చెల్లెలిని ప్రేమించాడన్న కోపంతో ఓ అన్న.. | In Jammikunta A Man Killed A Person For Loving His Sister | Sakshi
Sakshi News home page

చెల్లెలిని ప్రేమించాడన్న కోపంతో ఓ అన్న..

Published Thu, Nov 17 2022 8:42 AM | Last Updated on Thu, Nov 17 2022 9:34 AM

In Jammikunta A Man Killed A Person For Loving His Sister - Sakshi

జమ్మికుంట(హుజూరాబాద్‌): చెల్లెలిని ప్రేమించాడన్న కోపంతో ఓ అన్న.. తన బంధువును కత్తితో గొంతు కోసి, అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పట్టణంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. జమ్మికుంట మున్సిపల్‌ పరిధి కొత్తపల్లికి చెందిన మంద సంతోష్‌(30), మోత్కులగూడెంకు చెందిన జీడీ శివకృష్ణ అలియాస్‌ చిరంజీవి బంధువులు. వీరు పేయింటింగ్‌ వర్క్‌ చేస్తుంటారు.

 సంతోష్‌కు గతంలో పెళ్లి జరిగింది. కానీ అతని భార్య కాపురానికి రావడం లేదు. ఈ క్రమంలో అతను శివకృష్ణ చెల్లెలితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లిపోయారు. తన చెల్లెలు అదృశ్యమైందని శివకృష్ణ గత అక్టోబర్‌ 24న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరుపుతున్న క్రమంలో సంతోష్‌ ఆమెతో జమ్మికుంట చేరుకున్నాడు. వీరి ప్రేమ వ్యవహారంపై ఇరు కుటుంబాల మధ్య పంచాయితీ జరగడంతో సమస్య పరిష్కారమైంది. కానీ సంతోష్‌ ఆ తర్వాత కూడా ఆమెతో సఖ్యతగా ఉంటున్నాడని శివకృష్ణ అనుమానించాడు.

 ఈ నేపథ్యంలో అతను బుధవారం మరో ముగ్గురితో కలిసి పేయింటింగ్‌ పనులు చేశాడు. రాత్రి గాంధీచౌక్‌లోని సో హాన్‌ వైన్స్‌ పర్మిట్‌ రూమ్‌లో నలుగురూ మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో సంతోష్‌ అక్కడికి వచ్చి, వారితో కలిసి మద్యం సేవిస్తుండగా శివకృష్ణ కత్తితో ఒక్కసారిగా అతని గొంతు కోశాడు. ఈ ఘ టనతో పక్కనున్నవారు ఉలిక్కిపడ్డారు. సంతోష్‌ను తీసుకొని, పోలీస్‌స్టేషన్‌కు పరుగు పెట్టారు. అప్పటి కే తీవ్ర రక్తస్రావం జరిగి, అతను అపస్మారక స్థితి లోకి వెళ్లాడు. పోలీసులు తమ వాహనంలో జమ్మికు ంట ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందా డు. శివకృష్ణ పోలీసులకు లొంగిపోయాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement