పెళ్లయిన వ్యక్తితో ప్రేమాయణం.. | Woman Love WIth Married man At Warangal | Sakshi
Sakshi News home page

పెళ్లయిన వ్యక్తితో ప్రేమాయణం..

Published Tue, Aug 13 2024 11:11 AM | Last Updated on Tue, Aug 13 2024 11:18 AM

Woman Love WIth Married man At Warangal

వరుసకు అన్నాచెల్లెళ్లు.. 

మందలించిన పెద్దలు

చెరువులో దూకి ఇద్దరూ బలవన్మరణం

రాయపర్తి: అతనికి పెళ్లయ్యింది. కానీ వరుసకు చెల్లె అయ్యే యువతితో చాలాఏళ్ల ప్రేమ.. పెద్దలు పలుమార్లు మందలించారు. చివరికి ఆ జంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని రామచంద్రుని చెరువు వద్ధ సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా పైడిపల్లి పరిధిలోని మధ్యగూడానికి చెందిన తిక్క అంజలి(25), అదే గ్రామానికి చెందిన సంగాల దిలీప్‌(30) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ దగ్గరి బంధువులు కావడం, అందులోనూ వరుసకు అన్నాచెల్లెళ్లు కావడంతో పెద్దలు ఒప్పుకోరనే ఉద్దేశంతో ఉన్నారు. 

ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం దిలీప్‌కు వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం జంజరపల్లికి చెందిన ఓ యువతితో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. అయినా వీరి ప్రేమను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దిలీప్‌ వరంగల్‌ హంటర్‌రోడ్డులో ఓ మార్బుల్‌ దుకాణంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా, అంజలి ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా చేస్తుంది. వీరి ప్రేమ విషయం భార్యకు తెలియడంతో చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

 ఇటీవల భార్య తన పుట్టింటికి వెళ్లింది. దీంతో దిలీప్‌.. అంజలితో తిరగడం ప్రారంభించారు. విషయ పెద్దలకు తెలియగా నాలుగురోజులక్రితం మందలించారు. ఇప్పటినుంచి అలా తిరగమని చెప్పి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో దిలీప్‌ ఆదివారం ఉదయం 9:30 గంటల సమయంలో డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రి అయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎక్కడికో వెళ్లి ఉంటాడనుకున్నారు. 

సోమవారం ఉదయం రాయపర్తిలోని రామచంద్రుని చెరువులో రెండు మృతదేహాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ సూర్యప్రకాష్‌, వర్ధన్నపేట ఎస్సై ప్రవీణ్‌లతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పరిశీలించగా దిలీప్‌, అంజలిదిగా గుర్తించారు. క్లూస్‌టీంతో పరిశీలించి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ సూర్యప్రకాష్‌ తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement