బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025
కళ్లకు గంతలు కట్టొద్దు
ఎవరి లాభం కోసం..!
అల్లుడు వచ్చేంతకు వరకు అమావాస్య ఆగదన్న చందాన తయారైంది ప్రభుత్వం తీరు. అపరాల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. –IIలో
డాక్టర్ రాసిన చీటీ ఉండదు...
వ్యాధి పేరు చెబితే మందులు ఇచ్చేస్తున్నారు.
రోగి, బంధువులకు చదువురాదు..
అమాయకంగా కనిపిస్తే చాలు...
కాలం చెల్లిన మందులను అంటగట్టేస్తున్నారు.
కొన్ని మందులపై తేదీలు కనిపించకుండా చేస్తున్నారు..
అనుమానం రాకుండా కొత్త తేదీలను ముద్రించి విక్రయిస్తున్నారు.
ఇటీవల ఔషధ నియంత్రణ శాఖ అధికారులు జరిపిన దాడుల్లో విస్తుపోయిన నిజాలు
వెలుగుచూశాయి. ప్రాణాలు నిలిపే మందులే ప్రాణాలు తీస్తాయన్న భయం అధికారుల్లోనే కలిగిందంటే మందుల మాఫియాను అర్థం
చేసుకోవచ్చు.
ఆలివ్‌రిడ్లేలను కాపాడడం మనందరి బాధ్యత
● డీఎఫ్‌ఓ కొండలరావు
పూసపాటిరేగ: సముద్రంలో నివసించే ఆలివ్‌రిడ్లేలను కాపాడడం మనందరి బాధ్యతని డీఎఫ్‌ఓ కొండలరావు అన్నారు. పూసపాటిరేగ మండలం పులిగెడ్డపేట తీరంలో 270 ఆలివ్‌రిడ్లే పిల్లలను సముద్రంలో విడిచిపెట్టారు. ట్రీ ఫౌండేషన్, అటవీశాఖ ఆధ్వర్యంలో 10 రక్షణ కేంద్రాల్లో 517 తాబేళ్ల ద్వారా 56,065 గుడ్లను సంరక్షించినట్టు తెలిపారు. టేకు వలలు, నానాజాతి వలలను మత్స్యకారులు చేపల వేటకు వినియోగించడంతో ఆలివ్‌రిడ్లేలకు ముప్పువాటిల్లుతోందన్నారు. సముద్ర తాబేళ్లను కాపాడ డం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్యసంపద అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్టు రేంజ్ అధికారి అప్పలరాజు, ఫారెస్టు సెక్షన్ అధికారి మధుమోహన్, ట్రీ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ కామయ్య, తదితరులు పాల్గొన్నారు.
రైతు ఉత్త్పతిదారుల
సంఘాలకు నాబార్డు చేయూత
● నాబార్డు డీడీఎం నాగార్జున
నెల్లిమర్ల రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నాబార్డు నుంచి ఆర్థిక సహాయం అందజేస్తామని జిల్లా మేనేజర్ నాగార్జున తెలిపారు. మండలంలోని సతివాడ గ్రామంలో శుభోదయం రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులతో మంగళవారం సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల ఏర్పాటు, డ్రోన్ మిషన్లు, యాంత్రీకరణ పనిముట్లు కొనుగోలు కు సాయం అందజేస్తామన్నారు. రైతులంతా ఒకే మాటపై ఉండి సంఘ అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఇండియా మార్కెటింగ్ జోనల్ ఇన్‌చార్జి గోపాల్‌కృష్ణ గోఖులే, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, బీఆర్‌ఈడీఎస్ సీఈఓ రామకృష్ణరాజు, సీఈఓ పతివాడ సత్యనారాయణ, సర్పంచ్ రేవళ్ల శ్రీనివాసరావు, నాయకులు జమ్ము అప్పలనాయుడు, పంచాది శ్రీరాములనాయుడు, దురగాశి ఎర్రంనాయుడు, మత్స శ్రీనివాసరావు, కంది శ్రీను, డైరెక్టర్లు పాల్గొన్నారు.
సామాజిక, ఆర్థిక సర్వేల
ఆధారంగా ప్రణాళికలు
● జాతీయ శాంపిల్ సర్వే అసిస్టెంట్
డైరెక్టర్ రాజశేఖర్
కొత్తవలస: జాతీయ శాంపిల్ సర్వే నిర్వహించే సామాజిక, ఆర్థిక సర్వేల ఆధారంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తామని ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.రాజశేఖర్ తెలిపారు. మండలంలోని కంటకాపల్లి గ్రామంలో జాతీయ శాంపిల్ సర్వే వజ్రోత్సవాల నిర్వహణలో భాగంగా 2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వే చేస్తామన్నారు. గృహ వినియోగ, ఉద్యోగిత–నిరుద్యోగిత రేటు, సమయ వినియోగం, పంట దిగుబడి, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల సర్వేలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ గణాంకాధికారులు ఎస్.పళ్లంరాజు, ఎస్.వెంకటేశ్వరరావు, కె.వి.సురేష్‌కుమార్, బి.శ్రీనివాసరావు, టి.వేణుగోపాల్, ఆర్.శ్రీనివాసరావు, తహసీల్దార్ బి.నీలకంఠరా వు, ఎంపీడీఓ ఎస్.రమణయ్య, గ్రామ పెద్దలు మదీన అప్పలరమణ పాల్గొన్నారు.
చేపలవలకు చిక్కిన పాము
జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం గ్రామానికి చెందిన బందలుప్పి గోపి బాసంగి ముంపుడులో చేపల కోసం మంగళవారం వేసిన వలకు ఆరడుగుల పొడవున్న పాము చిక్కింది. దీనిని చూసిన గోపి భయంతో పరుగుతీశారు. పరిసరాల్లోని రైతులను పిలిచి వలను బయటకు తీసి పాముకు విముక్తి కల్పించాడు.
● కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్న దుకాణదారులు
● జిల్లాలో 1570 మందుల దుకాణాలు
● డాక్టర్ చీటీ లేకుండా మందుల విక్రయం
● చాలా మందుల దుకాణాల్లో
ఫార్మసిస్టులు లేకుండానే విక్రయాలు
● మత్తు టానిక్‌లకు బానిస అవుతున్న యువత
● మందుల దుకాణాలపై పర్యవేక్షణ
కరువైందన్న ఆరోపణ
దుల దుకాణాల్లో ఫార్మాసిస్టులు లేకుండానే మందులు విక్రయిస్తున్నట్టు సమాచారం. పర్యవేక్షణ కొరవడడంతో మందుల దుకాణాల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మత్తు టానిక్‌లకు బానిస అవుతున్న యువత
గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడిన యు వత సంబంధిత మత్తుపదార్థాలు దొరకని సమయంలో అదేతరహా మత్తును కలిగించే దగ్గు సిరప్‌లను తాగడం అలవాటు చేసుకుంటున్నారు. వీటి ఖరీదు కూడా తక్కువే కావడంతో వీటికి అలవాటు పడుతున్నారు. ఇదే అదునుగా కొంతమంది డాక్టర్ ప్రిస్క్రప్షన్ లేకుండా విక్రయించకూడని కొలిన్ వంటి దగ్గు సిరప్‌లు విక్రయిస్తున్నట్టు తెలిసింది. పరోక్షంగా యువత జీవితాలు నాశనం కావడానికి కొంతమంది మందుల దుకాణాల నిర్వాహకులు కార ణమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజల ప్రాణాలతో చెలగాటం
కాలపరిమితి దాటిన మందులు వాడడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. అదేవిధంగా దగ్గు సిరప్‌లు ఎక్కువగా సేవించడం వల్ల నరాలు దెబ్బతింటాయి. కాలేయం కూడా దెబ్బతిని మృత్యువాత పడే అవకాశం ఉంది. లైసెన్సు లేని వ్యక్తులు దగ్గర మందులు, సర్జికల్ మెటీరియల్స్ కొనుగోలు చేయడం వల్ల రోగులు నష్ట పోవాల్సిన పరిస్థితి. నాణ్యతలేని, కాలపరిమితి దాటిన మందులు విక్రయించే అవకాశం ఉంది. వాటిని రోగులు వినియోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. లైసెన్సు లేకుండా మందులు విక్రయించడం వల్ల ఎటువంటి బిల్లు ఇవ్వరు. దీని వల్ల అతనిపై కోర్టులోగాని మరే ఎక్కడైనా పోరాటం చేయడానికి వీలుకాదు.
విజయనగరం ఫోర్ట్:
‘ విజయనగరం కొత్త ఆగ్రహారంలో ఓ వ్యక్తి లైసెన్సు లేకుండా సర్జికల్ మెటీరియల్ విక్రయిస్తున్నట్టు ఔషధ నియంత్రణ అధికారులకు సమాచారం అందింది. ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేసి అతని వద్ద రూ.3 లక్షల విలువచేసే సర్జికల్ మెటీరియల్‌ను సీజ్ చేశారు. కేసు నమోదు చేశారు.’
‘ తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైసెన్సు లేకుండా మందులు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఔషధ నియంత్రణశాఖ అధికారులు దాడిచేశారు. అతని వద్ద రూ.30 వేలు విలువ చేసే మందులు సీజ్ చేసి అతనిపై కేసు నమోదుచేశారు.’
‘ఇటీవల విజయనగరంలోని రత్నం ఫార్మాస్యూటికల్స్ మందుల దుకాణంలో డాక్టర్ ప్రిస్క్రప్షన్ లేకుండా ప్రీకాఫ్ సిరప్‌లు విక్రయించడం, కాలపరిమితి దాటిన మందులు విక్రయిస్తున్నట్టు విజిలెన్స్, ఔషధ నియంత్రణ అధికారులు నిర్వహించిన దాడుల్లో గుర్తించారు. సుమారు రూ.2 లక్షలు విలువ చేసే మందులను సీజ్ చేసి, కేసు నమోదుచేశారు.’
కొందరికి లైసెన్స్ ఉండదు...కానీ దర్జాగా మందుల దుకాణం నిర్వహిస్తున్నారు. డబ్బులు సంపాదించాలన్న ఆశతో కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్నారు. మరికొందరు అన్నీ ఉన్నా అమాయమైన రోగుల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు. వైద్యల చీటీ లేకుండా అధిక ధరలకు మందులు విక్రయిస్తున్నారు. జిల్లాలో 1570 మందుల దుకాణాలు ఉన్నాయి. అయితే చాలా మం
●నిబంధనలు పాటించని వారిపై చర్యలు
నిబంధనలు పాటించని మందుల దుకాణ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. లైసెన్సు లేకుండా మందులు విక్రయించడం, కాలపరిమితి దాటిన మందులు విక్రయించడం, డాక్టర్ ప్రిస్క్రప్షన్ లేకుండా మందులు విక్రయించడం వంటివి నేరం. అలాంటి వారిపై కేసులు నమోదుచేస్తాం. ఇటీవల జిల్లాలో 11 దుకాణాలపై తనిఖీలు నిర్వహించాం. వీటిలో కాలపరిమితి దాటిన మందులు, వైద్యుని ప్రిస్క్రప్షన్ లేకుండా మందులు విక్రయించడం వంటివి గుర్తించాం. వారికి నోటీస్‌లు ఇచ్చాం. విచారణ అనంతరం కేసులు నమోదు చేస్తాం. – కె.రజిత, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణశాఖ
ఆక్రమణల
తొలగింపు
గజపతినగరం/బోడసింగిపేట: గజపతినగరం మండల కేంద్రానికి సమీపంలోని దావాల పేట రోడ్డు, బ్రిడ్జి, బోడసింగిపేటలో 26వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఆక్రమణలను పోలీసుల సమక్షంలో హైవే, రెవెన్యూ అధికారులు మంగళవారం తొలగించారు. ఆక్రమణలు తొలిగించాలని ఇదివరకే నోటీస్‌లు ఇచ్చినా దుకాణదారులు వినకపోవడంతో చర్యలకు ఉపక్రమించారు. ఒకేసారి నాలుగు జేసీబీలతో వచ్చి ఉన్నఫలంగా 23 దుకాణాలను కూల్చివేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తొలగింపు పనులు కొనసాగాయి. జాతీయ రహదారి పక్కన ఖాళీ ప్రదేశంలో నిరుపేదలు ఏళ్ల తరబడి పూరిగుడిసెలతో పాటు దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. దుకాణాల తొలగింపుతో ఉపాధి కోల్పోయారు. అయితే, ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాల దృష్ట్యా అధికారులు ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి–26 మధ్య నుంచి ఎడమవైపున 28 మీటర్ల వరకు జాతీయ రహదారి స్థలం ఉందని, అంత వరకు తొలగింపులు చేపడతామని ఎన్‌హెచ్ జేఈఈ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. తొలివిడతలో ఎడమవైపున తొలగింపులు చేపడుతున్నట్టు వెల్లడించారు. గజపతినగరం సీఐ జీఏవీ రమణతో పాటు ఎస్సైలు యు.మహేష్, సీతారాం, పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కె.రాజేశ్వరరావు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం
విజయనగరం