● మురళీరాజు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
పూసపాటిరేగ: పూసపాటిరేగకు చెందిన కలిదిండి వెంకట మురళీరాజు కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ఆపన్నహస్తం అందించింది. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన పైడి భీమవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకట మురళీరాజు మృతి చెందారు. కుటుంబ పెద్ద దిక్కు మరణాన్ని తట్టుకోలేని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. విషయాన్ని నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని మురళీరాజు భార్య సుష్మ బ్యాంకు ఖాతాలో జమ చేయించారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన కార్యకర్త కుటుంబాన్ని ఆదుకున్న జగన్‌మోహన్‌రెడ్డి, బడ్డుకొండ అప్పలనాయుడు, జెడ్పీ చైర్మ న్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీపీ మహంతి కల్యాణి, సోషల్ మీడియా కన్వీనర్ ఎ.వాసునాయుడుకు సుష్మ కృతజ్ఞతలు తెలిపారు.