బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. గోకులాల నిర్మాణ పనులన్నీ వారే తీసుకుంటున్నారు. బాడంగి మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఏకంగా 24 షెడ్ల కాంట్రాక్టు తీసుకోవడమే దీనికి నిదర్శనం. బొబ్బిలి మండలంలో 54, తెర్లాం మండలంలో 55, బాడంగి మండలంలో 75, రామభద్రపురం మండలంలో 58 గోకులాలు మంజూరయ్యాయి. టీడీపీ కార్యకర్తలు, నాయకులైతే చాలు పాడి రైతులు కాకపోయినా ఫర్వాలేదన్నట్లుగా పంచేశారు. కొంతమంది పాడిరైతులైనా, వారికి అర్హత ఉన్నా కేవలం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులనే కారణంతో దరఖాస్తులను పక్కన పడేస్తున్నారు.
తమ్ముళ్లే కాంట్రాక్టర్లు


