్తి చేయడానికి తాజా అంచనా ప్రకారం రూ.807.55 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదించాం. ఇది పూర్తయితే 16,538 ఎకరాల భూమికి సాగునీరు కూడా అందుతుంది. సాక్షి: తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ పనుల మాటేమిటి? కలెక్టరు: జిల్లాలో అదనంగా 23,119 ఎకరాలకు సాగునీటిని అందించే ఉద్దేశంతో తలపెట్టిన తోటపల్లి కుడి ప్రధాన కాలువ పనులు 86 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేయడానికి రూ.105.63 కోట్లు మేర నిధులు అవసరమవుతాయి. సాక్షి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తవుతాయా? కలెక్టరు: గత ఏడాది జూలై నాటికి 31.80 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం 67.92 శాతానికి చేరాయి. భూమి చదును పనులైతే గత జూలై నాటికే 97 శాతం అయిపోయాయి. దీంతో మిగతా పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. రన్‌వే నిర్మాణ పనులు 96 శాతం, టాక్సీ వే పనులు 84.45 శాతం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నిర్మాణ పనులు 64.22 శాతం పూర్తయ్యాయి. 2026 డిసెంబర్ 13 నాటికి తొలి దశ పూర్తి చేసి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించాలన్న నిర్దేశిత గడువులోగానే సిద్ధం చేస్తామని జీఎంఆర్ ఏరో ప్రతినిధులు చెబుతున్నారు. సాక్షి: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సొంత క్యాంపస్ పనుల పురోగతి ఎంతవరకూ వచ్చింది? కలెక్టరు: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరానికి సొంత క్యాంపస్ అందుబాటులోకి వస్తుంది. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మెంటాడ మండలంలో భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జాతీయ రహదారి నుంచి క్యాంపస్ వరకూ అప్రోచ్ రోడ్డుకు కొంతమేర భూసేకరణకు, తాగునీటి సరఫరా మిగులు పనులు, విద్యుద్ధీకరణకు రూ.29.15 కోట్ల నిధులు అవసరమని ప్రభుత్వానికి నివేదించాం. ఇవన్నీ పూర్తయితే 561 ఎకరాల్లోనున్న సువిశాల, ఆహ్లాదకరమైన వాతావరణంలోని సొంత క్యాంపస్‌కు జూలైనాటికల్లా వెళ్లిపోవచ్చు. గతంలో కొత్తవలస మండలంలో రెల్లి వద్ద కేటాయించిన 526 ఎకరాలను కేంద్ర గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకోసం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాం. సాక్షి: ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా గతంలో జిల్లా అధికారులు రెల్లి వద్ద ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ పార్కు పరిస్థితి ఏమిటి? కలెక్టరు: ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేసేందుకు ఏపీఐఐసీ ప్రణాళిక ఉంది. ఇందుకోసం చీపురుపల్లి నియోజకవర్గంలో పది ఎకరాలు, గజపతినగరంలో 57.49 ఎకరాలు, విజయనగరంలో 12, రాజాంలో 20, బొబ్బిలిలో వంద, ఎస్.కోటలో 57, నెల్లిమర్లలో 19 ఎకరాలు స్వాధీనం చేశాం. సాక్షి: వైద్య వసతుల కల్పన మాటేమిటి? కలెక్టరు: విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ రెండో దశ పనులు జరుగుతున్నాయి. కిడ్నీ రోగుల కోసం మరో ఐదు డయాలసిస్ యూనిట్లు పెట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. ఇందుకు రూ.కోటి వరకూ అవసరం. వీటి నిర్వహణకు ప్రతి నెలా రూ.4 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. -
ఫ్యాప్టో ఆందోళన రేపు
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ సమస్యల సాధన కోసం ఈ నెల 2న కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాన్ని విజయవతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. స్థానిక దాసన్నపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో సోమవారం ఫ్యాప్టో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ తక్షణమే 30 శాతం ఐఆర్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిటీ నియమించాలని, పెండింగ్‌లో ఉన్న 3 డీఏలను చెల్లించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ ఎరియర్స్‌ను, సరెండర్ లీవు బకాయిలు చెల్లించాలని కోరారు. దీనికోసం పోరుబాట సాగిద్దామన్నారు. అనంతరం ఐక్య నినాదం వినిపించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు కె.జోగారావు, సూరిబాబు, పి.దామోదరనాయుడు, జేఆర్కేవీఈశ్వరరావు, భాస్కరరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
పేరాపురంలో దొంగతనం
● నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రెండు లక్షల రూపాయల నగదు అపహరణ పూసపాటిరేగ: మండలంలోని పేరాపురం గ్రామంలో దొంగతనం జరిగింది. బాధితులు, పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గురుగుబిల్లి కసవయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 26న తిరుపతి వెళ్లాడు. దర్శనం అనంతరం 29వ తేదీ అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో ఇంటి తలుపు తెరిచి ఉండడంతో వెంటనే లోనికి వెళ్లి చూడగా బీరువాలోని నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రెండు లక్షల రూపాయల నగదు కనిపించలేదు. వెంటనే స్థానిక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా.. ఎస్సై ఐ. దుర్గాప్రసాద్, తదితరులు ఆదివారం గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బీరువాను క్షుణ్ణంగా పరిశీలించి, తెలిసిన వారు దొంగతనం చేశారా.. బయట వ్యక్తులు వచ్చారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
పచ్చ తమ్ముడి బరితెగింపు
● అధికారుల మాట బేఖాతర్ ● రచ్చబండను నేలమట్టం చేసిన వైనంఇచ్ఛాపురం రూరల్: అధికారంలో ఉన్నామన్న అహంకారంతో టీడీపీ నాయకుడు బరితెగించాడు. తన స్థలానికి అడ్డుగా ఉన్నటువంటి 30 ఏళ్ల నాటి రచ్చబండను నేలమట్టం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కె.శాసనాం గ్రామంలో 30 ఏళ్ల క్రితం స్థానిక గ్రామ పెద్ద కారంగి కారయ్య అనే వ్యక్తి రచ్చబండను నిర్మించాడు. అందులో రావి చెట్టును నాటి త్రినాథస్వాముల వారి విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఇసురు ఫకీరు తన సొంత భూమికి రచ్చబండ అడ్డుగా ఉందంటూ, ఈనెల 19న రచ్చబండను పెకిలించేందుకు ప్రయత్నించాడు. దీంతో గ్రామస్తులు పోలీసు, రెవెన్యూశాఖాధికారులకు ఫిర్యాదులు చేశారు. తహసీల్దార్ ఎన్.వెంకటరావు ఆదేశాల మేరకు ఈనెల 21, 23 తేదీల్లో మండల, గ్రామ సర్వేయర్లు, వీఆర్వో సంఘటనా స్థలానికి వెళ్లి కొలతలు తీశారు. రచ్చబండ ప్రభుత్వ స్థలంలో ఉందని, రచ్చబండకు పది అడుగుల దూరంలో ఫకీరు స్థలం ఉందని తేల్చి చెప్పారు. రచ్చబండపై ఫకీరుకు ఎటువంటి అధికారం లేదని, తొలగించేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అధికారుల మాటలు భేఖాతరు చేస్తూ, ఇసురు ఫకీరు తన అనుచరులతో ఆదివారం రచ్చబండను కూల్చడంతో పాటు 30 ఏళ్లనాటి చెట్టును తొలగించేశాడు. దీంతో సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి..
సాలూరు: శ్రీరామచంద్రుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్థిల్లాలని మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర ఆకాంక్షించారు. పట్టణంలోని వెలమపేట, డబ్బివీధి, తదితర ప్రాంతాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీతారాముల విగ్రహాలను రథంలో ఉంచి మేళతాళాల నడుమ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పీడిక రాజన్నదొర పాల్గొని రథం లాగారు. ఈ సమయంలో భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. బైక్ రికవరీ పార్వతీపురం రూరల్: రెండు రోజుల వ్యవధిలో పోయిన బైక్‌ను పోలీసులు రికవరీ చేశారు. పార్వతీపురం రూరల్ ఎస్సై బి. సంతోషి తెలియజేసిన వివరాల మేరకు.. ఈ నెల 28న పార్వతీపురం రూరల్ పరిధి వైకేఎం కాలనీలోని ఓ కిరాణా దుకాణం వద్ద పార్క్ చేసిన పల్సర్ ఎన్ఎస్ 200 ద్విచక్ర వాహనాన్ని ఎవరో దొంగిలించారు. దీంతో బాధితుడు ఆదిత్య (సీతానగరం మండలం) మరుచటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సై సంతోషి ఆధ్వర్యంలో పోలీసులు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా మక్కువ మండలానికి చెందిన ఇద్దరు మైనర్ల నుంచి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి గంట్యాడ: ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాల మేరకు.. కొఠారుబిల్లి కనకదుర్గమ్మ ఆలయం వెనుక ఉంటున్న కురిమిశెట్టి కృష్ణ అనే వ్యక్తి ఇంటికి వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనచోదకుడు ఢీకొట్టాడు. దీంతో కృష్ణ తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు వీరఘట్టం: మండలంలోని తూడి జంక్షన్ వద్ద సీఎస్పీ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మీసాల తిరుపతిరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. పాలకొండ మండలం పొట్లి గ్రామానికి చెందిన తిరుపతిరావు వీరఘట్టం నుంచి తన స్వగ్రామానికి బైక్‌పై వెళుతుండగా.. పాలకొండ నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో తిరుపతిరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి 108 వాహనంలో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. తప్పిన పెను ప్రమాదం వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని బాతుపురం–చినవంక ఆర్అండ్బీ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఒక భారీ మర్రిచెట్టు కొమ్మ రోడ్డుపై విరిగిపడింది. అయితే ఆ సమయంలో వాహన రాకపోకలు, ప్రయాణికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ రోడ్డులో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. చెట్టుకొమ్మ రోడ్డుకి అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికులంతా కలిసి చెట్టుకొమ్మను తొలగించారు. -
గిరిజన రైతు కంట కన్నీరు..
● జీడిమామిడికి తెగుళ్ల దెబ్బ ● తగ్గనున్న దిగుబడి ● ఆందోళనలో రైతులుసీతంపేట: గిరిజనుల ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న జీడిపంట ఈ ఏడాది దెబ్బతింది. అగ్గి తెగులు వల్ల కొన్ని ప్రాంతాల్లో పూత మాడిపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో దిగుబడి రాకపోవడంతో గిరిజనులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అధిక ఉష్ణోగ్రత, తేనె మంచుతో పూత రాలేదు. అక్కడక్కడ తోటల్లో కొద్దిపాటి పూత వచ్చిందంటే అది కూడా మాడిపోయింది. సీతంపేట ఐటీడీఏ పరిధిలో టీపీఎంయూ పరిధిలోని ఏడు మండలాల్లో దాదాపు 15 వేల హెక్టార్లలో జీడిపంట సాగవుతుండగా.. ఈ పంటపై సుమారు 12 వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు. ఏప్రిల్, మే నెలల్లో పంట చేతికందాల్సి ఉంది. అయితే ఈ ఏడాది సుమారు ఐదువేల హెక్టార్లలలో కూడా పంట పూర్తి స్థాయిలో పండిన దాఖలాలు లేవు. గతంలో ఈ సీజన్లో సుమారు రెండు నుంచి మూడు వేల టన్నుల వరకు జీడిపిక్కల దిగుబడి ఉండేది. ఈ ఏడాది వెయ్యి టన్నుల లోపు కూడా దిగుబడి వచ్చే అవకాశం కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఒక్కో గిరిజన కుటుంబానికి జీడి పంట వల్ల రూ.50 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చేది. ఈ ఏడాది రూ.20 వేలు కూడ వచ్చే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. ఎక్కువగా కుశిమి, కోడిశ, శంభాం, కె.గుమ్మడ, దోనుబాయి, పొల్ల, పెదరామ, మర్రిపాడు, పూతికవలస, చిన్నబగ్గ, పెద్దబగ్గ, కీసరజోడు, తదితర పంచాయతీల పరిధిలో జీడి ఎక్కువగా సాగవుతోంది. ఉద్యానవన పంటలను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో గతంలో ఐటీడీఏ కూడా జీడిమామిడి మొక్కలు సరఫరా చేసింది. అవి కూడా సరైన దిగుబడి ఇవ్వకపోవడంతో ఏం చేయాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. -
చీకటిలోనే రాకపోకలు..
పిల్లలు ఇబ్బంది పడుతున్నారు పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ప్రత్యేక తరగతులు ముగించుకుని ఇంటికి వచ్చే సమయానికి చీకటి పడడంతో ఇబ్బంది పడుతున్నారు. వారు ఇంటికి చేరుకునేంత వరకు భయంభయంగా ఉంటోంది. విషసర్పాలు, కీటకలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అధికారులు స్పందించి లైట్లు వేయాలి. – ఎం.గిరిప్రసాద్, వసుంధర్నగర్ ప్రమాదాలు జరిగే అవకాశం.. రాష్ట్రీయ రహదారి కావడంతో భారీ వాహనాలు అతివేగంతో రాకపోకలు సాగిస్తుంటాయి. విద్యుత్ దీపాలు లేకపోవడంతో వాహనం వెళ్లిపోయిన తర్వాత కాసేపు రోడ్డు కనిపించడం లేదు. ఆ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. – గండి రాంబాబు, విద్యానగర్ పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణ ప్రారంభంలో రహదారికి ఇరువైపులా విద్యుత్ దీపాలు లేకపోవడంతో అంధకారం నెలకొంది. దీంతో చీకటిలోనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రీయ రహదారికి అనుసరించి ఉన్న వైకేఎం కాలనీ, వసుంధర నగర్, శక్తినగర్, ఆఫీషియల్ కాలనీ, విద్యానగర్ వరకు రహదారికి ఇరువైపులా విద్యుత్ లైట్లు లేవు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు సాయంత్రం ఏడు దాటితే ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఉద్యోగస్తులు, విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో చీకటిలోనే భయం భయంగా ఇంటికి చేరుకుంటున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల వాసులు కోరుతున్నారు. ఇబ్బందిపడుతున్న ప్రజలు -
అనుమానాస్పదంగా ఉద్యోగి మృతి
రణస్థలం: మండలంలోని బంటుపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న యూనైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగి పిన్నింటి అప్పలసూరి(47) అనుమానాస్పదంగా మృతి చెందాడు. జేఆర్‌పురం పోలీసులు, పరిశ్రమ వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం జనరల్ డ్యూటీకి వెళ్లిన మృతుడు అప్పలసూరి సాయంత్రం 4.30 గంటల సమయంలో పరిశ్రమలోని వాష్ రూమ్‌లో ప్లాస్టిక్ పైపునకు ప్యాకింగ్ రోప్‌తో ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. కొంత సమయం తర్వాత గుర్తించిన తోటి ఉద్యోగులు జేఆర్‌పురం పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈయన పరిశ్రమలోని కేస్ ఫ్యాకర్ మిషన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. బంటుపల్లి పంచాయతీ ప్రజలకు ఆర్ఎంపీగా వైద్య సేవలు అందిస్తుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఉరివేసుకుని చనిపోయి ఉండడంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య అమ్ములు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడు స్వగ్రామం నరసన్నపేట దగ్గర లుకలాం కాగా, గత 30 ఏళ్లుగా ఉద్యోగరీత్యా జేఆర్‌పురం పంచాయతీలోని జీఎంఆర్ కాలనీలో నివాసముంటున్నాడు. జేఆర్‌పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
వినియోగానికి నోచుకోని నిధులు
● వీరఘట్టం మేజర్ పంచాయతీలో మూలుగుతున్న నిధులు ● అభివృద్ధి పనులపై దృష్టి సారించని పాలకవర్గం వీరఘట్టం: జిల్లాలోని అత్యధిక జనాభా ఉన్న వీరఘట్టం మేజర్ పంచాయతీకి ఎంతో ఘన చరిత్ర ఉంది. ఎందరో మహానుభావులు ఈ పంచాయతీలో పాలన చేసి ప్రజలందరిచే శభాష్ అనిపించుకున్నారు. అయితే ప్రస్తుతం షాడో పాలనలో ఉన్న ఈ మేజర్ పంచాయతీలో నిధులు పుష్కలంగా ఉన్నా వినియోగానికి నోచుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.98 లక్షలు.. అలాగే జనరల్ ఫండ్ నిధులు సుమారు రూ.28 లక్షలు మూలుగుతున్నాయి. మొత్తం వీరఘట్టం మేజర్‌పంచాయతీ ఖజానాలో రూ.1.26 కోట్లు ఉన్నాయి. అయినా ఈ నిధులు అభివృద్ధి పనులకు ఉపయోగించకపోవడం శోచనీయం. అభివృద్ధి చేయాల్సిన కొన్ని పనులు.. స్థానిక కొత్త బస్టాండ్‌లో కల్వర్టు చాలా ఏళ్ల కిందట కూలిపోయింది. దీన్ని బాగు చేయాల్సి ఉంది. అలాగే రెల్లివీధి సమీపంలో ఉన్న శ్మశానవాటిక రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. శ్మశానవాటిక పరిసరాలు కూడా దారుణంగా ఉన్నాయి. దీంతో శ్మశానవాటికకు వెళ్లే సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే చాలా వీధుల్లో వీధి కుళాయిలు పాడయ్యాయి. ట్యాప్‌లు లేక తాగునీరు వృథాగా పోతోంది. వీటిని బాగు చేయాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్ జంక్షన్ నుంచి బార్నాలవీధి రోడ్డు దారుణంగా ఉంది. అలాగే సెగిడివీధి నుంచి రెల్లివీధి మీదుగా బీసీ కాలనీకి వెళ్లే రోడ్డు అత్యంత దారుణంగా ఉంది. యల్లంకి వీధిలో ఎవరైనా మృతి చెందితే వారి అంత్యక్రియలకు అష్టకష్టాలు పడాల్సిందే. శ్మశానవాటికకు సరైన రహదారి సౌకర్యం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు పరిష్కారానికి ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు స్పందించి అందుబాటులో ఉన్న నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ప్రతిపాదనలు చేశాం.. పంచాయతీలో రూ.1.28 కోట్లు నిధులు అందుబాటులో ఉన్నాయి. వీటితో కొన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ఇటీవల రూ.30 లక్షలతో ప్రతిపాదనలు చేశాం. టెక్నికల్ అనుమతులు వస్తే పనులు ప్రారంభిస్తాం. – బి.కోటేశ్వరరావు, పంచాయతీ ఇన్చార్జ్ ఈఓ -
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
● జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: పవిత్ర రంజాన్ సందర్భంగా అల్లాహ్ తన కరుణతో అందరినీ దీవించాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ఆకాంక్షించారు. అందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు, ప్రశాంతత లభించాలని కోరారు. రంజాన్ మాసం జీవితాల్లో వెలుగులు నింపాలనీ, ప్రేమ, శాంతి, సామరస్యాన్ని అందించాలనీ ఆకాంక్షించా రు. సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన ఒక ప్రకటన లో శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో మన హృదయాలను శుద్ధి చేసుకోవాలని, విజయానికి మార్గం సుగమం కావాల ని ఆయన అభిలషించారు. పైడితల్లి నిత్యన్నదానానికి రూ.లక్ష విరాళం విజయనగరం టౌన్: సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి నిత్యన్నదానానికి సంబంధించి విజయవాడకు చెందిన మాగంటి బాబు, జ్యోతి దంపతులు ఆదివారం లక్షా 11వేల 111 రూపాయలు విరాళం అందజేశారు. ఈ మేరకు ఆలయ సూపర్వైజర్ ఏడుకొండలకు పట్టువ స్త్రాలు, నగదు అందజేశారు. అనంతరం వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలతో దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు తాళ్లపూడి ధనుంజయ్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు. నేడు రంజాన్ వేడుకలు విజయనగరం టౌన్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఈద్గాలో రంజాన్ వేడుకలు సోమవారం నిర్వహించనున్నట్టు ముస్లిం మతపెద్దలు ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని, ఈద్గాలో సామూహిక ప్రార్థనలు చేయడం జరుగుతుందన్నారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్ష ఆచరించిన భక్తులతో దీక్ష విరమణ చేస్తామన్నారు. అనంతరం జకాత్ పేరుతో నిరుపేదలకు దానధర్మాలు చేయనున్నామన్నారు. ఈకేవైసీ గడువు పెంపు పార్వతీపురం: జిల్లాలో రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచింది. ఈ మేరకు ఏప్రిల్ నెలాఖరు వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ పంపిణీ పటిష్టంగా అమలు చేసేందుకు కార్డులో ఉన్న సభ్యులందరికీ ఈకేవైసీ ఉండాలని పేర్కొంది. ఈ మేరకు రేషన్ దుకాణాల వద్ద డీలర్లు ఈకేవైసీ చేపట్టారు. జిల్లాలో 15 మండలాల్లో 8,23,638 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉండగా ఇంకా 80 వేల మంది వరకు ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. విరబూసిన బ్రహ్మకమలం రాజాం సిటీ: పట్టణంలోని పాలకొండ రోడ్డులో హర్షిత్నగర్లో ఉంటున్న ఉపాధ్యాయురాలు వడ్డి ఉషారాణి ఇంట బ్రహ్మకమలాలు పూశాయి. ఉగాది పండగ వేళ ఇలా పువ్వులు పూయడం ఆనందంగా ఉందని ఉషారాణి తెలిపారు. -
రామతీర్థానికి శ్రీరామనవమి శోభ
● వైభవంగా ప్రారంభమైన కల్యాణ వసంతోత్సవాలు ● వేద రుత్విక్కులచే శాస్త్రోక్తంగా పారాయణాలు ● ఏప్రిల్ 6న సీతారాముల కల్యాణం నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీ ర్థం శ్రీ రామస్వామి వారి దేవస్థానానికి శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నుంచి కల్యాణ వసంతోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున స్వామికి సుప్రభాత సేవ, బాలభోగం తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలోనికి స్వామివారిని వేచింపజేసి విశ్వక్సేరాధన, అంకురారోపణ, రుత్విగ్వరణం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సుమారు 40 మంది ఋత్విక్కులచే ఈ నెల 6వ తేదీ వరకు శ్రీమద్రామాయణ, సుందరకాండ, సహస్ర నామ తులసీ దళార్చన, కుంకుమార్చనలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆ రోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని వేడుకగా జరిపించనున్నారు. వేద రుత్విక్కులచే పారాయణాలు స్వామివారి ఆస్థాన మండపం వద్ద వివిధ ప్రాంతా ల నుంచి విచ్చేసిన రుత్విక్కులచే శ్రీమద్రామయణం, సుందరకాండ పారాయణాలు, సుదర్శన శతకం, నాలాయర దివ్య ప్రబంధ, తులసీ దళార్చన, కుంకుమార్చన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం యాగశాలలో సుందరాకాండ, గాయత్రీ రామాయణాలు, సుదర్శన శతకం హోమాలను నిర్వహించి అగ్నిప్రతిష్టాపనను గావించారు. రాత్రి 7గంటలకు స్వామివారిని రామతీర్థం తిరువీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉగాది పర్వదినం మొదలుకొని శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజు ల పాటు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఋత్విక్కులచే శత సహస్ర నామ తులసీ దళార్చన, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘పైడితల్లి’కి ఉగాది శోభ
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవా రి ఆలయం ఆదివారం ఉగాది శోభను సంతరించుకుంది. ఆలయ ఇంచార్జ్ ఈఓ కెఎన్‌విడివి.ప్రసాద్ నేత్రత్వంలో అమ్మవారికి పుష్పాలంకరణలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం అమ్మవారికి బూరెలతో నివేదన చేశారు. ఆలయమంతా పుష్పాలతోనూ, యాపిల్ పండ్లు, ద్రాక్ష పండ్లతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడు లు చెల్లించుకున్నారు. అనంతరం ఉగాది పర్వదినం పురస్కరించుకుని వేదపండితులను ఘనంగా సత్కరించి వారికి నగదు పురస్కారాలను అందజేశారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి ఆవరణలో అమ్మవారికి నేతేటి ప్రశాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో వేదపండితులు రాళ్లపల్లి రామసుబ్బారావు పంచాంగ శ్రవణం చేశా రు. కార్యక్రమంలో వేదపండితులు దూసి శివప్రసా ద్, తాతా రాజేష్, సాయికిరణ్, నరసింహమూర్తి, దూసి కృష్ణమూర్తిలు సహకారమందించారు. -
వేడుకగా విజయభావన వార్షికోత్సవం
● అబ్బురపరిచిన పి.రాజేశ్వరరావు చిత్ర కళాప్రదర్శన ● ఆలోచింపజేసిన వాణీవిలాసం ● చలనచిత్ర నటులు డాక్టర్ అక్కిరాజుకు ఉగాది పురస్కారం విజయనగరం టౌన్: సాహితీ సంస్థలకు తమ వంతు తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పేర్కొన్నారు. స్థ్దానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో విజయభావన సాహితీమిత్ర సమాఖ్య 40వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యల నగరమైన విజయనగరంలో సంగీత సాహిత్యాలు పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చలనచిత్ర నటులు, కవి డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ (హైదరాబాద్)ను దుశ్శాలువ, జ్ఞాపిక, నగదు బహుమతితో ఘనంగా సత్కరించారు. విజయనగరం గడ్డపై విజయభావన సంస్థ అందించిన పురస్కారంతో తనకెంతో ఆనందంగా ఉందని, విజయనగరంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి ముందు ఉదయం సభ కార్యక్రమాన్ని ప్రముఖ సీ్త్ర వైద్య నిపుణురాలు డాక్టర్ జి.సన్యాసమ్మ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ధవళ సర్వేశ్వరరావు, డాక్టర్ ఎ.గోపాలరావుల నేత్రత్వంలో నిర్వహించిన వాణీవిలాసంలో కవులు తమ కవితాగానాలాపన చేశారు. ప్రఖ్యాత చిత్రకారుడు, లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత పండూరు రాజేశ్వరరావు ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన ఆద్యంతం చూపరులను ఆకట్టుకుంది. డాక్టర్ భైరవభట్ల విజయాదిత్య ఏకపాత్రాభినయం, ఇబ్రహీంఖాన్ నాట్య ప్రదర్శన రక్తికట్టించింది. సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ.గోపాలరావు అధ్యక్షతన జరిగిన కార్యక్ర మంలో సమాఖ్య ప్రతినిధులు భోగరాజు సూర్యలక్ష్మి, బాబూజీరావు, డాక్టర్ జక్కు రామకృష్ణ, ఇఆర్.సోమయాజులు, వై.బాబూరావు, ఎం.అనిల్ కుమార పువ్వాడ వెంకట భాస్కర్, కాపుగంటి ప్రకాష్, దుర్గాప్రాద్, రఘోత్తమాచార్య, బవిరెడ్డి శివప్రసాదరెడ్డి, శ్రీరామబాబా అధిక సంఖ్యలో సాహితీవేత్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
విజయనగరం
సోమవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2025వినియోగానికి నోచుకోని నిధులు జిల్లాలోని అత్యధిక జనాభా ఉన్న వీరఘట్టం మేజర్ పంచాయతీకి ఎంతో ఘన చరిత్ర ఉంది. –8లోగిరిజన రైతు కంట కన్నీరు.. గిరిజనుల ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న జీడిపంట ఈ ఏడాది దెబ్బతింది. –8లోవిజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే మహిళలు అందరికి ఉచితంగా గ్యాస్ ఇస్తాం. ఏడాదికి మూడు సిలిండ ర్లు అందిస్తామని కూటమి నేతలు ఊరూరా ప్రచా రం చేశారు. అధికారంలోకి వచ్చారు... కానీ ఇచ్చిన ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు మాత్రం పూర్తి స్థాయిలో చేయలేదు. ఏడాదికి మూడు సిలిండర్లు అని చెప్పి 2024 – 25 సంవత్సరంలో ఒక సిలిండర్‌తోనే సరిపెట్టేశారు. ఈ క్రమంలో తొలి ఏడాది కూటమి నేతలు చెప్పిన దానికి విరుద్ధంగా రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ ఒక్క సిలిండ ర్ అయినా గ్యాస్ బుక్ చేసినా లబ్ధిదారులు అందరి కి సబ్సిడీ (రాయితీ) ఇచ్చారంటే అదీ లేదు. అందులో చాలా మందికి రాయితీ ఇవ్వలేదు. దీంతో కూటమి ప్రభుత్వం తీరు పట్ల గ్యాస్ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉచిత గ్యాస్ కోసం గుర్తించిన లబ్ధిదారుల సంఖ్య 5.02 లక్షలు జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు 6 లక్షలకు పైగా ఉన్నాయి. ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్ కోసం ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులు 5,02,654 మంది. ఇందులో 2024 – 25 సంవత్సరానికి సంబంధించి 4,46,846 మంది గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్నారు. 55,808 మంది గ్యాస్ బుక్ చేసుకోలేదు. వీరిలో ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ విడుదల చేసింది 4,42,394 మందికి మాత్రమే. వీరిలో 4,40,373 మందికి మాత్రమే ఉచిత గ్యాస్ రాయితీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. 6473 మందికి రాయితీ డబ్బులు నేటికీ జమ కాలేదు. రాయితీ కింద అందించాల్సిన నిధులు రూ.36.55 కోట్లు ఉచిత గ్యాస్ పథకం కిందద జిల్లాలో గ్యాస్ బుక్ చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించి రూ.36.55 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం రూ.32.63 కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది. ఇందులో లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయిన నిధులు రూ.32.49 కోట్లు. ఇంకా రూ.4.05 కోట్లు నిధులు జమ కావాల్సి ఉంది. వివిధ కారణాలతో లబ్ధిదారుల్లో కోత వివిధ కారణాలతో కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ రాయితీని తగ్గించుకోవాలని చూస్తుందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చిందని కొందరికి, ఇంట్లో అంగన్వాడీ కార్యకర్త, ఆశ కార్యకర్త వంటి చిరుద్యోగులు ఉన్నా రని మరి కొందరికి ఇలా అనేక కారణాలతో లబ్ధిదారులకు అందించాల్సిన ఉచిత రాయితీని ప్రభుత్వం ఎగ్గొంటేందుకు ప్రయత్నిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరం పట్టణంలోని దండు మారమ్మ కల్యాణ మండపం రోడ్డులో గ్యాస్ డెలివరీ చేస్తున్న సిబ్బంది న్యూస్‌రీల్ గ్యాస్ బుక్ చేసిన వారందరికీ పడని నగదు జిల్లాలో ఉచిత గ్యాస్‌కు అర్హులైన లబ్ధిదారులు 5,02,654 మంది గ్యాస్ బుక్ చేసుకున్న వారు 4,46,846 మంది గ్యాస్ వినియోగదారులకు అందించాల్సిన నిధులు రూ.36.35 కోట్లు ప్రభుత్వం రీలీజ్ చేసింది రూ.32.63 కోట్లు లబ్ధిదారులు ఖాతాల్లో జమ అయిన నిధులు రూ.32.49 కోట్లు రూ.32.63 కోట్లు విడుదల ఈ నెల 29వ తేదీ నాటికి ఫ్రీ గ్యాస్ లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.32.63 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.32.49 కోట్లు లబ్ధిదారు ల ఖాతాల్లో జమయ్యాయి. మిగతా వారికి ఈ నెల 31వ తేదీ వరకు సమయం ఉన్నందున జమయ్యే అవకాశం ఉంది. – కె.మధుసూదనరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి -
సిగ్గులేదా చంద్రబాబూ?
పేదల భూములు లాక్కునేందుకు బొబ్బిలి: మాది బీసీ ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడూ.. నిరుపేద బీసీలకు చెందిన భూములను లాక్కోవడానికి సిగ్గులేదా..? డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నీకూ సిగ్గులేదా.. మీకు పేదలు అర్జీ పెట్టుకున్నా కనిపించలేదా? అంటూ రాజమండ్రి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హర్షకుమార్ దుయ్యబట్టారు. ఆయన విజయనగరం జిల్లా బొబ్బిలిలో విలేకరులతో శుక్రవారం మాట్లాడారు. భూ పరిమితి చట్టం కింద రాజుల నుంచి ఏళ్ల కిందట స్వాధీనం చేసుకున్న భూమిని 1991 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఒక్కో పేద కుటుంబానికి ఎకరా చొప్పున ఇచ్చిందన్నారు. ఆ భూముల్లో సాగుచేసిన పంటలే వారికి జీవనాధారమని పేర్కొన్నారు. ఇప్పుడు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తన అధికార బలంతో మళ్లీ వాటిని లాక్కున్నారని, సర్వే నంబర్లు మార్చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా వేసి అమ్ముకోవడం దుర్మార్గమన్నారు. ముందుగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనా యన వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రాంతాన్ని పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడి ఓదార్చారు. అండగా ఉంటామన్నారు. రజక తదితర బీసీ కులస్తులకు గతంలో ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన భూములను తిరిగి లాక్కోవడాన్ని చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నారన్నారు. అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిన వారి తాట తీస్తానన్న చంద్రబాబు ఇప్పుడు బొబ్బిలి ఎమ్మెల్యే తాట తీయడం లేదేమని ఆయన ప్రశ్నించారు. బొబ్బిలిలో భూమాయ చూసిన ప్రజలకు టీడీపీ అధికారంలోకి వస్తే ఇలాగే ఉంటుందని బాగా అర్ధమవుతోందన్నారు. ఇది అన్యాయం.. అక్రమమన్నారు. వెంటనే పేదల భూములను వదిలి వెళ్లిపోవాలని , లేకుంటే ఇక్కడ నుంచి పేదల తరఫున పోరాడుతానని చెప్పారు. ఆయన వెంట బొబ్బిలి కాంగ్రెస్‌పార్టీ ఇన్చార్జి మువ్వల వెంకటరమణ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, భూ బాధితులు ఉన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ -
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
విజయనగరం అర్బన్: ప్రస్తుత వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తాగునీటి బోరుబావులన్నింటినీ వినియోగంలోకి తేవాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా, మండల, నియోజకవర్గ స్థాయి అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి శనివారం మండల ప్రత్యేకాధికారులు మండల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల్లో తాగునీటి సరఫరాపై ఆరా తీయాలన్నారు. తాగునీటి సమస్యపై కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 73825 63040ను అందుబాటులో ఉంచాలన్నారు. పశువులకు పశుగ్రాసం సమస్య తలెత్తకుండా చూడాలని పశుసంవర్థక శాఖ జేడీకు సూచించారు. ఉపాధి వేతనదారులకు పని గంటలు మార్చాలి ఉపాధి హామీ పనులు చేసే వేతనదారులు వేసవి తాపానికి గురికాకుండా పనివేళలను మార్చాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఉదయం 6.30 నుంచి 9.30 గంటల లోపు, సాయంత్రం 5 నుంచి 7గంటలలోపు పని వేళలు ఉండేలా చూడాలన్నారు. ఈ నెల 30, 31వ తేదీల్లో పబ్లిక్ సెలవులు కారణంగా 1వ తేదీన ఇచ్చే పింఛన్ సొమ్మును ఈ నెల 29వ తేదీనే విత్‌డ్రా చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, జిల్లా అధికారులు, నియోజకవర్గాల అధికారులు పాల్గొన్నారు. పీ–4కు ప్రత్యేక బస్సులు విజయవాడలో ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న పీ 4 కార్యక్రమానికి జిల్లా నుంచి వివిధ రంగాల ప్రతినిధులు హాజరయ్యేలా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి 7 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. విద్యార్థులు, ఉపాధిహామీ వేతనదారులు, స్వయం శక్తి సంఘాల ప్రతినిధులు, రైతులను అన్ని నియోజకవర్గాల నుంచి బస్సుకు 50 మంది చొప్పున పంపించాలని అధికారులకు సూచించారు. ప్రతి బస్సులో పోలీస్ కానిస్టేబుల్, ఏఎన్ఎంను ఉంచాలని, ఒక లైజనింగ్ అధికారిని నియమంచాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, ఎఎప్పీ సౌమ్యలత, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, డీఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, సీపీఓ పి.బాలాజీ, డీటీసీ మణికుమార్, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ వై.వి.రమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పాఠశాలల్లో ప్రతి రెండు గంటలకు వాటర్ బెల్ కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
తపాలాశాఖ అభ్యున్నతికి ఉద్యోగులంతా కృషిచేయాలి
విజయనగరం టౌన్: తపాలాశాఖ అభ్యున్నతికి ఉద్యోగులంతా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ అధికారి కె.సంతోష్ నేతా పేర్కొన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి పోస్టల్ డివిజన్ల అధికారులు, సిబ్బందితో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పెషల్ డ్రైవ్‌తో ఆర్పీఎల్ఐ శతశాతం లక్ష్యసాధనకు సూచనలు చేశారు. 58,780 లక్ష్యానికి మించి 64,561 అకౌంట్స్ ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. పీఎల్ఐ ప్రీమియంలు 92.78 శాతం, 3,880 సుకన్య సమృద్ధిఖాతాలు తెరవడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం టార్గెట్లు పూర్తిచేసిన అధికారులు, సిబ్బందిని ఘనంగా సత్కరించారు. అధిక సంఖ్యలో తపాలాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బార్ అసోసియేషన్ ఏకగ్రీవం
పార్వతీపురంటౌన్: పార్వతీపురం బార్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవమ య్యాయి. ఈ మేరకు అధ్యక్షుడిగా నల్ల శ్రీనివాసరావు ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి బి.సత్యనారాయణ శుక్రవారం పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు పార్వతీపురం బార్ అసోసియేషన్‌కు 2025–26 సంవత్సరానికి గాను ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. ఈ నెల 17 నామినేషన్ వేసిన వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలో ఉపాధ్యక్షుడిగా సూర్ల కృష్ణ, జనరల్ సెక్రటరీగా నీలం రాజేశ్వరరావు, జాయింట్ సెక్రటరీగా ఎంవీ వెంకట రాఘవేంద్ర, కోశాధికారిగా మంత్ర పూడి వెంటకరమణలను ఎన్నుకున్నారని వివరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని బార్ అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. విజయనగరంలో.. విజయనగరం లీగల్: విజయనగరం జిల్లా కేంద్ర న్యాయవాదుల సంఘం ఎన్నికల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. సంఘం అధ్యక్షుడిగా కలిశెట్టి రవిబాబు, సంయుక్త కార్యదర్శిగా బార్నాల సీతారామరాజు ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రవిబాబు 58 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి ధవళ వెంకట రావుపై విజయం సాధించారు. కాగా సంయుక్త కార్యదర్శిగా బార్నాల సీతారామ రాజు తన ప్రత్యర్థి సారిక సతీష్‌పై కేవలం నాలుగు ఓట్లు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. కార్యదర్శిగా నలితం సురేష్ కుమార్, ఉపాధ్యక్షుడిగా పి.శివప్రసాద్, కోశాధికారిగా కళ్ళెంపూడి వెంకట్రావు, లైబ్రరీ కార్యదర్శిగా తాడిరాజు, స్పోర్ట్స్ సెక్రటరీగా చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
క్షయ నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే జిల్లా టాప్
విజయనగరం ఫోర్ట్: క్షయవ్యాధి నియంత్రణలో విజయనగరం జిల్లాకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. క్షయ వ్యాధి నియంత్రణ ప్రత్యేక వందరోజుల ఉద్యమంలో దేశంలోనే అత్యధిక క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసిన జిల్లాగా గుర్తింపు పొందింది. క్షయవ్యాధి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని 347 జిల్లాల్లో వంద రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని గత ఏడాది డిసెంబర్ 7న ప్రారంభించింది. ఈ ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో విజయనగరం జిల్లా వంద రోజుల టీబీ నియంత్రణ కార్యక్రమానికి ఎంపికై ంది. దీనిలో భాగంగా క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, క్షయవ్యాధి లక్షణాలు కలిగి ఉన్న వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు జిల్లాలో చేపట్టారు. వంద రోజుల కార్యక్రమానికి ఎంపికై న 347 జిల్లాల అన్నింటిలో విజయనగరం జిల్లాలో అత్యధికంగా 45,195 క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మార్చి 24న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ జేపీ నడ్డా నుంచి క్షయ నియంత్రణపై విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర బృందం ప్రతినిధి పి.రమేష్ అవార్డు స్వీకరించారని తెలిపారు. ఈ ఘనతను సాధించడంలో కృషి చేసిన డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి, క్షయ నివారణ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. వైద్యారోగ్యశాఖను అభినందించిన కలెక్టర్ అంబేడ్కర్ -
సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్లుగా తెర్లాం యువకులు
తెర్లాం: జిల్లాలోని తెర్లాం మండలం, తెర్లాం పంచాయతీ పరిధిలోని చిన్నయ్యపేట గ్రామానికి చెందిన చింత జ్యోతిస్వరూప్, తెర్లాం మండల కేంద్రానికి చెందిన చిప్పాడ హరీష్‌లు ఇటీవల జరిగిన ఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచి సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్లుగా ఎంపికయ్యారు. ఆ యువకుల నేపథ్యం ఇలా ఉంది. చింత జ్యోతిస్వరూప్:. చిన్నయ్యపేట గ్రామానికి చెందిన చింత శంకరరావు, అరుణల కుమారుడు. విశాఖపట్నంలోని గాయత్రి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. ఇటీవల జరిగిన ఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలో 390 మార్కులకుగాను 350 మార్కులు సాధించి ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 836వ ర్యాంక్ సాధించి సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. జ్యోతిస్వరూప్ తండ్రి శంకరరావు విశాఖపట్నంలోని ఓ కోచింగ్ సెంటర్లో రీజనింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తుండగా తల్లి అరుణ గృహిణి. కుమారుడు జ్యోతిస్వరూప్ జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపిక కావడంపట్ల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిప్పాడ హరీష్.. తెర్లాం గ్రామానికి చెందిన చిప్పాడ రమణ, మంగరత్నంల కుమారుడు. హరీష్ ప్రస్తుతం చైన్నెలో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో టాక్స్ అసిస్టెంట్‌గా ఏడాదిన్నగా పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఎస్ఎస్సీ సీజీఎల్ ప్రవేశ పరీక్షకు హాజరై 390మార్కులకుగాను 346మార్కులు సాధించి ఆలిండియా ఓబీసీ కేటగిరీలో 1602 ర్యాంక్ కై వసం చేసుకుని సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. హరీష్ తండ్రి రమణ మండలంలోని పణుకువలస ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తల్లి మంగరత్నం తెర్లాంలోని శ్రీవేంకటేశ్వర విద్యాసంస్థల కరస్పాండెంట్. కుమారుడు హరీష్ సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్గా ఎంపిక కావడంపట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. చిన్నయ్యపేటకు చెందిన జ్యోతిస్వరూప్ తెర్లాంకు చెందిన హరీష్ ఎంపిక -
సారా దుష్ఫలితాలపై అవగాహన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సారా తాగితే అధోగతి, తాగకుంటే పురోగతి అని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎకై ్సజ్ శాఖ అధికారులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ ఆదేశించారు. సారా నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ఎకై ్సజ్ అధికారులతో నవోదయం 2.0పై శుక్రవారం విజయనగరంలోని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారారహిత గ్రామాలు స్వర్ణాంధ్ర సాధనకు సోపానం కావాలన్నారు. సారా మానేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అంటూ విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. సారా సరఫరాదారుల ఆటకట్టించేందుకు ట్రోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో విజయనగరం జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.శ్రీనాథుడు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు, ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు. ప్రతి గ్రామంలోనూ సదస్సులు ఎకై ్సజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ -
సిగ్గులేదా చంద్రబాబూ?
