విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక (ఫ్యాప్టో) జిల్లా నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పరిశీలకులు, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ చిరంజీవి సమక్షంలో విజయనగరం యూత్ హాస్టల్‌లో గురువారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. జిల్లా ఫ్యాప్టో చైర్మన్‌గా పాలితేరు శ్రీనివాస్ (ఏపీటీఎఫ్ 257), కో చైర్మన్‌గా లోపింటి శివప్రసాదరావు (ఎస్సీఎస్టీయూఎస్), డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా జేవీఆర్‌కే ఈశ్వరరావు (యూటీఎఫ్), ఎన్‌వీ పైడిరాజు (ఏపీటీఎప్ 1938), సెక్రటరీగా వంకర రమణ (ఏపీపీటీఏ) ఎన్నికయ్యారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ పలు డిమాండ్‌లను ప్రకటించింది. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, డీఏ బకాయిలు, పీఆర్‌సీ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సదాశివరావు, డి.ఈశ్వరరావు, డి.శ్యామ్, శ్రీనివాసరావు, షేక్ బుకారిబాబు, కె.జోగారావు, సీహెచ్ సూరిబాబు, బలరామినాయుడు, వెంకట శ్రీనివాస్, అప్పారావు, భాస్కరరావు, గోవిందరావు, ఎస్‌ఎస్‌దొర, నాయుడు తదితరులు పాల్గొన్నారు.