విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం పోలీసు వెల్ఫేర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి, పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని చెప్పారు.
ఆకట్టుకున్న గుర్రాల పరుగు ప్రదర్శన
వేపాడ: మండలంలోని బానాది గ్రామంలో అభయాంజనేయస్వామి తీర్థం సందర్భంగా నిర్వహించిన గుర్రాల పరుగు ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ పరుగు ప్రదర్శనలో 12 గుర్రాలు పాల్గొన్నాయి. వాటిలో రామన్న పాలెంకు చెందిన విక్రమ్ గుర్రం ప్రథమస్థానంలో నిలిచి రూ.12 వేలు, రెండోస్థానంలో చేనుల అగ్రహారానికి చెందిన మణి జెర్సీ నిలిచి రూ. పదివేలు సాధించాయి. మూడో స్థానంలో రామన్నపాలెంకు చెందిన చోడమాంబిక గుర్రం, నాల్గో స్థానంలో ఎల్.కోటకు చెందిన సింగపూర్ సత్యనారాయణ గుర్రం నిలిచి నగదు బహుమతులు సాధించాయి. విజేతలకు ఆలయ ధర్మకర్తలు, పెద్దలు కమిటీ సభ్యులు నగదు బహమతులు అందజేశారు.
‘గేట్’ లో కార్తికేయ కుశల్ కుమార్‌కు 79వ ర్యాంక్
విజయనగరం అర్బన్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్–2025) ఫలితాల్లో పట్టణ విద్యార్థి గంట కార్తికేయ కుశల్ కుమార్ జాతీయ ర్యాంక్ 79 సాధించాడు. గేట్‌లోని ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (ఈసీఈ) సబ్జెక్టులో 842 స్కోర్‌తో 79వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. కార్తికేయ బీటెక్ కాలికట్ ఎన్‌ఐటీలో చదివాడు. మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ సాధించిన కార్తికేయ తండ్రి జి.సునీల్ కుమార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి శోభ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయిని.
అదృశ్యం కేసు నమోదు
పార్వతీపురం రూరల్: మండలంలోని అడ్డాపుశీల గ్రామానికి చెందిన నీలయ్య జనవరి 20 నుంచి ఆచూకీ లేకపోవడంతో ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై బి.సంతోషి తెలిపారు. బంధువులు, పరిచయస్తుల ఇళ్ల వద్ద భర్త ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందంటూ భార్య ఫిర్యాదు చేసిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మెట్లు కూలి మహిళా కూలీ మృతి
● ఇద్దరికి గాయాలు
పీఎంపాలెం: నిర్మాణంలో ఉన్న భవనం మెట్లు కూలిపోయిన ఘటనలో మహిళా కూలీ సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలైంది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పీఎంపాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 8వ వార్డు పరిధి పనోరమ హిల్స్ వద్ద ఐకానికా గ్రాండ్ విల్లా నంబరు 121 నిర్మాణంలో ఉంది. ఈ భవనం మెట్ల నిర్మాణ లోపం కారణంగా రెండవ అంతస్తు నుంచి కూలిపోయి.. అదే భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో పని చేస్తున్న మహిళా కూలీ నీలరోతు రామలక్ష్మిపై పడ్డాయి. విజయనగరం జిల్లా మొరకముడిదాం మండలం వేముల గ్రామానికి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే ఘటనలో విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చౌడంతవలస గ్రామానికి చెందిన టి.ఆదినారాయణ వెన్నుపూస దెబ్బతింది. భీమిలి చేపలుప్పాడకు చెందిన కోడా అమ్మాజమ్మ కాలు విరిగి బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాయత్రీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ భాస్కర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే
జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే
జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే
జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే