బొబ్బిలి మండలం భోజరాజపురం వద్ద
నత్తనడకన సాగుతున్న వంతెన పనులు
ఈ వంతెన చూశారా? బొబ్బిలి మండలం భోజరాజపురం వద్ద వేగావతి నదిపై గత ప్రభుత్వం తలపెట్టిన వంతెన ఇది. దీని నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. రూ.2 కోట్ల మేరకు బిల్లులు కూడా చెల్లించింది. ఇంతలో ప్రభుత్వం మారింది. కాంట్రాక్టర్ మాత్రం పనులు కొనసాగిస్తూ పిల్లర్ల వరకు నిర్మాణం పూర్తిచేశారు. రూ.5 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవడం లేదు. పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు లేకపోవడంతో పనులు నత్తనడకగా సాగుతున్నాయి. వంతెన నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందోనన్న ఆందోళన స్థానిక ప్రజల్లో నెలకొంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం/బొబ్బిలి:
కొత్త ప్రభుత్వం వచ్చాక జిల్లాలో అభివృద్ధి పనులు పడకేశాయి. రోడ్లు, వంతెన నిర్మాణాలను పూర్తిచేస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడమే తప్ప పనుల్లో పురోగతి కనిపించడం లేదు. దీనంతటికీ బిల్లుల చెల్లింపులో జాప్యమే కారణంగా కనిపిస్తోంది. గత వర్షాకాలంలో పాడైన రోడ్లను ముందుగా మరమ్మతులు చేస్తామని చెప్పి సగం రహదారులను మొదటి విడతగా ఎంచుకున్న కూటమి ప్రభుత్వం వాటితోనే మమ అనిపించింది. ఆ పనులను సగంలోనే నిలిపివేసింది. వాటికి కూడా పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించలేదు. పై పెచ్చు రెండో విడత పనులు కూడా నిలిచిపోయాయి.
రోడ్ల బిల్లులు
రూ.49 కోట్ల మేర పెండింగ్
కూటమి ప్రభుత్వం వచ్చాక పంచాయతీ రాజ్ రోడ్ల బిల్లులు పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉండిపోయాయి. బొబ్బిలి, తెర్లాం, బాడంగి, రామభద్రపురం ప్రాంతాల్లో 22 రోడ్ల పనులు చేస్తామని ప్రకటించగా కేవలం కొన్నిరోడ్లను మాత్రమే పూర్తిచేసింది. రూ.63 కోట్ల విలువైన పనులకు 22 రోడ్లలో 4 ప్రారంభానికి నోచుకోలేదు. మిగతా రహదారులు నిర్మాణాల కోసం పనులు ప్రారంభించినా బిల్లుల చెల్లింపు జరగక నిలిచిపోయాయి. రూ.63 కోట్ల బిల్లులకు రూ.14 కోట్లు మాత్రమే బిల్లుల చెల్లింపులు జరగ్గా మిగతా రూ.49 కోట్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. కాంట్రాక్టర్, రోడ్డుపై వాహనాలు నడిపిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఆర్‌అండ్‌బీలో కొద్దిపాటి మరమ్మతులు పనులు చేపట్టి ప్రచారం చేసుకున్న కూటమి ప్రభుత్వం పెండింగ్ బిల్లులను మాత్రం చెల్లించేందుకు ముందుకు రాకపోవడంపై కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. ఆందోళనకు దిగుతు న్నారు. అధికారులు సైతం కాంట్రాక్టర్లకు చెప్పి పనులు చేయించలేకపోతున్నారు. ప్రజలను రోడ్ల కష్టాలు వీడడం లేదు.
రోడ్లు, వంతెనలకు బిల్లుల అవ్వక కాంట్రాక్లర్ల
అవస్థలు
పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామంటూ ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం
పంచాయతీరాజ్‌లో.. బిల్లుల పెండింగ్
పంచాయతీరాజ్‌లో.. బిల్లుల పెండింగ్