పార్వతీపురంటౌన్: బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్ధానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు స్వయం ఉపాధికి సచివాలయాల వద్ద, మీసేవా కేంద్రాల వద్ద, నెట్‌సెంటర్ల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. జనరిక్ మెడికల్ స్టోర్ నిర్వహించాలనుకున్న వారు బి–ఫార్మశీ, డి–పార్మశీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. 21 నుంచి 60ఏళ్ల మధ్య వయస్సు అభ్యర్థి కలిగి ఉండాలన్నారు. ఉచిత టైలరింగ్ శిక్షణకు 21 నుంచి 50ఏళ్ల వయస్సు మధ్య వయస్సు ఉండాలన్నారు. శిక్షణ పూర్తి చేసిన తరువాత కుట్టు మిషన్లు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. కుమ్మరి, మేదర కులాలకు చెందిన వారి కృలవృత్తి నిర్వహించేందుకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22 లోగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు.