సాక్షి ప్రతినిధి, విజయనగరం: సారా తాగితే అధోగతి, తాగకుంటే పురోగతి అని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎకై ్సజ్ శాఖ అధికారులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ ఆదేశించారు. సారా నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ఎకై ్సజ్ అధికారులతో నవోదయం 2.0పై శుక్రవారం విజయనగరంలోని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారారహిత గ్రామాలు స్వర్ణాంధ్ర సాధనకు సోపానం కావాలన్నారు. సారా మానేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అంటూ విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. సారా సరఫరాదారుల ఆటకట్టించేందుకు ట్రోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో విజయనగరం జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.శ్రీనాథుడు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు, ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్లు హాజరయ్యారు.
ప్రతి గ్రామంలోనూ సదస్సులు
ఎకై ్సజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