–8లో
‘జామి మండలం భీమసింగి పంచాయతీ పరిధిలో కొత్త భీమసింగి, యాతపాలెం, చిల్ల పాలెం, సోమయాజుల పాలెం, తెలగపాలెం, పీతల పాలెం, కంది పాలెం గ్రామాలున్నాయి. అన్నిగ్రామాల్లోనూ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ‘మోడల్ ప్రైమరీ స్కూల్’ విధానంలో ఆయా పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను భీమసింగి పాఠశాలకు తరలించనున్నారు. ఆయా గ్రామాలకు సుమారు 2 నుంచి 5 కిలోమీటర్ల వరకు దూరంలో ఉన్న పాఠశాలకు చిన్నారులు వెళ్లి చదువుకోవడం కష్టమన్నది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వాదన. దీనివల్ల డ్రాపౌట్స్ పెరుగుతారని, ఈ విద్యావిధానం సరికాదంటూ ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే పలు పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. పాఠశాలలు విలీనం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.’
‘పూసపాటిరేగ మండలంలోని పతివాడ పంచాయతీ పరిధిలో చినపతివాడ, రాయుడుపేట, బర్రిపేట, తమ్మయ్యపాలెం గ్రామాలున్నాయి. అన్ని గ్రామాల్లోనూ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. చిన్నారుల చదువుకు అవే ఆధారం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ నుంచి 3, 4, 5 తరగతులను తరలిస్తే పాఠశాలలు నిర్వీర్యమవుతాయన్నది గ్రామస్తుల వాదన.’
విజయనగరం అర్బన్:
కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ‘మోడల్ ప్రైమరీ స్కూల్’ విధానంపై అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ కమిటీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే జిల్లాలో పలు పాఠశాలల వద్ద తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. అయితే, కూటమి ప్రభుత్వం కొత్త విద్యావిధానంపై పునరాలోచించకుండా విలీనం కుట్ర కత్తిని ఉపాధ్యాయుల మెడపై పెట్టి చేయించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. విద్యా సంస్కరణ ప్రక్రియను ఆయా పాఠశాల స్కూల్ కమిటీ సభ్యులు అంగీకరిస్తున్నట్టు తీర్మానం చేసి విధిగా ఎంఈఓ లాగిన్‌లో ప్రతి స్కూల్ హెచ్‌ఎం అప్‌లోడ్ చేయాలి. తమ గ్రామంలోని స్కూల్‌లోనే 3, 4, 5వ తరగతులు ఉండాలని పలు స్కూళ్ల ఎస్‌ఎంసీలు తీర్మానాలు చేస్తున్నారు. అలా తరగతుల విలీనాన్ని ఎస్‌ఎంసీ అంగీకరించని స్కూళ్లకు చెందిన ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ సమక్షంలో కారణాలు వివరించాలన్న నిబంధన ప్రభుత్వం పెట్టడంతో ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. మండల స్థాయిలో ఎంఈఓలు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు విలీన ప్రక్రియను వివరించి ఒప్పించాలని, మండలంలోని ఏ క్లస్టర్‌లోని పాఠశాలను ఎలా మార్పుచేశారో చెప్పాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వీటన్నింటినీ చూసిన చిన్నారుల తల్లిదండ్రులు ఉన్నబడులను మూసివేసే ప్రక్రియను కూటమి ప్రభుత్వం ప్రారంభించిందని విమర్శిస్తున్నారు.
ప్రచారం ఒకటైతే...
ఓ వైపు పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో 934 పంచాయతీలు ఉండగా 60 మంది విద్యార్థుల నమోదు నిబంధనను పరిగణలోకి తీసుకుంటే కనీసం 150 మోడల్ స్కూళ్లు కూడా ఏర్పడని పరిస్థితి ఉంది. 60 మంది విద్యార్థులు నమోదు ఉన్న పాఠశాలలను మాత్రమే మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా మారుస్తామని, అంతమంది విద్యార్థులు లేకుంటే సమీపంలోని ఇతర ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులను తరలించాలని ఎంఈఓలకు మౌఖిక ఆదేశాలు ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నూతనంగా ఏర్పాటుచేసే మోడల్ ప్రాథమిక పాఠశాలలు గ్రామానికి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం కావడంతో గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ ప్రక్రియను వ్యతరేకిస్తూ ఇప్పటికే కలెక్టర్‌కు వినతిపత్రాలు సైతం అందజేశారు.
ఇదేం
విధానం..
‘మోడల్ ప్రైమరీ’ పేరుతో
స్కూళ్ల విలీనానికి చర్యలు
ఎస్‌ఎంసీలు ‘నో’ చెప్పినా అంగీకార పత్రాలు ఇవ్వాల్సిందేనంటూ హుకుం
అంగీకరించకుంటే హెచ్‌ఎంలపై చర్యలు తప్పవని హెచ్చరిక
టీచర్లపై విలీన ఒత్తిడి తగదంటున్న ఉపాధ్యాయ సంఘాలు
ఊరి బడిని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాడు–నేడు నిధులతో సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసింది. చదువుతోనే ఆర్థిక వికాసం సాధ్యమని, పేదకుటుంబాల పిల్లలు అంతర్జాతీయ అవకాశాలు అందుకునేలా విద్యాసంస్కరణలు అమలుచేసింది. వీటిని వినియోగించుకోకుండా పాఠశాలలు విలీనం చేయడాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ దశలో విలీన ప్రక్రియను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు కలిపి పూర్తిచేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు, హెచ్చరికలు వస్తుండడంపై కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
60 మందితో మోడల్ ప్రైమరీ స్కూల్స్
కొత్తగా ఏర్పాటు చేస్తున్న మోడల్ మ్రైమరీ స్కూల్స్ ప్రతి పంచాయతీలో ప్రారంభించనున్నాం. కనీసం 60 మంది విద్యార్థులుండేలా చూడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో నిర్దేశిత సంఖ్య కంటే తక్కువ మంది విద్యార్థులుంటే అక్కడ మౌలిక సదుపాయాలను పరిశీలించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో క్లస్టర్ల ఆధారంగా స్థానిక పరిశీలన అనంతరం ఐదు బడుల విలీనాన్ని అమల్లోకి తెస్తారు.
– యూ.మాణిక్యంనాయుడు, డీఈఓ