After Boyfriend Walks Out, Angry Woman Kills His 11-Year-Old Son - Sakshi
Sakshi News home page

 ప్రియుడిపై కోపంతో యువతి కిరాతకం.. 11 ఏళ్ల బాలుడిని..

Published Wed, Aug 16 2023 12:04 PM | Last Updated on Wed, Aug 16 2023 12:30 PM

After Boyfriend Walks Out Angry Woman Kills His Son - Sakshi

న్యూఢిల్లీ: బాయ్‌ఫ్రెండ్ తనకు దూరమయ్యాడని కోపంతో అతడి ఆచూకీ తెలుసుకుని అక్కడికి వెళ్లగా ఆ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న అతడి కుమారుడిని హతమార్చిందో ఖిలాడి ప్రియురాలు. పోలీసులు స్థానికంగా ఉన్న 300 సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. 

పెళ్లయిందని తెలిసినా..
పూజ కుమారి(24) అనే ఓ యువతి 2019లో తనకు పరిచయమైన జితేంద్ర అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. జితేంద్రకి అప్పటికే పెళ్లి కాగా వారికి 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయినా కూడా వ్యక్తిగత కారణాల రీత్యా అతను భార్య నుంచి వేరై పూజతో కలిసి ఉండేవాడు. మూడేళ్ళ పాటు వీరిద్దరూ కలిసే జీవించారు. కానీ ఆ తరువాత జితేంద్ర తన భార్య కుమారుడి వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు. దీంతో అతడిపై కోపాన్ని పెంచుకుంది పూజ. జితేంద్ర స్నేహితుల్లో ఒకరి ద్వారా అతడు ప్రస్తుతముంటున్న ఇంటి అడ్రస్ తీసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 10న ఇందర్‌పూరిలోని జితేంద్ర నివాసానికి వెళ్లిన పూజ అక్కడ ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. లోపలికి వెళ్లి చూస్తే దివ్యాంష్(11) ఒక్కడే ఒంటరిగా నిద్రిస్తున్నాడు. ఇంట్లో ఇంకెవ్వరూ లేకపోవడంతో పూజ అదే అదనుగా బాలుడిని చంపేసి అక్కడే ఉన్న ఒక పెట్టెలోంచి బట్టలు బయటకుతీసి  మృతదేహాన్ని అందులో పెట్టి పరారైందని తెలిపారు. 

ఇలా దొరికింది.. 
హత్య గురించి సమాచారం అందగానే వెంటనే రంగంలోకి దిగిన పశ్చిమ ఢిల్లీ పోలీసులు మొదట పూజ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఆమె అక్కడ ఉండటంలేదని తెలుసుకున్న తర్వాత ఇందర్‌పూరి పరిసర ప్రాంతాల్లో సుమారు 300 సీసీ కెమెరాల ఫుటేజీని నిశితంగా పరిశీలించి నిందితురాలిని జల్లెడ పట్టారు. ఎలాగోలా  హత్య జరిగిన మూడు రోజులకు పూజను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. 

ఇది కూడా చదవండి: Nuh Violence : హర్యానా అల్లర్లలో బజరంగ్‌దళ్‌ కార్యకర్త అరెస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement