విజయనగరం టౌన్: స్థానిక మన్నార్ రాజగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రాజెక్ర్ట్ చైర్మన్ బొడ్డు వెంకటేశ్వర ప్రసాద్ (పండు) నేతృత్వంలో వేదపండితులు శ్రీ ధన్వంతరి హోమాన్ని ఆద్యంతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 60 మంది రుత్విక్కులు, 54 హోమగుండాలు, 163 మంది దంపతులతో అంగరంగ వైభవంగా యాగప్రక్రియ నిర్వహించారు. ఆరోగ్యప్రదాత శ్రీ ధన్వంతరికి ప్రత్యేక పూజలు చేశారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సభ్యులు సేవలందించారు. కార్యక్రమంలో సురేష్, రమేష్, గోపాల్ జగదీష్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో ధన్వంతరి హోమం