పేదల భూములు లాక్కునేందుకు బొబ్బిలి: మాది బీసీ ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడూ.. నిరుపేద బీసీలకు చెందిన భూములను లాక్కోవడానికి సిగ్గులేదా..? డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నీకూ సిగ్గులేదా.. మీకు పేదలు అర్జీ పెట్టుకున్నా కనిపించలేదా? అంటూ రాజమండ్రి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హర్షకుమార్ దుయ్యబట్టారు. ఆయన విజయనగరం జిల్లా బొబ్బిలిలో విలేకరులతో శుక్రవారం మాట్లాడారు. భూ పరిమితి చట్టం కింద రాజుల నుంచి ఏళ్ల కిందట స్వాధీనం చేసుకున్న భూమిని 1991 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఒక్కో పేద కుటుంబానికి ఎకరా చొప్పున ఇచ్చిందన్నారు. ఆ భూముల్లో సాగుచేసిన పంటలే వారికి జీవనాధారమని పేర్కొన్నారు. ఇప్పుడు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తన అధికార బలంతో మళ్లీ వాటిని లాక్కున్నారని, సర్వే నంబర్లు మార్చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా వేసి అమ్ముకోవడం దుర్మార్గమన్నారు. ముందుగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనా యన వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రాంతాన్ని పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడి ఓదార్చారు. అండగా ఉంటామన్నారు. రజక తదితర బీసీ కులస్తులకు గతంలో ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన భూములను తిరిగి లాక్కోవడాన్ని చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నారన్నారు. అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిన వారి తాట తీస్తానన్న చంద్రబాబు ఇప్పుడు బొబ్బిలి ఎమ్మెల్యే తాట తీయడం లేదేమని ఆయన ప్రశ్నించారు. బొబ్బిలిలో భూమాయ చూసిన ప్రజలకు టీడీపీ అధికారంలోకి వస్తే ఇలాగే ఉంటుందని బాగా అర్ధమవుతోందన్నారు. ఇది అన్యాయం.. అక్రమమన్నారు. వెంటనే పేదల భూములను వదిలి వెళ్లిపోవాలని , లేకుంటే ఇక్కడ నుంచి పేదల తరఫున పోరాడుతానని చెప్పారు. ఆయన వెంట బొబ్బిలి కాంగ్రెస్‌పార్టీ ఇన్చార్జి మువ్వల వెంకటరమణ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, భూ బాధితులు ఉన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ -
ట్రాక్టర్ ఇంజిన్ కింద పడి వ్యక్తి మృతి
బొబ్బిలి రూరల్: మండలంలోని సీహెచ్ బొడ్డవలస పంచాయతీ పరిధి కేశాయవలస గిరిజన గ్రామంలో టేకు మొక్కలకు నీళ్లుపోస్తున్న వాటర్ ట్యాంకు ట్రాక్టర్ బోల్తా పడడంతో ట్రాక్టర్ ఇంజిన్ కింద పడి, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కాశీపేట గ్రామానికి చెందిన పెదిరెడ్డి పోలిరాజు(58)మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కేశాయవలస గ్రామానికి చెందిన కొండగొర్రె నీలమ్మ పొలంలో టేకు మొక్కలకు నీళ్లు పోసేందుకు వాటర్ట్యాంకర్తో వెళ్తున్న పోలిరాజు పొలంలో ఎత్తుపల్లాలను గమనించకపోవడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో పోలిరాజు ట్రాక్టర్ కింద పడగా అక్కడికక్కడే మృతిచెందాడని సీఐ సతీష్‌కుమార్ తెలిపారు. మృతుడి కుమారుడు సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్సై జ్ఞానప్రసాద్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్‌సీకి తరలించామని సీఐ తెలిపారు.మృతుడు పోలిరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి..భామిని: మండలం పసుకుడికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి మువ్వల జయరాం(18) శుక్రవారం శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడినట్లు బత్తిలి ఎస్సై డి.అనిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఘటనపై ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇటీవల జయరాం ఇంటర్మీడియట్ సెకెండియర్ పరీక్షలు భామినిలో రాశాడు. పరీక్షల అనంతరం సరదాగా గడుపుతున్న జయరాం ఈ నెల 2న పసుకుడి నుంచి లివిరి డోలోత్సవ యాత్రకు స్నేహితులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంజరిగి తీవ్రగాయాలపాలయ్యడు. వెంటనే 108 అంబులెన్సు లో కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించి శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బత్తిలి ఏఎస్సై కొండగొర్రి కాంతారావు ఆద్వర్యంలో కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుడికి తల్లిదండ్రులతో పాటు ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. పసుకుడిలో జరిగిన అంతిమ సంస్కారంలో తోటి విద్యార్థులు, టీచర్లు, బంధువులు పాల్గొని జయరాంకు ఘనంగా నివాళులు అర్పించారు. అనుమానాస్పద స్థితిలో యువతి..సాలూరు రూరల్: మండలంలోని మర్రివానివలస గ్రామానికి చెందిన వాకాటి ఐశ్వర్య (20) చీపురువలస గ్రామసమీపంలో మామిడితోటలో అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉన్నట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన చెప్పిన సమాచారం ప్రకారం విశాఖపట్నంలోని ఒక బట్టల షాపులో పనిచేస్తున్న ఆమె ఇటీవల ఇంటికి వచ్చి రెండురోజుల క్రితం పనికి వెళ్లింది. శుక్రవారం చీపురువలస గ్రామసమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నన్ను విడిచి వెళ్లిపోయావా...
సీతంపేట: బిడ్డా.. చనిపోయేందుకే వచ్చావా.. ఎంతఘోరం జరిగిపోయింది.. అండగా ఉంటానని చెప్పి అందని లోకాలకు వెళ్లిపోయావా... అంటూ ఆ తల్లి రోదన అక్కడివారికి కన్నీరు తెప్పించింది. పొట్టకూటి కోసం తల్లికి తోడుగా వలసవెళ్లి రెండు నెలల తర్వాత పాఠశాలకు వెళ్లిన విద్యార్థి మృత్యువాత పడిన ఘటన సీతంపేట మండలం దోనుబాయి ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కె.కాగుమానుగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి సవర చలపతి (14) దోనుబాయి ఆశ్రమపాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కూలిపని కోసం విజయవాడకు వలస వెళ్లిన తల్లి లండమ్మకు తోడుగా వెళ్లిపోవడంతో ఫిబ్రవరి నుంచి మార్చి 26 వరకు పాఠశాలకు గైర్హాజరయ్యాడు. పరీక్షలని తెలియడంతో ఈ నెల 27న పాఠశాలకు వచ్చి ఎప్పటివలే విద్యార్థులతో కలసిమెలసి ఉన్నాడు. శుక్రవారం ఉదయం ఫలహారం అనంతరం పాఠశాల పై అంతస్తులో తన గదిలో బంకర్ బెడ్ మంచానికి ఊయల కట్టుకుని సరదాగా ఊగుతున్నాడు. ఈ క్రమంలో గట్టిగా ఊగడంతో ఒక్కసారిగా కాలు జారి కిందపడిపోయాడు. మంచం కూడా విద్యార్థిపై పడి తలకు బలమైన గాయమైంది. రక్తం ధారలా కారుతుండడాన్ని చూసిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యాధికారి భానుప్రతాప్‌తో పాటు వైద్యసిబ్బంది సేవలందించినా ఫలితం లేకపోయింది. తండ్రి భీముడు రెండేళ్ల కిందటే మృతిచెందాడు. ఇద్దరు అన్నదమ్ములు గణేష్, ప్రసాద్ ఉన్నారు. ఎస్ఐ షేక్ మస్తాన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, సీఐ చంద్రమౌళి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి మృతిపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లికి తోడుగా వలస వెళ్లి... మృతుడి పెద్దఅన్నయ్యకు వివాహం కాగా, చిన్న అన్నయ్య నిరుద్యోగి. నిరుపేద కుటుంబం కావడంతో కూలిపనుల కోసం విజయవాడకు తల్లి బయలుదేరగా తోడుగా చలపతి వెళ్లాడు. ఐదు రోజుల కిందటే గ్రామానికి వచ్చారు. తొమ్మిదో తరగతి పరీక్షలు జరుగుతాయని గురువారం పాఠశాలకు వెళ్లాడు. ఇంతలో బిడ్డ మృతి చెందాడన్న పిడుగులాంటి సమాచారం అందడంతో తల్లితో పాటు కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బిడ్డా.. ఊయల నుంచి జారిపడి విద్యార్థి మృతి దోనుబాయి ఆశ్రమ పాఠశాలలో ఘటన కన్నీటిపర్యంతమైన తల్లి, కుటుంబ సభ్యులు కుటుంబాన్ని ఆదుకుంటాం మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి తెలిపారు. విద్యార్థి మృతివార్త తెలుసుకున్న వెంటనే ఆయన పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. మృతికి కారణాలు తెలుసుకున్నారు. తనకు సమగ్ర నివేదిక అందించాలని గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొరను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామపెద్దలు ఎస్.భాస్కరరావు, విజయ్, రవి తదితరులు పీఓను కోరారు. ముందుగా రుణ సౌకర్యం కల్పించి ఆదుకుంటామని పీఓ హామీ ఇచ్చారు. దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.10 వేలు అందజేశారు. ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, పార్వతీపురం ఐటీడీఏ డీడీ కృష్ణవేణి, ఏఎంవో కోటిబాబు, జీసీడీఓ రాములమ్మ, హెచ్ఎంలు ఎ.భాస్కరరావు, చంద్రరావు తదితరులు ఉన్నారు. -
1వ తేదీన పదో తరగతి సోషల్ పరీక్ష
విజయనగరం అర్బన్: ఈ నెల 31వ తేదీ జరగాల్సిన పదో తరగతి సాంఘిక శాస్త్ర సబ్జెక్టు పరీక్ష రంజాన్ పండగ కారణంగా వచ్చేనెల 1వ తేదీన నిర్వహిస్తామని డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. ప్రభుత్వ పరీక్షల విభా గం సంచాలకుల ఆదేశాల మేరకు ఈ మార్పు జరిగిందని తెలిపారు. ఇంతవరకు జరిగిన పరీక్షల మాదిరిగానే ఉదయం 09.30 గంటల నుంచి 12.45 గంటల మధ్య సమయంలోనే నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షల సిబ్బంది, అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు. 30, 31న యథావిధిగా రిజిస్ట్రేషన్ సేవలు విజయనగరం రూరల్: జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 30న ఉగాది, 31న రంజాన్ పండగల్లో సైతం రిజిస్ట్రేషన్ సేవలు యథావిధిగా అందజేస్తామని జిల్లా రిజిస్ట్రార్ పి.రామలక్ష్మిపట్నాయక్ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అడిషనల్ ఐజీ ఉదయభాస్కర్ ఆదేశాలు జారీచేశారన్నారు. ఆ రెండు రోజులు సెలవు దినాల నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు పతంజలి సాహిత్య పురస్కారం ప్రదానం విజయనగరం టౌన్: ప్రముఖ పాత్రికేయుడు, రచయిత తాడిప్రకాష్‌కు పతంజలి సాహిత్య పురస్కారాన్ని శనివారం ప్రదానం చేస్తామని పతంజలి సాంస్కృతిక వేదిక కార్యదర్శి ఎన్.కె.బాబు ఓ ప్రకటనలో తెలిపారు. గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సాయంత్రం 6 గంటల నుంచి పురస్కార సభ జరుగుతుందని, సాహితీవేత్తలు, అభిమానులు హాజరుకావాలని కోరారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల ఏర్పాటుకు వినతి విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను అదనంగా ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరావుకు ఉపాధ్యాయులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. జిల్లాలో గిరిజన బాలికల కోసం కేవలం రెండే రెండు ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయన్నారు. దీనివల్ల ఆ పాఠశాలల్లో ఉన్న సీట్లు భర్తీ అయిపోతే చదువుకోవాలనుకుంటున్న బాలికలు విద్యకు దూరమవుతున్నారని తెలియజేశారు. వినతిని స్వీకరించిన చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరావు మాట్లాడుతూ విద్య ప్రాథమిక హక్కు అని, పిల్లలు అందరూ చదువుకునేలా చూడాల్సి బాధ్యత అందరి మీదా ఉందన్నారు. జిల్లాలోని సమస్యను ప్రభుత్వానికి నివేదించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. 31న గ్రీవెన్స్ రద్దు విజయనగరం అర్బన్: రంజాన్ సందర్భంగా ఈ నెల 31వ తేదీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావినతుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను రద్దు చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు గమనించాలని సూచించారు. మత్య్సశాఖ డీడీకి ఉద్యోగోన్నతి విజయనగరం ఫోర్ట్: మత్య్సశాఖ డిప్యూటీ డైరెక్టర్ నేతల నిర్మలకుమారి మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతిపై రాజమండ్రికి బదిలీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ స్థాయి గుర్తింపు గజపతినగరం: పురిటిపెంట–2 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని మరుపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సాయికృష్ణారెడ్డి తెలిపారు. కేంద్రం సిబ్బందిని శుక్రవారం అభినందించారు. రోగులకు సంతృప్తికర వైద్యసేవలు, మౌలిక సదుపాయాలు, అవసరమైన మందుల నిల్వలు, పరిశుభ్రత తదితర అంశాల ఆధారంగా కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చినట్టు తెలిపారు. ఎమ్ఎల్హెచ్పి ఎం.సంతోషి, ఏఎన్ఎం ఎ.సత్యవతి సేవలను కొనియాడారు. -
తమ్ముళ్లే కాంట్రాక్టర్లు
బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. గోకులాల నిర్మాణ పనులన్నీ వారే తీసుకుంటున్నారు. బాడంగి మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఏకంగా 24 షెడ్ల కాంట్రాక్టు తీసుకోవడమే దీనికి నిదర్శనం. బొబ్బిలి మండలంలో 54, తెర్లాం మండలంలో 55, బాడంగి మండలంలో 75, రామభద్రపురం మండలంలో 58 గోకులాలు మంజూరయ్యాయి. టీడీపీ కార్యకర్తలు, నాయకులైతే చాలు పాడి రైతులు కాకపోయినా ఫర్వాలేదన్నట్లుగా పంచేశారు. కొంతమంది పాడిరైతులైనా, వారికి అర్హత ఉన్నా కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే కారణంతో దరఖాస్తులను పక్కన పడేస్తున్నారు. -
ఇదీ యంత్రాంగం తీరు..!
● కూటమి నేతల సిఫారసు ఉంటేనే వ్యవసాయ యంత్రాల మంజూరు ● కూటమి ఆదేశాలు అధికారులు అమలు చేస్తున్నారనే ఆరోపణలువిజయనగరం ఫోర్ట్: ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రంధి దేముడు. ఈయనది గంట్యాడ మండలంలోని పెదవేమలి గ్రామం. వ్యవసాయ యంత్ర పనిముట్లు రాయితీపై ఇస్తామని రైతు సేవా కేంద్రం సిబ్బంది చెప్పడంతో దుక్కిసెట్టు కోసం దరఖాస్తు చేశాడు. దుక్కిసెట్టు నిమిత్తం రైతు కట్టాల్సిన వాటాను చెల్లించడానికి రైతు సేవా కేంద్రం సిబ్బందిని అడిగితే మీకు దుక్కి సెట్టు మంజూరు చేయలేం అని తేల్చి చెప్పడంతో మిన్నుకుండిపోయాడు. ఈ పరిస్థితి ఈ ఒక్క రైతుదేకాదు. జిల్లాలోని అనేక మంది రైతులది. అందరికీ అన్నం పెట్టే రైతులతో కూటమి నేతలు రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యంత్ర పరికరాల కోసం దరఖాస్తు చేసిన రైతులు ఏపార్టీ వారా? అని అరా తీస్తున్నారు. కూటమి పార్టీకి చెందిన రైతులైతే వారికి యంత్ర పరికరాల మంజూరుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తటస్థంగా ఉండే రైతులైతే వారికి యంత్ర పరికరాలు మంజూరు చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు కూడా అధికార పార్టీకి చెందిన నేతల ఆదేశాలను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీకు తెలియంది ఏం ఉంది? అధికార పార్టీ నేతలు చెప్పినట్లు చేయాల్సిందే కదా అంటూ వ్యవసాయ శాఖకు చెందిన ఓ అధికారి వాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కూటమి నేతల వ్యవహార శైలి తెలిసిన చాలామంది రైతులు యంత్ర పరికరాల కోసం దరఖాస్తు చేయలేదు. దరఖాస్తు చేసినా కూటమి నేతలు మంజూరు కానివ్వరనేది రైతుల భావన. 456 మంది దరఖాస్తు వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతులు జిల్లావ్యాపంగా 456 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వాటికి సంబంధించి కూటమి నేతలు చెప్పి న లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేసిన ట్లు తెలిసింది. 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. దుక్కి సెట్లు, మోటార్ స్ప్రేయర్స్, పవర్ టిల్లర్స్, బ్రష్ కట్టర్స్, పవర్వీటర్స్, రోటోవీడర్స్ యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. వ్యవసాయ యంత్ర పరికరాల రాయితీకి సంబంధించి ప్రభుత్వం జిల్లాకు రూ.2.50 నిధులు కేటా యించినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారుదరఖాస్తులు పరిశీలించి మంజూరు జిల్లాలో యంత్ర పరికరాల కోసం 456 మంది దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులను పరిశీలించి యంత్ర పరికరాలు మంజూరు చేయనున్నాం. వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి -
గోకులంలోనూ.. తమ్ముళ్ల గోకుడు!
గోకులం షెడ్‌కు అదనంగా కమ్మలతో వేసుకున్న పాక డిజైన్ సరిగా లేదని రైతులు వాపోతున్న మినీ గోకులం షెడ్● పంచాయతీ తీర్మానాలు లేకుండానే పశువుల షెడ్ ● టీడీపీ నాయకులు, కార్యకర్తలకే గోకులాలు మంజూరు ● అసలైన పాడిరైతులకు మొండిచేయి ● షెడ్ల నిర్మాణ పనులకూ టీడీపీ నాయకులే కాంట్రాక్టర్లు సాక్షి ప్రతినిధి, విజయనగరం: పశువుల సంరక్షణ కోసం ఉద్దేశించిన మినీ గోకులాలు టీడీపీ నాయకులు, కార్యకర్తల జేబులు నింపుతున్నాయి. పాడి రైతులకు దక్కాల్సిన ఈ పథకం టీడీపీ నాయకుల సిఫారసు ఉన్నవారికే మంజూరు చేస్తున్నారు. వాస్తవానికి గ్రామ పంచాయతీ తీర్మానంతో మంజూరు చేయాలన్న నిబంధనకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను డమ్మీలను చేసేసి టీడీపీ నాయకులే చక్రం తిప్పుతున్నారు. జిల్లాలో రెండు దఫాల్లో దాదాపు 1900 మినీ గోకులాలు మంజూరయ్యాయి. వాటిలో వెయ్యి వరకూ నిర్మాణం పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద రూ.8.50 కోట్ల మేర అధికారులు ఎఫ్‌టీవో జనరేట్ చేశారు. జనవరి 15వ తేదీ తర్వాత నుంచి జరిగిన నిర్మాణాలకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ● నిబంధనలకు తిలోదకాలు... గోకులం రైతు సొంత భూమిలో నిర్మించాలి. పశువులు కూడా ఉండాలి. కానీ చాలా చోట్ల ప్రభుత్వ భూమిలో కూడా గోకులం మంజూరు చేసేశారు. అంతే కాదు వాటికి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్ సైతం రెవెన్యూ అధికారులు ఇచ్చేయడం గమనార్హం. కొంతమందికి పశువులు లేకపోయినా గోకులం షెడ్ మాత్రం వచ్చేసింది. పూసపాటిరేగ మండలంలోని జనసేన పార్టీకి చెందిన ఓ నాయకుడు చెప్పినవారికే గోకులం షెడ్లు మంజూరవుతున్నాయి. నెల్లిమర్ల మండలంలో 58 షెడ్లు టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులకే కేటాయించారు. దోపిడీ మారలేదు... టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ జేబులు నింపుకోవడానికి గోకులం షెడ్లు బాగా ఉపయోగపడుతున్నాయన్నది జనంమాట. గతంలో 2014–2019 టీడీపీ ప్రభుత్వపాలనలోనూ గోకులాల పేరుతో లక్షలాది రూపాయల దుర్వినియోగం తెలిసిందే. నాటి తరహాలోనే ఇప్పుడీ కూటమి ప్రభుత్వంలోనూ గోకులాలను తమ దోపిడీకి వాడుకుంటున్నారు. విజయనగరం మండల పరిధిలో తొలి విడతలో 26, రెండో విడతలో 74 గోకులం షెడ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 50 షెడ్లు నిర్మాణాలు పూర్తి కాగా మిగతా 50 షెడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. పశువుల షెడ్ అయినా చెప్పాల్సిందే.... అనర్హులకే గోకులం... అంతా ‘పసుపు’ మయం... చీపురుపల్లి మండలంలో 17, గరివిడి మండలంలో పది, గుర్ల మండలంలో 52, మెరకముడిదాం మండలంలో రెండు గోకులాల నిర్మాణం పూర్తయ్యింది. వాటి లబ్ధిదారులంతా టీడీపీ నాయకులు, కార్యకర్తలే. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన వీటికి టీడీపీ రంగు వేసేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో పశువుల షెడ్లు, గొర్రెల షెడ్లు, పౌల్టీల షెడ్లు ఏవైనా సరే అర్హత కన్నా మంజూరు విషయంలో పసుపు రాజకీయం, పక్షపాత ధోరణే కనిపిస్తోంది. షెడ్ కావాలంటే అధికార పార్టీకి చెందినవారైనా అయి ఉండాలి. లేదంటే ఆ నాయకుల సిఫార్సులైనా ఉండాలనేదీ రివాజుగా మారిపోయింది. ఎస్.కోట మండలంలో 108 గోకులం షెడ్లు మంజూరైతే వాటి లబ్ధిదారులంతా టీడీపీ వారే. రాజాం నియోజకవర్గంలో గోకులాలు అర్హుల కంటే అనర్హులకే అధికంగా దక్కాయి. రాజాం మండలంలో 13, వంగర మండలంలో 11, సంతకవిటి మండలంలో నాలుగు, రేగిడి మండలంలో 37 మంజూరుకాగా ఇప్పటివరకూ రాజాంలో మూడుచోట్ల, సంతకవిటిలో రెండుచోట్ల, రేగిడిలో మూడుచోట్ల మాత్రమే నిర్మాణం పూర్తి అయ్యింది. పూర్తయినవాటిని కూడా పశువులకు ఉపయోగించకుండా వాహనాల పార్కింగ్‌కు, వ్యాపార సామాగ్రి భద్రపర్చుకోవడానికి, మంచాలు, కుర్చీలు వేసుకోవడానికి వాడుకుంటున్నారు. -
పోలీస్ సిబ్బంది సమస్యలకు ఒకరోజు
● వెల్ఫేర్డేలో విజ్ఙాపనలు స్వీకరించిన ఎస్పీ విజయనగరం క్రైమ్: పోలీస్‌శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న, ఎదురవుతున్న అనుభవిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించనున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో శుక్రవారం పోలీస్ వెల్ఫేర్ డేను ఎస్పీ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా పోలీస్‌శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందల్ విజ్ఞాపనలు స్వీకరించి చర్యలు చేపట్టారు. లివిరి సమీపంలో ఏనుగుల గుంపుభామిని: మండలంలో ఏనుగుల గుంపు అలజడి సృష్టిస్తోంది. శుక్రవారం మండలంలోని లివిరి పంట పొలాల్లో నాలుగు ఏనుగుల గుంపు ప్రవేశించి పంటలు నాఽశనం చేస్తున్నాయి. వంఽశదార నదీ తీరం వెంబడి ఏనుగుల గుంపు ప్రయాణం కొనసాగుతోంది. భామిని గ్రామంలోకి ఏనుగుల గుంపు ప్రవేశిస్తుందని మండల కేంద్రం రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఏనుగులు గుంపు పంటలన్నీ పాడుచేస్తున్నప్పటికీ అధికార కూటమి నాయకులు ఇచ్చిన హామీ మరిచి మౌనం వహించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళ ఆత్మహత్యవిజయనగరం క్రైమ్: నగర శివారు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ధర్మపురిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్సై అశోక్ శుక్రవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ధర్మపురికి చెందిన సేనాపతి ఆదిలక్ష్మి (40) కొన్నేళ్లుగా తనకు పెళ్లి కావడంలేదని కుంగిపోయింది. ఇంట్లో తనతో పాటు కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు 40 ఏళ్లకే అకాల మరణం చెందారు. వాళ్లకు కూడా పెళ్లికాక మనోవేదనతో అకాలమృతి కావడంతో ఆదిలక్ష్మి మనస్తాపానికి గురైంది. రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు లేక ముగ్గురు అన్నల్లో ఒక అన్నావదిన దగ్గర ఉంటూ అన్నయ్య పిల్లలతోనే కాలం వెళ్లదీస్తోంది. ఇంట్లో వదిన కూడా తరచూ నీకు ఇంకా పెళ్లి కాలేదని మాటలతో వేధించసాగింది. అటు బయటకూడా స్నేహితులు, చుట్టుపక్కల వారు ఆదిలక్ష్మికి ఇంకా పెళ్లి కాలేదని గుసగుసలాడుకోవడం మరింతగా కంగదీసింది. ఈ క్ర మంలో గురువారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అప్పుడే ఆమె వదిన హుటాహుటిన నగరంలోని మహరాజా ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా శుక్రవారం చనిపోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. దీంతో వదిన నుంచి ఫిర్యాదు అందుకున్న ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండు బైక్‌లు ఢీకొని యువకుడి మృతి వేపాడ: మండలంలోని కొత్త బొద్దాం జంక్షన్లో గురువారం అర్ధరాత్రి రెండు బైక్‌లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా నలుగురు గాయాలపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట నుంచి ఎల్.కోట వైపు ద్విచక్రవాహనం వెళ్తుండగా ఎల్.కోట నుంచి ఎస్.కోట వైపు వెళ్తున్న మరో ద్విచక్రవాహనం కొత్త బొద్దాం జంక్షన్ దగ్గర ఢీకొన్నాయి. దీంతో ప్రమాదంలో రెండు వాహానాలపై ఉన్న ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఎస్.కోట నుంచి ఎల్.కోట వైపు వెళ్తున్న వాహనచోదకుడు బసవబోయిన కార్తీక్ (19) మృతిచెందాడు. ఎస్.కోట కోటవీధికి చెందిన కార్తీక్‌కు తల్లిదండ్రులు, సోదరి ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బి.దేవి తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో ధన్వంతరి హోమం
విజయనగరం టౌన్: స్థానిక మన్నార్ రాజగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రాజెక్ర్ట్ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వర ప్రసాద్ (పండు) నేతృత్వంలో వేదపండితులు శ్రీ ధన్వంతరి హోమాన్ని ఆద్యంతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 60 మంది రుత్విక్కులు, 54 హోమగుండాలు, 163 మంది దంపతులతో అంగరంగ వైభవంగా యాగప్రక్రియ నిర్వహించారు. ఆరోగ్యప్రదాత శ్రీ ధన్వంతరికి ప్రత్యేక పూజలు చేశారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభ్యులు సేవలందించారు. కార్యక్రమంలో సురేష్, రమేష్, గోపాల్ జగదీష్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
పోలీసుల పల్లెనిద్ర
● గ్రామస్తులతో మీతోనే మేము అంటున్న సీఐలు, ఎస్సైలు విజయనగరం క్రైమ్: ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో జిల్లాలోని పోలీస్ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్లెల్లో నిద్ర చేసి మీతోనే మేము అని పల్లె వాసులకు భరోసా కల్పించారు. ఈ విధంగా గ్రామస్తులతో మమేకమవుతూ వారి సమస్యలను విని, క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తున్నారు. తద్వారా పల్లెల్లో స్థానికులతో మమేకమవడమే కాకుండా ఆయా గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు పల్లెనిద్రతో ఓ కన్నేశారు. అలాగే గ్రామంలోకి వెళ్లి రాత్రి పడుకునే ముందు ఒకసారి గ్రామస్తులతో సమావేశమై సైబర్ నేరాలు, మహిళల భద్రత, శక్తి యావ్, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. దీనిపై ఎస్పీ వకుల్ జిందల్ గురువారం మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను, శాంతిభద్రతల సమస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారానికి సత్వరం చర్యలు చేపట్టేందుకు సంబంధిత పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అడాప్షన్ కానిస్టేబుల్స్ వారి పరిధిలోని గ్రామాల్లో నెలలో రెండు సార్లు పల్లెనిద్ర చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పార్టీలకు అతీతంగా గ్రామస్తులతో మమేకం కావాలని, గ్రామసమస్యలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్యల గురించి వారితో చర్చించి, గ్రామాల్లో ఎటువంటి వివాదాలు, అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రెండునెల్లో 72 గ్రామాల్లో పల్లెనిద్ర గ్రామాల్లోకి వచ్చే కొత్త వ్యక్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల నడవడికపై నిఘా పెట్టాలని, వారు జీవనం ఏవిధంగా సాగిస్తున్నది తెలుసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. గడిచిన రెండు నెలల్లో జిల్లాలో 10మంది సీఐలు, 30మంది ఎస్సైలు 72 గ్రామాల్లో పల్లెనిద్ర చేసి, గ్రామస్తులతో మమేకం కావడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని, ప్రజల్లో పోలీసుశాఖ పట్ల నమ్మకం, విశ్వాసం పెరుగుతున్నాయని ఎస్పీ వకుల్ జిందల్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
ట్రూఅప్, విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి
చికెన్బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ108 శ్రీ186 శ్రీ196విజయనగరం గంటస్తంభం: సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యుత్ ట్రూఅప్ చార్జీలు, సెకి విద్యుత్ ఒప్పందం రద్దు డిమాండ్లతో శుక్రవారం విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్మి వర్గ సభ్యుడు రెడ్డి శంకర్రావు పిలుపునిచ్చారు. ‘విద్యుత్ సాకులు’ అనే పుస్తకాన్ని విజయనగరం కోట జంక్షన్ వద్ద కార్మికులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎటువంటి విద్యుత్ చార్జీలు పెంచమని చెబుతూనే, ట్రూఅప్ చార్జీల పేరుతో ఇప్పటికే రూ.17 వేల కోట్లు ప్రజలపై భారం వేసిందన్నారు. మళ్లీ సెకి ఒప్పందం ప్రకారం విద్యుత్ భారాలు ప్రజలపై వేయడం దుర్మార్గమని, తక్షణమే సెకి ఒప్పందం, ట్రూఅప్ విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో విద్యుత్ ప్రజాపోరాటం జరగనుందని హెచ్చరించారు. విద్యుత్ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించనున్న ధర్నాలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేసీ్త్ర రాజు, తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా -
వక్ఫ్‌బోర్డు చట్టాల సవరణ వెనక్కి తీసుకోవాలి
● కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు కరీం విజయనగరం ఫోర్ట్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వక్ఫబోర్డ్ చట్టాల సవరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం విజయనగరం జిల్లా అధ్యక్షుడు కరీం డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక డీసీసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖబరస్థాన్ భూములు లాక్కునే ప్రయత్నంలో భాగమే చట్టసవరణ చేయడమని ఆరోపించారు. చట్టసవరణ అంశాన్ని వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు టీడీపీ సెక్యులర్ పార్టీ అంటారని, వక్ఫ్‌బోర్డు చట్ట సవరణ బిల్లును ఆయన వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్కే. సమీర్, ఎ.రహమాన్, డాక్టర్ తిరుపతిరావు, డాక్టర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రేగాననెల్లిమర్ల రూరల్: వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రేగాన శ్రీనివాసరావును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. నెల్లిమర్ల మండలంలోని సీతారామునిపేట గ్రామానికి చెందిన ఆయన గతంలో టూరిజం కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రెండోసారి వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడికి కృతజ్నతలు తెలిపారు. -
విద్యార్థినులకు ‘శక్తి టీమ్స్‘ ప్రత్యేక శిక్షణ
విజయనగరం క్రైమ్: ఆపద సమయంలో ఉన్న మహిళలు, విద్యార్థినులకు ‘శక్తి టీమ్స్‘ మెలకువలతో కూడిన ప్రత్యేక శిక్షణ ఇస్తాయని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినుల ఆత్మరక్షణకు అవసరమైన మెలకువలను శక్తి టీమ్స్ నేర్పుతాయన్నారు. వారిలో చైతన్యం నింపుతూ, ఆపద సమయాల్లో ఎలాంటి ఆందోళన చెందకుండా స్పందించేందుకు అవసరమైన మానసిక పరిపక్వత పొందేందుకుఈ ‘శక్తి టీమ్స్‘ చర్యలు చేపడతాయని చెప్పారు. ఈ మేరకు శక్తి టీమ్స్ కళాశాలలు, పాఠశాలలను సందర్శించే సమయంలో విద్యార్ధినులతో మమేకమవుతాయన్నారు. ఏదైనా ఆపద సమయం ఏర్పడినపుడు, మహిళల రక్షణకు విఘాతం కలిగే సంఘటన జరిగినప్పుడు భయపడకుండా, పరిస్థితిని అర్థం చేసుకుని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమయ్యే విధంగా అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. మీ రక్షణ కోసం శక్తి టీమ్స్ పని చేస్తాయని దీంతో పాటు డయల్ 112,లేదా 100 నంబర్లకు కాల్ చేసి పోలీస్ శాఖ సహాయం పొందవచ్చని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. -
● మొక్కజొన్నకు బర్డ్‌ఫ్లూ దెబ్బ
ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి సాగుచేసిన మొక్కజొన్న పంట చేతికందిన సమయంలో ధర పడిపోవడం రైతు కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో సుమారు 17 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగుచేశారు. హెక్టారుకు రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చుకాగా, 100 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. మొక్కజొన్నను ఎక్కువగా కోళ్ల మేతకు వినియోగిస్తారు. ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందడం, కోళ్లు లక్షల్లో చనిపోవడంతో కొత్తగా కోడి పిల్లల పెంపకాన్ని పౌల్ట్రీ యజమానులు నిలిపివేశారు. ఈ ప్రభావం మొక్కజొన్నపై పడింది. అధిక దిగుబడి వచ్చినా క్వింటా ధర కేవలం రూ.2,200 పలుకుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు రైతుకు మద్ధతు ధర చెల్లించి పంట కొనుగోలుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంపై మండిపడుతున్నారు. ఇదే విషయంపై జిల్లా వ్యవసాయాధికారి రామారావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా వారం రోజుల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. – రామభద్రపురం -
ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని సంతకాల సేకరణ
బొబ్బిలి: తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని పారిశుధ్య కార్మికులు కోరుతున్నారు. ఇదే విషయమై సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు స్థానిక పట్టణంలోని పారిశుధ్య కార్మికులతో సంతకాల సేకరణ గురువారం చేపట్టారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన వారి సేవలను గుర్తించాలని శంకరరావు కోరారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా వారిని పొగడడం కాదని వారి పట్ల చిత్తశుద్ధి నిబద్దత ఉంటే వారిని శాశ్వత ఉద్యోగులను చేయాలన్నారు. ఆప్కాస్ వంటి ప్రైవేటు ఏజెన్సీకి తమ ఉద్యోగాల భర్తీ, నిర్వహణ బాధ్యతలు అప్పగించవద్దని పారిశుధ్య కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు కలిగిన వినతిపత్రాన్ని మున్సిపల్ శాఖామంత్రి నారాయణకు కూడా పంపిస్తామన్నారు. కార్యక్రమంలో జి.గౌరి, జె.శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
108.. 24/7 ఇంజిన్ ఆన్!
ఆపద సమయంలో ఆదుకునే 108 వాహనానికే కష్టం వచ్చింది. సీతానగరం మండలానికి గతంలో మంజూరైన 108 వాహనం మరమ్మతులకు గురి కావడంతో కొద్దిరోజుల కిందట మరో వాహనాన్ని తీసుకొచ్చారు. అది కూడా తరచూ మొరాయిస్తుండడంతో మరొక వాహనాన్ని ఇచ్చారు. పోనీ.. ఇప్పుడున్న వాహనమైనా సక్రమంగా ఉందా.. అంటే అదీ లేదు. ఇంజిన్ సమస్య ఉంది. ఇంజిన్ ఆపితే మళ్లీ కదలడానికి తల ప్రాణం తోకకు వస్తుంది. దీంతో నిరంతరం వాహన సిబ్బంది ఇంజిన్‌ను ఆన్‌చేసే ఉంచుతున్నారు. దీనివల్ల లోపల వేడిగా అవుతుందని.. పనిలేని సమయంలో వాహనం డోర్లన్నీ.. ఇదిగో ఇలా తీసి ఉంచుతున్నారు. ఈ చిత్రాన్ని చూసి.. ఆపద్బాంధవికే కష్టం వస్తే చెప్పుకునే దిక్కులేకపోయిందంటూ స్థానికులు నిట్టూర్చుతున్నారు. – సీతానగరం -
టీటీసీ వేసవి ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురం టౌన్: టీటీసీ వేసవి ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. తిరుపతినాయడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురంలలో మే 1నుంచి జూన్ 11 వరకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి 25వరకు ప్రభుత్వ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఇన్‌లో ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మే 1 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు 45ఏళ్లలోపు వయస్సు గల వారు అర్హులని పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, అప్లికేషన్‌తో పాటు జిల్లా విద్యాశాఖాధి కారి కార్యాలయంలో మే 1వ తేదీన హాజరు కావాలని సూచించారు. పోలమాంబ హుండీల ఆదాయం లెక్కింపుమక్కువ: E™èl¢-Æ>…{«§ýl$ÌS CÌS-ÐólË$µ Ôèæ…ºÆý‡ ´ùÌS-Ð]l*…º AÐ]l$Ã-ÐéÇ çßæ$…yîlÌS B§éĶæ*-°² VýS$Æý‡$-ÐéÆý‡… §ólÐ]l-§éĶæ$-Ô>Q íܺ¾…¨ ÌñæMìSP…^éÆý‡$. Ôèæ…ºÆý‡ ´ùÌS-Ð]l*…º AÐ]l$Ã-ÐéÇ 8,9 gê™èl-Æý‡-ÌS-ÌZ ¿ýæMýS$¢-Ë$ çßæ$…yîl-ÌZÏ çÜÐ]l$-ǵ…^èl$-MýS$¯]l² M>¯]l$-MýS-ÌS¯]l$ ÌñæMìSP…^èl-V> ₹4,11,188 B§éĶæ$… Ð]l_a…§ýl° DK çÜ*Æý‡Å-¯éÆ>Ķæ$-×æ ™ðlÍ´ëÆý‡$. çßæ$…yîlÌS ÌñæMìSP…ç³# M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ ´ëÆý‡Ó-¡ç³#Æý‡… Ð]l$¯]lÅ… hÌêÏ §ólÐ]l-§éĶæ$ Ô>Q A«¨M>Ç G‹Ü.Æ>gêÆ>Ð]l#, {V>Ð]l$ çÜÆý‡µ…^Œl Ððl§ýl$âýæÏ íÜ…à^èl-ÌS-Ð]l$Ð]l$Ã, Eç³-çÜ-Æý‡µ…^Œl AË$Ï Ððl…MýS-rÆý‡-Ð]l$-×æ, Ð]l*i O^ðlÆý‡Ã¯ŒS ç³Nyìl §éÍ ¯éĶæ¬yýl$, E™èlÞÐ]l MýSÑ$sîæ Ð]l*i O^ðlÆý‡Ã¯ŒS O¯ðl§é¯]l çÜ*Æý‡Å-¯éÆ>Ķæ$-×æ, ™èl¨™èl-Æý‡$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. గడ్డి మందుతాగి వ్యక్తి ఆత్మహత్యగుర్ల: మండలంలోని నాగళ్లవలసకు చెందిన సంబర రమేష్ (51) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండడంతో తట్టుకోలేక బుధవారం గడ్డి మందు తాగేశాడు. గమనించిన కుటుంబసభ్యులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుని భార్య ఉమ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. కుమారుడు సూర్య ఉన్నాడు, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.నారాయణ రావు తెలిపారు. పక్కా డాక్యుమెంట్ రీ సర్వే జరగాలి ● జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్ శోభికకొమరాడ: జిల్లాలో జరుగుతున్న రెండవ విడత రీ సర్వేలో డాక్యుమెంట్లు పక్కాగా ఉండాలని, సమగ్ర విచారణ చేపట్టి తుది నిర్ణయం తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆమె కొమరాడ మండలంలోని విక్రంపురం గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా రెండవ విడత రీ సర్వే పనులపై తనిఖీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రీ సర్వే చేపడతున్న గ్రామల్లో ముందుగా రైతులకు సమాచారం అందించి తగు రశీదులను పొందాలని స్పష్టం చేశారు. భూముల రీసర్వేలో తలెత్తిన లోపాలను భూయజమానికి ముందుగా నోటీస్ ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. వివాదాస్పద భూములకు సంబంధించిన వివరాలు ఆయా రిజిస్టర్లలో నమోదు చేయాలని చెప్పారు. రీ సర్వేలో ఎక్కడా లోపాలు ఉండరాదని అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్డార్ శివయ్య మండల సర్వేయిర్ వంశీ తదితరులు పాల్గున్నారు. -
● పింఛన్ కోసం పాట్లు
ఆస్పత్రి వద్ద రోడ్డుపైనే దివ్యాంగుల నిరీక్షణ నడవలేనివారు కొందరు... బంగురుతూ వచ్చేవారు మరికొందరు.. కర్రసాయంతో, మరొకరి తోడుతో ముందుకు సాగిన వారు ఇంకొందరు... ఒకరికి ఒకరు తోడుగా వెళ్లినవారు కొందరు... ఇలా.. పింఛన్ అర్హతల నిర్ధారణకు విజయనగరం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గురువారం నిర్వహించిన సదరం శిబిరానికి వచ్చేందుకు దివ్యాంగులు అష్టకష్టాలు పడ్డారు. మండుతున్న ఎండలో రాకపోకలకు నరకయాతన అనుభవించారు. కొందరు సొమ్మసిల్లి రోడ్లమీదనే కూర్చొండిపోయారు. ఇవెక్కడి కష్టాలు ‘బాబూ’ అంటూ నిట్టూర్చారు. వైద్యుల వద్ద తమ అర్హతలను నిర్ధారించుకున్నాక కుటుంబ సభ్యుల తోడుతో మెల్లగా ఇంటిబాట పట్టారు. దీనికి ఈ చిత్రాలే సజీవ సాక్ష్యం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
చర్యలు తీసుకుంటాం
ఆస్పత్రికి వచ్చే వారికి సకాలంలో వైద్య సేవలు అందిస్తున్నాం. విధులు పట్ల ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటాం. శస్త్రచికిత్స ఏదైనా కారణం ఉంటే తప్ప వాయిదా వేయం. మందులన్నీ ఉండేలా చూస్తాం. – డాక్టర్ సంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆస్పత్రిలో వైద్య పరీక్షలకోసం నిరీక్షిస్తున్న రోగులు● -
● మద్యం జోలికి పోవద్దు
ఏ ఒక్కరూ మద్యానికి బానిసలు కావద్దు.. మీకు అందుబాటులో దొరికిన మద్యమే మీ జీవితాలను చిత్తు చేస్తుంది.. ప్రశాంతమైన పల్లెల్లో ఘర్షణలకు కారణమవుతోంది.. యువత జీవితాలను నాశనం చేస్తోందని వంగర ఎస్ఐ షేక్ శంకర్ తెలిపారు. వంగర మండలం తలగాం గ్రామస్తులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. పోలీస్ శాఖ తలపెట్టిన ‘సంకల్పం’పై అవగాహన కల్పించారు. శక్తి యాప్ పనితీరును వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి విద్యార్థులు చక్కగా చదువుకోవాలని, గ్రామానికి పేరుతేవాలని, పెద్దలు కూడా పిల్లల నడవడికపై దృష్టిసారించి మంచిచెడులు విడమర్చి చెప్పాలని సూచించారు. – వంగర -
జాతీయ కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన క్రీడాకారులు అవకాశం దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్.అనురాధ, ఇ.సుమంత్‌లు ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు బీహార్ రాష్ట్రంలో జరగనున్న అంతర్ రాష్ట్ర కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జాతీయ పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.రంగారావుదొర, కార్యదర్శి కేవీ.ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన.లక్ష్మణరావు, పీడీ వి.సౌదామిని అభినందించారు. రాష్ట్ర జట్టు తరఫున ఆడనున్న ఇద్దరు క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడి జిల్లా ఖ్యాతిని జాతీయస్థాయిలో చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. -
● ఐటీఐ విద్యార్థుల అద్భుత సృష్టి
చిత్రంలో ఈగిల్‌ను చూశారా.. ఇది విజయనగరం ఐటీఐ విద్యార్థుల అద్భుత సృష్టికి నిలువెత్తు రూపం. మెకానికల్ విభాగానికి చెందిన విద్యార్థులు 16 బైక్ చైన్స్, 2,500 చైన్ లింక్స్‌తో ఈగిల్‌ను సృష్టించారు. దీనిని గాజువాక సిటీ ఐటీఐలో డ్యూయల్ వీఈటీ (సీమెన్స్– టాటా స్ట్రైవ్ సంయుక్త) నిర్వహణలో బుధవారం నిర్వహించిన ‘ప్రాజెక్టు ఇన్నోవేషన్ చాలెంజ్ కాంపిటేషన్–2025 జోన్–1 పోటీల్లో ప్రదర్శించారు. మొత్తం 30 ప్రదర్శనల్లో ‘ఈగిల్’ ప్రాజెక్టు మొదటి బహుమతిని సొంతం చేసుకుంది. ఎమ్మెల్సీ చిరంజీవిరావు, కార్పొరేటర్ సరసింహపాత్రుడు, ప్రభుత్వ ఐటీఐ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీ రమణ, ఐఎంసీ చైర్మన్ బాలాజీ, కోరమండల్ ప్రతినిధి శ్రీనివాసరావు, టాటా స్ట్రైవ్ ప్రతినిధులు రమేష్, మార్కండేయులు, సంతోష్, జోన్– ఐటీఐ ప్రిన్సిపాల్స్ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతిని అందుకున్నారు. – విజయనగరం అర్బన్ -
మరో మూడు రోజులే గడువు..!
● రేషన్ లబ్ధిదారుల్లో ఆందోళన ● ఈనెల 31లోగా ఈకేవైసీ చేయించాలి ● జిల్లాలో 2,77, 153 రేషన్‌కార్డులు ● కార్డుల్లో సభ్యులు 8,23,638 మంది ● 7లక్షల మంది వరకు ఈకేవైసీ పూర్తిపార్వతీపురం: రేషన్ పంపిణీలో అక్రమాల కారణంగా చౌకదుకాణాల్లో బియ్యం పక్కదారి పట్టి దుర్వినియోగం కాకుండా చేయాలనే ఉద్దేశంతో రేషన్‌కార్డుల్లోని సభ్యలంతా ఈకేవైసీ చేయించుకుని అర్హులైన వారికి మాత్రమే సబ్సిడీ బియ్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో 2,77,153 రేషన్ కార్డులుండగా అందులో 8,23,638 మంది సభ్యులున్నారు. ఇంతవరకు లక్షమంది వరకు ఈ కేవైసీ చేయించుకోలేదు. ఈకేవైసీ చేయించుకునేందుకు ఈ నెల 31వరకు గడువు ఉండగా త్వరితగతిన ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు లబ్ధిదారులకు సూచిస్తున్నారు. వలస దారుల ఆవేదన బతుకు తెరువుకోసం యువకులు, వ్యవసాయ కూలీలు హైదరాబాద్, విశాఖపట్నం, చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. పండగలు, శుభకార్యాలకు, సొంత గ్రామాలకు వచ్చి తమ రేషన్ కార్డులో పేర్లను తొలగించకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అలాగే విద్యాభ్యాసం కోసం ఇతర పట్టణాలకు, ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థుల విషయంలోను, వృద్ధులకు వేలిముద్రలు పడని కారణంగా ఈకేవైసీ సమస్య తలెత్తుతోందని పలువురు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈకేవైసీ చేయించుకోకపోతే సంక్షేమ పథకాలు దూరమవుతామని సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. మొరాయిస్తున్న సర్వర్లు ఈకేవైసీ చేయించుకునేందుకు సర్వర్లు కూడా తరచూ మొరాయిస్తున్నాయి. అందరూ ఒకేసారి ఈకేవైసీ చేయించుకునేందుకు తరలివస్తున్న కారణంగా సర్వర్లు పనిచేయడం లేదు. ఉదయ, రాత్రి సమయాల్లో సర్వర్ సమస్య లేనప్పటికీ మిగిలిన సమయాల్లో రేషన్ షాపులు, ఆధార్, మీసేవ కేంద్రాల్లో లబ్ధిదారులు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయం పనివేళల్లో ఎక్కువమంది ఈకేవైసీకి రావడంతో సర్వర్లకు లోడ్ ఎక్కువై మొరాయిస్తున్నట్లు సాంకేతిక విభాగ నిపుణులు చెబుతున్నారు. చాలామంది రేషన్ కార్డు లబ్ధిదారులు కేవలం చౌక దుకాణానికి వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని భావించడం వల్ల కూడా సమస్య తలెత్తుతోందని పలువురు అంటున్నారు. ఈకేవైసీ చేయించుకోవాలి రేషన్ కార్డుల్లో కుటుంబసభ్యులందరూ ఈకేవైసీ చేయించుకోవాలి. మిగిలిన మూడు రోజుల్లో తప్పనిసరిగా చేయించుకోవాలి. లబ్ధిదారులందరికీ ఈకేవైసీ చేసేలా సిబ్బందిని ఆదేశించాం. ఈకేవైసీ చేయించుకోకపోతే ప్రభుత్వ పథకాలకు దూరమవుతారు. లబ్ధిదారులంతా సమీపంలోని చౌక దుకాణాలు, మీసేవా కేంద్రాలకు వెళ్లి ఈకేవైసీ చేయిచుకోవాలి. ఐ.రాజేశ్వరి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, పార్వతీపురం మన్యం జిల్లా -
జీఎస్టీ అధికారిగా బాడంగి కుర్రాడు
బాడంగి: విజయనగరం జిల్లా బాడంగి గ్రామానికి చెందిన వంగపండు అభిషేక్ అనే యువకుడు పోటీ పరీక్షలో ప్రతిభ చూపాడు. కేంద్ర స్థాయిలో ఇటీవల జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ స్థాయి పరీక్షలో 390కు 354 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 640వ ర్యాంక్ సాధించాడు. సెంట్రల్ జీఎస్టీ అధికారిగా కొలువు సాధించాడు. అభిషేక్ ఖరగ్‌పూర్ ఐఐటీలో బీటెక్, ఎంటెక్ పూర్తిచేశాడు. తల్లి వెంకటలక్ష్మి హైస్కూల్ టీచర్ కాగా, తండ్రి శ్రీను వ్యాపారి. అభిషేక్‌ను తల్లితండ్రులతో పాటు గ్రామస్తులు, స్నేహితులు అభినందించారు. భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలి రేగిడి: భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలని జిల్లా ల్యాండ్ సర్వే అఽధికారి రమణమూర్తి రైతులకు సూచించారు. మండలంలోని అంబఖండి గ్రామంలో గురువారం రీ సర్వేకు సంబంధించి అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు పొలాల్లోకి వెళ్లి సర్వే చేసిన సమయంలో ఆ భూములకు సంబంధించిన ప్రతి రైతు తప్పనిసరిగా ఉండాలన్నారు. చట్టపరంగా రైతులకు సంబంధించిన భూములకు పూర్తిస్థాయిలో హక్కులు కల్పిస్తామని తెలిపారు. కొన్ని భూములకు ఆధారాలు లేవని, అటువంటి భూములను అధికారులు హక్కులో ఉన్న రైతులకు రికార్డులో పొందుపరిచేలా చూడాలని సర్పంచ్ గోవిందనాయుడు అధికారులను కోరారు. సర్వే చేసిన అనంతరం ప్రతి రైతుకు నోటీస్ ఇస్తామని, అటువంటి వాటిలో ఎటువంటి సవరణలు ఉన్నా సంబంధిత తహసీల్దార్‌కు తెలియజేస్తే వాటిని పునఃసర్వే చేస్తామని రమణమూర్తి స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సత్యవాణి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎం.చిన్నారావు, రైతులు పాల్గొన్నారు. ఉగాది వేడుకలకు ఏర్పాట్లు విజయనగరం అర్బన్: విశ్వావసునామ ఉడాది వేడుకలను సంప్రదాయ బద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆదేశించారు. ఉగాది వేడుకల నిర్వహణపై తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచనల మేరకు ఈ నెల 30వ తేదీన కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఉగాది పంచాంగ శ్రవణం, వేదాశీర్వచనం, ప్రసాదాల ఏర్పాట్లను దేవదాయశాఖ అధికారులు చేయాలని ఆదేశించారు. సమావేశం అనంతరం ఆడిటోరియంను పరిశీలించారు. సమావేశంలో సమాచార పౌసంబంధాల శాఖ ఏడీ డి.రమేష్, ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శాస్త్రి, జిల్లా పర్యాటక శాఖాధికారి కుమారస్వామి, కలెక్టరేట్ ఏఓ దేవ్‌ప్రసాద్, తహసీల్దార్ కూర్మనాథ్, ఆయా శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఏకగ్రీవంగా ఫ్యాప్టో నూతన కార్యవర్గం ఎన్నిక
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక (ఫ్యాప్టో) జిల్లా నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పరిశీలకులు, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ చిరంజీవి సమక్షంలో విజయనగరం యూత్ హాస్టల్లో గురువారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. జిల్లా ఫ్యాప్టో చైర్మన్‌గా పాలితేరు శ్రీనివాస్ (ఏపీటీఎఫ్ 257), కో చైర్మన్‌గా లోపింటి శివప్రసాదరావు (ఎస్సీఎస్టీయూఎస్), డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా జేవీఆర్కే ఈశ్వరరావు (యూటీఎఫ్), ఎన్వీ పైడిరాజు (ఏపీటీఎప్ 1938), సెక్రటరీగా వంకర రమణ (ఏపీపీటీఏ) ఎన్నికయ్యారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ పలు డిమాండ్లను ప్రకటించింది. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సదాశివరావు, డి.ఈశ్వరరావు, డి.శ్యామ్, శ్రీనివాసరావు, షేక్ బుకారిబాబు, కె.జోగారావు, సీహెచ్ సూరిబాబు, బలరామినాయుడు, వెంకట శ్రీనివాస్, అప్పారావు, భాస్కరరావు, గోవిందరావు, ఎస్ఎస్దొర, నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులపైస్కూళ్ల విలీనం ఒత్తిడి!
–8లో‘జామి మండలం భీమసింగి పంచాయతీ పరిధిలో కొత్త భీమసింగి, యాతపాలెం, చిల్ల పాలెం, సోమయాజుల పాలెం, తెలగపాలెం, పీతల పాలెం, కంది పాలెం గ్రామాలున్నాయి. అన్నిగ్రామాల్లోనూ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ‘మోడల్ ప్రైమరీ స్కూల్’ విధానంలో ఆయా పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను భీమసింగి పాఠశాలకు తరలించనున్నారు. ఆయా గ్రామాలకు సుమారు 2 నుంచి 5 కిలోమీటర్ల వరకు దూరంలో ఉన్న పాఠశాలకు చిన్నారులు వెళ్లి చదువుకోవడం కష్టమన్నది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వాదన. దీనివల్ల డ్రాపౌట్స్ పెరుగుతారని, ఈ విద్యావిధానం సరికాదంటూ ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే పలు పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. పాఠశాలలు విలీనం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.’ ‘పూసపాటిరేగ మండలంలోని పతివాడ పంచాయతీ పరిధిలో చినపతివాడ, రాయుడుపేట, బర్రిపేట, తమ్మయ్యపాలెం గ్రామాలున్నాయి. అన్ని గ్రామాల్లోనూ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. చిన్నారుల చదువుకు అవే ఆధారం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ నుంచి 3, 4, 5 తరగతులను తరలిస్తే పాఠశాలలు నిర్వీర్యమవుతాయన్నది గ్రామస్తుల వాదన.’ విజయనగరం అర్బన్: కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ‘మోడల్ ప్రైమరీ స్కూల్’ విధానంపై అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే జిల్లాలో పలు పాఠశాలల వద్ద తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. అయితే, కూటమి ప్రభుత్వం కొత్త విద్యావిధానంపై పునరాలోచించకుండా విలీనం కుట్ర కత్తిని ఉపాధ్యాయుల మెడపై పెట్టి చేయించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. విద్యా సంస్కరణ ప్రక్రియను ఆయా పాఠశాల స్కూల్ కమిటీ సభ్యులు అంగీకరిస్తున్నట్టు తీర్మానం చేసి విధిగా ఎంఈఓ లాగిన్‌లో ప్రతి స్కూల్ హెచ్ఎం అప్లోడ్ చేయాలి. తమ గ్రామంలోని స్కూల్లోనే 3, 4, 5వ తరగతులు ఉండాలని పలు స్కూళ్ల ఎస్ఎంసీలు తీర్మానాలు చేస్తున్నారు. అలా తరగతుల విలీనాన్ని ఎస్ఎంసీ అంగీకరించని స్కూళ్లకు చెందిన ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ సమక్షంలో కారణాలు వివరించాలన్న నిబంధన ప్రభుత్వం పెట్టడంతో ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. మండల స్థాయిలో ఎంఈఓలు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు విలీన ప్రక్రియను వివరించి ఒప్పించాలని, మండలంలోని ఏ క్లస్టర్‌లోని పాఠశాలను ఎలా మార్పుచేశారో చెప్పాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వీటన్నింటినీ చూసిన చిన్నారుల తల్లిదండ్రులు ఉన్నబడులను మూసివేసే ప్రక్రియను కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని విమర్శిస్తున్నారు. ప్రచారం ఒకటైతే... ఓ వైపు పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో 934 పంచాయతీలు ఉండగా 60 మంది విద్యార్థుల నమోదు నిబంధనను పరిగణలోకి తీసుకుంటే కనీసం 150 మోడల్ స్కూళ్లు కూడా ఏర్పడని పరిస్థితి ఉంది. 60 మంది విద్యార్థులు నమోదు ఉన్న పాఠశాలలను మాత్రమే మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా మారుస్తామని, అంతమంది విద్యార్థులు లేకుంటే సమీపంలోని ఇతర ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులను తరలించాలని ఎంఈఓలకు మౌఖిక ఆదేశాలు ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నూతనంగా ఏర్పాటుచేసే మోడల్ ప్రాథమిక పాఠశాలలు గ్రామానికి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం కావడంతో గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ ప్రక్రియను వ్యతరేకిస్తూ ఇప్పటికే కలెక్టర్‌కు వినతిపత్రాలు సైతం అందజేశారు. ఇదేం విధానం.. ‘మోడల్ ప్రైమరీ’ పేరుతో స్కూళ్ల విలీనానికి చర్యలు ఎస్ఎంసీలు ‘నో’ చెప్పినా అంగీకార పత్రాలు ఇవ్వాల్సిందేనంటూ హుకుం అంగీకరించకుంటే హెచ్‌ఎంలపై చర్యలు తప్పవని హెచ్చరిక టీచర్లపై విలీన ఒత్తిడి తగదంటున్న ఉపాధ్యాయ సంఘాలు ఊరి బడిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు నిధులతో సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసింది. చదువుతోనే ఆర్థిక వికాసం సాధ్యమని, పేదకుటుంబాల పిల్లలు అంతర్జాతీయ అవకాశాలు అందుకునేలా విద్యాసంస్కరణలు అమలుచేసింది. వీటిని వినియోగించుకోకుండా పాఠశాలలు విలీనం చేయడాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ దశలో విలీన ప్రక్రియను హెచ్ఎం, ఉపాధ్యాయులు కలిపి పూర్తిచేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు, హెచ్చరికలు వస్తుండడంపై కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 60 మందితో మోడల్ ప్రైమరీ స్కూల్స్ కొత్తగా ఏర్పాటు చేస్తున్న మోడల్ మ్రైమరీ స్కూల్స్ ప్రతి పంచాయతీలో ప్రారంభించనున్నాం. కనీసం 60 మంది విద్యార్థులుండేలా చూడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో నిర్దేశిత సంఖ్య కంటే తక్కువ మంది విద్యార్థులుంటే అక్కడ మౌలిక సదుపాయాలను పరిశీలించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో క్లస్టర్ల ఆధారంగా స్థానిక పరిశీలన అనంతరం ఐదు బడుల విలీనాన్ని అమల్లోకి తెస్తారు. – యూ.మాణిక్యంనాయుడు, డీఈఓ -
ిపీడీఎస్ బియ్యం పక్కదారి..!
విజయనగరం ఫోర్ట్: ఇటీవల గజపతినగరం మండలంలోని ఓ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లయిస్ అధికారులు పట్టుకుని సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ● కొద్దినెలల క్రితం గంట్యాడ మండలం చంద్రంపేట గ్రామంలో ఉన్న రైస్ మిల్లు గొడౌన్‌కు పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు సమాచారం రావడంతో వీఆర్వో వెళ్లి రెండున్నర టన్నుల పీడీఎస్ బియ్యాన్ని, తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ● ఇదే మండలంలో ఉన్న మరో మిల్లులో ిపీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులు మిల్లు వద్దకు చేరుకుని పీడీఎస్ బియ్యం తరలించే వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యం 1500 కేజీలుగా గుర్తించారు. వాటిని అధికారులు సీజ్ చేసి మిల్లు యాజమానిపైన, తరలించిన వ్యక్తిపైన కేసులు నమోదు చేశారు. ● ఇలా ఈ మూడు చోట్లే కాదు. జిల్లాలోని అనేక చోట్ల పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు పీడీఎస్ బియ్యాన్ని మిల్లులకు తరలిస్తూ మిల్లులో బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి వాటినే మళ్లీ ప్రజాపంపిణీ వ్యవస్థ గొడౌన్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోద్యం చూస్తున్న అధికారులు పీడీఎస్ బియ్యం అధికారుల కళ్లముందే తరలిపోతున్నా తమకేమీ కనబడడం లేదన్న రీతిన వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో పీడీఎస్ బియ్యం ఎక్కువగా పక్కదారి పట్టిస్తున్నా గ్రామాల్లో ఉండే వీఆర్వోలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో యథేచ్ఛగా పీడీఎస్ బియ్యం తరలిపోతున్నట్లు తెలుస్తోంది. 2024–25 లో 90 కేసులు నమోదు: 2024–25 లో పీడీఎస్ తరలించిన 90 మందిపై 6 ఎ కేసులు నమోద య్యాయి. 1959 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. 2025–26లో 23 మందిపై 6 ఎ కేసులు నమోదయ్యాయి. 99.86 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. టన్నుల కొద్దీ తరలిస్తున్న వ్యాపారులు రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్ మళ్లీ అవే బియ్యం పౌరసరఫరాల శాఖ గొడౌన్లకు తరలింపుఆకస్మిక తనిఖీలు చేస్తున్నాంపీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించకూడదు. సీ ఎస్డీటీలు ఆకసిక్మక తనిఖీలు చేపడుతూ కేసులు నమోదు చేస్తున్నారు. ఒక వేళ ఎవరైనా పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లయితే అటువంటి వారిపై 6ఎ కేసులు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో ప్రవేశపెడతాం. కె.మధుసూదన్‌రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
వంటావార్పుతో కార్మికుల ఆందోళన
వేపాడ: మండలంలోని బొద్దాంలో చెక్‌పోస్టువద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో రైతులు, కార్మికులు బుధవారం వంటావార్పుతో ఆందోళన నిర్వహించారు. చెక్‌పోస్టు ఎత్తివేయాలని లేదా వెసులుబాటు కల్పించాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. ఈ ఆందోళనపై స్పందించిన ఉత్తరాంధ్ర మైన్స్ అండ్ జియాలజీ విజిలెన్స్ ఎ.డి. అజయ్‌కుమార్ బొద్దాం చేరుకుని సమస్యపై ఆరాతీశారు. దీనిపై సీఐటీయూ జిల్లానేత చల్లాజగన్ మాట్లాడుతూ ప్రైవేట్ చెక్‌పోస్టు సిబ్బంది, విజిలెన్స్ బోర్డులు పెట్టుకుని అక్రమాలుచేస్తున్నారని ఎ.డికి వివరించారు. రైతులు సొంత పొలాల్లో నుంచి మట్టితోలుకున్నా, గృహనిర్మాణదారులు పునాదులు పూడ్చుకోవడానికి తెచ్చుకున్నా అక్రమంగా వసూలు చేస్తున్నారని ఈ ఇబ్బందుల నుంచి రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లకు విముక్తి కలిగించాలని కోరారు. దీనిపై ఎ.డి.అజయ్‌కుమార్ మాట్లాడుతూ మట్టి, కారురాయి తోలకాలకు మినహాయింపు కల్పిస్తామన్నారు. అయితే లే అవుట్ల వ్యాపారాలకు తోలేవాటికి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్ చెక్‌పోస్టుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. దీంతో కార్మికులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ ఎ.జి.మల్లేశ్వర్రావు, బొద్దాం గ్రామపెద్ద ఎర్రా సన్యాసిరావు, యూనియన్ నాయకులు గేదెల శ్రీను, తూర్పాటి సతీష్, శ్యామ్, కృష్ణ, రవి, శివప్రసాద్, రామకృష్ణ, బాలు, సన్నిబాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ సీఐ అప్పలనాయుడు, వల్లంపూడి ఎస్సై దేవి, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
రైతుసేవా కేంద్రం పరిశీలన
విజయనగరం ఫోర్ట్: అపరాల (పెసర, మినుము) పంటలను రైతులు విక్రయించేసిన తరువాత ప్రభుత్వం అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్న అంశంపై సాక్షిలో బుధవారం ‘ఎవరి లాభం కోసం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఎన్. వెంకటేశ్వరరావు స్పందించారు. ఈ మేరకు జామి మండలంలోని విజినిగిరిలో ఏర్పాటు చేసిన అపరాల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతులు మాత్రమే అపరాలను విక్రయించుకోవాలని దళారులు ఎవరైనా అపరాలు విక్రయించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జెడ్పీ చైర్మన్‌కు వైఎస్సార్సీపీ నాయకుల పరామర్శవిజయనగరం: జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావును వైఎస్సార్సీపీ నాయకులు బుధవారం పరామర్శించారు. ఇటీవల జెడ్పీ చైర్మన్ చిన్న కుమారుడు మృతి చెందిన నేపథ్యంలో పార్టీ నాయకురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి జెడ్పీ చైర్మన్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తొలుత ఆమె మృతిచెందిన ప్రణీత్ బాబు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. కోటదుర్గమ్మ హుండీల ఆదాయం లెక్కింపుపాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఉదయం 10 గంటల నుంచి దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీలను తెరిచి ఆదాయాన్ని సిబ్బంది లెక్కించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 23 రోజులకు గాను రూ.3,08,943 ఆదాయం సమకూరినట్లు ఈవో సూర్యనారాయణ తెలిపారు. అలాగే 36 గ్రాముల బంగారం, 1900 గ్రాముల వెండి హుండీల్లో లభించిందని వివరించారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిసాలూరు: రామభద్రపురం మండలం చింతలవలస గ్రామానికి చెందిన టి.గౌరమ్మ(47) సాలూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతిచెందింది. ఈ ఘటనపై సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మక్కువ మండలంలోని ఎర్రసామంతవలస వద్ద చర్చికి ప్రార్థనలకు వెళ్లి వస్తున్న క్రమంలో ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణిస్తుండగా సాలూరులోని కోటవీధి జంక్షన్ వద్ద బైక్ మధ్యలో కూర్చున్న గౌరమ్మ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో రైల్వే స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ ఆమైపె నుంచి వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయి వెంటనే మరణించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
డీసీహెచ్ఎస్ పోస్టులకు 2,503 దరఖాస్తులు
● డీసీహెచ్ఎస్ రాజ్యలక్ష్మి విజయనగరం ఫోర్ట్: జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వ య అధికారి (డీసీహెచ్ఎస్) పరిధిలో 12 కేడర్లకు సంబంధించి 23 పోస్టులకు 2,503 దరఖాస్తులు వచ్చాయని డీసీహెచ్ఎస్ జి.వి.రాజ్యలక్ష్మి తెలిపారు. బయో స్టాటిస్టియన్ ఒక పోస్టుకు 46 దరఖాస్తులు, ల్యాబ్ టెక్నీషియన్ 2 పోస్టులకు 268, ఆడియో మెట్రిషిన్ 4 పోస్టులకు 15, రేడియాగ్రాఫర్ ఒక పోస్టుకు 51, ఫిజియోథెరపిస్టు 2 పోస్టులకు 84, బయోమెడికల్ ఇంజినీర్ ఒక పోస్టుకు 33, థియేటర్ అసిస్టెంట్ 3 పోస్టులకు 168, మెడికల్ రికార్డు అసిస్టెంట్ ఒక పోస్టుకు 388, ల్యాబ్ అటెండెంట్ 2 పోస్టులకు 128, ఎలక్ట్రీషియన్ ఒక పోస్టుకు 115, జనరల్ డ్యూటీ అటెండెంట్ 10 పోస్టులకు 1177, ప్లంబర్ ఒక పోస్టుకు 30 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎంపిక పక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్ 2024–25 సీజన్లో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 487 రైతు సేవా కేంద్రాల ద్వారా 72,845 మంది రైతుల నుంచి 3.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. రైతుల ఖాతాలకు రూ.768 కోట్లు ధాన్యం డబ్బులు, జీఎల్టీ కింద రూ.12 కోట్లు జమచేసినట్టు తెలిపారు. రైతుల వద్ద ధాన్యం మిగిలి ఉంటే ఈ నెల 31వ తేదీలోగా రైతు సేవా కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. పైడితల్లి హుండీల ఆదాయం లెక్కింపు విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. అమ్మ వారి కల్యాణ మండపం ఆవరణలో నిర్వహించిన లెక్కింపు ప్రక్రియను ఆలయ ఇన్చార్జి ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ పర్యవేక్షించారు. 86 రోజులకు చదురుగుడి హుండీల నుంచి రూ.34,51,576లు, 35 గ్రాముల 700 మిల్లీ గ్రాముల బంగారం, 449 గ్రాముల వెండి, వనంగుడి హుండీల నుంచి రూ.9,43,375లు, 6 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారం, 682 గ్రాముల వెండి లభించిందని ప్రసాద్ తెలిపారు. అన్నదానం హుండీల నుంచి రూ. 45,823లు వచ్చిందన్నారు. కార్యక్రమంలో రామతీర్థం ఆలయ సహాయ కమిషనర్ వై.శ్రీనివాసరావు, శ్రీవారి సేవకులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌పై మరోసారి దర్యాప్తు
రామభద్రపురం: మండలకేంద్రంలోని సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ సతీష్‌పై దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా బుదవారం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ప్రమీలా గాంధీ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సులోచనరాణితో కలిసి దర్యాప్తు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఏడాది క్రితం బీఎల్వో విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు అతడి సమాధానం కూడా బాగాలేదన్న ఉద్దేశంతో తహసీల్దార్ సులోచనరాణి ఆర్డీవోకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఆర్డీవో కూడా కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అప్పటి కలెక్టర్ సదరు ఇంజినీరింగ్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సదరు ఇంజినీరింగ్ అసిస్టెంట్ సతీష్‌కు దాదాపు 6 నెలల క్రితం పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. అయితే అప్పట్లో దర్యాప్తు సక్రమంగా జరగలేదని, ఇప్పుడు మళ్లీ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. తహసీల్దార్ సులోచనరాణిని అప్పట్లో ఏం జరిగిందో ఎస్డీసీ ప్రమీలా గాంధీ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రత్నం పాల్గొన్నారు. -
బాలబాలికలను లైంగికంగా వేధిస్తే 20ఏళ్ల జైలుశిక్ష
విజయనగరం/నెల్లిమర్ల రూరల్: లైంగికంగా బాల,బాలికలను వేధించినా, అవమాన పరిచినా..నేరం చేసిన వ్యక్తికి కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష విధించనున్నట్లు ఫ్యామిలీ కోర్టు జడ్జి కె.విజయకల్యాణి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ ఉత్తర్వుల మేరకు విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికల్యాణ్ చక్రవర్తి ఆదేశాలతో బుధవారం ఆమె నెల్లిమర్ల మండలంలోని కొండగుంపాం గ్రామంలో పోక్సో చట్టంపై న్యాయఅవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ దగ్గర వారే మన బాలికలపై నేరానికి పాల్పడుతుంటారని, అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్ల లపట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ఈ సందర్భంగా గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్ గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రస్తుత పిల్లలు టీనేజ్ వయస్సులో లేనిపోని ఆకర్షణలకు గురవుతుంటారని, ఇంటర్నెట్ ప్రభావానికి లోనుకాకుండా విద్యపై దృష్టి సారించాలని చెప్పారు. ఏ విషయాన్నైనా నిర్భయంగా తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బొబ్బిలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.రోహిణీరావు,, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ డి.సీతారాం, కొండగుంపాం గ్రామసర్పంచ్ పి.అప్పన్న, నెల్లిమర్ల ఎస్సై ఎం.గణేష్, కొండగుంపాం గ్రామ సచివాలయ కార్యదర్శి ఎల్.తౌడు, సచివాలయ సిబ్బంది, జిల్లా న్యాయ సేవాధికార సిబ్బంది, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి కె.విజయకల్యాణి -
మట్టి మాఫియా ఆగడాలు
రామభద్రపురం: మండలంలో మట్టిమాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ నాయకుల అండతో గ్రామాల్లోని చెరువులు, చెరువు పోరంబోకు, గెడ్డ పోరంబోకుల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ చోటామోటా నాయకులు వారి జేబులు నింపుకుంటున్నారు. టీడీపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు ఉండడం, ఒక వేళ ఫిర్యాదు వచ్చినా నామమాత్రంగా పరిశీలించి మిన్నకుండిపోవడంతో మండలంలో మట్టి మాఫియా పేట్రేగిపోతూ అక్రమ రవాణా సాగిస్తోంది. ఎన్నడూలేని విధంగా రాత్రింబవళ్లు మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నా అటువైపు కన్నెత్తి చూసే సాహసాన్ని కూడా అధికార యంత్రాంగం చేయడం లేదు. ఎవరో ఒకరు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే అటువైపు వెళ్తున్నారు తప్ప..అక్రమ రవాణాను అడ్డుకుందామన్న స్పృహ వారికి లేదని, ఒక వేళ అడ్డుకున్నా అధికార పార్టీ నాయకుల నుంచి ఫోన్‌కాల్ వచ్చిన వెంటనే వెనుదిరుగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని కొట్టక్కి రెవెన్యూ పరిధిలో రేయింబవళ్లు చెరువు పోరంబోకు, చెరువులు, గెడ్డ పోరంబోకులో జేసీబీలతో విలువైన మట్టిని తవ్వి వందలాది ట్రాక్టర్లు, పెద్దపెద్ద ట్రక్కులు, లారీల ద్వారా మన్యం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన మాఫియా అక్రమంగా తరలిస్తున్నారు. రామభద్రపురం నుంచి సాలూరు వెళ్లే ఎన్‌హెచ్ 26 రోడ్డు పక్కన ఉన్న సైట్లు ఎత్తు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పడంతో పాటు స్థానిక టీడీపీ నాయకుడు, సాలూరుకు చెందిన ఓ చౌదరికి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.150 వరకు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం మనదే అడ్డుకునేవారే లేరంటూ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు సైతం అడ్డుకోవడానికి కూడా వీల్లేదంటూ చోటా నాయకులు హుకుం జారీ చేసి మరీ మట్టి తవ్వకాలు నిర్వహించడం గమనార్హం. అక్రమార్కులు మట్టి ఎక్కడికి తరలిస్తున్నారో తెలిసినా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ప్రకృతి సంపదను దోపిడీ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని గ్రామస్తులు ప్రత్యక్షంగా ఆందోళన చేసినా..లేక ఫిర్యాదు చేసినా అధికారులు అడపాదడపా దాడులు చేస్తూ మమ అన్పిస్తున్నారు తప్ప కట్టడి చేసే ప్రయత్నాలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. యథేచ్చగా రవాణా ప్రభుత్వ ఆదాయానికి గండి అధికార పార్టీ నాయకుల అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు చేతులెత్తేసిన రెవెన్యూ యంత్రాంగంఫిర్యాదు చేసినా స్పందన లేదు మూడు రోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వెళ్లి అడ్డుకుని, ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు స్వయంగా ఫిర్యాదు చేశాను. కనీస స్పందన లేదు. మొన్న జూనియర్ అసిటెంట్ వచ్చి అడ్డుకుని జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు తహసీల్దార్ కార్యాలయానికి తరలిస్తుండగా ఎక్కడి నుంచో ఫోన్ రావడంతో వెంటనే వదిలేసి వెళ్లిపోయారు. మండలంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. సంబంధిత అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే అటువైపు వెళ్తున్నారు కానీ అడ్డుకోవడం లేదు. అలమండ ఆనందరావు, సీపీఐ జిల్లా జాయింట్ సెక్రటరీ, కొట్టక్కి సిబ్బందిని పంపి అడ్డుకుంటాం.. మాకు ఫిర్యాదు అందింది. కానీ వారి సొంత భూమిలో తవ్వుకుని, వారి పొలంలోనే వేసుకుంటున్నామని చెబుతున్నారు. మా అధికార సిబ్బందిని పంపించగా వెళ్లి పరిశీలించారు. తవ్వడం వాస్తవమే. అయితే వారి సొంత పొలం తవ్వుకుని వేసుకుంటున్నారని చెబుతున్నారు. అయినా నిబంధనల ప్రకారం ఎక్కడ తవ్వినా అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. మరోసారి సిబ్బందిని పంపించి అక్రమ రవాణాను అడ్డుకుంటాం. ఎ సులోచనరాణి, తహసీల్దార్, రామభద్రపురం -
డోలీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రయత్నం
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాను డోలీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సీఎం చంద్రబాబు నాయుడికి తెలిపారు. రెండవ రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో బుధవారం ఆయన జిల్లా ప్రగతిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉందని, కొండ ప్రాంతాల్లో రహాదారి సదుపాయం లేక డోలీలు వినియోగిస్తున్నారని, ఆ పరిస్థితి కనిపించకుండా ఉండేలా రహదారి సదుపాయం కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. 250 మంది ప్రజలున్న ఆవాసాలకు కూడా రహదారి సదుపాయం కల్పించాలనే దిశగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అపరాల సాగును కూడా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో అనీమియా ఎక్కువగా ఉందని తాన్ని కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా తలసరి ఆదాయం రూ. 1.67 లక్షలుగా ఉందని దాన్ని వచ్చే 2025–56 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1.94 లక్షలకు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ప్రగతికి పర్యాటరంగం ఎంతో దోహదపడుతుందని, పర్యాటక రంగంలో జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించామని వివరించారు. జిల్లాలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజి నిర్మాణం 60 శాతం పూర్తి కావచ్చిందని తెలిపారు. కందుల సాగుకు ప్రోత్సాహం తలసరి ఆదాయం పెంచే దిశగా చర్యలు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
కొండ చీపుళ్ల కొనుగోలుకు టెండర్ల ఖరారు
సీతంపేట: గిరిజనుల వద్ద నుంచి కొండచీపుళ్ల కొనుగోలుకు అడ్వాన్స్ టెండర్లు బుధవారం ఖరారయ్యాయి. ఐటీడీఏ కార్యాలయంలో పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, జీసీసీ డీఎం సంధ్యారాణి సమక్షంలో టెండర్లు నిర్వహించారు. 16 మంది టెండర్‌దారులు హాజరయ్యారు. గిరిజన సహకార సంస్థ ఒక్కో కొండచీపురు గ్రేడ్ వన్ గిరిజనుల వద్ద నుంచి రూ.45కి కొనుగోలు చేసి రూ.47కు వ్యాపారులకు విక్రయిస్తుంది. గ్రేడ్ టు చీపురు ఒకటి రూ.40కి కొనుగోలు చేసి రూ.42కు, గ్రేడ్–3 చీపురు కట్ట రూ.35కు కొనుగోలు చేసి రూ.37కు వ్యాపారులకు విక్రయించనున్నారు. కొండచీపురు కొనుగోలు చేసిన ధరపై రూ.2 మార్జిన్‌ను కలిపి సేల్ బిల్లు వ్యాపారులకు ఇవ్వనున్నారు. అటవీశాఖ నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పర్మిట్లు కూడా జీసీసీ ఇవ్వనుంది. వారపు సంతల వద్దే కొనుగోలు చేసి వెంటనే వ్యాపారులకు విక్రయించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో జీసీసీ మేనేజర్లు దాసరి కృష్ణ, గొర్లె నరసింహులు, తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలకు చిక్కిన మత్స్యశాఖాధికారి
పార్వతీపురంటౌన్: బలహీన వర్గాలకు చెందిన మత్స్యకారులకు సీడ్ బిల్లుల చెల్లింపులో పార్వతీపురం మన్యం జిల్లా మత్స్యశాఖాధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారులకు బుధవారం పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొండ మండలం టీడీ పురానికి చెందిన బొప్పన అప్పన్నదొరకు చెందిన కోటదుర్గ ఫిష్ సీడ్ సంస్థలోని విత్తన నిల్వలను తనిఖీ చేసి, రూ.60 లక్షల బిల్లు మంజూరు చేసినందుకు జిల్లా మత్స్యశాఖాధికారి వేముల తిరుపతయ్య రూ.60 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు అప్పన్నదొరకు లంచం ఇవ్వడం ఇష్టంలేక విజయనగరంలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వలపన్నాం. బాధితుడి నుంచి పార్వతీపురంలోని మత్స్యశాఖ కార్యాలయంలో రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నాం. ఆయనపై కేసు సమోదు చేసి, డబ్బులు సీజ్ చేశాం. నిందితుడిని విశాఖపట్టణంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. దాడిలో సీఐలు మహేశ్వరరావు, భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు. సీడ్ ఏజెన్సీకి బిల్లులు చెల్లించినందుకు రూ.60 వేలు డిమాండ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించిన ఏజెన్సీ నిర్వాహకుడు వలపన్ని పట్టుకున్న అధికారులు -
వర్షపునీటి నిల్వ నిర్మాణాలకు నిధులు
విజయనగరం: విజయనగరంలో వర్షపు నీరు నిల్వ ఉండే నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం తొలివిడత (50 శాతం)గా రూ.24.86లక్షలు మంజూరు చేసింది. సంబంధిత నిధులు మంజూరు పత్రాన్ని భారత గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం న్యూఢిల్లీలో విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్యకు అందజేశారు. షాలో అక్విఫెర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 75 నగరాలను గుర్తించగా అందులో విజయనగరం ఒకటి. అమృత్ 2.0 పథకం కింద 10 అర్బన్ అక్విఫెర్ ఫర్ సస్టైనబుల్ మ్యాపింగ్ కింద విజయనగరం నగరపాలక సంస్థ అర్హత సాధించిందని కమిషనర్ పల్లి నల్లనయ్య తెలిపారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ వారిచ్చిన 10 ప్రాంతాలలో వర్షపు నీటి కట్టడాలను ఏర్పాటుకు రూ.49.72 లక్షలు అంచనాలను పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించామన్నారు. ఎంపిక చేసిన పది ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టేందుకు ఆ శాఖ ఆమోదం తెలుపుతూ నిధులు మంజూరు చేసిందన్నారు. త్వరలో విజయనగరం నగరపాలక సంస్థ బ్యాంకు ఖాతాకు నిధులు జమవుతాయన్నారు. త్వరలో 10 వర్షపు నీటి కట్టడాలకు టెండర్లు పిలిచి వర్షాకాలం రాకముందే వాటి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో డీఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. తొలివిడతగా రూ.24.86 లక్షలు మంజూరు చేసిన కేంద్రం న్యూఢిల్లీలో కార్పొరేషన్ కమిషనర్‌కు నిధుల మంజూరుపత్రం అందజేత -
గందరగోళంగా సామాజిక తనిఖీలు
గుర్ల: మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద డ్వామా పీడీ శారదాదేవి ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం చేపట్టిన సామాజిక తనిఖీలు గందరగోళంగా మారాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల దాటిన వరకు తనిఖీలు సాగా యి. తనిఖీల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తమైంది. ఉపాధిహామీ సిబ్బంది తరఫున రాజకీయ పార్టీల నాయకుల వాగ్వాదంతో తనిఖీల ప్రాంగణ మంతా అరుపులు వినిపించాయి. పెనుబర్తిలో అనర్హులకు మస్తర్లు వేసినట్టు రుజువైనా లేదంటూ స్థానిక టీడీపీ నాయకులు పీడీతో వాగ్వాదం చేశా రు. ఎటువంటి అపరాధ రుసుం వేయకుండా అధికారులను భయపెట్టారు. అచ్చుతాపురం, గూడేం, తాటిపూడి, గొలగాం, దమరసింగి ఫీల్డ్ అసిస్టెంట్ల అవినీతిపై విచారణ చేయాలని పీడీ ఆదేశించారు. ఆ గ్రామాలకు చెందిన మేట్లు, వేతనదారులు సామాజిక తనిఖీ వద్దకు వచ్చి ఎటువంటి అవినీతి జరగలేదని విజ్ఞప్తిచేసినా ఫలితం లేకుండా పోయింది. రాత్రిపూట సామాజిక తనిఖీలతో అధికారులు సైతం అసహనం వ్యక్తం చేశారు. -
●నిజాలు చెప్పాలని గిరిజన సంఘం వినతి ● మోకాళ్లపై వేడుకోలు.. ● ‘కోట’లో బాలికల ఆశ్రమ పాఠశాల ఏర్పాటుచేయాలని ఆందోళన
శృంగవరపుకోట: గిరిజనుల కళ్లకు గంతలు కట్టకుండా ప్రభుత్వం నిజాలు చెప్పాలని ఏపీ గిరిజన సంఘం సభ్యులు విజ్ఞప్తిచేశారు. గిరిజన బాలికల కోసం ఎస్.కోట పట్టణంలో బాలికల ఆశ్రమ పాఠ శాల ఏర్పాటు చేయాలని వేడుకున్నారు. ఎస్.కోట మండలంలోని ధారపర్తి పంచాయతీ పరిధిలోని చిలకపాడు గ్రామంలో పలువురు గిరిజన విద్యార్థు లు, చిన్నారులు, వారి తల్లిదండ్రులతో కలిసి సంఘ నాయకులు జె.గౌరీష్, జె.భీమయ్య, మంగళయ్య లు మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్రామంలోని చిన్నా పెద్ద అంతా మోకాళ్లపై కూర్చుని కలెక్టర్‌కి, ప్రభుత్వ పెద్దలకు మోకాళ్లపై నిల్చొని నమస్కారాలు చేస్తూ తమ గోడు వినిపించారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలో 160 మందికి సరిపడే భవనంలో 260 మందికి అడ్మిషన్లు ఇచ్చారని, ఆపై చేరిన బాలికలను పార్వతీపురం, సాలూరులోని ఆశ్రమ పాఠశాలలకు పంపుతున్నారన్నారు. తమ పిల్లలు చదవాలని కొండలు, కోనలు దించి ఆడపిల్లలను పంపుతున్నారని, వారికి రోగమొచ్చినా, కష్టమొచ్చినా 50 నుంచి 70 కి.మీ మేర గిరిజన తల్లిదండ్రులు ప్రయాణాలు చేయాల్సి వస్తోందని చెప్పారు. మన్యానికి ముఖ ద్వారంగా ఉన్న ఎస్.కోటలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఏర్పాటుచేసి బాలికా విద్యను ప్రోత్సహించాలని కోరారు. ఇక్కడి సమస్యలను నిజాయితీగా అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. -
పరీక్షలంటే భయాన్ని వీడండి
సాలూరు: విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని విడనాడాలని సబ్‌కలెక్టర్, ఇన్చార్జ్ ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పాచిపెంట మండలంలోని పి.కోనవలస గిరిజన గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని రుచి చూసి మెనూ పరిశీలించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షలు ఏ విధంగా రాస్తున్నారు? ఏ విధమైన ప్రణాళిక ద్వారా చదువుతున్నారు? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు లక్ష్యంతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. పరీక్షల్లో ప్రణాళికా బద్ధంగా చదవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడిలో కొలువైన అమ్మవారికి సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌లు శాస్త్రోక్తంగా పూజాధికాలు జరిపారు. రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో అర్చకులు నేతేటి ప్రశాంత్ అమ్మవారిని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధనలు చేశారు. కార్యక్రమాలను ఆలయ ఇన్చార్జి ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ పర్యవేక్షించారు. రాజీపేట పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపుజియ్యమ్మవలస: మండలంలోని చింతలబెలగాం పంచాయతీ రాజీపేట పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లో ఏనుగులు మంగళవారం దర్శనమిచ్చాయి. ఉదయం వెంకటరాజపురంలోని వరిపంటను ధ్వంసం చేసి సాయంత్రానికి వెంకటరాజపురం, బాసంగి మీదుగా చింతలబెలగాం, రాజీపేట గ్రామంలోకి జారుకున్నాయి. రాత్రి సమయమంలో గ్రామంలోకి చొచ్చుకు రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వరిపంట, అరటి ఉండడంతో పంటలను ధ్వంసం చేస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థినికి డీఈఓ అభినందనలుపాచిపెంట: లక్నోలో ఇటీవల జరిగిన 1500 మీటర్లు, 3వేల మీటర్ల పరుగుపందెంలో పాచిపెంట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని జోత్స్న పాల్గొంది. అండర్ 17 విభాగంలో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థినిని డీఈఓ నాయుడు మంగళవారం అభినందించారు. విద్యార్థినికి పాఠశాల హెచ్ఎం ఈశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు అభినందనలు తెలిపారు. మహిళ మృతిపై కేసు నమోదురాజాం సిటీ: పట్టణ పరిధి మల్లికార్జునకాలనీ 7వ లైన్లో నివాసం ఉంటున్న కెల్ల లక్ష్మి (44) మృతిచెందడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. వీధిలో దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రెవెన్యూ సిబ్బంది సహాయంతో ఇంటి తలుపులు తీయగా ఇంటిలోపల ఆమె మృతదేహం కనిపించిందని ఎస్సై తెలిపారు. మూడు రోజుల క్రితమే ఆమె మృతిచెంది ఉంటుందని, ఇంట్లో ఒక్కతే ఉండేదని, ఆమె కుమారుడు దుర్గాప్రసాద్ విశాఖపట్నంలో ఉంటున్నాడని చెప్పారు. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
తరలిపోతున్న వృక్ష సంపద..!
● పట్టించుకోని రెవెన్యూ, అటవీశాఖ అధికారులుకొమరాడ: మండలం నుంచి వేలాది రూపాయల విలువ చేసే అటవీ సంపద రాత్రివేళ నాటుబళ్లు, ట్రాక్టర్ల సహాయంతో తరలిపోతోంది. పట్టించుకోవాల్సిన రెవెన్యూ, అటవీశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణులు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వృక్ష సంపద నరికి వేస్తుండడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఒడిశా సరిహద్దు నుంచి టేకు కలప చడీచప్పుడు లేకుండా రవాణా సాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది అక్రమ వ్యాపారులు, రెవెన్యూ సిబ్బంది కుమ్మకై ్కనట్లు తెలుస్తోంది. టేకుకలప తరలించాలంటే కచ్చితంగా రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కొమరాడ మండలం నుంచి పార్వతీపురం సా మిల్లులకు తరలించిన తరువాత అక్కడినుంచే సంబంధిత శాఖ అధికారులకు మామూళ్లు వెళ్తాయని సమాచారం. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
వయోశ్రేష్టుల సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలి
విజయనగరం టౌన్: వయోశ్రేష్టుల సంరక్షణ చట్టాన్ని ప్రతి జిల్లాలో కచ్చితంగా అమలుచేయాలని ఆలిండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, రాష్ట్ర వయోశ్రేష్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంపరాల నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో వయోశ్రేష్టుల రాష్ట్ర కార్యవర్గ కౌన్సిల్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సబ్‌డివిజనల్ స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి రెవెన్యూ సబ్ డివిజన్ స్ధాయిలో వచ్చే సమస్యలను పరిష్కరించాలని, కలెక్టర్ స్థాయిలో అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేసి జిల్లా స్థాయిలో వచ్చే వయోశ్రేష్టుల సమస్యలను 90 రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి జిల్లాలోనూ కమిటీలు వేసి మూడు నెలలకొకసారి కమిటీ సమావేశం నిర్వహించి వయోశ్రేష్టుల సంక్షేమంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వయోశ్రేష్టుల శేషజీవితం ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా సమృద్ధిగా ఉండేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర్ ప్రార్థన గీతంతో ప్రారంభమైన సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పరమేశ్వర రెడ్డి, కార్యదర్శి రామచంద్రరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, సత్యనారాయణమూర్తి, వెంకటరమణ, తదితరులు దివంగత కేపీ ఈశ్వర్ మృతిపట్ల మౌనం పాటించారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఎస్.కుప్పూరావు, ప్రతినిధులు త్రినాథప్రసాద్, బసవమూర్తి, జగన్నాథరావు, గిడుతూరి పైడితల్లి, అధిక సంఖ్యలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆదుకున్న వైఎస్సార్సీపీ
● మురళీరాజు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం పూసపాటిరేగ: పూసపాటిరేగకు చెందిన కలిదిండి వెంకట మురళీరాజు కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆపన్నహస్తం అందించింది. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన పైడి భీమవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకట మురళీరాజు మృతి చెందారు. కుటుంబ పెద్ద దిక్కు మరణాన్ని తట్టుకోలేని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. విషయాన్ని నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని మురళీరాజు భార్య సుష్మ బ్యాంకు ఖాతాలో జమ చేయించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన కార్యకర్త కుటుంబాన్ని ఆదుకున్న జగన్మోహన్రెడ్డి, బడ్డుకొండ అప్పలనాయుడు, జెడ్పీ చైర్మ న్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీపీ మహంతి కల్యాణి, సోషల్ మీడియా కన్వీనర్ ఎ.వాసునాయుడుకు సుష్మ కృతజ్ఞతలు తెలిపారు. -
హైరిస్క్ గర్భిణుల పట్ల అప్రమత్తం
భామిని: ఆస్పత్రి ప్రసవాలకు ప్రాధాన్యం ఇచ్చి,హైరిస్క్ గర్భిణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి డాక్టర్ భాస్కరరావు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన భామిని మండలంలోని బత్తిలి, భామిని, బాలేరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. బత్తిలి పీహెచ్సీలో నిర్వహిస్తున్న నూట్రీ–గార్డెన్‌ను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రులకు వస్తున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. భామిని పీహెచ్సీలో మందుల నిల్వలు పరిశీలించి,ల్యాబ్‌లో చేస్తున్న పరీక్షలను గుర్తించారు. బాలేరు పీహెచ్సీలో వైద్యసిబ్బంది హాజరు పట్టీ పరిశీలించారు. డీఎంహెచ్ఓ వెంట బత్తిలి డాక్టర్లు రవీంద్ర, దామోదరరావు, భామిని వైద్యులు సోయల్, సంతోషిలక్ష్మి, బాలేరు వైద్యాధికారి శివకుమార్, సీహెచ్ఓ భాస్కరరావు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు -
డ్రోన్ దెబ్బ.. పేకాటరాయుళ్ల అబ్బా..!
విజయనగరం క్రైమ్: జిల్లాలో డ్రోన్స్ సహాయంతో పేకాట, కోడి పందాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. విజయనగరంలోని హుకుంపేట శివారు, పూసపాటిరేగ మండలం వెంపడాం వద్ద మంగళవారం పోలీసులు డ్రోన్స్ ఉపయోగించి పేకాట ఆడుతున్న, కోడి పందాలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో విజయనగరం టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు సిబ్బంది హుకుంపేట శివారులో పార్కింగ్ చేసిన లారీలో పేకాట ఆడుతున్న వారిపైకి డ్రోన్‌ను వంపి, శివారు ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు నిర్ధారించుకుని, రైడ్ చేసి పారిపోతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12,600 నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాల శిబిరంపై దాడిఅలాగే జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు ఎస్బీ పోలీసులకు వచ్చిన సమాచారంతో వారిపైకి డ్రోన్ పంపి, సుదూర ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకుని భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, పూసపాటిరేగ ఎస్సై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్‌సిబ్బంది రైడ్ చేసి, కోడి పందాలు ఆడుతూ, పారిపోతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15,600 నగదు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్బంగా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. నేర నియంత్రణలోను, శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు డ్రోన్స్‌ను వినియోగిస్తున్నామని, పట్టణ, గ్రామ శివారు ప్రాంతాలపై డ్రోన్స్ సహాయంతో నిఘా పెడుతున్నామని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు. -
గిరిశిఖర గ్రామాల్లో ఆగని మరణాలు
● అనారోగ్యంతో మరో చిన్నారి మృతి ● అంతు చిక్కని కారణాలు ● ఆందోళనలో ధారపర్తి గిరిజనులు ● వ్యాక్సినేషన్ లేకపోవడమే కారణమా? శృంగవరపుకోట: గిరిశిఖర గ్రామాల్లో మరణమృదంగం వినిపిస్తోంది. ఒక తల్లి గర్భశోకం మరిచిపోకముందే మరో తల్లికి గర్భశోకం కలుగుతోంది. ఎస్.కోట మండలం ధారపర్తి పంచాయతీ వరుస మరణాలతో వణుకుతోంది. స్పందించాల్సిన వైద్యారోగ్యశాఖ చేష్టలుడిగి చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరణాలు ఏకారణంతో జరుగుతున్నాయన్న కనీస విచారణ లేకుండా వైద్యులు చేతులు దులిపేసుకుంటున్నారని గిరిజనులు వాపోతున్నారు. ధారపర్తి గ్రామానికి చెందిన కురిన బోయిన గంగులు–సీతమ్మల ఐదు నెలల కుమారుడు మంగళవారం ఉదయం విజయనగరంలోని ఘోషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రెండు నెలల కిందట ఇదే పంచాయతీకి చెందిన జన్ని విజయ్ అనే చిన్నారి తనువుచాలించాడు. ఈ ఘటనపై ఆదివాసీ గిరిజన సంఘ సభ్యులు, చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబీకులు అంతా తమ ప్రాణాలకు సరైన గ్యారంటీ దక్కడం లేదని, చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసి పోతుంటే వైద్యసిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారంటూ ఆందోళనకు దిగారు. చిన్నారుల మరణానికి సకాలంలో వాక్సినేషన్ వేయకపోవడమే కారణమన్న వాదన వినిపిస్తోంది. పంచాయతీలోని చిన్నారులకు వాక్సినేషన్ లేకుండా చేసిన భారీ తప్పిదానికి వైద్యారోగ్యశాఖ అధికారులు ఇద్దరు ఉద్యోగులను బదిలీ చేసి చేతులు దులిపేసుకున్నా... చిన్నారుల మరణాలు అందరినీ కలచివేస్తున్నాయి. రిఫర్ చేశాం.. ధారపర్తికి చెందిన చిన్నారి మరణం పట్ల ఎస్.కోట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీల స్పందించారు. తొలుత చిన్నారి తక్కువ బరువుతో పుట్టాడని, జిల్లా కేంద్రంలో ఘోషా ఆస్పత్రిలో వైద్య సేవలు అందజేశారు. ఈ నెల 3వ తేదీన చిన్నారికి ఆయాసం రావడంతో ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారం రోజుల పాటు వైద్యసేవలు అందజేశాం. కోలుకున్నాక ఈ నెల 10న డిశ్చార్జ్ చేశాం. తిరిగి 23వ తేదీ రాత్రి 11.30కి చిన్నారి ఆరోగ్యం క్షీణించిందంటూ ఆస్పత్రికి తెచ్చారు. ఎలాంటి సమస్య లేకున్నా ఆయాసం తగ్గక పోవడంతో జీవక్రియలకు సంబందించి ఇబ్బంది ఉండొచ్చని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ పిడియాట్రిక్స్‌కు 24వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు రిఫర్ చేశాం. ఘోషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయినట్టు తెలిసిందని తెలిపారు. -
ఇరుగ్రామాల యాదవుల కొట్లాట
బాడంగి: గొర్రెల మేత విషయంలో ఇరుగ్రామాలకుచెందిన యాదవులు కొట్లాటకు దిగడంతో ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మండలంలో జరగ్గా గాయపడిన వారి బంధువులు తెలిపిన సమాచారం ఇలా ఉంది. మండలంలోని గొల్లాది, కామన్నవలస గ్రామాలకుచెందిన యాదవులు గొడవపడి కర్రలతో కొట్టుకోగా కామన్నవలసకు చెందిన పడాల లక్షుం, కామేశ్వరరావు, సింహాచలం, ఆదినారాయణలు, గొల్లాదికి చెందిన ఈపు ఈశ్వరరావు, చప్పసత్యం గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురిని 108లో స్థానిక ఆస్పత్రికి తీసుకురాగా ప్రథమచికిత్స చేసిన డాక్టర్ హారిక వారిలో ఈపుఈశ్వరరావు, పడాల లక్షుంల పరిస్థితి విషమించడంతో విజయనగరం ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు క్షతగాత్రుల బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం -
అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి రిటైర్డ్ హెచ్ఎం మృతి
బొబ్బిలి: పట్టణంలోని నాయుడు కాలనీలో గల ఓ ఆపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న రిటైర్డ్ హెచ్ఎం వై.శ్యామ్‌సుందర్(80) రెండో అంతస్తు నుంచి పడిపోయి మంగళవారం మృతిచెందారు. బాడంగి మండలం పాల్తేరులో హెచ్ఎంగా రిటైరైన ఆయన బొబ్బిలిలోని ప్రముఖ వైద్యుడు, ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ వై.విజయమోహన్ తండ్రి. మంగళవారం మేడపై ఉన్న ఆయన ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందికి పడిపోయినట్లు, ఆల్జీమర్స్‌తో కొద్దికాలంగా బాధపడుతున్నట్లు కోడలు గ్రేస్కుమారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని ఎస్సై ఆర్.రమేష్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఎస్సై చెప్పారు. -
విజయనగరం
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025కళ్లకు గంతలు కట్టొద్దు ఎవరి లాభం కోసం..! అల్లుడు వచ్చేంతకు వరకు అమావాస్య ఆగదన్న చందాన తయారైంది ప్రభుత్వం తీరు. అపరాల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. –IIలోడాక్టర్ రాసిన చీటీ ఉండదు... వ్యాధి పేరు చెబితే మందులు ఇచ్చేస్తున్నారు. రోగి, బంధువులకు చదువురాదు.. అమాయకంగా కనిపిస్తే చాలు... కాలం చెల్లిన మందులను అంటగట్టేస్తున్నారు. కొన్ని మందులపై తేదీలు కనిపించకుండా చేస్తున్నారు.. అనుమానం రాకుండా కొత్త తేదీలను ముద్రించి విక్రయిస్తున్నారు. ఇటీవల ఔషధ నియంత్రణ శాఖ అధికారులు జరిపిన దాడుల్లో విస్తుపోయిన నిజాలు వెలుగుచూశాయి. ప్రాణాలు నిలిపే మందులే ప్రాణాలు తీస్తాయన్న భయం అధికారుల్లోనే కలిగిందంటే మందుల మాఫియాను అర్థం చేసుకోవచ్చు. ఆలివ్‌రిడ్లేలను కాపాడడం మనందరి బాధ్యత ● డీఎఫ్ఓ కొండలరావు పూసపాటిరేగ: సముద్రంలో నివసించే ఆలివ్‌రిడ్లేలను కాపాడడం మనందరి బాధ్యతని డీఎఫ్ఓ కొండలరావు అన్నారు. పూసపాటిరేగ మండలం పులిగెడ్డపేట తీరంలో 270 ఆలివ్‌రిడ్లే పిల్లలను సముద్రంలో విడిచిపెట్టారు. ట్రీ ఫౌండేషన్, అటవీశాఖ ఆధ్వర్యంలో 10 రక్షణ కేంద్రాల్లో 517 తాబేళ్ల ద్వారా 56,065 గుడ్లను సంరక్షించినట్టు తెలిపారు. టేకు వలలు, నానాజాతి వలలను మత్స్యకారులు చేపల వేటకు వినియోగించడంతో ఆలివ్రిడ్లేలకు ముప్పువాటిల్లుతోందన్నారు. సముద్ర తాబేళ్లను కాపాడ డం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్యసంపద అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్టు రేంజ్ అధికారి అప్పలరాజు, ఫారెస్టు సెక్షన్ అధికారి మధుమోహన్, ట్రీ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ కామయ్య, తదితరులు పాల్గొన్నారు. రైతు ఉత్త్పతిదారుల సంఘాలకు నాబార్డు చేయూత ● నాబార్డు డీడీఎం నాగార్జున నెల్లిమర్ల రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నాబార్డు నుంచి ఆర్థిక సహాయం అందజేస్తామని జిల్లా మేనేజర్ నాగార్జున తెలిపారు. మండలంలోని సతివాడ గ్రామంలో శుభోదయం రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులతో మంగళవారం సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల ఏర్పాటు, డ్రోన్ మిషన్లు, యాంత్రీకరణ పనిముట్లు కొనుగోలు కు సాయం అందజేస్తామన్నారు. రైతులంతా ఒకే మాటపై ఉండి సంఘ అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఇండియా మార్కెటింగ్ జోనల్ ఇన్చార్జి గోపాల్‌కృష్ణ గోఖులే, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, బీఆర్ఈడీఎస్ సీఈఓ రామకృష్ణరాజు, సీఈఓ పతివాడ సత్యనారాయణ, సర్పంచ్ రేవళ్ల శ్రీనివాసరావు, నాయకులు జమ్ము అప్పలనాయుడు, పంచాది శ్రీరాములనాయుడు, దురగాశి ఎర్రంనాయుడు, మత్స శ్రీనివాసరావు, కంది శ్రీను, డైరెక్టర్లు పాల్గొన్నారు. సామాజిక, ఆర్థిక సర్వేల ఆధారంగా ప్రణాళికలు ● జాతీయ శాంపిల్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ కొత్తవలస: జాతీయ శాంపిల్ సర్వే నిర్వహించే సామాజిక, ఆర్థిక సర్వేల ఆధారంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తామని ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.రాజశేఖర్ తెలిపారు. మండలంలోని కంటకాపల్లి గ్రామంలో జాతీయ శాంపిల్ సర్వే వజ్రోత్సవాల నిర్వహణలో భాగంగా 2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వే చేస్తామన్నారు. గృహ వినియోగ, ఉద్యోగిత–నిరుద్యోగిత రేటు, సమయ వినియోగం, పంట దిగుబడి, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల సర్వేలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ గణాంకాధికారులు ఎస్.పళ్లంరాజు, ఎస్.వెంకటేశ్వరరావు, కె.వి.సురేష్‌కుమార్, బి.శ్రీనివాసరావు, టి.వేణుగోపాల్, ఆర్.శ్రీనివాసరావు, తహసీల్దార్ బి.నీలకంఠరా వు, ఎంపీడీఓ ఎస్.రమణయ్య, గ్రామ పెద్దలు మదీన అప్పలరమణ పాల్గొన్నారు. చేపలవలకు చిక్కిన పాము జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం గ్రామానికి చెందిన బందలుప్పి గోపి బాసంగి ముంపుడులో చేపల కోసం మంగళవారం వేసిన వలకు ఆరడుగుల పొడవున్న పాము చిక్కింది. దీనిని చూసిన గోపి భయంతో పరుగుతీశారు. పరిసరాల్లోని రైతులను పిలిచి వలను బయటకు తీసి పాముకు విముక్తి కల్పించాడు. ● కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్న దుకాణదారులు ● జిల్లాలో 1570 మందుల దుకాణాలు ● డాక్టర్ చీటీ లేకుండా మందుల విక్రయం ● చాలా మందుల దుకాణాల్లో ఫార్మసిస్టులు లేకుండానే విక్రయాలు ● మత్తు టానిక్‌లకు బానిస అవుతున్న యువత ● మందుల దుకాణాలపై పర్యవేక్షణ కరువైందన్న ఆరోపణ దుల దుకాణాల్లో ఫార్మాసిస్టులు లేకుండానే మందులు విక్రయిస్తున్నట్టు సమాచారం. పర్యవేక్షణ కొరవడడంతో మందుల దుకాణాల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మత్తు టానిక్‌లకు బానిస అవుతున్న యువత గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడిన యు వత సంబంధిత మత్తుపదార్థాలు దొరకని సమయంలో అదేతరహా మత్తును కలిగించే దగ్గు సిరప్‌లను తాగడం అలవాటు చేసుకుంటున్నారు. వీటి ఖరీదు కూడా తక్కువే కావడంతో వీటికి అలవాటు పడుతున్నారు. ఇదే అదునుగా కొంతమంది డాక్టర్ ప్రిస్క్రప్షన్ లేకుండా విక్రయించకూడని కొలిన్ వంటి దగ్గు సిరప్లు విక్రయిస్తున్నట్టు తెలిసింది. పరోక్షంగా యువత జీవితాలు నాశనం కావడానికి కొంతమంది మందుల దుకాణాల నిర్వాహకులు కార ణమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం కాలపరిమితి దాటిన మందులు వాడడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. అదేవిధంగా దగ్గు సిరప్లు ఎక్కువగా సేవించడం వల్ల నరాలు దెబ్బతింటాయి. కాలేయం కూడా దెబ్బతిని మృత్యువాత పడే అవకాశం ఉంది. లైసెన్సు లేని వ్యక్తులు దగ్గర మందులు, సర్జికల్ మెటీరియల్స్ కొనుగోలు చేయడం వల్ల రోగులు నష్ట పోవాల్సిన పరిస్థితి. నాణ్యతలేని, కాలపరిమితి దాటిన మందులు విక్రయించే అవకాశం ఉంది. వాటిని రోగులు వినియోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. లైసెన్సు లేకుండా మందులు విక్రయించడం వల్ల ఎటువంటి బిల్లు ఇవ్వరు. దీని వల్ల అతనిపై కోర్టులోగాని మరే ఎక్కడైనా పోరాటం చేయడానికి వీలుకాదు. విజయనగరం ఫోర్ట్: ‘ విజయనగరం కొత్త ఆగ్రహారంలో ఓ వ్యక్తి లైసెన్సు లేకుండా సర్జికల్ మెటీరియల్ విక్రయిస్తున్నట్టు ఔషధ నియంత్రణ అధికారులకు సమాచారం అందింది. ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేసి అతని వద్ద రూ.3 లక్షల విలువచేసే సర్జికల్ మెటీరియల్‌ను సీజ్ చేశారు. కేసు నమోదు చేశారు.’ ‘ తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైసెన్సు లేకుండా మందులు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఔషధ నియంత్రణశాఖ అధికారులు దాడిచేశారు. అతని వద్ద రూ.30 వేలు విలువ చేసే మందులు సీజ్ చేసి అతనిపై కేసు నమోదుచేశారు.’ ‘ఇటీవల విజయనగరంలోని రత్నం ఫార్మాస్యూటికల్స్ మందుల దుకాణంలో డాక్టర్ ప్రిస్క్రప్షన్ లేకుండా ప్రీకాఫ్ సిరప్లు విక్రయించడం, కాలపరిమితి దాటిన మందులు విక్రయిస్తున్నట్టు విజిలెన్స్, ఔషధ నియంత్రణ అధికారులు నిర్వహించిన దాడుల్లో గుర్తించారు. సుమారు రూ.2 లక్షలు విలువ చేసే మందులను సీజ్ చేసి, కేసు నమోదుచేశారు.’ కొందరికి లైసెన్స్ ఉండదు...కానీ దర్జాగా మందుల దుకాణం నిర్వహిస్తున్నారు. డబ్బులు సంపాదించాలన్న ఆశతో కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్నారు. మరికొందరు అన్నీ ఉన్నా అమాయమైన రోగుల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు. వైద్యల చీటీ లేకుండా అధిక ధరలకు మందులు విక్రయిస్తున్నారు. జిల్లాలో 1570 మందుల దుకాణాలు ఉన్నాయి. అయితే చాలా మం●నిబంధనలు పాటించని వారిపై చర్యలు నిబంధనలు పాటించని మందుల దుకాణ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. లైసెన్సు లేకుండా మందులు విక్రయించడం, కాలపరిమితి దాటిన మందులు విక్రయించడం, డాక్టర్ ప్రిస్క్రప్షన్ లేకుండా మందులు విక్రయించడం వంటివి నేరం. అలాంటి వారిపై కేసులు నమోదుచేస్తాం. ఇటీవల జిల్లాలో 11 దుకాణాలపై తనిఖీలు నిర్వహించాం. వీటిలో కాలపరిమితి దాటిన మందులు, వైద్యుని ప్రిస్క్రప్షన్ లేకుండా మందులు విక్రయించడం వంటివి గుర్తించాం. వారికి నోటీస్‌లు ఇచ్చాం. విచారణ అనంతరం కేసులు నమోదు చేస్తాం. – కె.రజిత, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణశాఖ ఆక్రమణల తొలగింపు గజపతినగరం/బోడసింగిపేట: గజపతినగరం మండల కేంద్రానికి సమీపంలోని దావాల పేట రోడ్డు, బ్రిడ్జి, బోడసింగిపేటలో 26వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఆక్రమణలను పోలీసుల సమక్షంలో హైవే, రెవెన్యూ అధికారులు మంగళవారం తొలగించారు. ఆక్రమణలు తొలిగించాలని ఇదివరకే నోటీస్‌లు ఇచ్చినా దుకాణదారులు వినకపోవడంతో చర్యలకు ఉపక్రమించారు. ఒకేసారి నాలుగు జేసీబీలతో వచ్చి ఉన్నఫలంగా 23 దుకాణాలను కూల్చివేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తొలగింపు పనులు కొనసాగాయి. జాతీయ రహదారి పక్కన ఖాళీ ప్రదేశంలో నిరుపేదలు ఏళ్ల తరబడి పూరిగుడిసెలతో పాటు దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. దుకాణాల తొలగింపుతో ఉపాధి కోల్పోయారు. అయితే, ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాల దృష్ట్యా అధికారులు ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి–26 మధ్య నుంచి ఎడమవైపున 28 మీటర్ల వరకు జాతీయ రహదారి స్థలం ఉందని, అంత వరకు తొలగింపులు చేపడతామని ఎన్‌హెచ్ జేఈఈ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. తొలివిడతలో ఎడమవైపున తొలగింపులు చేపడుతున్నట్టు వెల్లడించారు. గజపతినగరం సీఐ జీఏవీ రమణతో పాటు ఎస్సైలు యు.మహేష్, సీతారాం, పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కె.రాజేశ్వరరావు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. న్యూస్‌రీల్ -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
పార్వతీపురంటౌన్: ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం ఆమె పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్ఓ కె.హేమలత, కేఆర్ఆర్సీ ఎస్డీసీ పి.రామచంద్రారెడ్డిలతో కలిసి 98 వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని సూచించారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఎటువంటి అర్జీలు రీ ఓపెన్ కాకుండా చర్యలు ఉండాలన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగురాలైన పాలకొండ మండలానికి చెందిన సుందరగిరి శ్రీజా భవానీ తనకు టచ్‌ఫోన్ కావాలని ఇదివరకే వినతిపత్రాన్ని అందజేయడంతో ఆమెకు టచ్‌ఫోన్ అందజేశారు. పీజీఆర్ఎస్లో అందించిన కొన్ని అర్జీలు ● జియ్యమ్మవలస మండలం గడసింగుపురం నుంచి పి. తాతబాబు తదితరులు తమ గ్రామంలోని ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ పనికిరానివారి పేర్లతో అక్రమాలకు పాల్పడడమే కాకుండా ఒక్కో వేతన దారు నుంచి రూ.200 చొప్పున అవినీతికి పాల్పడుతున్నారని, దానిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ● పార్వతీపురం మండలం డోకిశీల గ్రామంలో గల పొలాలకు ఆధారమైన పంటకాలువ పూర్తిగా కబ్జాకు గురైందని, ఆ కాలువ ద్వారా 200 ఎకరాల్లో సాగుభూములు, 15 చెరువులు ఆధారపడి ఉన్నాయన్నారు. కబ్జాతో రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని, కబ్జాదారులపై చర్యలు చేపట్టాలని కోరారు. ● కురుపాం మండలం రెల్లిగూడ గ్రామానికి గతంలో నిర్మించిన గ్రావెల్ రోడ్డు పూర్తిగా పాడైనందున తమ గ్రామాలకు అంబులెన్స్, రేషన్ వాహనం రావడం లేదని, రోడ్డు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ బి.అరుణ గ్రామస్తులతో కలిసి అర్జీ చేశారు. ● పాలకొండ మండలం బుక్కురుపేట గ్రామానికి చెందిన సంధ్యారాణి పెండింగ్‌లో ఉన్న తన ఇంటి బిల్లును మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. సమస్యలపై విచారణ చేసి న్యాయం పార్వతీపురం రూరల్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి అలసత్వం చేయకుండా విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వారితో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సోమవారం వచ్చిన 13 ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, వరకట్న వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీ వసూళ్లు, ప్రేమపేరుతో మోసం వంటి ఫిర్యాదులు ఉన్నాయి. ఈ మేరకు వచ్చిన సమస్యల పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ స్వయంగా ఫోన్ ద్వారా మాట్లాడి ఆయా సమస్యలను, వాటి పూర్వాపరాలను పరిశీలించి వాస్తవాలైతే చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. పీజీఆర్ఎస్కు 40 వినతులు సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 40 వినతులు వచ్చాయి. పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి వినతులు స్వీకరించారు. బర్నగ్రామానికి రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ఎ.చిన్నారావు, సీసీరహదారి మంజూరు చేయాలని ఈతమానుగూడకు చెందిన రాజేష్ అర్జీలు అందజేశారు. మంచినీటి సదుపాయం కల్పించాలని కుశిమి బంగారుగూడ గిరిజనులు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, ఏపీడీ సన్యాసిరావు, డీఈ మధుసూదనరావు, సీడీపీఓ రంగ లక్ష్మి పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 98 వినతులు -
గురుకుల ప్రవేశ పరీక్ష వాయిదా
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల/కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు వచ్చేనెల 6న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్టు గురుకులాల సమన్వయకర్త శంబాన రూపవతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను ఏప్రిల్ 13వ తేదీన నిర్వహిస్తామని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గమనించాలని కోరారు. హాల్ టికెట్లను ‘ఏపీబీఆర్ఏజీసెట్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆ రోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఐదో తరగతికి, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ కార్డు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకొని రావాలని కోరారు. డాక్టర్ బీఆర్అంబేద్కర్ గురుకుల పాఠశాల/కళాశాలలు విజయనగరం జిల్లాలో 8, పార్వతీపురం మన్యం జిల్లాలో 5 ఉన్నాయని పేర్కొన్నారు. శంబాన రూపవతి, ఉమ్మడి విజయనగరం జిల్లా సమన్వయకర్త -
మెటలర్జికల్ కోర్సుతో ఉద్యోగ అవకాశాలు
విజయనగరం అర్బన్: ఇంజినీరింగ్ విద్యలో మెటలర్జికల్ కోర్సులో ప్రతిభచూపిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) ఇన్చార్జి వీసీ డి.రాజ్యలక్ష్మి అన్నారు. జేఎన్టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ వైజాగ్ చాప్టర్ సంయుక్త నిర్వహణలో సోమవారం నిర్వహించిన 10వ నేషనల్ స్థాయి టెక్నికల్ సింపోజియం ‘ఈఐఎస్ఈఎన్ 2కే25’ను ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతోపాటు పరిశోధనా దృక్పథాన్ని విద్యార్థిదశ నుంచే అలవర్చుకోవాలని సూచించారు. సదస్సుకు ముఖ్యవక్తగా హాజరైన హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ కె.భానుశంకరరావు మాట్లాడుతూ మెటలర్జికల్ విద్యలోని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల ప్రాధాన్యత కీలకమని, దానిపై ఆసక్తిని పెంచుకొని ప్రతిభావంతులు కావాలని సూచించారు. అనంతరం ముఖ్యవక్తను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, మెటలర్జికల్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ జి.స్వామినాయుడు మాట్లాడారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ, ఆర్ఐఎంఎల్ అండ్ ఐఐఎం వైజాగ్ చాప్టర్ తాతారావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. జేఎన్టీయూ జీవీ ఇన్చార్జి వీసీ రాజేశ్వరరావు -
● ఆరోగ్య మిత్రల ఆందోళన
ఆరోగ్య శ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) సిబ్బందికి అంతర్గత పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్, డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఆరోగ్య మిత్రలు సోమవారం ఆందోళన చేశారు. డిమాండ్లను వినిపించారు. ఈ సందర్భంగా ఏపీ ఆరోగ్యమిత్ర అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు జె.ప్రదీప్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బంది 17 సంవత్సరాల సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఆరోగ్య మిత్రలకు డీపీఓ కేడర్ అమలు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీలో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాజారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్ -
పోక్సో చట్టంపై అవగాహన అవసరం
● స్పెషల్ జడ్జి కె.నాగమణి విజయనగరం అర్బన్: పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధానికి సంబంధించిన పోక్సో–2012 చట్టంపై పాఠశాల స్థాయి నుంచి అవగాహన కలిగించాలని స్పెషల్ జడ్జి కె.నాగమణి సూచించారు. గురజాడ పబ్లిక్ పాఠశాలలో సోమవారం జరిగిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. లైంగిక వేధింపులకు అడ్డుకట్టవేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. చట్టంపై అవగాహన కల్పి స్తూ పిల్లల్లో చైతన్యం కలిగించాలన్నారు. అనంతరం నాగమణిని పాఠశాల సిబ్బంది సత్కరించారు. సదస్సులో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ హిమబిందు, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ భాగ్యం, న్యాయవాదులు జి.సత్యం, టి.రాజు, పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, కరస్పాండెంట్ ఎం.స్వరూప, హెచ్ఎం పూడి శేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఎన్నాళ్లీ డోలీ మోతలు? శృంగవరపుకోట: ఏజెన్సీ గిరిజనానికి డోలీ మోతలు తప్పవా అంటూ గిరిశిఖర గ్రామాల వాసులు గగ్గోలు పెడుతున్నారు. రేగపుణ్యగిరిలో అరటిగెలలు పట్టుకుని కొండదిగుతుండగా ఎస్.కోటకు చెందిన సీదరి అర్జున సోమవారం ప్రమాదానికి గురయ్యాడు. కాలు విరిగిపోవడంతో వైద్యం కోసం డోలీలో మోసుకుంటూ ఎస్.కోటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రేగపుణ్యగిరి రోడ్డు నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని, లేదంటే గిరిజనులతో కలిసి ప్రజాఉద్యమం చేపడతామని గిరిజనులు, స్థానిక నాయకుడు ఒబ్బిన సన్యాసినాయుడు హెచ్చరించారు. పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షలు విజయనగరం అర్బన్: జిల్లాలో మంగళ, బుధవారాల్లో జరగనున్న ఏపీపీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై తన చాంబర్లో సంబంఽధిత అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. 25న అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, 25, 26వ తేదీల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్–2 ఉద్యోగాలకు, 26న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్ ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఉద యం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యా హ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. జిల్లాలో ఎంవీజీఆర్, అయాన్ డిజిటల్, లెండి ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎస్ఈ లక్ష్మణరావు, భాస్కరరావు, ఎం.బాలరాజు, కె.అనిల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
పొలంలో మట్టితరలిస్తే సుంకం కట్టాలా?
● ఇదెక్కడి తీరు? ● చెక్‌పోస్టును ఎత్తేయాలని రైతుల డిమాండ్ ● సమస్యను డీడీకి నివేదిస్తానంటూ వెనుదిరిగిన విజిలెన్స్ ఏజీ వేపాడ: తమ మెరకపొలాల్లోని మట్టిని పల్లపు పొలాల్లోకి తరలిస్తే సుంకం కట్టాలా..? ఇదెక్కడి పాలన..? మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ల నుంచి చెక్‌పోస్టు వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడడం దారుణమంటూ రైతులతో కలిసి సీఐటీయూ నాయకులు చల్లాజగన్, మద్ది రమణ, ట్రాక్టర్ల డ్రైవర్ల యూనియన్ నాయకుడు గేదెల శ్రీను, ఆందోళన చేశారు. బొద్దాం–కేజీ పూడి రోడ్డులోని చెక్‌పోస్టువద్ద వాహనాలను నిలిపి సోమవారం ధర్నా చేశారు. దీనిపై స్పందించిన మైనింగ్ అండ్ విజిలెన్స్ ఏజీ ఎస్.పి.కె.మల్లేశ్వరరావుకు చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టు సిబ్బంది తీరు, అక్రమ వసూళ్లను రైతులు, సీఐటీయూ నాయకులు ఆయనకు వివరించారు. రైతువారీ పనుల్లో భాగంగా మట్టి, పిక్క, కంకరవంటివి తరలిస్తుంటే వేలల్లో డబ్బులు చెల్లించాలని చెక్‌పోస్టు సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని చెక్ పోస్టులు మూడు జిల్లాల్లో పెట్టారని, శ్రీకాకుళం జిల్లాలో రైతువారీ పనులకు వినియోగించే వాహనాలకు వెసులబాటు కల్పించారని చెప్పారు. ఇక్కడ మాత్రం ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. దీనిపై స్పందించిన విజిలెన్స్ ఏజీ సమస్యను డీడీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి వెనుదిరిగారు. సమస్యను పరిష్కరించేవరకు ఆందోళన కొనసాగిస్తామని సీఐటీయూ నాయకులు స్పష్టంచేశారు. కార్యక్రమంలో చలుమూరి శ్యామ్, చెల్లికాని ముత్యాలు, గేదెల శ్రీను, తూర్పాటి సతీష్, జనపరెడ్డి శ్రీను, పట్రాన కృష్ణ, దళాయి శివ, అలమండ శివప్రసాద్, మజ్జి గంగరాజు, ద్వారపూడి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. వల్లంపూడి ఎస్ఐ బి.దేవీ తన సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
జెడ్పీ చైర్మన్‌కు వైఎస్సార్సీపీ నాయకుల పరామర్శ
విజయనగరం: జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావును వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం పరామర్శించారు. ఇటీవల జెడ్పీ చైర్మన్ చిన్న కుమారుడు మృతిచెందిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు ఆయనను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు మృతిచెందిన ప్రణీత్ బాబు చిత్రపటం వద్ద పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, తుని మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా, పాలకొండ మాజీ ఎమ్మెల్యే తలేభద్రయ్య, ప్రస్తుత కూటమి ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు, మాజీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ వెంకటేశ్వరరావు, మాజీ వుడా చైర్మన్ రవి రాజు, వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు పరామర్శించిన వారిలో ఉన్నారు. -
మూడు రిజిస్ట్రేషన్లు..ఆరు స్టాంపులు..!
● యథేచ్ఛగా స్టాంపు వెండర్ల దోపిడీ ● ఇ–స్టాంప్‌లపై అక్రమంగా వసూలు ● సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో మాన్యువల్ స్టాంప్లకు బ్రేక్ ● సిండికేట్‌గా మారిన విక్రయదారులురూ.30లు అఽధికం రాజాంలో ఈ స్టాంప్ పత్రాల విక్రయంలో అధికంగా వసూలు జరుగుతోంది. ఇటీవల రూ.50లు స్టాంప్ పత్రం నిమిత్తం వెళ్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేదు. ఆ ఇ–స్ట్టాంప్ బయట వెండర్ వద్ద తీసుకుంటే రూ.30లు అదనంగా వసూలు చేశారు. – ఏవీ అర్జున్, డోలపేట, రాజాం -
క్షయ రహిత భారత్‌కు సహకరించండి
విజయనగరం ఫోర్ట్: క్షయ రహిత భారత్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ర్యాలీని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2025 నాటికి క్షయ వ్యాధిని అంతం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. క్షయ రోగులు అందరూ పూర్తి కాలం మందులు వాడితే వ్యాధి నయం అవుతుందని తెలిపారు. క్షయ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న కఫం పరీక్ష కేంద్రంలో పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన వైద్యసిబ్బందికి ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేశారు. సమావేశంలో డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి, ఎన్‌సీడీపీఓ డాక్టర్ సుబ్రమ్మణ్యం, డీఎంఓ మణి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి -
అకాల వర్షం.. రైతుకు నష్టం
విజయనగరం జిల్లాలో పలు చోట్ల ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజాము వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నువ్వు, అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లింది. పొలాల్లో నూర్పిడిచేసిన ధాన్యం, మొక్కజొన్న పిక్కలు తడిసిముద్దయ్యాయి. వాటిని అరబెట్టే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. అకాల వర్షం నష్టం మిగిల్చిందంటూ కొందరు రైతులు వాపోతుండగా, వేసవి దుక్కులకు ఉపకరిస్తుందని మరికొందరు చెబుతున్నారు. – రాజాం/రేగిడి -
మధ్యవర్తిత్వం ద్వారా సులభంగా కేసుల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కల్యాణచక్రవర్తి విజయనగరం లీగల్: మధ్యవర్తిత్వంలోని మెలకువలను నేర్చుకోవడం ద్వారా కేసులను చాలా సులభంగా పరిష్కరించవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికల్యాణచక్రవర్తి అన్నారు. ఈ మేరకు సోమవారం 40 గంటల మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నిర్వహించిన శిక్షణలో న్యాయవాదులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మధ్యవర్తిత్వంలో భాగంగా శిక్షణ ఇవ్వడానికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన రత్నతార, కేరళ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ సిరాజ్ ఎంపికై న న్యాయవాదులకు శిక్షణ ఇస్తారన్నారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వ్యాజ్యాలను మానవతా దృక్పథంతో పరిశీలించి ఉభయ పార్టీల ద్వారానే పరిష్కారం రాబట్టాలని న్యాయవాదులకు సూచించారు. ఈ మధ్యవర్తిత్వం వల్ల ఉభయ పార్టీలకు సమయం డబ్బు వృథా కాకుండా ఉంటాయని, అదేవిధంగా కోర్టులో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకు పరిష్కారం చూపంవచ్చన్నారు. వ్యాజ్యాల పరిష్కారానికి రాజీ కూడా ఒక మార్గమేనని ఆయన స్పష్టం చేశారు. శిక్షణ పొందుతున్న ఉమ్మడి జిల్లాల న్యాయవాదులను శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. శిక్షణను అందిస్తున్న మాస్టర్ ట్రైనీస్‌తో మాట్లాడి శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి బీహెచ్‌వీ లక్ష్మీకుమారి పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 275 అర్జీలు
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 275 వినతులు అందాయి. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 117, దేవాదాయ శాఖకు 46, పోలీస్‌శాఖకు 31, డీఆర్డీఏకు 19, జిల్లా పంచాయతీ రాజ్ శాఖకు 10, విద్యుత్ పంపిణీ సంస్థకు 5, వైద్యారోగ్యశాఖకు ఐదు, పాఠశాల విద్యాశాఖకు 4 చొప్పున వినతులు అందగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవిగా నమోదయ్యాయి. వినతులను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళి, ప్రమీలా గాంధీ స్వీకరించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 42 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు ఎస్పీ వకుల్ జిందల్ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీవకుల్ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, వాటి పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ పీజీఆర్ఎస్లో మొత్తం 42 ఫిర్యాదులు ఆయన స్వీకరించారు. ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 15, కుటుంబ కలహాలకు సంబంధించి 4, మోసాలకు పాల్పడినట్లు 8, ఇతర అంశాలపై 15 ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీ ఆర్బీ సీఐ శంకర్రావు, ఎస్బీ సీఐలు పాల్గొన్నారు. -
పంచాయతీరాజ్‌లో.. బిల్లుల పెండింగ్
బొబ్బిలి మండలం భోజరాజపురం వద్ద నత్తనడకన సాగుతున్న వంతెన పనులు ఈ వంతెన చూశారా? బొబ్బిలి మండలం భోజరాజపురం వద్ద వేగావతి నదిపై గత ప్రభుత్వం తలపెట్టిన వంతెన ఇది. దీని నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. రూ.2 కోట్ల మేరకు బిల్లులు కూడా చెల్లించింది. ఇంతలో ప్రభుత్వం మారింది. కాంట్రాక్టర్ మాత్రం పనులు కొనసాగిస్తూ పిల్లర్ల వరకు నిర్మాణం పూర్తిచేశారు. రూ.5 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవడం లేదు. పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు లేకపోవడంతో పనులు నత్తనడకగా సాగుతున్నాయి. వంతెన నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందోనన్న ఆందోళన స్థానిక ప్రజల్లో నెలకొంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం/బొబ్బిలి: కొత్త ప్రభుత్వం వచ్చాక జిల్లాలో అభివృద్ధి పనులు పడకేశాయి. రోడ్లు, వంతెన నిర్మాణాలను పూర్తిచేస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడమే తప్ప పనుల్లో పురోగతి కనిపించడం లేదు. దీనంతటికీ బిల్లుల చెల్లింపులో జాప్యమే కారణంగా కనిపిస్తోంది. గత వర్షాకాలంలో పాడైన రోడ్లను ముందుగా మరమ్మతులు చేస్తామని చెప్పి సగం రహదారులను మొదటి విడతగా ఎంచుకున్న కూటమి ప్రభుత్వం వాటితోనే మమ అనిపించింది. ఆ పనులను సగంలోనే నిలిపివేసింది. వాటికి కూడా పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించలేదు. పై పెచ్చు రెండో విడత పనులు కూడా నిలిచిపోయాయి. రోడ్ల బిల్లులు రూ.49 కోట్ల మేర పెండింగ్ కూటమి ప్రభుత్వం వచ్చాక పంచాయతీ రాజ్ రోడ్ల బిల్లులు పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉండిపోయాయి. బొబ్బిలి, తెర్లాం, బాడంగి, రామభద్రపురం ప్రాంతాల్లో 22 రోడ్ల పనులు చేస్తామని ప్రకటించగా కేవలం కొన్నిరోడ్లను మాత్రమే పూర్తిచేసింది. రూ.63 కోట్ల విలువైన పనులకు 22 రోడ్లలో 4 ప్రారంభానికి నోచుకోలేదు. మిగతా రహదారులు నిర్మాణాల కోసం పనులు ప్రారంభించినా బిల్లుల చెల్లింపు జరగక నిలిచిపోయాయి. రూ.63 కోట్ల బిల్లులకు రూ.14 కోట్లు మాత్రమే బిల్లుల చెల్లింపులు జరగ్గా మిగతా రూ.49 కోట్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. కాంట్రాక్టర్, రోడ్డుపై వాహనాలు నడిపిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఆర్‌అండ్‌బీలో కొద్దిపాటి మరమ్మతులు పనులు చేపట్టి ప్రచారం చేసుకున్న కూటమి ప్రభుత్వం పెండింగ్ బిల్లులను మాత్రం చెల్లించేందుకు ముందుకు రాకపోవడంపై కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. ఆందోళనకు దిగుతు న్నారు. అధికారులు సైతం కాంట్రాక్టర్లకు చెప్పి పనులు చేయించలేకపోతున్నారు. ప్రజలను రోడ్ల కష్టాలు వీడడం లేదు. రోడ్లు, వంతెనలకు బిల్లుల అవ్వక కాంట్రాక్లర్ల అవస్థలు పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామంటూ ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం -
ఆలయంలో దేవుడి విగ్రహాల ధ్వంసం
● పునర్నిర్మాణ దశలో దుండగుల దుశ్చర్య ● బోడసింగిపేటలో ఘటన ● దుర్గాదేవి, గరుత్మంతుడు విగ్రహాల ధ్వంసం బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామంలో జాతీయ రహదారి 26కు ఆనుకోని పునర్నిర్మాణంలో ఉన్న సీతారామ ఆలయంలో దేవుడి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామంలో గతంలో ఉన్న ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని పునర్నిర్మించేందుకు గ్రామస్తులంతా ఐక్యంగా శ్రీకారం చుట్టారు. పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. పెద్దాపురానికి చెందిన శిల్ప కళాకారులు ఆలయ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇంతలోనే ఆలయం వెలుపల గోడకు ఆనుకోని నిర్మాణ తుది దశలో ఉన్న దుర్గాదేవి విగ్రహంతో పాటు గరుత్మంతుడు విగ్రహాల చేతులు, కాళ్లను దుండగలు ధ్వంసం చేశారు. రోజూలాగే ఆదివారం ఉదయం పనులకు వచ్చిన శిల్ప కళాకారులు విగ్రహాలు ధ్వంసం కావడం చూసి గ్రామ పెద్దలకు విష యం తెలిపారు. సర్పంచ్ కోరాడ జానకీరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ యు.మహేష్ ఆలయం వద్దకు చేరుకొని ధ్వంసమైన విగ్రహాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా గ్రామానికి ఆనుకొని రెండు మద్యం దుకాణాలు ఉండడంతో మందుబాబులే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా విగ్రహాల ధ్వంసం విషయం తెలుసుకున్న రాష్ట్ర చిన్న, మధ్య తరహ, ఎన్ఆర్ఐ వ్యవహరాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆలయానికి వచ్చి పరిశీలించారు. -
ఈ వేడుక ఆదర్శం
● చెప్పడం కాదు.. చేసి చూపించారు... ● కొబ్బరి కమ్మలతో చలువ పందిళ్లు ● అరటి ఆకుల్లో భోజనాలు ● మట్టి గ్లాసుల్లో తాగునీరు చీపురుపల్లి: మారిన ఆధునిక సమాజంలో సాంప్రదాయ పద్ధతుల నడుమ నూతన వస్త్రాలంకరణ మహోత్సవం జరిపి మిరియాల వారి కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచింది. శభాష్ అనిపించుకుంది. వివరాల్లోకి వెళ్తే... చీపురుపల్లి పట్టణంలోని వంగపల్లిపేటకు చెందిన మిరియాల రాంబాబు, అనురాధ దంపతుల ఇంట నూతన వస్త్రాలంకరణ మహోత్సవం పేరిట ఆదివారం ఓ కార్యక్రమం నిర్వహించారు. బంధువులు, స్నేహితులను వందల సంఖ్యలో పిలిచారు. అందరూ వచ్చారు.. అక్కడ ఏర్పాట్లు చూసి ఒకింత మెచ్చుకున్నారు. వేడుకలు ఇలాగే చేస్తే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని చర్చించుకున్నారు. వేడుకలో కొబ్బరి కమ్మలతో చలువ పందిళ్లు వేశారు. అరటి ఆకుల్లో భోజనాలు పెట్టారు. మట్టి గ్లాసుల్లో నీరు పోశారు. ఆహ్వానాన్ని కూడా ఓ వస్త్రంపై రాసి ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వద్దు... కాగితం సంచులు ముద్దు... అంటూ నిత్యం ప్రకటనలిస్తూ.. పత్రికలకు ఫొజులిచ్చే వారికి కళ్లు తెరిచేలా ఎక్కడా ప్లాస్టిక్ వస్తువును వాడకుండా వేడుక నిర్వహించి అందరి మన్ననలు పొందారు. ఎక్కడా ప్లాస్టిక్ కనిపించకుండా చేయడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. దశాబ్దాల కిందట జరిగిన వేడుకలు గుర్తుకొచ్చేలా సాంప్రదాయంగా చేసి అందరినీ ఆకట్టుకున్నారు. -
మే 1 నుంచి సాలూరు – విశాఖ పాసింజర్ రైలు!
బొబ్బిలి: సాలూరు – విశాఖ పాసింజర్ రైలు మే 1 నుంచి నడపనున్నట్టు రైల్వే వర్గాల ద్వారా తెలిసింది. ఈ రైలు రోజుకు రెండు సార్లు విశాఖ, సాలూరు మధ్య బొబ్బిలి జంక్షన్ మీదుగా నడవనుంది. చాలా ఏళ్లుగా ఇక్కడ ఉన్న బొబ్బిలి రైల్ బస్సు కొన్ని ట్రిప్పులను బొబ్బిలి – సాలూరు మధ్య నడిపేవారు. నిత్యం కిక్కిరిసే ప్రయాణికులతో నడుస్తున్న ఈ రైల్‌బస్ కరోనా కారణంగా రైల్వే అధికారులు నిలిపివేశారు. అనంతరం సాధారణ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌లు, గూడ్స్ రైళ్లు పట్టాలెక్కినా రైల్‌బస్‌ను రైల్వే వర్గాలు నడపలేదు. కొన్నాళ్ల కిందట రైల్వే వర్గాలు విశాఖ, సాలూరు మధ్య బొబ్బిలి మీదుగా రైలును నడపనున్నట్టు ప్రకటించాయి. దీనికోసం రైలు ట్రాక్‌ను పటిష్టపరిచారు కూడా! చివరకి మళ్లీ వాయిదా పడింది. అయితే ఈ రైలును ఈ ఏడాది మే 1 నుంచి నడపనున్నట్టు తెలుస్తోంది. రైల్వే సాంకేతికాఽధికారులు సాలూరు లైన్ వద్ద ఆదివారం గేటును అమర్చారు. బొబ్బిలి నుంచి రైలు బయలుదేరిన వెంటనే రాజ్‌మహల్ వద్ద లెవెల్ క్రాసింగ్ ఉంది. ఇక్కడ క్యాబిన్‌ను కూడా నిర్మించి ఇప్పుడు గేటు కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయమై రైల్వే సాంకేతికాధికారులు మే 1 నుంచి విశాఖ, సాలూరు రైలును నడపనున్నట్టు వెల్లడించారు. ఉపశమనం ఇచ్చిన చిరు జల్లులు భామిని: మండలంలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన చిరు జల్లులతో వాతావరణం కాస్త చల్లబడింది. రోజంతా మబ్బులు పట్టి సాయంకాలానికి చిరు జల్లులు కురవడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో కురిసిన వర్షం వాతావరణాన్ని చల్లబరిచింది. -
ప్రశాంతంగా ఉల్లాస్ పరీక్ష
● 96.6 శాతంతో 46,953 మంది హాజరు విజయనగరం అర్బన్: వయోజనులను అక్షరాస్యులను చేసే ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆదివారం నిర్వహించిన అక్షరాస్యతా పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 1,051 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 48,578 మంది అభ్యాసకులు రాయాల్సి ఉండ గా 96.6శాతంతో 46,953 మంది హాజరయ్యా రు. 1,625 మంది గైర్హాజరయ్యారు. కొత్తవలస, గజపతినగరం, విజయనగరం మండలాలలో 20 మందిలోపు మాత్రమే అభ్యాసకులు హాజరు కాలేదు. అత్యధికంగా 100కు పైగా గైర్హాజరైన మండలాలలో వంగర, ఆర్.ఆమదాలవలస, మెంటాడ ఉన్నాయి. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పరీక్షల నిర్వహణ తనిఖీలో భాగంగా జామి మండలం అట్టాడ ప్రాథమిక పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. వయోజన మహిళల అక్షరాస్యతా సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. వారు పరీక్షలు రాసిన తీరు పరిశీలించారు. ఆయనతో పాటు వయోజన విద్యా శాఖ డీడీ ఎ.సోమేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ ఎ.కల్యాణ్ చక్రవర్తి తదితరులు ఉన్నారు. 28 వరకు నూకాలమ్మ జాతర విజయనగరం టౌన్: నగరంలోని నూకాలమ్మ అమ్మవారి 67వ వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 28 వరకు నిర్వహించనున్నట్టు నూకాలమ్మ యువజన సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు గురాన అయ్యలు, యడ్ల రాజేష్ తెలిపా రు. ఆలయ సాంప్రదాయం ప్రకారం శనివా రం పూజలతో దీన్ని ప్రారంభించారు. ఈ మేర కు ఆలయ ఆవరణలో అమ్మవారి జాతర మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆదివారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్సవాలను ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించేందు కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రతీ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. 28న అమ్మ వారి చల్లదన మహోత్సవం, భారీ ఊరేగింపు ఉంటుందని తెలిపారు. వేసవి దృష్ట్యా జాతరలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వారు తెలిపారు. జాతర మహోత్సవంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వజ్రపు నవీన్‌కుమార్, యడ్ల భాస్కరరావు, రొంగలి శరత్‌బాబు, రాజేంద్రప్రసాద్‌తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. మన ఊరు బడిని మనమే కాపాడుకుందామంటూ.. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టేందుకు.. బడిని కాపాడుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఏకమవ్వాలని పిలుపునిస్తున్నారు. వీరఘట్టం మండలం కిమ్మి, గడగమ్మ గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో మన ఊరి బడిని మనమే కాపాడుకుందాం.. అంటూ నినదించారు. ఆందోళనలో యూటీఎఫ్ నాయకులు ఎస్.మురళీమోహనరావు, మజ్జి పైడిరాజు, అరసాడ చంద్రమోహన్, కర్రి సింహాచలం, బి.వాసుదేవరావు, శీలా గణేష్‌తో పాటు కిమ్మి సర్పంచ్ గురాన రామ్మోహనరావు, ఎస్ఎంసీ చైర్మన్ వాన సంతోషమ్మ, గడగమ్మ సర్పంచ్ వి.సూర్యనారాయణ, ఎస్ఎంసీ వైస్ చైర్మ న్ పి.దయానంద్ పాల్గొన్నారు. – వీరఘట్టం -
ముద్ద లేనట్టే...!
ముద్ర పడకుంటే..మీకు రేషన్ కార్డు ఉందా.. అందులో మీరు సభ్యులేనా.. మరైతే తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సిందే.. వలస వెళ్లినవారు, చిన్నపిల్లలు, మృతులు, 80 ఏళ్లకు పైబడిన వారిని గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం ఈకేవైసీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. సచివాలయాల పరిధిలోని క్లస్టర్ల వారీగా ఈకేవైసీ పెండింగ్ వివరాలను పంపారు. సచివాలయ వీఆర్ఓలు.. డీలర్లను సచివాలయాలకు రప్పించి.. ఈకేవైసీ పెండింగ్ ఉన్న సభ్యుల చేత చేయించేలా చర్యలు చేపట్టారు. ఈ నెలాఖరులోగా ఈకేవైసీ చేయించుకోకుంటే వారికి రేషన్ ఆగిపోతుంది. ● తాజాగా కార్డుదారులకు ఈకేవైసీ ● ఈ నెలాఖరు వరకు గడువు ● సచివాలయాలు, రేషన్ డీలర్ల చుట్టూ ప్రజల ప్రదక్షిణలు తప్పనిపాట్లు రేషన్ కార్డులో ఉన్న వారంతా ఈకేవైసీ నమో దు చేయించుకోవాలని చెబుతున్నారు. అందుకోసం సచివాలయాలు, రేషన్ డీలర్ల చుట్టూ తిరుగుతున్నాం. గతంలో వలంటీర్లు ఇంటికి వచ్చి ప్రక్రియ పూర్తి చేసేవారు. ఇప్పుడు వారి సేవలు నిలిపివేయటంతో ఇబ్బందులు పడుతున్నాం. – కె.సత్యలత, గృహిణి, విజయనగరం రామభద్రపురం/విజయనగరం: అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అందజేస్తాం.. అని గొప్పలు చెప్పిన కూటమి నేత లు ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు పక్కనపెడితే గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అటకెక్కించడానికి శ్రీకారం చుట్టి పక్కాగా ముందు కు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే నిత్యావసర సరుకుల పంపిణీలో జరుగుతున్న వ్యత్యాసాలు, అవకతవకలు నివారించేందుకు అంటూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ నెలాఖరులోపు కార్డులో ఉన్న కుటుంబ సభ్యులంతా విధిగా ఈకేవైసీ చేయించుకోకపోతే ఏప్రిల్ నెల సరుకులు అందవని రెవెన్యూ అధికారులు చెబుతుండడంతో కార్డుదారుల్లో ఆందోళన నెలకొంది. రేషన్ నిలిపేస్తారో... లేక రేషన్‌కార్డే రద్దు చేస్తారోనని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 5,81,668 రేషన్ కార్డులున్నాయి. వీరికి ప్రతి నెలా 90 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరా అవుతుంది. అలాగే చక్కెర 3.50 మెట్రిక్ టన్నులు, 581 మెట్రిక్ టన్నుల వరకు కందిపప్పు సరఫరా అవుతోంది. ఇంతే కాకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కార్డు ఆధారంగా ఆరోగ్యశ్రీ సేవలు పొందేందుకు అర్హులు. దీని ఫలితంగా ఏటా వైద్యసేవల పరంగా రూ.25 లక్షల వరకు వైద్య సేవలు కూడా పొందేందుకు అవకాశం ఉంది. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలకు స్కాలర్షిప్పులు, ఉచిత విద్య, పేద ప్రజలు రాయితీపై ఇస్తున్న రుణాలు పొందుతున్నారు. ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు కీలకం కావడంతో లక్షలాది మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తుంటే.. కూటమి ప్రభుత్వం ఆ పని చేయకపోగా ఉన్న కార్డులను మంగళం పాడేందుకు సర్వేలు చేపడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామ, జాతీయ సమాచార సంస్థ(ఎన్ఐసీ) ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్‌ను నవీకరించి వార్డు, సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ పాస్ పరికరాల ద్వారా ఈకేవైసీని నమోదు ప్రక్రియ ప్రారంభించారు. ఐదేళ్ల లోపు చిన్న పిల్లలు మినహా మిగిలిన అబ్ధిదారులందరూ ఈకేవైసీ ప్రక్రియను ఈ నెల 31లోపు పూర్తి చేసుకోవాలి. లేకపోతే రేషన్ కార్డుదారులకు భవిష్యత్‌లో రేషన్ సరుకులతో పాటు మిగిలిన సంక్షేమ పథకాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఎదురవుతున్న సమస్యలు.. ఐదేళ్లలోపు పిల్లలు, ఐదేళ్లకు పైబడి 12–13 ఏళ్లలో పు పిల్లలు, 70 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఈకై వైసీ నమోదు కావడం లేదు. సర్వర్ సమస్య వేధిస్తోంద ని సచివాలయ సిబ్బంది, డీలర్లు చెబుతున్నారు.ఎక్కడైనా ఈకేవైసీ నమోదు సొంత గ్రామాలకు దూరంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా, ఏ డీలర్ వద్దనైనా ఈకేవైసీ చేసుకోవ చ్చు. రేషన్ దుకాణాల్లోని ఈ పాస్ యంత్రాల్లో నే నమోదు చేసుకోవాలి. డీలర్‌కు కార్డు సంఖ్య తెలియజేస్తే వేలిముద్ర వేయించుకుని నమోదు చేస్తారు. అప్పుడే సదరు వ్యక్తి కార్డులో సభ్యుడి గా ఉన్నట్లు గుర్తింపు లభిస్తుంది. కార్డులో ఉన్న చిన్నారులకు సంబంధించి ఆధార్ కేంద్రాలకు వెళ్లి అప్డేట్ చేస్తే ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఈకేవైసీ నమోదు చేయించుకోని వారికి బియ్యం సరఫరా జరగదు. – రెడ్డి సాయికృష్ణ, సీఎస్‌డీటీ, బొబ్బిలి -
లారీ ఢీకొని భార్యాభర్తల మృతి
సాలూరు: మండలంలోని నెలిపర్తి పంచాయతీ వంగర గుడ్డివలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు సాలూరు పట్టణంలో లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వంగరగుడ్డివలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు మజ్జి రాము(51), గురిబారి(47)లు సాలూరు పట్టణానికి వచ్చి సొంత పనులు ముగించుకుని ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో పట్టణంలో బైపాస్ రోడ్డు వై జంక్షన్ వద్ద వారి బైక్‌ను ఒడిశా నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.కాగా ఆ భార్యాభర్తలు విజయవాడలో వలస పనులకు వెళ్లి ఇటీవలే తమ స్వగ్రామానికి వచ్చినట్లు తెలియవస్తోంది. -
ఘనంగా ద్విగళ అష్టావధానం
పాలకొండ: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం శ్రీ సూర్యచంద్ర కళాసాహితి ఆధ్వర్యంలో ద్విగళ అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విక్రాంత్ పాల్గొని అవధాని బంకుపల్లి రమేష్ శర్మ, అవధాన చంద్రమస శతావధాని చంద్రశేఖర శర్మ, అవధాన చంద్రమస శతావధాని సాయికుమార్ శర్మలను సన్మానించారు. విశ్వావసు నామసంవత్సర ఉగాధి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కణపాక చౌదరినాయుడు, సింహచలాచార్య, బౌరోతు శంకరరావు, దిలీప్‌కుమార్, సాహితి శ్రీనివాసరావు, వెలమల మన్మథరావు, కడగల రమణ, గారాల సూర్యం తదితరులు పాల్గొన్నారు. ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో రజతంవిజయనగరం: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన కిల్లక లలిత సిల్వర్ మెడల్ కై వసం చేసుకుని జిల్లా పేరు మరోసారి మారు మోగించిందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 1200 మంది వరకు పారా క్రీడాకారులు పాల్గొన్నారని, టి–11 కేటగిరికి సంబంధించి 400 మీటర్ల పరుగు పందెంలో గట్టి పోటీ నెలకొన్నప్పటికీ లలిత అసామాన్య ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించడం అభినందనీయమని, ఇది జాతీయస్థాయిలో జిల్లాకు దక్కిన గౌరవమన్నారు. లలిత ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, రా ష్ట్రకార్యదర్శి వి. రామస్వామి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, కలెక్టర్ డాక్టర్. బీఆర్. అంబేడ్కర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావులు అభినందించారని తెలియజేశారు. సీనియార్టీ జాబితా తయారీకి ఏకీకృత విధానం తప్పనిసరిపార్వతీపురంటౌన్: వివిధ జిల్లాలకు చెందిన విద్యాశాఖాధికారులు సీనియార్టీని రూపొందించడంతో ఒకే నిర్దిష్ట నియమాలు అనుసరించకపోవడం వల్ల అనేక పొరపాట్లు జరుగుతున్నాయని ఏపీటీఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి ఎన్. బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల ప్రకారం రూపొందించారని, బదిలీలకు రిజర్వేషన్లు వర్తించవు కాబట్టి బదిలీలు కోరుకునే ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బదిలీల్లో వ్యక్తిగతంగా ప్రిఫరెన్షియల్ కేటగిరీ, పనిచేసే పాఠశాల హెచ్ఆర్ఏ, పూర్తి సర్వీసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పాయింట్లు కేటాయిస్తారన్నారు. బదిలీల పాయింట్లు సమానంగా వస్తే వయస్సును బట్టి సీనియార్టీ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. వివిధ జిల్లాల విద్యాశాఖాధికారులు సీనియార్టీ రూపొందించడంలో ఒకే నిర్దిష్ట నియమాలు అనుసరించకపోవడం వల్ల పొరపాట్లు జరుగుతున్నాయని, వాటిని సవరించే విధంగా స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సంగీత, సాహిత్యాలతో పైడితల్లికి ఘనంగా నీరాజనం విజయనగరం టౌన్: శ్రీ పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం 27వ వార్షికోత్సవాన్ని ఏప్రిల్ 22న గురజాడ కళాభారతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సంస్థ వ్యవస్ధాపకుడు ఆర్.సూర్యపాత్రో పేర్కొన్నా రు. ఈ మేరకు స్థానిక సంఘం కార్యాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగీత, సాహి త్య కార్యక్రమాలతో పైడితల్లి అమ్మవారికి ఘనంగా నీరాజనాలర్పిస్తూ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలి పారు. అదే రోజు అమ్మవారి భక్తిగీతాలపపై భజన సీడీలను ఆవిష్కరిస్తామన్నారు. సంస్థ గౌరవాధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త నాలుగెస్సుల రాజు మాట్లాడుతూ పైడిమాంబ కళానికేతన్ సంస్ధ 27వ వార్షికోత్సవానికి ప్రముఖులతో పాటు, పలువురు పెద్దలు హాజరుకానున్నారన్నారు. ఆ రోజు వేకువజామునుంచి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించే సభా కార్యక్రమంలో పలువురిని సముచితరీతిలో సత్కరిస్తామన్నారు. కార్యక్రమంలో సంస్ధ ప్రతినిధులు తాడిరాజు, తదితరులు పాల్గొన్నారు. శ్రీపైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం వ్యవస్ధాపకుడు పాత్రో -
పార్వతీపురం మన్యం జిల్లాలో 1451 క్షయ కేసులు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో 20 పంచాయతీలను క్షయ రహిత పంచాయతీలుగా ఎంపిక చేసి జిల్లాలో 49 డిజిగ్నేటేడ్ మైక్రోస్కోప్ సెంటర్లు, 7 టీబీ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 1451 మందికి క్షయ పాజిటివ్‌గా గుర్తించారు. వారిలో 1117 మందికి చికిత్స పూర్తి చేశారు. జనవరి 2025 నుంచి ఇప్పటివరకు 507 మందిని గుర్తించి వారికి చికిత్స అందించారు. 700 మంది పౌష్టికాహారం కిట్లుప్రస్తుతం జిల్లాలో ఏడు వందల మంది పౌష్టికాహారం కిట్లు పొందుతున్నారని జిల్లా క్షయ నియంత్ర అధికారి డాక్టర్ ఎం.వినోద్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారిలో కనీసం 10 నుంచి 15 శాతం మందికి కఫం పరీక్షలు చేయాలని ఆదేశించామని చెప్పారు. ఏఎన్ఎం, అశ కార్యకర్తలు క్షయరోగులను పరామర్శించి, మందులు వేసుకుంటున్నారో లేదో గమనించడమే కాకుండా ప్రతి రెండు నెలలకు ఒకసారి ‘కఫం’ పరీక్షకు పంపించాలని సూచించినట్లు చెప్పారు. -
వానర సైన్యం!
వామ్మో..టెక్కలి : గూడేం.. టెక్కలి మండలంలోని ఈ గ్రామం పేరు వినగానే మొదటగా గుర్తుకు వచ్చేది కార్గిల్ పోరాట యోధులే. పలువురు సైనికులు అప్పటి యుద్ధంలో పాల్గొని గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. ఇదే గ్రామం మామిడి పంటకు సైతం ప్రసిద్ధి. ఇక్కడి మామిడిపండ్లకు ఇతర రాష్ట్రాల్లో ఎంతో గిరాకీ. అటువంటి గూడేం గ్రామస్తులకు ఇప్పుడు వానరాల గుంపు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు గానీ గుంపులుగా సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. మామిడి పంటలు, మునగ, మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయి. ఇళ్లల్లో చొరబడి అకస్మాత్తుగా దాడులకు తెగబడుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉండటంతో గ్రామస్తులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. ఏటా మామిడి పంటతో లాభాలను చవిచూస్తున్న తమకు ఈ ఏడాది ఈ కోతుల బెడద వల్ల ఇప్పటికే తీవ్రమైన నష్టం వాటిల్లిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖాధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా అటవీ శాఖాధికారులు స్పందించి గ్రామంలో కోతుల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు. బెంబేలెత్తిపోతున్న గూడేం గ్రామస్తులు గుంపులుగా తిరుగుతున్న కోతులు మామిడి, మునగ, మొక్కజొన్న పంటలు నాశనం -
అప్రమత్తంగా లేకుంటే అక్షయం
● క్షయ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే కఫం పరీక్ష చేయించాలి ● 60 ఏళ్లు దాటిన వారు, పొగ తాగేవారికి పరీక్ష అవసరం ● 100 రోజుల క్షయ కార్యక్రమంలో 861 కొత్త కేసులు గుర్తింపు ● నేడు ప్రపంచ క్షయ దినోత్సవంవిజయనగరం ఫోర్ట్: ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందే అంటువ్యాధి క్షయ. క్షయ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. దీని వల్ల వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సోమవారం ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. క్షయ వ్యాధిని గుర్తించి 6 నెలల పాటు మందులు వాడడం ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. అయితే వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అటువంటి వారికి ప్రాణాలు మీదికి వస్తుంది. తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. వ్యాధి లక్షణాలు: రెండు వారాలకు మించి దగ్గు, రెండు వారాలకు మించిన జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతీలో నొప్పి, కఫంలో రక్తపు జీరలు రావడం, రాత్రి పూట చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆలసటగా ఉండటం, మెడ వద్ద వాపులు క్షయ వ్యాధి లక్షణాలు. మైక్రో బాక్టీరియా చుబర్‌క్యూలోసిస్ అనే బాక్టీరియా వల్ల గాలి ద్వారా ఈ వ్యాప్తి చెందుతుంది. రోగి దగ్గినప్పుడు ఉమ్మి తుంపర్ల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: క్షయ వ్యాధి రాకుండా ఉండాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, సురక్షతం కాని లైంగిక సంబంధాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. క్షయ వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే మందులను పూర్తి కాలం పాటు వాడాలి. సాధారణ క్షయ వ్యాధికి 6 నెలల పాటు, మధ్యలో మానివేసి తిరిగి ప్రారంభిస్తే 8 నెలల పాటు, మొండి క్షయ వ్యాధికి రెండేళ్ల పాటు మందులు వాడాలి. అలా కాకుండా మందులను మధ్యలో మానివేస్తే రోగ నిరోధక శక్తి క్షీణించి మృత్యవాత పడే ప్రమాదం ఉంది.క్షయ పరీక్ష చేసుకోవాల్సిన వారు: 60 ఏళ్లు దాటిన వారు, సుగర్ వ్యాధి గ్రస్తులు, మద్యం, పొగతాగేవారు. గతంలో క్షయ వ్యాధి మందులు వాడిన వారు, క్షయ వ్యాధి మందులు వాడిన వారి కుటుంబసభ్యులు, ఎత్తుకు తగ్గ బరువు లేని వారు, క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. 861 కేసులు గుర్తింపు: జిల్లాలో 100 రోజుల టీబీ కార్యక్రమాన్ని 2024 డిసెంబర్ 7 నుంచి మార్చి 23 వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5,59,899 మందిని స్క్రీనింగ్ చేసి 43,413 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. 33, 637మందికి ఎక్స్‌రే తీయగా 861 క్షయ కేసులు నమోదయ్యాయి. -
గురుకులాలు, కళాశాలల్లో సీసీ కెమెరాలు
● సజావుగా పదోతరగతి పరీక్షలు ● గురుకుకాల రాష్ట్ర కార్యదర్శి వీఎన్ మస్తానయ్యబొబ్బిలి: రాష్ట్రంలోని 50 గురుకులాలు, మరో పది కళాశాలల్లో సీసీ కెమెరాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు గురుకులాల రాష్ట్ర కార్యదర్శి వీఎన్ మస్తానయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన బొబ్బిలిలోని గురుకులాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో గురుకులానికీ 8 చొప్పున మొత్తం 480 కెమెరాలను అమర్చేందుకు సంబంధిత వ్యక్తులతో మాట్లాడామని, త్వరలోనే కెమెరాలను అమర్చనున్నట్లు చెప్పారు. గురుకులాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల పర్యవేక్షణ సులువవుతుందన్నారు. అన్ని విభాగాలను అనుసంధానం చేస్తూ సీసీ కెమెరాల ద్వారా ప్రిన్సిపాల్స్, పీఈటీ, పీడీలు విద్యార్థులకు క్రమశిక్షణను మరింత మెరుగుపర్చేందుకు వీలవుతుందన్నారు. బొబ్బిలి గురుకులానికి ప్రహరీ, కంచెల నిర్మాణం ఒక కొలిక్కి వచ్చిందన్నారు. ఇప్పటికే ప్రహరీ దాదాపు పూర్తి కావచ్చిందని, త్వరలో మిగిలిన కొద్దిపాటి భాగం కూడా దాతల సాయంతో నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. మన బడి నాడు–నేడులో భాగంగా కొన్ని భవనాలు నిర్మించగా మిగిలిన పాత భవనాలను తొలగించాల్సి ఉందన్నారు. అలాగే గురుకులాల్లో రెసిడెన్షియల్ అనే పదానికి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా స్థానికంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకోసం ఇక్కడ సిబ్బంది నివాస గృహాల నిర్మాణం కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నిధుల సమస్య ఉన్న కారణంగా పాత డార్మిటరీలను ఆధునికీకరించి కొద్దిమంది సిబ్బందినైనా స్థానికంగా ఉండేందుకు వీలుగా నిర్మాణాలు చేయనున్నామని తెలిపారు. దీనిపై అక్కడికక్కడే సంబంధిత ఈఈతో ఫోన్లో మాట్లాడారు. కళాశాలగా ఎచ్చెర్ల గురుకులం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల సమీపంలోని ఎస్ఎం పురంలో ఉన్న గురుకులాన్ని కళాశాలగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదించామని చెప్పారు. బొబ్బిలి గురుకులాన్ని కూడా చాలా సంవత్సరాలుగా కళాశాలగా మార్చాలన్న డిమాండ్, ప్రతిపాదనలు ఉన్నందున, ఇక్కడి కమిటీలు, స్థానికులు మంత్రి, ప్రజాప్రతినిధుల ద్వారా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఎం పురం వద్ద ఉన్న గురుకులానికి చెందిన ప్రభుత్వ భూమి ఇప్పుడు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామన్నారు. మరో 11 ఎకరాలు మిగిలి ఉన్నందున దానిని సంరక్షించుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. గురుకులాల్లో సిబ్బంది కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ప్రస్తుతం గురుకులాల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు తాను పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నానని, పరీక్షలు ప్రశాంతంగానే జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
వాగ్దేవి సమారాధనం సంస్థ వార్షికోత్సవానికి సర్వం సిద్ధం
● సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి విజయనగరం టౌన్: విద్యలనగరం విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దివ్యాశీస్సులతో సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణకు వేద సంస్కృతాంధ్ర భాషలలో ఎవరైతే స్థానికంగా విశేష కృషిచేసి ఉంటారో అటువంటి పెద్దలను సముచిత రీతిలో సంస్థ వార్షికోత్సవం రోజున సత్కరించుకునేందుకు ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు వాగ్దేవి సమారాధనం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ధర్మపురి రోడ్డులో ఉన్న సంస్థ ఆవరణలో ఆదివా రం వివరాలు వెల్లడించారు. ఉగాది పర్వదినం, సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ దార్లపూడి శివరామకృష్ణకు వాగ్దేవి సాహిత్య స్రష్ట అనే పురస్కారంతో, డాక్టర్ బొంతు గురవయ్యకు వాగ్దేవి వరపుత్ర పురస్కారంతో సత్కరించుకుంటున్నామని తెలిపారు. సంస్ధ ప్రధానకార్యదర్శి డాక్టర్ నాగమల్లిక మా ట్లాడుతూ గురజాడ గ్రంథాలయంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది రోజున ఉద యం 10 గంటల నుంచి నిర్వహించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాహిత్య పర్యవేక్షకులు సాహితి, రుగ్వేదాచార్యులు రాంభట్ల సన్యాసిరాజు, శంబర కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఫెన్సింగ్ పోటీల్లో కానిస్టేబుల్‌కు కాంస్యం
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్‌శాఖలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో జరిగిన 1వ ఆలిండియా పోలీస్ క్లస్టర్ పోటీల్లో కాంస్యపతకం సాధించిన పీసీ బీఎస్ ఎన్ మూర్తికి ఎస్పీ వకుల్ జిందల్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని ట్రాఫిక్ సీఐ సూరినాయుడుతో పాటు కానిస్టేబుల్ మూర్తి శుక్రవారం కలిశారు. జిల్లాకు చెందిన బీఎస్ఎన్ మూర్తి పోలీస్ శాఖ నిర్వహించిన జాతీయపోటీల్లో ఫెన్సింగ్ విభాగంలో రాష్ట్ర పోలీసు జట్టు తరఫున పాల్గొని కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతకం సాధించిన కానిస్టేబుల్ మూర్తిని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారని ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా తెలిపారు. పతకాలు సాధించిన పోలీస్‌సిబ్బందికి త్వరలో ప్రోత్సాహక నగదు బహుమతిని, అదనంగా వార్షిక ఇంక్రిమెంట్ అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు పాల్గొన్నారు. అభినందించిన ఎస్పీ వకుల్ జిందల్ -
రైల్వే ఉద్యోగుల నిరసన
విజయనగరం టౌన్: ఈస్ట్‌కోస్ట్ రైల్వేశ్రామిక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వేస్టేషన్ ఆవరణలో ఉద్యోగులు, యూనియన్ నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిజనల్ కోఆర్డినేటర్ పీవీ.మౌళీశ్వరరావు మాట్లాడుతూ పెరిగిన ట్రాఫిక్ కారణంగా అన్ని ఎల్సీ గేట్లకు 8 గంటల రోస్టర్‌ను అమలుచేయాలన్నారు. ట్రాక్ మెయింటైనర్లకు సైకిల్ అలవెన్స్చెల్లింపును నిర్ధారించాలని, రన్‌ఓవర్ కేసుల్లో స్టేషన్ మాస్టర్లకు మెమోలు ఇచ్చే ట్రాక్ మెయింటైనర్లను నివారించాలని బదులుగా సీయూజీ ఫోన్ల ద్వారా సంబంధిత కీమాన్, ట్రాక్ మాన్ల నుంచి వివరాలను పొందడంపై పీడబ్ల్యూవే సూపర్ వైజర్ల ద్వారా మెమోలను అందించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆక్యుపెన్సీని పెంచేందుకు క్వార్టర్స్ మెరుగైన నిర్వహణ చేపట్టాలని కోరారు. సేఫ్టీ కేటగిరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు రిస్క్, హార్ట్షిప్ అలవెన్స్ అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శ్రామిక్ కాంగ్రెస్ విజయనగరం బ్రాంచ్ కార్యదర్శి బి.సత్యనారాయణ, శ్రీకాకుళం బ్రాంచ్ కార్యదర్శి ఎస్.దంతేశ్వరరావు, సెంట్రల్ ఆఫీస్ బేరర్ ఎం.అనిల్ కుమార్, బి.శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. -
నెలాఖరుకు పథకాల మంజూరు
విజయనగరం అర్బన్: బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు ఈ నెలాఖరులోగా పథకాలను మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. వివిధ పథకాలు, వాటి మంజూరులో బ్యాంకుల పరిస్థితిని ఎల్డీఎం వీవీరామణమూర్తి వివరించారు. నాబార్డ్ డీడీఎం నాగార్జున మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (పీఎల్‌సీపీ)ను వివరించారు. సుమారు రూ.10,650.32 కోట్ల అంచనాతో ఈ రుణ ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. దీని ఆధారంగానే జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికను కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, వ్యవసాయ శాఖ జేడీ వీటీరామారావు, పశుసంవర్ధకశాఖ డాక్టర్ వైవీరమణ, జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, మెప్మా పీడీ చిట్టిరాజు, ఉద్యాన, మత్సశాఖల డీడీలు జమదగ్ని, నిర్మలాకుమారి, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు వెంకటేశ్వరరావు, పెంటోజీరావు, వివిధ బ్యాంకుల అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అంబేడ్కర్ -
మానాపురం ఆర్ఓబీ కాంట్రాక్టర్‌కు నోటీసులు
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం అర్బన్: జిల్లాలోని మానాపురం ఆర్ఓబీ నిర్మాణం పనుల్లో జాప్యంపై కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. నోటీసు అందిన రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన చాంబర్లో ఆర్అండ్బీ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఓబీ 2021, జూన్ నెలలో ప్రారంభమైందని, ఒప్పందం ప్రకారం జనవరి 2023కు పూర్తిచేయాల్సి ఉండగా, ఇప్పటికే 780 రోజులు ఆలస్యమైందన్నారు. నిర్మాణంలో జాప్యం వల్ల ట్రాఫిక్ సమస్యతోపాటు ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. ఇంతవరకు 83.56 శాతం పనులు పూర్తయ్యాయని, 56.42 శాతం చెల్లింపులు జరిగాయని తెలిపారు. అగ్రిమెంట్ విలువ రూ.20.8 కోట్లు కాగా రూ.17.268 కోట్ల విలువైన పనులు జరిగాయని, మిగిలిన పనుల విలువ రూ.3.532 కోట్లు వరకు ఉందన్నారు. పనులు పూర్తి చేస్తే నిధులు చెల్లింపునకు ఎలాంటి ఆటంకం లేదన్నారు. ప్రజలకు అత్యవసరమైన వంతెన నిర్మాణంలో అలసత్వం తగదన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. తాడి ప్రకాష్‌కు పతంజలి పురస్కారం విజయనగరం గంటస్తంభం: ప్రముఖ పాత్రికేయుడు, సినీ మాటల రచయిత కె.ఎన్.వై.పతంజలి 73వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయుడు, పతంజలితో పాతికేళ్ల పాటు కలిసి పనిచేసిన రచయిత తాడి ప్రకాష్‌కు పతంజలి పురస్కారం అందజేయనున్నట్టు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తెలిపారు. గురజాడ అప్పారావు గృహంలో వేదిక ప్రతినిధులతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఏటా పతంజలి జయంతి సందర్భంగా ప్రముఖులకు పురస్కారం అందజేస్తున్నామన్నారు. 2025 సంవత్సరానికి గాను తాడి ప్రకాష్‌కు ఈ నెల 29 తేదీన గురుజాడ గ్రంథాలయంలో పురస్కారం ప్రదానం చేస్తామని చెప్పారు. సాహిత్య అభిమానులు, రచయితలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వేదిక కార్యదర్శి బాబు, లక్ష్మణరావు, పౌరవేదిక ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి బుద్ధిచెబుదాం
గజపతినగరం: టిట్లాగర్ నుంచి విజయనగరం వరకు సుమారు 4 వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న మూడవ రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అన్యాయం చేయడం ప్రభుత్వానికి తగదని, సమయం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధిచెబుతామని రైల్వే లైన్ నిర్వాసితుల కమిటీ నాయకుడు జి.శ్రీనివాస్ తెలిపారు. గజపతినగరం మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో మూడో రైల్వే లైన్ నిర్మాణంలో ముందుగా 14 ఇళ్లకు అరకొర డబ్బులు చెల్లించి వాటిని కూల్చివేశారని, తరువాత మరో 28 కుటుంబాలకు చెందిన వారి ఇళ్లను కూల్చి వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. నిర్వాసితులకు నిలువునీడ చూపకుండా ఇళ్లు కూల్చివేయడం దుర్మార్గమన్నారు. ఫిబ్రవరి 9వ తేదీన బాధితులకు న్యాయం చేస్తామంటూ మాట ఇచ్చిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇప్పుడు మాటమార్చారని విమర్శించారు. నిర్వాసితుల పక్షాన కాకుండా ఇళ్లను కూల్చే కాంట్రాక్టర్ తరఫున కొమ్ముకాయడం దారుణమన్నారు. తక్షణమే నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు, పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మార్చి 27, 28 తేదీల్లో మానాపురం బ్రిడ్జి సమీపంలో రెండు రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ సమస్య పరిష్కరించకుంటే ఏప్రిల్ 2వ తేదీన చలో తహసీల్దార్ ఆఫీస్ కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో నిర్వాసితుల కమిటీ నాయకులు చిల్లా గోవింద్, బోర మహేష్, నగిరెడ్ల రాము, తదితరులు పాల్గొన్నారు. నిర్వాసితులను మోసం చేయడం అన్యాయం ఎంపీ మాట మార్చడం బాధాకరం 27, 28వ తేదీల్లో నిరాహార దీక్షలు మూడవ రైల్వే లైన్ నిర్వాసితుల కమిటీ నాయకుడు శ్రీనివాస్ -
ఇంటర్ వర్సిటీ బేస్‌బాల్ పోటీలకు పట్టణ క్రీడాకారులు
విజయనగరం అర్బన్: నెల్లూరులోని విక్రమ్ సింహపురి యూనివర్సిటీలో త్వరలో జరగనున్న ఇంటర్ యూనివర్సిటీ బేస్‌బాల్ పోటీలకు ఆంధ్రయూనివర్సిటీ నుంచి పోటీ పడే జట్టులో విజయనగరం పట్టణంలోని మహరాజా అటానమస్ కళాశాల క్రీడాకారులు ముగ్గురు ఎంపికయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సాంబశివరావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ నెల 19న జరిగిన అంతర్ కళాశాల బేస్‌బాల్ పోటీల్లో ప్రతిభచూపిన ఎం.దుర్గాప్రసాద్, ఐ.నవీన్‌కుమార్, ఎన్.భవానీప్రసాద్ ఎంపికై న తుదిజట్టులో ఎంపికై నట్లు తెలిపారు. ఎంపికై న వారిని మాన్సాస్ కరెస్పాండెంట్ డాక్టర్ కేవీఎల్‌రాజు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాంబశివరావు, పీడీ డాక్టర్ పి.రామకృష్ణ, అధ్యాపకులు అభినందించారు. -
వేతనదారులకు నిలువనీడ కరువు
● పనిప్రదేశంలో మెడికల్ కిట్లు లేవు ● మండుటెండలోనే పనులు ● 8 వారాలుగా వేతనాలు అందక విలవిలసీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట మండలం ఎంఎన్ఆర్ఈజీఎస్ పనులు చేయడంలో ముందంజలో గత కొన్నేళ్లుగా ఉంది. ఈ మండలంలో ఎక్కువ పనులు జరుగుతాయి. అటువంటి ఈ మండలంలో ఉపాధి వేతనదారులకు నిలువ నీడ లేదు. మండుటెండలో విలవిల్లాడుతున్నారు. వేసవి వచ్చినా కనీసం టెంట్లు కూడా లేకపోవడంతో వేతనదారులకు అవస్థలు తప్పడం లేదు. అసలే వేసవి కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపాధి పనులు చేస్తుంటారు. ఆ సమయంలో అత్యధికంగా ఎండ కాస్తోంది. ఉదయం 8 గంటలైతే భానుడు భగభగ మంటున్నాడు. సాయంత్రం 5 గంటల వరకు ఎండలు మండుతున్నాయి. విశ్రాంతి తీసుకోవడానికి కనీసం నీడ లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని వేతనదారులు వాపోతున్నారు. అలాగే పని సమయంలో వడదెబ్బ వంటివి, చిన్నచిన్నదెబ్బలు తగులుతుంటాయి. ఈ సమయంలో ప్రాథమిక చికిత్స చేయడానికి మెడికల్ కిట్లు పని ప్రదేశం వద్ద ఉండాలి. వాటిని కూడా ప్రభుత్వం ఇంతవరకు సప్లై చేయకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు వాపోతున్నారు. వేతనదారులు డీహైడ్రేషన్‌కు గురైతే ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా లేని పరిస్థితి ఉంది. బకాయిలు రూ.5 కోట్లకు పైనే.. వేతనదారులకు చెల్లించాల్సిన వేతనాల బకాయిలు రూ.కోటి వరకు ఉండవచ్చని అంచనా. మెటీరియల్ కాంపొనెంట్‌లో వేసిన రహదారులు, హార్టీకల్చర్, ఇతర పనులు దాదాపు 200 వరకు జరగడంతో వాటికి చెల్లించాల్సిన బకాయిలు రూ.4 కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. వేతనదారులు చేసిన భూ అభివృద్ధి పనులు వంటి వాటికి ఎప్పటికప్పుడు వేతనాలు చెల్లించాల్సి ఉంది. దాదాపు ఉపాధి వేతనదారులు జాబ్‌కార్డులు ఉన్నవారు 18 వేల మంది ఉన్నారు. వారిలో వందరోజుల పనులు పూర్తి చేసిన వారు 80 శాతం వరకు ఉండడంతో ప్రస్తుతం పనులు చేస్తున్న వేతనదారులు 3 వేలమంది ఉన్నారు. భూ అభివృద్ధి, టెర్రాసింగ్, ఫార్మ్పౌండ్ పనులు వేతనదారులు చేస్తున్నారు. ఇలా 150 వరకు పనులు చేశారు. సరాసరి ఒక్కో వేతనదారుకు రోజుకు రూ.270 వరకు వేతనం గిట్టుబాటవుతుంది. రెండు నెలలుగా బకాయి వేతనాలు చెల్లించకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని వేతనదారులు ఆవేదన చెందుతున్నారు. కొలతలకు టేప్ సప్లై లేదు.. ఉపాధి పనులు చేసిన వేతనదారుల పనులు ఎంత పూర్తి చేశారనేది సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఇతర సిబ్బంది కొలతలు వేయడానికి వీలుగా టేపులు సప్లై చేయాల్సి ఉన్నప్పటికీ అవికూడా సరఫరా చేయని పరిస్థితి ఉంది. కేవలం ఎవరి సామగ్రి వారు తెచ్చుకునే పనుల కొలతలు వేస్తున్నారు. టెంట్లు తాత్కాలికంగా వేసుకోమన్నాం వేతనదారులు పనిచేసిన చోట టెంట్లు తాత్కాలికంగా వేసుకుంటున్నారు. ఎండ తీవ్రత లేని సమయంలో ఉదయం 7 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు పనులు చేసుకుంటున్నారు. బకాయి నిధులు మంజూరైన వెంటనే వేతనదారులకు వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటాం. శ్రీహరి, ఏపీడీ, ఎంఎన్ఆర్ఈజీఎస్ -
రక్తహీనత కేసులు తగ్గుముఖం
విజయనగరం ఫోర్ట్: కేంద్ర ప్రభుత్వం రక్తహీనతను నివారించేందుకు ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్ర స్థాయిలో సమర్ధంగా అమలుచేస్తుండడంతో రక్తహీనత కేసులు తగ్గుముఖంపట్టాయని కేంద్ర బృందం ప్రతినిధులు డాక్టర్ దృష్టిశర్మ, డాక్టర్ జాస్మిన్ అభిప్రాయపడ్డారు. గత రెండు రోజులుగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రక్తహీనత తగ్గడానికి గల కారణాలపై ఆధ్యయనం చేశారు. సంబంధిత అంశాలను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కలిసి వివరించారు. ఎనిమీయా ముక్త్ భారత్, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకం, ప్రజాపంపిణీ వ్యవస్థ, జాతీయగ్రామీణ జీవనోపాదుల కార్యక్రమాలు రక్తహీనత తగ్గించేందుకు దోహదపడుతున్నాయన్నారు. దేశంలోని ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాంలోని 12 జిల్లాల్లో రక్తహీనత తగ్గుదలకు గల కారణాలపై ఆధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవన రాణి పాల్గొన్నారు. -
జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం పోలీసు వెల్ఫేర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి, పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని చెప్పారు. ఆకట్టుకున్న గుర్రాల పరుగు ప్రదర్శనవేపాడ: మండలంలోని బానాది గ్రామంలో అభయాంజనేయస్వామి తీర్థం సందర్భంగా నిర్వహించిన గుర్రాల పరుగు ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ పరుగు ప్రదర్శనలో 12 గుర్రాలు పాల్గొన్నాయి. వాటిలో రామన్న పాలెంకు చెందిన విక్రమ్ గుర్రం ప్రథమస్థానంలో నిలిచి రూ.12 వేలు, రెండోస్థానంలో చేనుల అగ్రహారానికి చెందిన మణి జెర్సీ నిలిచి రూ. పదివేలు సాధించాయి. మూడో స్థానంలో రామన్నపాలెంకు చెందిన చోడమాంబిక గుర్రం, నాల్గో స్థానంలో ఎల్.కోటకు చెందిన సింగపూర్ సత్యనారాయణ గుర్రం నిలిచి నగదు బహుమతులు సాధించాయి. విజేతలకు ఆలయ ధర్మకర్తలు, పెద్దలు కమిటీ సభ్యులు నగదు బహమతులు అందజేశారు. ‘గేట్’ లో కార్తికేయ కుశల్ కుమార్‌కు 79వ ర్యాంక్విజయనగరం అర్బన్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్–2025) ఫలితాల్లో పట్టణ విద్యార్థి గంట కార్తికేయ కుశల్ కుమార్ జాతీయ ర్యాంక్ 79 సాధించాడు. గేట్‌లోని ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (ఈసీఈ) సబ్జెక్టులో 842 స్కోర్‌తో 79వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. కార్తికేయ బీటెక్ కాలికట్ ఎన్ఐటీలో చదివాడు. మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ సాధించిన కార్తికేయ తండ్రి జి.సునీల్ కుమార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి శోభ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయిని. అదృశ్యం కేసు నమోదుపార్వతీపురం రూరల్: మండలంలోని అడ్డాపుశీల గ్రామానికి చెందిన నీలయ్య జనవరి 20 నుంచి ఆచూకీ లేకపోవడంతో ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై బి.సంతోషి తెలిపారు. బంధువులు, పరిచయస్తుల ఇళ్ల వద్ద భర్త ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందంటూ భార్య ఫిర్యాదు చేసిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మెట్లు కూలి మహిళా కూలీ మృతి ● ఇద్దరికి గాయాలు పీఎంపాలెం: నిర్మాణంలో ఉన్న భవనం మెట్లు కూలిపోయిన ఘటనలో మహిళా కూలీ సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలైంది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పీఎంపాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 8వ వార్డు పరిధి పనోరమ హిల్స్ వద్ద ఐకానికా గ్రాండ్ విల్లా నంబరు 121 నిర్మాణంలో ఉంది. ఈ భవనం మెట్ల నిర్మాణ లోపం కారణంగా రెండవ అంతస్తు నుంచి కూలిపోయి.. అదే భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో పని చేస్తున్న మహిళా కూలీ నీలరోతు రామలక్ష్మిపై పడ్డాయి. విజయనగరం జిల్లా మొరకముడిదాం మండలం వేముల గ్రామానికి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే ఘటనలో విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చౌడంతవలస గ్రామానికి చెందిన టి.ఆదినారాయణ వెన్నుపూస దెబ్బతింది. భీమిలి చేపలుప్పాడకు చెందిన కోడా అమ్మాజమ్మ కాలు విరిగి బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాయత్రీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ భాస్కర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రత్నం ఫార్మాస్యుటికల్స్‌పై క్రిమినల్ కేసు
● కాలం చెల్లిన మందులు, నిషేధిత మత్తు సిరప్లు లభ్యం విజయనగరం ఫోర్ట్: పట్టణంలోని అంబటి సత్రం జంక్షన్లో ఉన్న రత్నం ఫార్మాస్యుటికల్స్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ దుకాణంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టగా గడువుదాటిన మందులు, నిషేధిత మత్తు టానిక్‌లు దుకాణంలో లభ్యమయ్యాయి. దీంతో ఈ దుకాణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకుని యువత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. వెంకటరత్నం మెడికల్ దుకాణంలో అధిక మొత్తంలో మత్తు కలిగించే నిషేధిత టానిక్‌లు పట్టుకుని సీజ్ చేశామన్నారు. తనిఖీల్లో ఔషధ నియంత్రణశాఖ ఎ.డి రజిత పాల్గొన్నారు. -
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు స్థానిక ఎస్సై పి.రమేష్ నాయుడు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. తోటపల్లి ప్రాజెక్టు నాల్గవ గేటు వద్ద యువకుడి మృతదేహం తేలియాడుతూ ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు మృతదేహాన్ని బయటకు తీసిన తరువాత మృతుడిని పార్వతీపురం పట్టణంలో గల జగన్నాథపురం ప్రాంతానికి చెందిన ఆలవెల్లి రాజా(26)గా గుర్తించారు. ఈనెల 19 బుధవారం ఉదయం నుంచి కుమారుడు ఆలవెల్లి రాజా ఆచూకీ లేకపోవడంతో తండ్రి శ్రీనివాసరావు పార్వతీపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా శుక్రవారం తోటపల్లి జలాశయం వద్ద రాజా మృతదేహం లభ్యమైంది. మృతికి గల కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
ప్రాజెక్టుల నిధులకు ప్రతిపాదిద్దాం
విజయనగరం అర్బన్: జిల్లా వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు సాధించాలంటే తోటపల్లి కుడి ప్రధాన కాలువ, తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టులు పూర్తికావాలి... దీనికి అవసరమైన నిధులు మంజూ రు చేయాలని త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఆయా ప్రాజెక్టుల పనులు, భూసేకరణ, పునరావాసం పూర్తి చేసేందుకు ఏ మేరకు నిధులు అవసరమవుతాయో జలవనరుల శాఖ అధికారులు నివేదిక అందజేయాలని ఆదేశించారు. తన కార్యాల యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తోటపల్లి కుడి ప్రధాన కాలువ, తారకరామ సాగరం ప్రాజెక్టులను పూర్తిచేస్తే సుమారు 50 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. వ్యవసాయ రంగంలో అదనపు ఉత్పత్తిని, ఆదాయాన్ని సాధించే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు నగరానికి మంచినీటి సరఫరా, భోగాపురం ఎయిర్‌పోర్టుకు నీటి సరఫరా జరిగే అవకాశం ఉన్నందున ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తిచేయాల్సిన అవసరాన్ని వివరిస్తామని చెప్పారు. కలెక్టర్ల సదస్సు మార్చి 25, 26 తేదీల్లో అమరావతిలో జరగనుందని, జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వివిధ శాఖల అధికారులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే అద నంగా ఎంతమేరకు లక్ష్యాలు సాధించగలమో పేర్కొంటూ వాస్తవిక అంచనాలను మాత్రమే ఇవ్వా లని ఆదేశించారు. సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, డీఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు. -
ఫెన్సింగ్ పోటీల్లో కానిస్టేబుల్‌కు కాంస్యం
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్‌శాఖలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో జరిగిన 1వ ఆలిండియా పోలీస్ క్లస్టర్ పోటీల్లో కాంస్యపతకం సాధించిన పీసీ బీఎస్ ఎన్ మూర్తికి ఎస్పీ వకుల్ జిందల్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని ట్రాఫిక్ సీఐ సూరినాయుడుతో పాటు కానిస్టేబుల్ మూర్తి శుక్రవారం కలిశారు. జిల్లాకు చెందిన బీఎస్ఎన్ మూర్తి పోలీస్ శాఖ నిర్వహించిన జాతీయపోటీల్లో ఫెన్సింగ్ విభాగంలో రాష్ట్ర పోలీసు జట్టు తరఫున పాల్గొని కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతకం సాధించిన కానిస్టేబుల్ మూర్తిని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారని ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా తెలిపారు. పతకాలు సాధించిన పోలీస్‌సిబ్బందికి త్వరలో ప్రోత్సాహక నగదు బహుమతిని, అదనంగా వార్షిక ఇంక్రిమెంట్ అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు పాల్గొన్నారు. అభినందించిన ఎస్పీ వకుల్ జిందల్ -
ప్రశాంతంగా పది పరీక్షలు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 67 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 10,363 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 10,314 మంది హాజరయ్యరని, 49 మంది గైర్హాజరయ్యరని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుంగా పరీక్ష సజావుగా నిర్వహించామన్నారు. 61 పరీక్షా కేంద్రాల్లో వర్యవేక్షక బృందం 6 కేంద్రాల్లో తాను సందర్శించినట్లు తెలిపారు. డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు -
నెలాఖరుకు పథకాల మంజూరు
విజయనగరం అర్బన్: బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు ఈ నెలాఖరులోగా పథకాలను మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. వివిధ పథకాలు, వాటి మంజూరులో బ్యాంకుల పరిస్థితిని ఎల్డీఎం వీవీరామణమూర్తి వివరించారు. నాబార్డ్ డీడీఎం నాగార్జున మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (పీఎల్‌సీపీ)ను వివరించారు. సుమారు రూ.10,650.32 కోట్ల అంచనాతో ఈ రుణ ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. దీని ఆధారంగానే జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికను కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, వ్యవసాయ శాఖ జేడీ వీటీరామారావు, పశుసంవర్ధకశాఖ డాక్టర్ వైవీరమణ, జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, మెప్మా పీడీ చిట్టిరాజు, ఉద్యాన, మత్సశాఖల డీడీలు జమదగ్ని, నిర్మలాకుమారి, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు వెంకటేశ్వరరావు, పెంటోజీరావు, వివిధ బ్యాంకుల అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అంబేడ్కర్ -
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణాపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతోందని విశాఖ రేంజ్ పోలీసు డీఐజీ గోపీనాథ్ జెట్టి స్పష్టం చేశారు. ఈ మేరకు గడిచిన ఎనిమిది నెలల్లో మూడు దశల్లో పట్టుబడిన 7 వేల 378 కేజీల గంజాయిని ధ్వంసం చేశామని డీఐజీ తెలిపారు. విశాఖ పోలీస్ రేంజ్ పరిధి శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాత కుంకాంలో గురువారం మూడు జిల్లాల్లో పలు కేసుల్లో సీజ్ చేసిన గంజాయి నిర్మూలన కార్యక్రమం జరిగింది. 226 కేసులలో సీజ్ చేసిన 7378 కిలోల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, ,శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి -
ఆధునిక పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలి
విజయనగరం అర్బన్: పరిశ్రమ రంగానికి అవసరమైన ఆధునిక పరిశోధనలపై విద్యార్థులు ఆసక్తిని పెంచుకోవాలని జేఎన్టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు అన్నారు. ఈ మేరకు స్థానిక జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా స్టూడెంట్ చాప్టర్ సంయుక్త నిర్వహణలో ‘మెక్ అనో ఎంఎంఎక్స్ఎక్స్వీ 2025’ అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి టెక్నికల్ సింపోజియాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరికరాలు అవి పని చేస్తున్న తీరు తదితర అంశాలపై పరిజ్ఞానాన్ని పెంచడానికి ఇలాంటి సదస్సులు విద్యార్థులకు దోహదపడతాయన్నారు. అనంతరం సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెకా నికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె.శ్రీనివాస్ ప్రసాద్, వి.మణికుమార్, డాక్టర్ సి.నీలిమదేవి ఫ్యాకల్టీ సమన్వయకర్తలుగా,, స్టూడెంట్ కో ఆర్డినేటర్స్‌గా కె.కౌశిక్, పి.ప్రగతి వ్యవహరించారు. జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేశ్వరరావు వర్సిటీలో మెక్అనో జాతీయ సదస్సు ప్రారంభం -
నిర్దిష్ట ప్రమాణాల మేరకు పెసర, మినుము కొనుగోళ్లు
బొబ్బిలి: పట్టణంలోని పీఏసీఎస్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు పండించిన పెసలు, మినుము కొనుగోళ్లు చేపట్టి సకాలంలో చెల్లింపులు చేస్తామని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఎన్.వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని పీఏసీఎస్ కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మినుములు క్వింటా రూ.7,400లు, పెసలు క్వింటా రూ.8,682లకు కొనుగోలు చేస్తామన్నారు. అయితే నాఫెడ్ విధించిన నిర్దిష్ట నాణ్యతా ప్రమాణాల నిబంధనల ప్రకారం పెసలు, మినుములను పై మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామన్నారు. ఇందులో మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా తన విధులను నిర్వర్తిస్తోందన్నారు. జిల్లాలో జామి మండలం విజినిగిరి, గంట్యాడ, గజపతినగరం, సంతకవిటి, బొబ్బిలి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. గోదాముల నిర్మాణానికి భూమి కొనుగోలు మార్క్‌ఫెడ్ ద్వారా గోదాములను నిర్మించేందుకు బొబ్బిలి గ్రోత్ సెంటర్ సమీపంలోని జగనన్న కాలనీ వద్ద 5.19 ఎకరాల భూమిని గతంలో కొనుగోలు చేసినట్టు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గొల్లపల్లి సర్వే నంబర్ 509–2లో గల ఈ భూమికి సంబంధించిన రూ.33,73,500 లను రెవెన్యూ శాఖకు చెల్లించామన్నారు. ఇప్పుడు మరోసారి దానిని గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు తహసీల్దార్ ఎం.శ్రీనుతో కలసి సర్వే చేసినట్టు చెప్పారు. పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. జిల్లాలో ఐదు మండలాల్లో కేంద్రాలు ప్రారంభించిన మార్క్‌ఫెడ్ మేనేజర్ -
బాలికల ఉన్నత పాఠశాలలో ‘సునీత’ విజయోత్సవాలు
విజయనగరం అర్బన్: అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ క్షేమంగా చేరుకున్న సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. తొలుత పాఠశాల ప్రాంగణంలో బాలికలు సామూహిక ప్రదర్శన చేసి బాణసంచా కాలుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం పి.రమణమ్మ మాట్లాడుతూ యువత సునీత విలియమ్స్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాలికల్లో స్ఫూర్తిని పెంచే విధంగా ఆమె చూపిన పట్టుదల, దృఢ సంకల్పం నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి.వెంకట్రావు, ఈ.రామునాయుడు, పి.ఉమారాణి, ఎంవీ లక్ష్మీనరసమ్మ, సీహెచ్రత్నం, యూవీఏఎన్ రాజు, శ్రీరంగాచార్యులు, విద్యార్ధినులు పాల్గొన్నారు. 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసంవేపాడ: మండలంలోని కుమ్మపల్లి సమీపంలో సారా తయారీకి సిద్ధం చేసిన బెల్లం ఊటను వల్లంపూడి పోలీసులు గుర్తించి ధ్వంసం చేశా రు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం సాయంత్రం అందిన సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన దాడుల్లో గ్రామసమీపంలోని తోటల్లో 500 లీటర్ల బెల్లం ఊట పట్టుబడింది. దీంతో బెల్లం ఊటను ధ్వంసం చేశారు. -
మీటర్ రీడింగ్ కార్మికుల పొట్ట కొట్టొద్దు..
విజయనగరం గంటస్తంభం: స్మార్ట్‌మీటర్లు తీసుకొచ్చి వేలాది మంది విద్యుత్ మీటర్ రీడింగ్ తీసే కార్మికుల పొట్ట కొట్టొద్దని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. గురువారం స్థానిక దాసన్నపేటలోని విద్యుత్ భవన్ ముందు మీటర్ రీడర్స్ యూనియన్ సభ్యులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల్లో సుమారు 4500 మంది విద్యుత్ మీటర్ రీడర్స్ 20 సంవత్సరాలుగా పని చేస్తున్నారన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో కార్మికులందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పారు. గతంలో చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్‌మీటర్లను వ్యతిరేకించి.. నేడు బీజేపీతో జత కట్టడం సిగ్గుచేటన్నారు. ఒక్కో సర్వీస్‌కు కేవలం రూ.3.60 పీస్ రేటుతో నెలకు రూ. 6 నుంచి 10 వేల రూపాయల లోపు మాత్రమే వేతనం పొందుతున్న రీడర్స్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. మీటర్ రీడర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్‌లో ఆందోళనలను ఉధృతం చేస్తామని చెప్పారు. సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాసరావు, పసుమర్తి శ్రీకాంత్, (ఎస్.కోట సబ్ డివిజన్), విజయనగరం సబ్ డివిజన్ గోక రమణ, (గజపతినగరం సబ్ డివిజన్) ఆది, రీడింగ్ కార్మికులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ -
‘అగ్నివీర్’కు దరఖాస్తుల ఆహ్వానం
శరీర కొలతలు అగ్నివీర్ జనరల్ డ్యూటీ మరియు అగ్ని ట్రేడ్స్‌మెన్ పోస్టులకు 166 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి. అగ్నివీర్ టెక్నికల్ పోస్టుకు 165 సెంటీమీటర్లు, అగ్నివీర్ క్లర్క్/టెక్నికల్ పోస్టులకు 162 సెంటీమీటర్లు ఎత్తు తప్పనిసరి. 77 సెంటీమీటర్ల కనీస విస్తీర్ణంతో ఛాతీ ఉండి ఊపిరి పీల్చేటప్పుడు 5 సెంటీమీటర్ల విస్తీర్ణం పెరగాలి. ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండాలి. ఎంపికై న వారిని 4 సంవత్సరాల షార్ట్ టర్మ్ సర్వీసు అగ్నివీర్ సర్వీస్లోనికి తీసుకుంటారు. దళారులు, మధ్యవర్తులను నమ్మవద్దని ఆర్మీ రిక్రూట్మెంట్ ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఆర్మీ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఇతర వివరాల కోసం సెట్విజ్ కార్యాలయంలోని మేనేజర్ వెంకటరమణ 9849913080 నంబరుకు సంప్రదించాలని ఆయన సూచించారు. విజయనగరం అర్బన్: భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను వచ్చే నెల 10వ తేదీలోగా ఆన్లైన్లో joinindianarmy.nic.in వెబ్సైట్ ద్వారా స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఆన్లైన్లో ద్వారా నమోదు చేసుకున్న అభ్యర్థులు అడ్మిన్కార్డును డౌన్లోడ్ చేసుకొని ఆర్మీ ర్యాలీ జరిగే తేదీ, సమయం పొందవచ్చునని తెలిపారు. తొలిత ఆన్లైన్ పరీక్ష పాసైన అభ్యర్థులకు ఆర్మీ ర్యాలీ (ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్) నిర్వహిస్తారని పేర్కొన్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ: 10వ తరగతిలో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అగ్నివీర్ టెక్నికల్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్ మరియు ఇంగ్లిష్ సబ్జెక్టులతో కనీసం 50 శాతంతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్: ఆర్ట్స్, కామర్స్, సైన్స్ సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ప్రతి సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్: 8వ/10వ తరగతి ఉత్తీర్ణత. అభ్యర్థులు 2004 అక్టోబర్ 1 నుంచి 2008 ఏప్రిల్1వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. పోస్టుల వివరాలు, విద్యార్హతలు ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
నిరసన గళం
ప్రకృతి సౌందర్యం ఉట్టిపడేలా.. కల్లుగీత కార్మికుల కష్టాలు తెలిసొచ్చేలా.. కనిపిస్తున్న ఈ చిత్రం విజయనగరం జిల్లా గజపతినగరం రోడ్డులో గురువారం సాయం సంధ్యా సమయాన సాక్షి కెమెరాకు ఇలా చిక్కింది. అస్తమిస్తున్న సూర్యుడి వెలుగులో గీత కార్మికుడు తన బతుకు జీవనానికి బాటలు వేసుకునేలా.. ఈ దృశ్యం చూపరులను ఇట్టే కట్టి పడేసింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం విజయనగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం నిరసన గళం వినిపించారు. 2019లో విజయనగరం పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చినా నేటికీ సొంత భవనం లేకపోవడంపై విద్యార్థులు నినదించారు. ఇక్కడ కళాశాలలో ఏటా 400 మందికి పైగా విద్యార్థులు కళాశాలలో చేరుతున్నా సొంత భవనం ఏర్పాటు చేయకపోవడంపై మండిపడ్డారు. ఇప్పటికీ సంస్కృత డిగ్రీ కళాశాలలోనే క్లాసులు నిర్వహించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి కె.రాజు, అధ్యక్షుడు జి.సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం -
ఉల్లాస్..తుస్
ఉల్లాస్.. ఇదో బృహత్తర కార్యక్రమం. గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీన్ని మూడేళ్ల పాటు విడతల వారీగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా జత కలిసింది. తద్వారా మహిళల అక్షరాస్యతను పెంచి సమాజాభివృద్ధిలో వారిని కీలకంగా వ్యవహరించేలా చేయాలని భావించింది. అయితే.. అనుకున్నదొకటి.. జరుగుతున్నది వేరొకటి అనేలా.. ఉంది. జిల్లాలో ఇలా.. పరీక్ష కేంద్రాలు : 875 రాయనున్నవారు : 48,578 పరీక్ష తేదీ : 23–03–2025 సమయం : ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ● ఎలా రాయాలి? ఏమి రాయాలి? ● అభ్యాసకుల ఆందోళన ● గ్రామాల్లో కానరాని అభ్యసనా తరగతులు ● ఈ నెల 23న పరీక్షల నిర్వహణ ● జిల్లాలో పరీక్షకు హాజరు కానున్న 48,578 మంది ● కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు ● అధికారుల పర్యవేక్షణ కరువు ● -
దర్బార్‌లో ఇఫ్తార్ విందు
విజయనగరం టౌన్: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని బాబామెట్టలోని సూఫీ ఆధ్యాత్మిక చక్రవర్తి ఖాదర్‌బాబా సూఫీ క్షేత్రంలో ఆలయ ధర్మకర్త ఖలీల్‌బాబు సారథ్యంలో గురువారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. విశాఖ నుంచి హాజరైన రవిచంద్ర రవి, ఖలీల్‌బాబు తనయుడు అహ్మద్‌బాబుతో కలిసి ఉపవాస దీక్షాపరులకు ఆత్మీయతతో వడ్డన చేశారు. అనంతరం పరిసర ప్రాంత ప్రజలు, భక్తులకు ఖాదర్‌బాబా వారి అన్న సమారాధనను నిర్వహించారు. నూనె గింజల పంటల సాగు పెంచాలి విజయనగరం ఫోర్ట్: నూనె గింజల పంటలైన నువ్వు, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటల సాగు విస్తీర్ణం పెంచాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం సేద్య విభాగ అధిపతి డాక్టర్ ఎం.భరతలక్ష్మి అన్నారు. స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ అధికారులకు, విస్తరణ అధికారులకు, వీఏఏలకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నూనె గింజల పంటల్లో కలుపు నివారణకు మార్కెట్లో కలుపు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. వేరుశనగ పంటలో కదిరి లేపాక్షి, నిత్య వారిత వంటి రకాలను వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కెల్ల లక్ష్మణ్, శాస్త్రవేత్తలు డాక్టర్ యు.త్రివేణి తదితరులు పాల్గొన్నారు. రెన్యువల్స్ సకాలంలో చేయించుకోవాలి విజయనగరం ఫోర్ట్: ఆస్పత్రులు, డయోగ్నోస్టిక్ సెంటర్లు, క్లినిక్స్ సకాలంలో రెన్యువల్స్ చేయించుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల వైద్యులకు కెపాసిటి బిల్డింగ్, జనరల్ బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్ల రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ వెల్లడించకూడదన్నారు. సమావేశంలో అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కె.రాణి, పీసీపీఎన్డీటీ నోడల్ అధికారి డాక్టర్ రెడ్డి అచ్చుతకుమారి, డాక్టర్ ఎం.జయచంద్రనాయుడు, డెమో వి.చిన్నతల్లి, డిప్యూటీ డెమో ఎస్.రమణ పాల్గొన్నారు. మారిక హెచ్ఎం సస్పెన్షన్ వేపాడ: మండలంలోని కరకవలస పంచాయతీ శివారు గిరి శిఖరంపై ఉన్న మారిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్వీ శ్రీకాంత్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యాలనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలకు సక్రమంగా హాజరు కావడం లేదని అందిన ఫిర్యాదుల మేరకు ఎంఈఓతో విచారణ నిర్వహించారు. అనంతరం సస్పెండ్ చేస్తూ డీఈఓ ఆదేశాలు ఇచ్చారు. సదరు హెచ్ఎం స్థానంలో వేరొకరిని నియమించాలని ఎంఈఓకు సూచించారు. -
వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు
● తగ్గుతున్న జలాశయాల నీటి మట్టాలు బొబ్బిలి: అన్నదాతకు, అటు మూగజీవులు, ప్రజానీకానికి దాహార్తిని తీర్చే జలాశయాలు నీటి నిల్వలను మార్చి నెలలోనే కోల్పోవడం కనిపిస్తోంది. జిల్లాలోని ప్రధాన జలాశయాల నీటి మట్టాలు తగ్గుముఖం పట్టే ఛాయలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని నీటి మట్టాలు తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రబీకి సాగునీరు ఇచ్చే పరిస్థితి లేకపోయినా చాలా చోట్ల పశువుల దాహార్తిని తీర్చేందుకు, ఆరుతడి పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందా.. అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగునీటి వనరుల్లో ఒక భారీ తరహా నీటి పారుదల ప్రాజెక్టు ఉండగా మిగతావి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులున్నాయి. వీటి ద్వారా ఏటా ఖరీఫ్‌లోనే సాగునీటిని విడుదల చేస్తున్నారు. రబీలో ఆరుతడి పంటలకు సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉంటోంది. వీటిని ఏటా జలవనరుల శాఖ అధికారులు పరిశీలించి రబీకి సాగునీటిని విడుదల చేయాలా.. వద్దా.. అనేది నిర్ణయిస్తారు. దీని ప్రకారం రైతులు తమ పంటలను సాగు చేసుకుంటుంటారు. అయితే ఈ ఏడాది సాగునీటి నిల్వలు తగ్గే పరిస్థితి నెలకొంది. మార్చి నెలలోనే సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు మీటర్ల మేర తగ్గుతూ కనిపిస్తోంది. వేసవిలో అకాల వర్షాలు, తుఫాన్ల వంటివి సంభవిస్తే తప్ప మే నెలాఖరుకు మరింత నీరు ఇంకిపోయే పరిస్థితులున్నాయి. ఇది అందరినీ కలవరపరుస్తోంది. వీఆర్ఎస్లో కొద్ది రోజుల కిందటి నీటి నిల్వలు -
దైవదర్శనానికి వెళ్తూ ఇద్దరు మహిళల మృతి
గుర్ల: మండలంలోని పెనుబర్తికి చెందిన 15 మంది, గరివిడి మండలంలోని కుమరాం గ్రామానికి చెందిన 30 మంది తమిళనాడులోని రామేశ్వరం దైవదర్శనానికి బస్సులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందా రు. తెలంగాణలోని మెదక్ జిల్లా శంకరంపేట వద్ద మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదం వివరాలిలా ఉన్నాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రయాణికుల బస్సును డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి బస్సు వెనుక భాగంలో ఉన్న కూర్చున్న మహిళలు మృతిచెందారు. మృతిచెందిన వారిలో గుర్ల మండలంలోని పెనుబర్తికి చెందిన రౌతు సూరప్పమ్మ (60), గరివిడి మండలంలోని కుమరాం గ్రామానికి చెందిన మీసాల అప్పలనారాయణమ్మ (50) ఉన్నారు. అలాగే పెనుబర్తి గ్రామానికి చెందిన బెల్లాన జగన్నాథం, సుంకరి రామలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. బావిలో పడి ఒకరు...పార్వతీపురం రూరల్: రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి నేలబావిలో శవమై తేలా డు. ఈ మేరకు స్థానిక రూరల్ ఎస్సై బి.సంతో షి గురువారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సారిక వీధికి చెందిన మజ్జి సత్యనారాయణ(54)ఈనెల 18న ఆస్పత్రికి అని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. తరువాత ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు పరిసర గ్రామాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు భార్య పార్వతి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం పార్వతీపురం రూరల్ పరిధిలో ఉన్న బ్యాంక్ఆఫ్ బరోడా సమీపంలో నేలబావిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మృతదేహాన్ని సత్యనారాయణగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నాలుగు నెలల క్రితం కుటుంబ సభ్యులలో ఒకరు మరణించడంతో మనస్తాపానికి గురై సత్యనారాయణ మృతి చెంది ఉంటాడని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
పొజిషన్ ఉంటేనే నిధుల మంజూరు..!
పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, అర్బన్ ప్రాంతంలో రెండున్నర సెంట్లు చొప్పున ఇంటి స్థలాలు కేటాయించనుంది. హౌసింగ్‌లో వచ్చే నిధులను ఒక్కో లబ్ధిదారుకు రూ.2.50లక్షలకు పెంచినట్లు పక్క ప్రభుత్వం, మరోపక్క అధికారులు చెబుతున్నారు. వాటికి తోడు బీసీ, ఎస్సీ కులాల లబ్ధిదారులకు అదనంగా రూ.50వేలు, ఎస్టీ కులాలకు చెందిన లబ్ధిదారులకు అదనంగా రూ.70వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ క్రమంలో హౌసింగ్ పథకం అమలు వేగం పుంజుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతా ఒక ఎత్తయితే హౌసింగ్ పథకంలో బీసీ, ఎస్సీ,ఎస్టీ కులాల ధ్రువీకరణ పత్రాలు, వారి అనుభవంలో ఉన్న స్థలాలకు రెవెన్యూ అధికారులతో పొజిషన్ సర్టిఫికెట్లు జతచేయాలన్న నిబంధన పెట్టారు. దీంతో లబ్ధిదారులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు స్థలాల పొజిషన్ సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో లబ్ధిదారులకు ఇబ్బందులు రావడం లేదు కానీ పొజిషన్ సర్టిఫికెట్ మంజూరులో రెవెన్యూ అధికారులు పలు ప్రశ్నలు వేస్తున్నారు. స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్, అగ్రిమెంట్లు ఉండాలని, డీకేటీ, గ్రామకంఠం భూములకు ఇవ్వమని చెబుతున్నారు. గ్రామాల్లో పేద రైతులకు వారి పొలాల వద్ద హౌసింగ్ ఇంటి నిర్మాణానికి స్థలాలు ఉన్న భూములకు వన్‌బీ ఉండడంతో మూడు సెంట్ల స్థలానికి పొజిషన్ సర్టిఫికెట్లు ఎలా ఇస్తామని రెవెన్యూ అధికారులు మెలిక పెడుతున్నారు. దీంతో లబ్ధిదారులు తమ గోడు ఎవరికీ చెప్పుకోవాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గందరగోళంలో హౌసింగ్ అధికారులు పార్వతీపురం మన్యం జిల్లాలో హౌసింగ్ పథకంలో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి. ప్రతి వారం రోజులకు ఈ పథకంలో సాధించిన నివేదికలు ఇవ్వండి అంటూ హౌసింగ్ ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారుల వెంట పడుతున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే ఈ పాటికే హౌసింగ్ నిర్మాణాలు పునాదులు దాటి గోడస్థాయికి వచ్చి ఉండేవి. కానీ లబ్ధిదారుల సొంత స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్ ఉంటేనే నిధులు మంజూరు చేయాలనే నిబంధన ఉండడంతో ఇక్కడే ఈ పథకం ముందుకు కదలకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయింది. దీంతో ఉన్నతాధికారులకు సమాధానాలు చెప్పలేక, రెవెన్యూ అధికారులను ప్రాథేయపడలేక హౌసింగ్ అధికారుల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలో 18,056 మంది లబ్ధిదారుల గుర్తింపు పార్వతీపురం మన్యం జిల్లాలో 18,056 మంది హౌసింగ్ పథకంలో లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు సర్వే చేశారు. సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులకు హౌసింగ్ పథకంలో ఇంటి నిర్మాణం మంజూరు చేసేందకు ఆ స్థలాల్లో పొజిషన్ సర్టిఫికెట్ల మెలిక పెట్టడంతో అవి నిలిచిపోతున్నాయి. జిల్లాలో గల 15 మండలాల్లో అధికారులు విస్తృతంగా సర్వే నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. సుమారు 13వేల మందికి పైగా లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లు లేవన్న కారణంగా హౌసింగ్ బిల్లులు అందుతాయో? లేదోనన్న ఆందోళన నెలకొంది. హౌసింగ్ నిధులు ఒక్కో లబ్ధిదారుకు రూ.2.50లక్షలకు పెంపు కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు పొజిషన్ సర్టిఫికెట్ తప్పనిసరి తలలు పట్టుకుంటున్న ఇళ్ల లబ్ధిదారులుఅన్ని ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి హౌసింగ్ పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్ తప్పనిసరి. సొంత స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో అందజేస్తున్నారు. ఆధాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తేనే లబ్ధిదారులకు హౌసింగ్ నిధులు కేటాయించి నిర్మాణ పనులు చేపట్టేలా చూస్తున్నాం. – పి.ధర్మ చంద్రారెడ్డి, ఇన్చార్జ్ హౌసింగ్ పీడీ, పార్వతీపురం మన్యం జిల్లా -
ఆదుకోకోంటే ఉద్యమమే
పెదవేగి: కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోకో రైతుల రాష్ట్ర సదస్సు హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. బొల్లు రామకృష్ణ, బోళ్ల సుబ్బారావు, ఈడ్పుగంటి శ్రీనివాసరావు అధ్యక్షులుగా వ్యవహరించిన ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కోకో రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కంపెనీల సిండికేట్‌తో దోపిడీ కోకో గింజల కొనుగోలు కంపెనీలు సిండికేట్‌గా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకొని కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 75 వేల ఎకరాల్లో కోకో తోటల సాగు ఉందని, ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో కోకో అంతర పంటగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కోకో రైతులు సంఘటితం కావాలి కోకో రైతులంతా సంఘటితంగా లేకపోవడం వల్లే కంపెనీలు సిండికేట్ అయి ఇబ్బంది పెడుతున్నాయని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. 24న ధర్నాలు, రాస్తారోకోలు కోకో రైతుల సమస్యలపై ఈ నెల 24, 25 తేదీల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలని, ఎంపీలు ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలని, సమస్యను పరిష్కరించకపోతే కోకో గింజలు కొనుగోలు చేస్తున్న కంపెనీల గొడౌన్ల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోకో రైతుల రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది. తేల్చిచెప్పిన కోకో రైతులు కొనుగోలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ విజయరాయిలో రాష్ట్ర సదస్సుకు పెద్దసంఖ్యలో రైతుల హాజరు -
నిందితులకు రిమాండ్
గజపతినగరం: మెంటాడ మండలం రెల్లిపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు రాళ్లపూడి అంకమ్మను(75) హతమార్చిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం గజపతినగరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మెంటాడ మండలం రెల్లిపేటలో తన నివాస గృహంలో 16.3,2025న వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశామన్నారు. శవపంచనామా అనంతరం వృద్ధురాలిని గొంతునులిమి చంపినట్లు వైద్యుల రిపోర్టు రావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు నిందితులను గాలించి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గురువారం ఉదయం 11గంటలకు నలుగురు నిందితులైన దానాలరాము, దానాల దుర్గారావు, దానాల రాములమ్మ, పాల్తేటి రామప్పడు అలియాస్ బొడ్డులు పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఓల సమక్షంలో లొంగిపోయినట్లు చెప్పారు. మృతురాలు అంకమ్మ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి నగదు అప్పుగా ఇస్తూ ఉంటుందని అందులో భాగంగా దానాల రాములమ్మ అప్పుఅడగ్గా ఆమె తిరస్కరించింది. దీంతో రాములమ్మతో పాటు మరో ముగ్గురు తోడై వృద్ధురాలి వద్ద ఉన్న బంగారం ముక్కుపుడక, రూ.740లు దోచుకుని ఆమెను హతమార్చినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన స్థానిక సీఐ జీఏవీ రమణ, ఆండ్ర ఎస్సై కె.సీతారామ్, గజపతినగరం ఎస్సై కె.లక్ష్మణరావులతో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్‌తో పాటు తాను అభినందిస్తున్నట్లు చెప్పారు. వృద్ధురాలిని హతమార్చిన కేసులో నలుగురి అరెస్ట్ -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ107 శ్రీ184 శ్రీ194గేట్లో ఆలిండియా 451వ ర్యాంక్ ● అర్తమూరు యువకుడి ప్రతిభ చీపురుపల్లి రూరల్ (గరివిడి): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన గేట్–2025 (గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)ఎంట్రన్స్ టెస్ట్‌లో గరివిడి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన యువకు డు సుంకరి నరసింహనాయుడు ప్రతిభ చాటా డు. మెకానికల్ విబాగంలో ఆలిండియా స్థా యిలో 451వ ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 3న గేట్ ఎంట్రన్ పరీక్ష జరగ్గా బుధవారం ఫలితాలు విడుదలయ్యాయి. తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన బాలుడుగరుగుబిల్లి: మండలంలోని రావివలస ఎస్సీ వసతి గృహంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి పత్తిగూల శివసాయిని స్థానిక ఎస్సై పి.రమేష్‌నాయుడు గురువారం తల్లిదండ్రులకు అప్పగించారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన శివసాయి ఫిబ్రవరి 17న రావివలస ఎస్సీ వసతి గృహంనుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు తండ్రి పోలయ్య ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివసాయి కోసం గాలింపు చేపట్టగా సీతానగరం మండలం అంటిపేటవద్ద ఆచూకీ లభించడంతో పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి, తల్లిదండ్రులకు ఎస్సై అప్పగించారు. ఈ సందర్భింగా తల్లిదండ్రులు ఎస్సైకి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈహెచ్ఎస్ సేవలందించడంలో అలసత్వం తగదు● ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ డి.రాంబాబు విజయనగరం ఫోర్ట్: ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)కు సంబంధించి ప్రతి రోగికి వైద్యసేవలు అందించాలి. వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) జిల్లా మేనేజర్ డి.రాంబాబు అన్నారు. ఈ మేరకు పట్టణంలోని శ్రీసాయి సూపర్ స్పెషాలిటీ నెట్వర్క్ ఆస్పత్రిని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వైద్యసేవల గురించి ఆరా తీశారు. చికిత్స సకాలంలో అందిస్తున్నారా? నాణ్యమైన భోజనం పెడుతున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదనంగా డబ్బులు ఏమైనా అడుతున్నారా అని రోగులను ఆరా తీశారు. ఆస్పత్రిలో ఏ సమస్య ఉన్నా వెంటనే ఆరోగ్య మిత్రను కలవాలని రోగులకు చెప్పారు. కార్యక్రమంలో టీమ్ లీడర్ ఎ.భానుప్రసాద్ పాల్గొన్నారు. అట్రాసిటి కేసుపై విచారణవేపాడ: మండలంలోని గుడివాడ గ్రామానికి సంబంధించి నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుపై విజయనగరం డీఎస్పీ మీరాకుమార్ నేతృత్వంలో గురువారం విచారణ చేపట్టారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. మార్చి 11న గుడివాడలో వేణుగోపాలస్వామి తీర్థం సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్‌బేబీ డ్యాన్స్ వద్ద జరిగిన గొడవలో తన కుమారుడిని కులం పేరుతో వల్లంపూడి ఎస్సై బి.దేవి దూషించి గాయపర్చినట్లు గ్రామానికి చెందిన గుడివాడ కృష్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ పి.మీరాకుమార్, రూరల్ సీఐ అప్పలనాయుడు గ్రామంలో గురువారం విచారణ నిమిత్తం గ్రామసభ నిర్వహించారు. గ్రామసభ వద్దకు ఫిర్యాదుదారు కృష్ణమ్మ హాజరుకాకపోవడంతో డీఎస్పీ మీరాకుమార్ ఫిర్యాదు దారు ఇంటికి వెళ్లి ఆరా తీయగా కుటుంబసభ్యులు ఉన్నారు కానీ ఫిర్యాదుదారు లేకపోవడంతో గ్రామసభకు చేరుకున్నారు. గ్రామసభలో వేచి ఉన్నప్పటికీ సాక్షులు హాజరుకాకపోవడంతో సర్పంచ్ మిడతాన గోపి, ఏపీ దళితకూలీ రైతు సంఘం నాయకుడు గాలి ఈశ్వర్రావు తదితరులతో మాట్లాడిన అనంతరం డీఎస్పీ, సీఐ వెనుదిరిగారు. -
పోక్సో కేసుల్లో ఇరుక్కుని జీవితాలు నాశనం చేసుకోవద్దు
బొబ్బిలి: పోక్సో కేసుల్లో ఇరుక్కుని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని సీనియర్ సివిల్ జడ్జి ఎస్.అరుణశ్రీ హితవు పలికారు. ఈ మేరకు గురువారం స్థానిక సబ్‌జైలును ఆమె సందర్శించి రిమాండ్ ఖైదీలతో మాట్లాడి సత్ప్రవర్తనపై తెలియజేశారు. న్యాయ సహాయం కావాల్సిన వారు ఏ విధంగా పొందవచ్చో వివరించారు. చెడు ఆలోచనల వల్ల ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కోవాల్సి వస్తుందో, వాటికి దూరంగా ఉంటూ సమాజంలో మంచి పౌరులుగా ఎలా జీవించాలోనన్న విషయాలను తెలియపర్చి వారిలో పరివర్తన, చైతన్యం కల్పించే ప్రయత్నం చేశారు. సబ్‌జైలర్ పాత్రో, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
91,836 మందికి ఆరోగ్యశ్రీ సేవలు
రాజాం: జిల్లాలో 91,836 మంది 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) కింద సేవలు పొందారని పథకం జిల్లా మేనేజర్ దూబ రాంబాబు తెలిపారు. ఆయన రాజాం సామాజిక ఆస్పత్రిని బుధవారం పరిశీలించారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందిస్తున్న మెనూపై ఆరా తీశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న మెనూను లబ్ధిదారులకు అందించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో మాట్లాడారు. ఆస్పత్రికి అవసరమైన సౌకర్యాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.హరిబాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ కింద రూ.195 కోట్ల విలువైన వైద్యసేవలు అందించినట్టు వెల్లడించారు. డీసీసీబీలో అంతర్గత ఆడిటర్ల నియామకం విజయనగరం అర్బన్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పరిధిలోని 24 బ్రాంచిలలో అంతర్గత ఆడిటర్లను నియమించుకునేందుకు మహాజన సభలో ఆమోదం తెలిపారు. జేసీ ఎస్.సేతుమాధవన్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మూడో మహా జన సభలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి బ్యాంకు ఆర్థిక ఫలితాలపై చర్చించారు. గత నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు కమిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయాలను ఆమోదించారు. 2025–26 ఆర్థిక వార్షిక బడ్జెట్ అంచనాలను సమావేశం కన్వీనర్, డీసీసీబీ సీఈఓ ఉమామహేశ్వరరావు సభ్యులకు వివరించారు. కస్టమర్ డిపాటిట్ పాలసీ, కస్టమర్ సర్వీస్ పాలసీ, డెత్ క్లెయిమ్ పాలసీలపై చర్చించారు. సమావేశంలో నాబార్డు డీడీఎం టి.నాగార్జున, విజయనగరం డీసీఓ సన్యాసినాయుడు, పార్వతీపురం మన్యం జిల్లా డీసీఓ శ్రీరామ్మూర్తి, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. మృత శిశువుతో ఆందోళన శృంగవరపుకోట: శిశువు మృతికి వైద్యులే కారణమంటూ మృత శిశువుతో తల్లి, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన ఎస్.కోట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మ గ్రామానికి చెందిన అరుణ్ భార్య శాంతి ప్రసవం కోసం ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఉదయం 10 గంటల సమయంలో ఆపరేషన్ కోసం ఆస్పత్రి థియేటర్లోకి గర్భిణిని తీసుకెళ్లారు. అప్పటివరకు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పిన వైద్యులు కొద్ది సేపటికి మాట మార్చి శిశువు మృతిచెందినట్టు చెప్పారు. దీనిపై అరుణ్‌తో పాటు బంధువులు ఆందోళనకు గురయ్యారు. సకాలంలో వైద్య సేవలు అందించకపోవడం వల్లే ఆడ శిశువు చనిపోయిందంటూ శాంతితో పాటు బంధువులు, మృత శిశువుతో కలిసి ఆస్పత్రి ఆవరణలో బైఠాయించారు. బిడ్డ మృతికి వైద్యులే కారణమంటూ ఆందోళన చేశారు. ఇదే విషయంపై ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ నీల స్పందిస్తూ ప్రైవేట్స్కాన్ సెంటర్లో చేయించిన స్కాన్ రిపోర్టులో బిడ్డ హార్ట్‌బీట్ బాగుంది. సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించాం. ప్రసవం అవుతున్నప్పుడు బిడ్డ మెడకు రెండు ప్రేగులు చుట్టుకున్నట్టు వైద్యులు చూశారు. బిడ్డ బయటకు వస్తున్న కొద్దీ ప్రేగులు మెడకు బిగిసుకోవడంతో ఊపిరి ఆడక శిశువు మరణించింది. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఎంత మాత్రం లేదని చెప్పారు. -
చిన్నశ్రీను ఇంట విషాదం
● ప్రమాదంలో గాయపడిన కుమారుడి మృతి ● ఐదేళ్లపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన ప్రణీత్‌బాబు ● జెడ్పీ చైర్మన్‌ను పరామర్శించిన వైఎస్సార్సీపీ శ్రేణులు, జిల్లా ప్రజలు ● సంతాపం తెలిపిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)కు పుత్ర వియోగం కలిగింది. ఆయన రెండవ కుమారుడు మజ్జి ప్రణీత్‌బాబు(20) విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. 2020 సంవత్సరం మే 14వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ నాలుగు సంవత్సరాల పదినెలల పాటు మృత్యువుతో పోరాడారు. కరోనా విపత్కర సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించి చికిత్స అందించారు. అనంతరం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని విశాఖ నుంచి విజయనగరంలోని ధర్మపురిలో గల మజ్జి శ్రీనివాసరావు ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ బంధువులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వైఎస్సార్సీపీ శ్రేణులు సందర్శన అనంతరం తోటపాలెంలోని రోటరీ స్వర్గధామంలో బంధువులు, అభిమానుల అశ్రునయనాల నడుమ సంప్రదాయబద్ధంగా మజ్జి శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తిచేశారు. ప్రణీత్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నశ్రీనును మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు తమ అభిమాన నాయకుడు మజ్జి శ్రీనివాసరావు రెండవ కుమారుడు ప్రణీత్‌బాబు మరణవార్త తెలుసుకున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రముఖ నాయకులు, వైస్సార్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంతాపం తెలిపారు. జిల్లా నాయకులతో పాటు వెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, జెడ్పీటీసీ వర్రి నర్సింహమూర్తి, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రణీత్ భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెడ్పీ చైర్మన్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
జిల్లా కేంద్రంలో 43 రోజులపాటు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు విరమణ సమయంలో ఆర్టీసీ అధికారులు అంగీకరించిన డిమాండ్ల పరిష్కారంలో జాప్యం చేస్తే ఉద్యమం తప్పదని ఆర్టీసీ ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి పీజీ రాఫిల్ హెచ్చరించారు. విజయనగరం డిపో ఎదుట బుధవారం భోజన విరామ సమ
రూ.కోటి యంత్రం.. గదికే పరిమితం! విజయనగరం ఫోర్ట్: ‘దేవుడు వరమిచ్చినా పూజరి కరుణించని’ చందంగా ఉంది ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యుల తీరు. రూ.కోటి ఖర్చుతో కొనుగోలుచేసిన అధునాతన డిజిటల్ ఎక్స్‌రే మిషన్‌ను గదికే పరిమితం చేసి... పాత పద్ధతిలో రోగులకు ఎక్స్‌రే సేవలందించడంపై రోగులు మండిపడుతున్నారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఊపిరితిత్తుల సమస్యలు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, వెన్నుముఖ, ఎముకలు సంబంధిత వ్యాధుల నిర్ధారణలో ఎక్స్‌రే కీలకం. దీనికోసం సర్వజన ఆస్పత్రికి ప్రతిరోజూ 100 నుంచి 120 మంది రోగులు వస్తారు. ప్రస్తుత పాత పద్ధతిలో డిజిటల్ ఎక్స్‌రే తీయడానికి ఒక వ్యక్తికి 15 నిమిషాల సమయం పడుతోంది. సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డీఆర్ ఎక్స్‌రే మిషన్‌తో అయితే ఒక వ్యక్తికి ఎక్స్‌రే తీసేందుకు 3 నిమిషాల సమయం చాలు. దీనివల్ల రోగులకు నిరీక్షణ కష్టాలు తప్పుతాయి. ఇదే విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ సంబంగి అప్పలనాయుడు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా డి.ఆర్.ఎక్స్‌రే మిషన్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని, రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యమం తప్పదు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వృథాగా అధునాతన డిజిటల్ ఎక్స్రేమిషన్ ఏర్పాటు చేసి రెండు నెలలైనా ప్రారంభించని వైనం -
సీఎస్‌లకు చేతి చమురు
పరీక్షల నిర్వహణలో వారిపైనే ఆర్థిక భారం విజయనగరం అర్బన్: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్న’ చందంగా ఉంది పదోతరగతి పరీక్ష నిర్వహణ ఖర్చుల వ్యవహారం. ప్రభుత్వం కేటాయించిన నిధులు చాలకపోవడంతో పరీక్షల నిర్వహణ అధికారులకు చేతిచమురు వదులుతోంది. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు పరీక్షగా మారుతోంది. పరీక్షలు పూర్తయ్యేవరకు ఒక్కో విద్యార్థికి కేటాయించిన రూ.10 సరిపోకపోవడంతో కనీసం రూ.100 వరకు సొంత నిధుల నుంచి వెచ్చించాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యేలోగా కేటాయింపులు పెంచాలని, ఇన్విజిలేటర్లకు ఇచ్చే రెమ్యూనరేషన్‌ను పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పరీక్షల నిర్వహణకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.1.42 చొప్పున ఏడు పరీక్షలకు రూ.10లు ప్రభుత్వం మంజూరు చేస్తోంది. 2018లో ఒక్కో విద్యార్థికి కంటింజెంట్ చార్జీగా రూ.5.50 మాత్రమే ఇవ్వగా పెరిగిన ధరల మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023లో ఆ చార్జీని రూ.8కి, మరుసటి ఏడాది రూ.10కి పెంచింది. ఈ ఏడాది చార్జీల పెంపు విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదన్నది ఉపాధ్యాయ సంఘాల మాట. పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్న పత్రాలను తీసుకొని వచ్చి, పరీక్ష అనంతరం సమాధాన పత్రాలను సీల్ చేస్తారు. ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలకు వేర్వేరుగా సంచులు వాడతారు. ఒక్కో సంచికి రెండు నుంచి మూడు మీటర్ల వస్త్రం కొనుగోలుకు, జవాబు పత్రాలను పోస్టాఫీస్‌కు తీసుకుని వెళ్లడానికి రవాణా ఖర్చులను భరించాల్సి వస్తోంది. జవాబు పత్రాలను కట్టి భద్రపరిచేందుకు లక్క, కొవ్వొత్తి, ధారం, స్కెచ్ పెన్నులు, స్టాప్లర్లు, గమ్, వైట్నర్ తదితర వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పరీక్ష కేంద్రంలో మంచినీరును అందుబాటులో ఉంచాలి. ఒక పరీక్ష కేంద్రంలో 100 మంది విద్యార్థులుంటే అక్కడి నిర్వాహణకు రూ.10 వంతున రూ.1,000 కంటింజెన్సీ నిధులు వస్తాయి. ఆ సెంటర్‌కి కావాల్సిన అన్ని వస్తువులను కొనాలంటే ఎంతలేదన్నా రోజుకు కనీసం రూ.600కు పైగా ఖర్చవుతుంది. ఈ లెక్కన కనీసం రూ.6 వేలు వరకు కంటింజెన్సీ నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒక్కో విద్యార్ధికి రోజుకి 1.42 ఇస్తే ఎలా సరిపోతుందని చీఫ్‌లు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ పరీక్షల్లో ఇన్విజిలేటర్లకు రోజుకు రూ.150 వంతున రెమ్యూనరేషన్ ఇస్తుండగా పదో తరగతి ఇన్విజిలేషన్‌కు మాత్రం రోజుకు కేవలం రూ.33 ఇస్తున్నారు. అటెండర్‌కు రూ.20, వాటర్ బాయ్‌కి రూ.17 వంతున భృతిని చెల్లిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అంతకు ముందు కంటే సీఎస్, డీఓలకు రూ.22, ఇన్విజిలేటర్లు, క్లర్క్స్‌కు రూ.11, అటెండర్లకు రూ.6.80, వాటర్ బాయ్‌కి రూ.6 చొంపున పెంపుదల చేసింది. మరోవైపు ఇంటర్, పదోతరగతి పరీక్షలకు పెద్దగా తేడా లేకున్నా, రెమ్యూనరేషన్ చెల్లింపులో మాత్రం తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిర్వహణ ఖర్చులు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు ఇన్విజిలేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీఫ్, డీఓ, కస్టోడియన్లకు రోజుకు ఇచ్చేది రూ.66రూ.33రూ.17ఇదీ లెక్క... ఇన్విజిలేటర్లకూ అన్యాయమే ప్రతి పరీక్ష కేంద్రంలో నిర్వహణ బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్ల (సీఎస్)దే. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్ష నిర్వహణకు 186 మంది చీఫ్‌లు హాజరవుతున్నారు. ప్రభుత్వం నిధులను తక్కువగా విడుదల చేస్తుండడంతో అదనంగా అయ్యే ఖర్చును వారి చేతి నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తోంది. రోజుకు రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా భరించాల్సి ఉంటుందని పలువురు చీఫ్‌లు చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.15 ఇవ్వాలని, అదనంగా రవాణా చార్జీలు మంజూరు చేయాలని చీఫ్‌లు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పరీక్ష కేంద్రాలు 186ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఇవ్వాలి ప్రస్తుత ధరలకు అనుగుణంగా రెమ్యూనిరేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు కంటింజెంట్ చార్జి పరీక్షల నిర్వహణకు ఏ మూలకూ సరిపోవడం లేదు. ప్రభుత్వం సీఎస్, డీవోలతో పాటు ఇన్విజిలేటర్లకు కనీస చార్జీలు చెల్లించక పోవడం దురదృష్ణకరం. – జేఏవీఆర్‌కే ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ రెమ్యూనరేషన్‌ను పెంచాలి ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు చేస్తున్న కేటాయింపులు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఒక విద్యార్థికి ఒక పేపరుకు చెల్లిస్తున్న రూ.1.42 కంటింజెంట్ చార్జి ఏ విధంగా సరిపోతాయో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. ఇన్విజిలేటర్లకు రోజుకు కనీసం రూ.150, చీఫ్, డీఓ, కస్టోడియన్లకు రోజుకు రూ.200 వంతున కేటాయించాలి. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలి. – బంకపల్లి శివప్రసాద్, ఉత్తరాంధ్ర మీడియా ఇన్చార్జ్, పీఆర్టీయూ -
పోక్సో చట్టంపై బాలబాలికలకు అవగాహన
విజయనగరం లీగల్: ప్రస్తుత రోజుల్లో బాలికలు చాలా జాగ్రత్తగా ఉండాలని వారి పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ముందుగా తల్లిదండ్రులు, క్లాస్ టీచర్లకు తెలియజేయాలని జిల్లా జడ్జి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. పోక్సో చట్టంపై బాలబాలికలకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం అవగాహన కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ 2012లో ఏర్పడిన పోక్సో చట్టం గురించి వివరించారు. బాలబాలికలకు న్యాయవ్యవస్థ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఏ సమయంలోనైనా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. బాలల హక్కులను కాపాడడానికి జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు. బాలబాలికలపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారి పట్ల కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. 18 సంవత్సరాల్లోపు విద్యార్థులకు బాల్య దశనుంచే రాజ్యాంగం పట్ల సామాన్యమైన చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవంతో మెలగాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ కోర్టు జడ్జి బి.అప్పలస్వామి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి టీవీ రాజేష్ కుమార్, మండల విద్యాశాఖాధికారి పి.సత్యవతి, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.పర్వీన్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు
పార్వతీపురంటౌన్: బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్ధానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు స్వయం ఉపాధికి సచివాలయాల వద్ద, మీసేవా కేంద్రాల వద్ద, నెట్‌సెంటర్ల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. జనరిక్ మెడికల్ స్టోర్ నిర్వహించాలనుకున్న వారు బి–ఫార్మశీ, డి–పార్మశీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. 21 నుంచి 60ఏళ్ల మధ్య వయస్సు అభ్యర్థి కలిగి ఉండాలన్నారు. ఉచిత టైలరింగ్ శిక్షణకు 21 నుంచి 50ఏళ్ల వయస్సు మధ్య వయస్సు ఉండాలన్నారు. శిక్షణ పూర్తి చేసిన తరువాత కుట్టు మిషన్లు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. కుమ్మరి, మేదర కులాలకు చెందిన వారి కృలవృత్తి నిర్వహించేందుకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22 లోగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. -
బాలల సంక్షేమం కోసం కమిటీలు
విజయనగరం ఫోర్ట్: మిషన్ వాత్సల్య కార్యక్రమం కింద బాలల సంక్షేమం, పరిరక్షణ కోసం గ్రామస్థాయిలో సర్పంచ్ ఽ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో బుధవారం జిల్లా స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గ్రామస్థాయి కమిటీలో మహిళా పోలీస్ కన్వీనర్‌గా ఉంటారని, పంచాయతీ సభ్యులు, ఉపాధ్యాయలు, ఎన్జీఓలు, ఆరోగ్యవర్కర్స్ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. గ్రామస్థాయి సమావేశాల్లో అనాథ పిల్లల్ని, స్కూల్ డ్రాపౌట్స్‌ను గుర్తించాలని చెప్పారు. బాల్య వివాహాలు, ట్రాఫికింగ్, డ్రగ్స్ దోపిడీ తదితర అంశాలపై చర్చించాలని సూచించారు. బాలల హక్కుల సంరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. గ్రామస్థాయి కమిటీలో చర్చించిన అంశాలను జిల్లాస్థాయి కమిటీకి పంపించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో టీనేజీ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహాలపై చర్చ జరగాలని, బాల్యవివాహాలు చేయాలనే అలోచనే తల్లిదండ్రులకు రాకుండా చేయాలన్నారు. బాల్య వివాహ చట్టంపై అవగాహన కల్పించి చట్టంలో ఉన్న శిక్షలపై కూడా తెలిసేలా చూడాలని చెప్పారు. హోటల్స్, కర్మాగారాల్లో పనిచేసే బాలలను గుర్తించాలని కోరారు. సమావేశంలో ఇన్చార్జి ఐసీడీఎస్ పీడీ ప్రసన్న, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ -
రసాయన శాస్త్రంలో నైపుణ్యంతో ఉద్యోగావకాశాలు
● గిరిజన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ విజయనగరం అర్బన్: ఉన్నత విద్యలో రసాయన శాస్త్రంలో నైపుణ్యంతో ఉపాధి, ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ రిజిస్ట్రార్ టి.శ్రీనివాసన్ అన్నారు. ఈ మేరకు స్థానిక గిరిజన యూనివర్సిటీ ప్రాంగణంలో ‘మాలిక్యుయల్స్ టు మెటీరియల్స్’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన ఒక రోజు సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవిష్కరణ, విద్యానైపుణ్యాన్ని పెంపొందించడంలో యూనివర్సిటీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. మెటీరియల్ సైన్స్‌పైనే ప్రపంచం ఆధార పడి ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీలతో కలిసి ప్రపంచాన్ని శాసించే విధంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సులో జర్నల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ చీఫ్ ఎడిటర్, బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్కి చెందిన ప్రొఫెసర్ ఎస్.నటరాజన్, ప్రొఫెసర్ బాలాజీ ఆర్ జాగీర్దార్, ప్రొఫెసర్ కేఆర్ప్రసాద్ మాట్లాడుతూ అధునాతన పద్ధతులలో తయారు చేసిన వివిధ పదార్థాలపై పరిశోధనాత్మక అంశాలను వివరించారు. కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ ముక్కామల శరత్చంద్రబాబు, కో ఆర్డినేటర్ డాక్టర్ సురేష్‌బాబు, డాక్టర్ పడాల కిషోర్ నిర్వహణలో జరిగిన సదస్సులో యూనివర్సిటీ అధ్యాపకులు, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మారిక రోడ్డుకు మోక్షం
● గిరిజనుల హర్షం ● కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులువేపాడ: గిరిశిఖర మారిక గ్రామ గిరిజనుల దశాబ్దాల పోరాటం సఫలీకృతం కావడంతో మారిక రోడ్డు నిర్మాణం చురుగ్గా సాగుతోందని సీపీఎం జిల్లా నాయకుడు చల్లా జగన్ అన్నారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా మారిక తండాలో రెండురోజులు బస చేసిన నాయకులు బుధవారం మారిక సమీపంలో జరుగుతున్న రోడ్డు పనుల వద్దకు చేరుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మారిక గిరిజన గ్రామానికి రోడ్డు కావాలని, స్వాతంత్య్ర ఫలాలు గిరిజనులకు అందాలంటూ 2013, 2017, 2021,2025 సంవత్సరాల్లో రోడ్డుకోసం ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి, వంటావార్పు, కార్యాలయ నిర్బంధం లాంటి పోరాటాల్లో యువత, మహిళలు, పెద్దలు పోరాడి నందున ఆ ఫలితంగా నేడు రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైందన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ జాతీయ ఉపాధిహామీ పథంకం నిధులు రూ.7కోట్లు కేటాయించటమే కాకుండా రోడ్డు నిర్మాణంపై చొరవ చూపించారంటూ కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమ సమస్య పరిష్కారంలో స్థానిక ప్రజాప్రతినిధులు కృషిచేయడంతో పాటు గతంలో ఆసంపూర్తిగా నిలిచిన రోడ్డుపనులు, కొత్తగా మంజూరైన రోడ్డు పనులు ఒకేసారి చేపట్టడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పాలకులు మరింత చొరవచూపి వర్షాకాలంనాటికి రోడ్డునిర్మాణం పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు చలుమూరి శ్యామ్ మారిక పెద్దలు కిలోఆనంద్, గమ్మెల రామకృష్ణ, బాబారావు, అప్పలనాయుడు, అసు, ఆర్జున్, వెంకటరావు,లింగరాజు, కృష్ణ, శ్రీను మహిళలు పాల్గొన్నారు. -
75 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగు లక్ష్యం
బాడంగి: రానున్న ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 75 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగు చేసేందుకు కృషి చేస్తున్నామని ఏపీజీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎం.ఆనందరావు వెల్లడించారు. మండల స్థాయి కన్వర్జెన్సీ సమావేశం స్థానిక వెలుగు మండల సమాఖ్య భవనంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 – 26లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళిక తయారీ చేసేందుకు వీఏఏలు, గ్రామైక్య సంఘాల సభ్యులతో కలసి సమీక్షించారు. గత ఏడాది 259 మంది రైతులకు చెందిన 58 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగు చేయించినట్టు తెలిపారు. ఆయనతో పాటు ఏపీఎం రత్నాకరరావు, వీఏఏలు, వీఓఏలు, సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాల పట్ల పోలీస్ శాఖ అలెర్ట్
విజయనగరం క్రైమ్: సైబర్ నేరాలను అరికట్టేందుకు, కేసుల దర్యాప్తుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో వివిధ పోలీస్స్టేషన్లలో కంప్యూటర్ ఆపరేటర్లగా పని చేస్తున్న కానిస్టేబుల్స్‌కు ఒకరోజు శిక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది.రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు, మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ తరహా నేరాలను నియంత్రించేందుకు నమోదైన కేసుల్లో దర్యాప్తు చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి సిబ్బంది మెరుగుపర్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాలను ఛేదించడంలో సమర్థవంతంగా ఎవరైతే విధులు నిర్వహిస్తారో వారికి తప్పనిసరిగా శాఖలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్నారు. బాధితులు వెంటనే ఫోన్ చేయాలిసైబర్ నేరం జరిగిన వెంటనే బాధితులు1930కు ఫిర్యాదు చేసే విధంగా చూడాలని ఫిర్యాదు అంశాలను ముందుగా పరిశీలించి, అది ఏ తరహా నేరమో గుర్తించాలని సిబ్బందికి సూచించారు. నేరం జరిగిన తీరును తెలుసుకుని, బాధితులను విచారణ చేసిన తరువాత, నేరానికి సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బాధితుడి బ్యాంకు స్టేట్మెంటును పరిశీలించి, నేరానికి పాల్పడిన మోసగాడి బ్యాంకు అకౌంటుకు నగదు ఏవిధంగా బదిలీ అయ్యింది, అక్కడి నుంచి ఇంకేమైనా అకౌంట్స్‌కు నగదు బదిలీ జరిగిందా? లేదా? అన్న విషయాలను గుర్తించాలని చెప్పారు. ఇలా గుర్తించిన బ్యాంకు లావాదేవీలను ఫ్రీజ్ చేసేందుకు సంబంధిత విభాగాలకు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని పేర్కొన్నారు. నేరం జరిగిన గోల్డెన్ అవర్స్‌లో ఫిర్యాదు దారు 1930కు రిపోర్టు చేస్తే, సైబర్ మోసగాడి బ్యాంకు లావాదేవీలను నియంత్రించేందుకు ఉత్తర. ప్రత్యుత్తరాలు సకాలంలో జరిపితే కోల్పోయిన నగదును తిరిగి బాధితుడికి ఇప్పించే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శిక్షణలో సైబర్ అండ్ సోషల్ మీడియా సెల్ సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, కంప్యూటర్ నిపుణులు రామరాజు, కె.ప్రసాద్, జగదీష్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బాధితులు 1930కు ఫిర్యాదు చేయాలి నేరాలు ఛేదించేందుకు నైపుణ్యం మెరుగుపర్చుకోవాలి జిల్లా పోలీస్ కార్యాలయంలో కానిస్టేబుల్స్‌కు ఒకరోజు శిక్షణ -
పాము కాటుతో విద్యార్థిని మృతి
గుర్ల: మండలంలోని బూర్లిపేటలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థిని పాముకాటుతో బుధవారం మృతిచెందింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. బూర్లిపేటకు చెందిన ద్వారపూడి మౌనిక (16) మంగళవారం సాయంత్రం ఇంటి ఆరు బయట ఉన్న వరండాలో కుర్చీలో కుర్చుని సెల్‌ఫోన్ చూసుకుంటూ కుర్చీ కింద ఉన్న నాగుపామును గమనించలేదు. ఇంతలో మౌనిక కాలిపై పాము కాటువేసింది. పాము కాటువేసిన సంగతి కుటుంబసభ్యులకు తెలియజేయడంతో ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మా ర్గమధ్యంలో మృతిచెందింది. మౌనిక నెల్లిమర్ల సీకేఎంజీజే కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతోంది. కూతురు ఆకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరయ్యారు. ఫిర్యాదు మేరకు గుర్ల ఎస్సై నారాయణ రావు బుధవారం కేసు నమోదు చేశారు. -
విద్యుత్ బిల్లుల కాల్చివేత
● ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలంటూ సీపీఎం నిరసన విజయనగరం గంటస్తంభం: విద్యుత్ బిల్లులు తగ్గించి ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో పూల్‌భాగ్ కాలనీ 4వ వార్డులో విద్యుత్ బిల్లులు కాల్చివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్మి వర్గ సభ్యుడు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తి లేదని చెప్పిన చంద్రబాఋ నేడు విద్యుత్ చార్జీలు పెంచి ట్రూ అప్ చార్జీల భారం వేయడం అన్యాయమన్నారు. ట్రూ అప్ చార్జీలను రద్దు చేసి విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ అప్, సర్దుబాటు చార్జీల పేరిట రూ.15 వేల కోట్ల విద్యుత్తు భారం మోపిందన్నారు. అవినీతితో కూడిన సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శాఖ కార్యదర్మి రామాలక్ష్మి, సభ్యులు విజయ, గురయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన మంత్రి యోగా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానంపార్వతీపురంటౌన్: ప్రధానమంత్రి యోగా అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్విజ్ సీఈఓ ఎ.సోమేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తులు, సంస్థలు సమాజంలో యోగాను అంకిత భావంతో ప్రజల్లోకి తీసుకు వెళ్లినవారు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అవార్డులకు ఎంపికై న వారికి రూ. 25 లక్షల నగదు బహుమానం ఉంటుందన్నారు. అర్హత కలిగిన వారు దరఖాస్తులను నిర్ణీత ప్రొఫార్మాలో నేరుగా డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూౖ.మైజీఓవీ.ఐన్ వెబ్సైట్లో హెచ్‌టీటీపీఎస్://ఇన్నొవేషన్ఇండియా.మైజీఓవీ.ఐన్/పీఎం–యెగా–అవార్డులు–2025 లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 10 లీటర్ల సారా స్వాధీనం● ద్విచక్రవాహనం సీజ్ గుమ్మలక్ష్మీపురం (కురుపాం): కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జియ్యమ్మవలస మండలం దత్తివలస గ్రామంలో 10 లీటర్ల సారాను ద్విచక్రవాహనంపై తరలిస్తూ చినమేరంగి గ్రామానికి చెందిన వెలగాడ బాలకృష్ణ పట్టుకున్నట్లు సీఐ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనం, సారాను కురుపాం ఎకై ్సజ్ స్టేషన్ వద్ద చూపించారు. బాలకృష్ణతో పాటు సారా సరఫరా చేసిన సిరిపురం సుధాకర్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. టాటా ఏస్ వాహనం బోల్తా● ఇద్దరికి గాయాలు గంట్యాడ: మండలంలోని లక్కిడాం నుంచి బొండపల్లి మండలంలోని రయింద్రం గ్రామానికి వాటర్ బస్తాలు తీసుకుని వెళ్తుండగా గంట్యాడ మండలంలోని చినమానాపురం జంక్షన్ వద్ద టైర్ పంక్చర్ కావడంతో 15 అడుగుల గోతిలో టాటా ఏస్ వాహనం బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాల య్యాయి. ప్రైవేట్ వాహనంలో వారిని విజయనగరంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై ఫిర్యాదు రాలేదని గంట్యాడ పోలీసులు తెలిపారు. శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఆదాయం లెక్కింపుమక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఎనిమిదవ జాతర ఆదాయాన్ని ఈవో వీవీ.సూర్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం లెక్కించారు. శీఘ్రదర్శనం టిక్కెట్ల ద్వారా రూ.69,700, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.59,760. కేశఖండన టిక్కెట్ల ద్వారా రూ.2,400, మహాఅన్నదానం విరాళాల ద్వారా రూ.92,011, లడ్డూప్రసాదం ద్వారా రూ.61,950, పులిహోర ప్రసాదం ద్వారా రూ.42,250 ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు. మొత్తంగా ఎనిమిదవ జాతరలో రూ.3,28,071 ఆదాయం వచ్చిందని చెప్పారు. పది హిందీ పరీక్షకు 99.53 శాతం హాజరుపార్వతీపురంటౌన్: పదవతరగతి హిందీ పరీక్షకు 99.53 శాతం హాజరు నమోదైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 67 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 10,367 మంది విద్యార్ధులకు గాను 10,319 మంది హాజరయ్యరని, 48 మంది గైరాజరయ్యారయ్యారని పేర్కొన్నారు. 31 మంది స్క్వాడ్ సిబ్బంది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారని తెలిపారు. -
పిచ్చుకపై.. బ్రహ్మాస్త్రాలు..!
తిండి గింజలు లేక ముగ్గు పిండిని తింటున్న ఊర పిచ్చుకలు● కిచకిచల మనుగడకు ముప్పు ● నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవంపర్యావరణ పరిరక్షకులైన, చిరుప్రాణులైన పిచ్చుకలను మానవత్వంతో ఆదరించాలి. బంగారు పిచ్చుకలను పెంచవలసిన బాధ్యత పెరిగింది.అరు బయట తిండి గింజలు వేయడం, చూరుపై చిన్న చిన్న కప్పులతో నీటిని పెట్టడం, ఇంటి సన్స్లేడ్లపై ఖాళీలలో పెట్టిన గూళ్లను కాపాడడం వంటి చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో సెల్‌టవర్స్ ఏర్పాటు లేకుండా రేడియేషన్‌కు దూరం చేయాలి. పిచ్చుకలు తినడంతో తిండి గింజలు నష్టపోతున్నామనే అపొహ విడనాడాలి. పంటపై పడిన కీటకాలు,పురుగులను పిచ్చుకలు తిని రైతుకు మేలు చేస్తాయి. డాక్టర్ జీఎన్‌నాయుడు, పీహెచ్డీ, జువాలజీ, భామిని పిచ్చుకలు అంతరించి పోకుండా కాపాడాలి ఒకప్పుడు పల్లెల్లో గుంపులు గుంపులుగా సందడి చేస్తూ కనిపించే పిచ్చుకలు క్రమేపీ అంతరించిపోతున్నాయి.పర్యావరణ సమతౌల్యం కాపాడడంలో పిచ్చుకలు ముఖ్య భూమిక వహిస్తాయి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలి. సెల్ టవర్స్ దూరంగా ఉండేలా చూడాలి. మనతో సహజీవనం చేసే పిచ్చుకలను స్నేహితులుగా భావించి రక్షించుకోవాలి. కేవీ రమణమూర్తి, సీఈఓ, గ్రీన్‌మెర్సీ సంస్థ, శ్రీకాకుళంభామిని: ఇంటి చూర్లు, లోగిళ్లలో నివాసంతో ఇంటిల్లిపాదికి పిచ్చుకలు ఆనందం పంచేవి. మనుషుల మధ్య మమేకమై సహజీవనం సాగించేలా మనముందే ఎగురుతూ అలరించేవి. నేలబావులపైన వాలిన చెట్లుపైన, పొదలు తుప్పలపైన, ఇంటి ముంగిళ్లలో ఊగిసలాడుతూ అందమైన పిచ్చుక గూళ్లు నిర్మించేవి. అపరూపమైన కళానైపుణ్యంతో నిర్మించిన పిచ్చుక గూళ్లు ఆధునిక ప్రపంచంలోనూ గృహనిర్మాణాలకు ఉదాహరణగా మారాయి. పూరింటి చూరుపై కట్టిన గూళ్లపై వాలుతూ ఊగుతూ, వేలాడుతూ కిచకిచ రావాలతో అలరించేవి. తల్లి ప్రేమకు రుజువు జంటకట్టిన పిచ్చుకల జత చెట్ల ఆకులనుంచి తెచ్చిన మొత్తని నార పీచుతో అల్లి నిర్మించిన పిచ్చుక గూళ్ల నిర్మాణం, రక్షణ వలగా మారిన గూళ్లలో గుడ్లు పెట్టి, పిల్లలు పుట్టే వరకు పొదగడం, దగ్గరుండి వాటిని సంరక్షించడంలో దిట్టగా కనిపించచేవి. ఏరి తెచ్చిన గింజలను పిల్లల నోటికి అందిస్తూ తల్లి ప్రేమకు రుజువుగా నిలిచేవి. పిల్లలు పెరిగి పెద్దవయ్యే వరకు సంరక్షించడం అన్యోన్యమైన జీవన విధానం ప్రతిబంబించేవి. ఆధునికత రూపంలో.. పర్యావరణ హితులైన పిచ్చుకల జీవనంపై ఆధునికత వేటు వేస్తోంది. విద్యుత్ రూపంలో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు గూళ్ల నిర్మాణాలకు అడ్డుకట్ట వేశాయి.సెల్ టవర్ల నుంచి ఉద్భవించే రేడియేషన్ పునరుత్పత్తి లేకుండా చేశాయి. వ్యవసాయ రంగంలో వచ్చిన యాంత్రీకరణతో కళ్లాల్లో తిండి గింజలు కరువై జీవనం కష్టమైంది. వరిచేను కుప్పలు, ధాన్యం రాశులు తగ్గిపోవడం పిచ్చుకల మనుగడకు కష్టంగా మారింది. కాంక్రీట్ భవనాలు పిచ్చుకల వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయి. ధాన్యం నిల్వలు లేకుండా పోవడం, పంటచేలపై క్రిమి సంహారక మందులు పిచ్చుకల మనుగడకు కష్టంగా మారుతున్నాయి. మానవత్వంతో ఆదరించాలి -
నీలగిరి తోటలు దగ్ధం
వేపాడ: మండలంలోని వీలుపర్తి పంచాయతీ శివారు కొత్తూరు గ్రామం సమీపంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నీలగిరి, టేకు తోటలు దగ్ధమయ్యాయి. ఎస్.కోట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో ఫైర్‌స్టేషన్ అధికారి ఎస్.కె మదీనా నేతృత్వంలో సిబ్బంది శ్రీనివాసరావు, లక్ష్మణరావు, వెంకటరావులు సంఘటానా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కొత్తూరు గ్రామానికి చెందిన బోజంకి ఎరుకునాయుడు, బోజంకి ఈశ్వర్రావు, జూరెడ్డి దేముడు తదితర 15 మందికి సంబంధించిన నీలగిరి, టేకు చెట్లు సుమారు పది ఎకరాల్లో కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. సుమారు రూ.నాలుగు లక్షల ఆస్తి నష్టం ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.