ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌ను సందర్శించిన డీఐజీ
డెంకాడ: చింతలవలసలోని ఏపీఎస్పీ ఐదవ బెటాలియన్‌ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి గురువారం సందర్శించారు. ఆయనకు బెటాలియన్ కమాండెంట్ మాలికాగార్గ్ మొక్కను అందించి స్వాగతం పలికారు. బెటాలియన్‌లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో మౌలిక వసతులను డీఐజీ పరిశీలించా రు. తరగతి గదులు, ఆఫీస్, వంటగది, డైనింగ్ హాల్, స్టోర్, వాష్ రూంలను పరిశీలించారు. మినరల్ వాటర్‌ప్లాంట్, లైబ్రరీ, పరేడ్ గ్రౌండ్ స్థితిగతులను మాలికాగార్గ్‌ను అడిగి తెలుసుకున్నారు. అదనపు వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్న టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకు న్నారు. డీఐజీ వెంట ఎస్పీ వకుల్‌జిందాల్, ఉన్నారు.


