విజయనగరం ఫోర్ట్: క్షయ రహిత భారత్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద ర్యాలీని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2025 నాటికి క్షయ వ్యాధిని అంతం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. క్షయ రోగులు అందరూ పూర్తి కాలం మందులు వాడితే వ్యాధి నయం అవుతుందని తెలిపారు. క్షయ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న కఫం పరీక్ష కేంద్రంలో పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన వైద్యసిబ్బందికి ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేశారు. సమావేశంలో డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి, ఎన్‌సీడీపీఓ డాక్టర్ సుబ్రమ్మణ్యం, డీఎంఓ మణి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి