విజయనగరం | - | Sakshi
Sakshi News home page

విజయనగరం

Mar 31 2025 11:08 AM | Updated on Mar 31 2025 11:09 AM

సోమవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2025

వినియోగానికి నోచుకోని నిధులు

జిల్లాలోని అత్యధిక జనాభా ఉన్న వీరఘట్టం మేజర్‌ పంచాయతీకి ఎంతో ఘన చరిత్ర

ఉంది.

8లో

గిరిజన రైతు కంట కన్నీరు..

గిరిజనుల ప్రధాన ఆదాయ వనరుగా

భావిస్తున్న జీడిపంట ఈ ఏడాది దెబ్బతింది.

8లో

విజయనగరం ఫోర్ట్‌:

ధికారంలోకి వస్తే మహిళలు అందరికి ఉచితంగా గ్యాస్‌ ఇస్తాం. ఏడాదికి మూడు సిలిండ ర్లు అందిస్తామని కూటమి నేతలు ఊరూరా ప్రచా రం చేశారు. అధికారంలోకి వచ్చారు... కానీ ఇచ్చిన ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు అమలు మాత్రం పూర్తి స్థాయిలో చేయలేదు. ఏడాదికి మూడు సిలిండర్లు అని చెప్పి 2024 – 25 సంవత్సరంలో ఒక సిలిండర్‌తోనే సరిపెట్టేశారు. ఈ క్రమంలో తొలి ఏడాది కూటమి నేతలు చెప్పిన దానికి విరుద్ధంగా రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ ఒక్క సిలిండ ర్‌ అయినా గ్యాస్‌ బుక్‌ చేసినా లబ్ధిదారులు అందరి కి సబ్సిడీ (రాయితీ) ఇచ్చారంటే అదీ లేదు. అందులో చాలా మందికి రాయితీ ఇవ్వలేదు. దీంతో కూటమి ప్రభుత్వం తీరు పట్ల గ్యాస్‌ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో ఉచిత గ్యాస్‌ కోసం గుర్తించిన

లబ్ధిదారుల సంఖ్య 5.02 లక్షలు

జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్లు 6 లక్షలకు పైగా ఉన్నాయి. ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్‌ కోసం ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులు 5,02,654 మంది. ఇందులో 2024 – 25 సంవత్సరానికి సంబంధించి 4,46,846 మంది గ్యాస్‌ సిలిండర్‌ కోసం బుక్‌ చేసుకున్నారు. 55,808 మంది గ్యాస్‌ బుక్‌ చేసుకోలేదు. వీరిలో ప్రభుత్వం గ్యాస్‌ సబ్సిడీ విడుదల చేసింది 4,42,394 మందికి మాత్రమే. వీరిలో 4,40,373 మందికి మాత్రమే ఉచిత గ్యాస్‌ రాయితీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. 6473 మందికి రాయితీ డబ్బులు నేటికీ జమ కాలేదు.

రాయితీ కింద అందించాల్సిన

నిధులు రూ.36.55 కోట్లు

ఉచిత గ్యాస్‌ పథకం కిందద జిల్లాలో గ్యాస్‌ బుక్‌ చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించి రూ.36.55 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం రూ.32.63 కోట్లు మాత్రమే రిలీజ్‌ చేసింది. ఇందులో లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయిన నిధులు రూ.32.49 కోట్లు. ఇంకా రూ.4.05 కోట్లు నిధులు జమ కావాల్సి ఉంది.

వివిధ కారణాలతో లబ్ధిదారుల్లో కోత

వివిధ కారణాలతో కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్‌ రాయితీని తగ్గించుకోవాలని చూస్తుందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌ బిల్లు ఎక్కువగా వచ్చిందని కొందరికి, ఇంట్లో అంగన్‌వాడీ కార్యకర్త, ఆశ కార్యకర్త వంటి చిరుద్యోగులు ఉన్నా రని మరి కొందరికి ఇలా అనేక కారణాలతో లబ్ధిదారులకు అందించాల్సిన ఉచిత రాయితీని ప్రభుత్వం ఎగ్గొంటేందుకు ప్రయత్నిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విజయనగరం పట్టణంలోని దండు మారమ్మ కల్యాణ మండపం రోడ్డులో గ్యాస్‌ డెలివరీ చేస్తున్న సిబ్బంది

న్యూస్‌రీల్‌

గ్యాస్‌ బుక్‌ చేసిన వారందరికీ పడని నగదు

జిల్లాలో ఉచిత గ్యాస్‌కు అర్హులైన లబ్ధిదారులు 5,02,654 మంది

గ్యాస్‌ బుక్‌ చేసుకున్న వారు

4,46,846 మంది

గ్యాస్‌ వినియోగదారులకు

అందించాల్సిన నిధులు రూ.36.35 కోట్లు

ప్రభుత్వం రీలీజ్‌ చేసింది

రూ.32.63 కోట్లు

లబ్ధిదారులు ఖాతాల్లో జమ అయిన

నిధులు రూ.32.49 కోట్లు

రూ.32.63 కోట్లు విడుదల

ఈ నెల 29వ తేదీ నాటికి ఫ్రీ గ్యాస్‌ లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.32.63 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.32.49 కోట్లు లబ్ధిదారు ల ఖాతాల్లో జమయ్యాయి. మిగతా వారికి ఈ నెల 31వ తేదీ వరకు సమయం ఉన్నందున జమయ్యే అవకాశం ఉంది.

– కె.మధుసూదనరావు,

జిల్లా పౌర సరఫరాల అధికారి

విజయనగరం1
1/2

విజయనగరం

విజయనగరం2
2/2

విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement