విజయనగరం జిల్లాలో పలు చోట్ల ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువజాము వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నువ్వు, అరటి, మొక్కజొన్న, బొప్పాయి
పంటలకు నష్టం వాటిల్లింది. పొలాల్లో నూర్పిడిచేసిన ధాన్యం, మొక్కజొన్న పిక్కలు తడిసిముద్దయ్యాయి. వాటిని అరబెట్టే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. అకాల వర్షం నష్టం మిగిల్చిందంటూ కొందరు రైతులు వాపోతుండగా, వేసవి దుక్కులకు ఉపకరిస్తుందని మరికొందరు చెబుతున్నారు.
– రాజాం/రేగిడి
అకాల వర్షం.. రైతుకు నష్టం


