
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
● జిల్లా పరిషత్ చైర్మన్
మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: పవిత్ర రంజాన్ సందర్భంగా అల్లాహ్ తన కరుణతో అందరినీ దీవించాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ఆకాంక్షించారు. అందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు, ప్రశాంతత లభించాలని కోరారు. రంజాన్ మాసం జీవితాల్లో వెలుగులు నింపాలనీ, ప్రేమ, శాంతి, సామరస్యాన్ని అందించాలనీ ఆకాంక్షించా రు. సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన ఒక ప్రకటన లో శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో మన హృదయాలను శుద్ధి చేసుకోవాలని, విజయానికి మార్గం సుగమం కావాల ని ఆయన అభిలషించారు.
పైడితల్లి నిత్యన్నదానానికి రూ.లక్ష విరాళం
విజయనగరం టౌన్: సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి నిత్యన్నదానానికి సంబంధించి విజయవాడకు చెందిన మాగంటి బాబు, జ్యోతి దంపతులు ఆదివారం లక్షా 11వేల 111 రూపాయలు విరాళం అందజేశారు. ఈ మేరకు ఆలయ సూపర్‌వైజర్ ఏడుకొండలకు పట్టువ స్త్రాలు, నగదు అందజేశారు. అనంతరం వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలతో దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు తాళ్లపూడి ధనుంజయ్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు రంజాన్ వేడుకలు
విజయనగరం టౌన్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఈద్‌గాలో రంజాన్ వేడుకలు సోమవారం నిర్వహించనున్నట్టు ముస్లిం మతపెద్దలు ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని, ఈద్‌గాలో సామూహిక ప్రార్థనలు చేయడం జరుగుతుందన్నారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్ష ఆచరించిన భక్తులతో దీక్ష విరమణ చేస్తామన్నారు. అనంతరం జకాత్ పేరుతో నిరుపేదలకు దానధర్మాలు చేయనున్నామన్నారు.
ఈకేవైసీ గడువు పెంపు
పార్వతీపురం: జిల్లాలో రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచింది. ఈ మేరకు ఏప్రిల్ నెలాఖరు వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ పంపిణీ పటిష్టంగా అమలు చేసేందుకు కార్డులో ఉన్న సభ్యులందరికీ ఈకేవైసీ ఉండాలని పేర్కొంది. ఈ మేరకు రేషన్ దుకాణాల వద్ద డీలర్లు ఈకేవైసీ చేపట్టారు. జిల్లాలో 15 మండలాల్లో 8,23,638 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉండగా ఇంకా 80 వేల మంది వరకు ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
విరబూసిన బ్రహ్మకమలం
రాజాం సిటీ: పట్టణంలోని పాలకొండ రోడ్డులో హర్షిత్‌నగర్‌లో ఉంటున్న ఉపాధ్యాయురాలు వడ్డి ఉషారాణి ఇంట బ్రహ్మకమలాలు పూశాయి. ఉగాది పండగ వేళ ఇలా పువ్వులు పూయడం ఆనందంగా ఉందని ఉషారాణి తెలిపారు.