రెల్లి కులస్తుల ఆందోళన
విజయనగరం టౌన్: జిల్లాను యూనిట్‌గా చేసి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, రెల్లి కులస్తులకు వర్గీకరణలో రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని, వర్గీకరణ అనేది కులగణన చేపట్టిన తర్వాతనే చేయాలని విజయనగరం రెల్లి సామాజిక వర్గం ప్రతినిధులు బంగారు దుర్గారావు, యర్రంశెట్టి వాలి, శ్రీను తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద ఆందోళన చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి రెల్లికులస్తులకు అన్యాయం చేయవద్దన్నారు. భావితరాలకు ఈ ఫలాలు అందాలంటే వర్గీకరణ విషయంలో తమకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో సామాజిక వర్గ ప్రతినిధులు రామారావు, సతీష్, రమణ, రఘు, సభ్యులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ శాతాన్ని పెంచాలంటూ డిమాండ్
రెల్లి కులస్తుల ఆందోళన


