విజయనగరం: జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావును వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం పరామర్శించారు. ఇటీవల జెడ్పీ చైర్మన్ చిన్న కుమారుడు మృతిచెందిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఆయనను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు మృతిచెందిన ప్రణీత్ బాబు చిత్రపటం వద్ద పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, తుని మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా, పాలకొండ మాజీ ఎమ్మెల్యే తలేభద్రయ్య, ప్రస్తుత కూటమి ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు, మాజీ స్మార్ట్ సిటీ చైర్మన్ జీవీ వెంకటేశ్వరరావు, మాజీ వుడా చైర్మన్ రవి రాజు, వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు పరామర్శించిన వారిలో ఉన్నారు.