డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని మనస్తాపం.. యువతి ఆత్మహత్య | Warangal Woman Died With Depression Over Not Getting Job | Sakshi
Sakshi News home page

'ఐ మిస్‌ యూ' అమ్మానాన్న.. జాబ్‌ రావడం లేదని యువతి ఆత్మహత్య

Published Tue, Mar 21 2023 8:53 AM | Last Updated on Tue, Mar 21 2023 8:53 AM

Warangal Woman Died With Depression Over Not Getting Job - Sakshi

సాక్షి, వరంగల్‌: డిగ్రీ వరకు చదివిన తనకు ఉద్యోగం రావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువతి జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో జరిగింది. గ్రేటర్‌ వరంగల్‌ 16వ డివిజన్‌ ధర్మారంలో ఊదరి రవికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరికి వివాహమైంది. చిన్న కూతురు మేఘన (23) డిగ్రీ వరకు చదవి ఇంటివద్దే ఉంటోంది. ఉదయం 11 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ ఇన్‌స్పెక్టర్‌ సట్ల రాజు తెలిపారు. ‘డిగ్రీ వరకు చదివినా ఆర్థికంగా నా కుటుంబానికి ఏమీ చేయలేకపోతున్నా. నన్ను తల్లిదండ్రులు బాగా చూసుకున్నారు. నా తండ్రి మద్యం తాగడం బంద్‌ చేసి ఆరేళ్ల నుంచి బాగానే చూసుకుంటున్నాడు. నాకు జాబ్‌ రావడం లేదనే ఒత్తిడికి గురవుతున్నా. అందరూ జాబ్‌ కోసం ట్రై చేసి రిజల్ట్‌ వచ్చిన తర్వాత ఓడిపోతారని, కానీ నేను ప్రయత్నం చేయకుండానే ఓడిపోతున్నా. ఐ మిస్‌యూ అమ్మానాన్న.. సిస్టర్స్, కుటుంబ సభ్యులు బాగుండాలి’అని తన డైరీలో రాసుకుని ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు. పోలీసులు ఆ డైరీని స్వాధీనం చేసుకున్నారు.

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: రిజిస్ట్రేషన్‌ చేయకుంటే పెట్రోల్‌ పోస్తాం.. పోలీసుల సాక్షిగా మహిళా తహసీల్దార్‌కు బెందిరింపులు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement