ఆరోగ్య శ్రీ (ఎన్‌టీఆర్ వైద్యసేవ) సిబ్బందికి అంతర్గత పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్, డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ఆరోగ్య మిత్రలు సోమవారం ఆందోళన చేశారు. డిమాండ్లను వినిపించారు. ఈ సందర్భంగా ఏపీ ఆరోగ్యమిత్ర అవుట్ సోర్సింగ్,
కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు జె.ప్రదీప్ మాట్లాడుతూ ఎన్‌టీఆర్ వైద్య
సేవ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బంది 17 సంవత్సరాల సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుని
కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఆరోగ్య మిత్రలకు డీపీఓ కేడర్ అమలు చేయాలన్నారు. ఆరోగ్యశ్రీలో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి రూ.15 లక్షల
ఎక్స్‌గ్రేషియా, రిటైర్‌మెంట్ బెనిఫిట్ రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజీ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాజారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
– విజయనగరం ఫోర్ట్


