
పాము కాటుతో విద్యార్థిని మృతి
గుర్ల: మండలంలోని బూర్లిపేటలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థిని పాముకాటుతో బుధవారం మృతిచెందింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. బూర్లిపేటకు చెందిన ద్వారపూడి మౌనిక (16) మంగళవారం సాయంత్రం ఇంటి ఆరు బయట ఉన్న వరండాలో కుర్చీలో కుర్చుని సెల్‌ఫోన్ చూసుకుంటూ కుర్చీ కింద ఉన్న నాగుపామును గమనించలేదు. ఇంతలో మౌనిక కాలిపై పాము కాటువేసింది. పాము కాటువేసిన సంగతి కుటుంబసభ్యులకు తెలియజేయడంతో ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మా ర్గమధ్యంలో మృతిచెందింది. మౌనిక నెల్లిమర్ల సీకేఎంజీజే కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతోంది. కూతురు ఆకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరయ్యారు. ఫిర్యాదు మేరకు గుర్ల ఎస్సై నారాయణ రావు బుధవారం కేసు నమోదు చేశారు.