గోకులంలోనూ.. తమ్ముళ్ల గోకుడు! | - | Sakshi
Sakshi News home page

గోకులంలోనూ.. తమ్ముళ్ల గోకుడు!

Mar 29 2025 12:40 AM | Updated on Mar 29 2025 12:39 AM

గోకులం షెడ్‌కు అదనంగా

కమ్మలతో వేసుకున్న పాక

డిజైన్‌ సరిగా లేదని రైతులు వాపోతున్న మినీ గోకులం షెడ్‌

పంచాయతీ తీర్మానాలు లేకుండానే

పశువుల షెడ్‌

టీడీపీ నాయకులు, కార్యకర్తలకే

గోకులాలు మంజూరు

అసలైన పాడిరైతులకు మొండిచేయి

షెడ్‌ల నిర్మాణ పనులకూ టీడీపీ

నాయకులే కాంట్రాక్టర్లు

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

శువుల సంరక్షణ కోసం ఉద్దేశించిన మినీ గోకులాలు టీడీపీ నాయకులు, కార్యకర్తల జేబులు నింపుతున్నాయి. పాడి రైతులకు దక్కాల్సిన ఈ పథకం టీడీపీ నాయకుల సిఫారసు ఉన్నవారికే మంజూరు చేస్తున్నారు. వాస్తవానికి గ్రామ పంచాయతీ తీర్మానంతో మంజూరు చేయాలన్న నిబంధనకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను డమ్మీలను చేసేసి టీడీపీ నాయకులే చక్రం తిప్పుతున్నారు. జిల్లాలో రెండు దఫాల్లో దాదాపు 1900 మినీ గోకులాలు మంజూరయ్యాయి. వాటిలో వెయ్యి వరకూ నిర్మాణం పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద రూ.8.50 కోట్ల మేర అధికారులు ఎఫ్‌టీవో జనరేట్‌ చేశారు. జనవరి 15వ తేదీ తర్వాత నుంచి జరిగిన నిర్మాణాలకు బిల్లులు చెల్లించాల్సి ఉంది.

నిబంధనలకు తిలోదకాలు...

గోకులం రైతు సొంత భూమిలో నిర్మించాలి. పశువులు కూడా ఉండాలి. కానీ చాలా చోట్ల ప్రభుత్వ భూమిలో కూడా గోకులం మంజూరు చేసేశారు. అంతే కాదు వాటికి ల్యాండ్‌ పొజిషన్‌ సర్టిఫికెట్‌ సైతం రెవెన్యూ అధికారులు ఇచ్చేయడం గమనార్హం. కొంతమందికి పశువులు లేకపోయినా గోకులం షెడ్‌ మాత్రం వచ్చేసింది.

పూసపాటిరేగ మండలంలోని జనసేన పార్టీకి చెందిన ఓ నాయకుడు చెప్పినవారికే గోకులం షెడ్‌లు మంజూరవుతున్నాయి. నెల్లిమర్ల మండలంలో 58 షెడ్లు టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులకే కేటాయించారు.

దోపిడీ మారలేదు...

టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ జేబులు నింపుకోవడానికి గోకులం షెడ్లు బాగా ఉపయోగపడుతున్నాయన్నది జనంమాట. గతంలో 2014–2019 టీడీపీ ప్రభుత్వపాలనలోనూ గోకులాల పేరుతో లక్షలాది రూపాయల దుర్వినియోగం తెలిసిందే. నాటి తరహాలోనే ఇప్పుడీ కూటమి ప్రభుత్వంలోనూ గోకులాలను తమ దోపిడీకి వాడుకుంటున్నారు. విజయనగరం మండల పరిధిలో తొలి విడతలో 26, రెండో విడతలో 74 గోకులం షెడ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 50 షెడ్లు నిర్మాణాలు పూర్తి కాగా మిగతా 50 షెడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.

పశువుల షెడ్‌ అయినా చెప్పాల్సిందే....

అనర్హులకే గోకులం...

అంతా ‘పసుపు’ మయం...

చీపురుపల్లి మండలంలో 17, గరివిడి మండలంలో పది, గుర్ల మండలంలో 52, మెరకముడిదాం మండలంలో రెండు గోకులాల నిర్మాణం పూర్తయ్యింది. వాటి లబ్ధిదారులంతా టీడీపీ నాయకులు, కార్యకర్తలే. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో నిర్మించిన వీటికి టీడీపీ రంగు వేసేస్తున్నారు.

కూటమి ప్రభుత్వ పాలనలో పశువుల షెడ్లు, గొర్రెల షెడ్లు, పౌల్టీల షెడ్లు ఏవైనా సరే అర్హత కన్నా మంజూరు విషయంలో పసుపు రాజకీయం, పక్షపాత ధోరణే కనిపిస్తోంది. షెడ్‌ కావాలంటే అధికార పార్టీకి చెందినవారైనా అయి ఉండాలి. లేదంటే ఆ నాయకుల సిఫార్సులైనా ఉండాలనేదీ రివాజుగా మారిపోయింది. ఎస్‌.కోట మండలంలో 108 గోకులం షెడ్లు మంజూరైతే వాటి లబ్ధిదారులంతా టీడీపీ వారే.

రాజాం నియోజకవర్గంలో గోకులాలు అర్హుల కంటే అనర్హులకే అధికంగా దక్కాయి. రాజాం మండలంలో 13, వంగర మండలంలో 11, సంతకవిటి మండలంలో నాలుగు, రేగిడి మండలంలో 37 మంజూరుకాగా ఇప్పటివరకూ రాజాంలో మూడుచోట్ల, సంతకవిటిలో రెండుచోట్ల, రేగిడిలో మూడుచోట్ల మాత్రమే నిర్మాణం పూర్తి అయ్యింది. పూర్తయినవాటిని కూడా పశువులకు ఉపయోగించకుండా వాహనాల పార్కింగ్‌కు, వ్యాపార సామాగ్రి భద్రపర్చుకోవడానికి, మంచాలు, కుర్చీలు వేసుకోవడానికి వాడుకుంటున్నారు.

గోకులంలోనూ.. తమ్ముళ్ల గోకుడు! 1
1/5

గోకులంలోనూ.. తమ్ముళ్ల గోకుడు!

గోకులంలోనూ.. తమ్ముళ్ల గోకుడు! 2
2/5

గోకులంలోనూ.. తమ్ముళ్ల గోకుడు!

గోకులంలోనూ.. తమ్ముళ్ల గోకుడు! 3
3/5

గోకులంలోనూ.. తమ్ముళ్ల గోకుడు!

గోకులంలోనూ.. తమ్ముళ్ల గోకుడు! 4
4/5

గోకులంలోనూ.. తమ్ముళ్ల గోకుడు!

గోకులంలోనూ.. తమ్ముళ్ల గోకుడు! 5
5/5

గోకులంలోనూ.. తమ్ముళ్ల గోకుడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement