విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 275 వినతులు అందాయి. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 117, దేవాదాయ శాఖకు 46, పోలీస్‌శాఖకు 31, డీఆర్‌డీఏకు 19, జిల్లా పంచాయతీ రాజ్ శాఖకు 10, విద్యుత్ పంపిణీ సంస్థకు 5, వైద్యారోగ్యశాఖకు ఐదు, పాఠశాల విద్యాశాఖకు 4 చొప్పున వినతులు అందగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవిగా నమోదయ్యాయి. వినతులను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళి, ప్రమీలా గాంధీ స్వీకరించారు.
ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 42 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించేందుకు ఎస్పీ వకుల్ జిందల్ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీవకుల్ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, వాటి పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 42 ఫిర్యాదులు ఆయన స్వీకరించారు. ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 15, కుటుంబ కలహాలకు సంబంధించి 4, మోసాలకు పాల్పడినట్లు 8, ఇతర అంశాలపై 15 ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీ ఆర్బీ సీఐ శంకర్రావు, ఎస్బీ సీఐలు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 275 అర్జీలు


