గుర్ల: మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద డ్వామా పీడీ శారదాదేవి ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం చేపట్టిన సామాజిక తనిఖీలు గందరగోళంగా మారాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల దాటిన వరకు తనిఖీలు సాగా యి. తనిఖీల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తమైంది. ఉపాధిహామీ సిబ్బంది తరఫున రాజకీయ పార్టీల నాయకుల వాగ్వాదంతో తనిఖీల ప్రాంగణ మంతా అరుపులు వినిపించాయి. పెనుబర్తిలో అనర్హులకు మస్తర్లు వేసినట్టు రుజువైనా లేదంటూ స్థానిక టీడీపీ నాయకులు పీడీతో వాగ్వాదం చేశా రు. ఎటువంటి అపరాధ రుసుం వేయకుండా అధికారులను భయపెట్టారు. అచ్చుతాపురం, గూడేం, తాటిపూడి, గొలగాం, దమరసింగి ఫీల్డ్ అసిస్టెంట్‌ల అవినీతిపై విచారణ చేయాలని పీడీ ఆదేశించారు. ఆ గ్రామాలకు చెందిన మేట్‌లు, వేతనదారులు సామాజిక తనిఖీ వద్దకు వచ్చి ఎటువంటి అవినీతి జరగలేదని విజ్ఞప్తిచేసినా ఫలితం లేకుండా పోయింది. రాత్రిపూట సామాజిక తనిఖీలతో అధికారులు సైతం అసహనం వ్యక్తం చేశారు.


