West Delhi
-
యువతి కిరాతకం.. అడ్డుగా ఉన్నాడని 11 ఏళ్ల బాలుడిని..
న్యూఢిల్లీ: బాయ్‌ఫ్రెండ్ తనకు దూరమయ్యాడని కోపంతో అతడి ఆచూకీ తెలుసుకుని అక్కడికి వెళ్లగా ఆ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న అతడి కుమారుడిని హతమార్చిందో ఖిలాడి ప్రియురాలు. పోలీసులు స్థానికంగా ఉన్న 300 సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. పెళ్లయిందని తెలిసినా.. పూజ కుమారి(24) అనే ఓ యువతి 2019లో తనకు పరిచయమైన జితేంద్ర అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. జితేంద్రకి అప్పటికే పెళ్లి కాగా వారికి 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయినా కూడా వ్యక్తిగత కారణాల రీత్యా అతను భార్య నుంచి వేరై పూజతో కలిసి ఉండేవాడు. మూడేళ్ళ పాటు వీరిద్దరూ కలిసే జీవించారు. కానీ ఆ తరువాత జితేంద్ర తన భార్య కుమారుడి వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు. దీంతో అతడిపై కోపాన్ని పెంచుకుంది పూజ. జితేంద్ర స్నేహితుల్లో ఒకరి ద్వారా అతడు ప్రస్తుతముంటున్న ఇంటి అడ్రస్ తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 10న ఇందర్పూరిలోని జితేంద్ర నివాసానికి వెళ్లిన పూజ అక్కడ ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. లోపలికి వెళ్లి చూస్తే దివ్యాంష్(11) ఒక్కడే ఒంటరిగా నిద్రిస్తున్నాడు. ఇంట్లో ఇంకెవ్వరూ లేకపోవడంతో పూజ అదే అదనుగా బాలుడిని చంపేసి అక్కడే ఉన్న ఒక పెట్టెలోంచి బట్టలు బయటకుతీసి మృతదేహాన్ని అందులో పెట్టి పరారైందని తెలిపారు. ఇలా దొరికింది.. హత్య గురించి సమాచారం అందగానే వెంటనే రంగంలోకి దిగిన పశ్చిమ ఢిల్లీ పోలీసులు మొదట పూజ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఆమె అక్కడ ఉండటంలేదని తెలుసుకున్న తర్వాత ఇందర్పూరి పరిసర ప్రాంతాల్లో సుమారు 300 సీసీ కెమెరాల ఫుటేజీని నిశితంగా పరిశీలించి నిందితురాలిని జల్లెడ పట్టారు. ఎలాగోలా హత్య జరిగిన మూడు రోజులకు పూజను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఇది కూడా చదవండి: Nuh Violence : హర్యానా అల్లర్లలో బజరంగ్దళ్ కార్యకర్త అరెస్టు -
ఐదేళ్లుగా పని, నమ్మి ఇంటి తాళం ఇస్తే.. రూ.10కోట్లతో జంప్..
న్యూఢిల్లీ: ఐదేళ్లుగా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడని తాళం అతనికే అప్పగించి అమెరికా వెళ్లాడు ఓ యజమాని. తీరా అతనే దొంగతనానికి పాల్పడి రూ.10కోట్లు దోచుకెళ్లాడని తెలిసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో దొంగతనానికి పాల్పడిన నిందితుని పేరు మోహన్ కుమార్(26). ఐదేళ్లుగా నమ్మకంగా ఉంటున్నాడని అతని ఇంటి యజమాని తాళాలు అప్పగించి కుటుంబంతో అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంట్లో పనిచేసే మరో వ్యక్తి యజమానికి ఫోన్ చేశాడు. మోహన్ కుమార్ ఇంట్లో దొంగతనం చేశాడని, డబ్బు, నగలతో పారిపోయాడని తెలియజేశాడు. వెంటనే యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. మోహన్ ఇంట్లో నుంచి సూట్‌కేసుతో కారులో పారిపోతున్నట్లు అందులో రికార్డు ఉయ్యింది. అతనితో పాటు మరో మైనర్ కూడా ఉన్నాడు. విచారణ చేపట్టిన పోలీసులు మొదట మైనర్ జాడ కనుగొన్నారు. అతడు మోహన్ బంధువని, బిహార్‌లోని శివహర్ జిల్లాలో ఉంటున్నాడని తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి వెళ్లి బాలుడ్ని ఆదివారం అరెస్టు చేశారు. అతడు చెప్పిన వివరాలతో మోహన్‌ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మోహన్ బంధువు మైనర్ అయినందున అతడ్ని జువెనైల్ హోంకు తరలించారు. మోహన్ దొంగతనం చేసిన డబ్బులు, నగలు, వజ్రాల మొత్తం విలువ రూ.10కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. వీటిలో కొంతమాత్రమే స్వాధీనం చేసుకున్నామని, మిగతా మొత్తం ఎక్కుడుందో తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ముసుగు దుండగుల దాడి.. మంగళూరులో దారుణ హత్య.. 144 సెక్షన్ విధింపు -
అయ్యో భగవంతుడా!.. బతుకులు బుగ్గి చేశావే (ఫోటోలు)
-
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. వెలుగులోకి కీలక అంశాలు
నూఢిల్లీ: దేశ రాజధానిలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం నుంచి 60 నుంచి 70 మందిని రక్షించామని, సుమారు 40 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఒక ఫ్లోర్‌ను గాలించాల్సి ఉండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చని చెప్పారు. కాగా ఈ ఘటనకు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కీలక అంశాలు.. ► మొదటి అంతస్తులో ఉన్న సీసీటీవీ కెమెరాలు, రూటర్ల తయారీ కంపెనీ కార్యాలయంలో మంటలు చెలరేగాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమీర్ శర్మ తెలిపారు. ► భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన కాసేపటి పొగలు భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో కొంతమంది తమను తాము రక్షించుకోవడానికి కిటికీలోంచి కిందకి దూకేశారని, మరికొందరు కిందకి దిగడానికి తాళ్లను ఉపయోగించిన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కొందరికి గాయాలు కాగా మరికొందరు మృతి చెందారు. ► భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి ఎటువంటి సేఫ్టీ క్లియరెన్స్ లేదు. ఆ బిల్డింగ్ యజమాని మనీష్ లక్రాగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం చోటు చేసుకున్న కంపెనీ యజమానులు హరీష్ గోయెల్, వరుణ్ గోయెల్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ►మంటలు చెలరేగినప్పుడు రెండవ అంతస్తులో మోటివేషన్ స్పీచ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణమిదే కావొచ్చని అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. ఈ అంతస్తులో నుంచి మృతుల సంఖ్య మరింత బయటపడొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ►కేవలం ఒక మెట్లు ద్వారం మాత్రమే ఉన్నందున ప్రజలు భవనం నుంచి తప్పించుకోలేకపోయారని అగ్ని మాపక శాఖ డివిజనల్ అధికారి తెలిపారు. ►అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం 4.40 గంటలకు మంటలు చెలరేగినట్లు సమాచారం అందడంతో 24 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందకు తీవ్రంగా శ్రమించాయి. ►బాధితుల గుర్తింపు గురించి పోలీసులు ఇంకా వివరాలు పంచుకోలేదు. ఘటనలో గాయపడిని వారిని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. భవనం నుండి కనీసం 60 మందిని రక్షించారని, మరికొందరు ఇంకా లోపల చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. ►అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. చదవండి: Delhi Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం -
ఢిల్లీ ప్రమాదంలో 29 మంది గల్లంతు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో శుక్రవారం సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో 29 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన 27 మందిలో ఏడుగురిని ఇప్పటివరకు గుర్తించారు. మంటలను ఆర్పిన అనంతరం శనివారం ఉదయం భవనంలో మాడిమసైన మృతదేహ భాగాలను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు. దీంతో, మృతుల సంఖ్య 30కు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్షతగాత్రులైన మరో 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భవనంలో పూర్తి స్థాయి గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆ భవనంలోకి వేర్వేరు పనుల నిమిత్తం వచ్చి గల్లంతైనట్లు భావిస్తున్న 29 మంది ఆచూకీ కోసం వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న మృతదేహాల గుర్తింపు సాధ్యంకాని సందర్భాల్లో డీఎన్ఏ పరీక్షలు జరిపిస్తామని పోలీసులు తెలిపారు. మిస్సయిన 24 మంది మహిళలు సహా మొత్తం 29 మంది జాబితాను పోలీసులు తయారు చేశారు. కాగా, ప్రమాదం చోటుచేసుకున్న నాలుగంతస్తుల భవనానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేదు. భవనం మొత్తానికి ఒకే గేట్ ఉన్న కారణంగా మరణాలు పెరిగాయని చీఫ్ ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ వెల్లడించారు. ఏసీ యంత్రం పేలుడు కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నామన్నారు. అయితే, ఒకటో అంతస్తులోని సీసీటీవీ కెమెరా ఉత్పత్తి యూనిట్లో మంటలు మొదలయ్యాయనే అనుమానంతో ఆ యూనిట్ యజమానులైన హరీశ్ గోయెల్, వరుణ్ గోయెల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సమీర్ శర్మ తెలిపారు. భవనంలోని నాలుగంతస్తులను వీరి కంపెనీయే వాడుకుంటోందని, వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టామని అన్నారు. భవన యజమాని మనీశ్ లక్రాపైనే కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా, ప్రమాద ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించినట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. శనివారం ఆయన ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున అందజేస్తామన్నారు. -
షహీన్‌బాగ్‌తో ఎవరికి చెక్
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దక్షిణ ఢిల్లీలోని యమునా నది ఒడ్డున షహీన్‌బాగ్ ప్రాంతం గత నెలరోజులుగా నిరసనలతో అట్టుడుకుతోంది. వణికించే చలిని లెక్కచేయకుండా ముస్లిం వర్గానికి చెందిన వారు ముఖ్యంగా మహిళలు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఏఏ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంతో బీజేపీ షహీన్‌బాగ్‌ను ఎన్నికల అస్త్రంగా మార్చుకుంది. సీఏఏ వ్యతిరేకుల్ని పదునైన మాటలతో ఎండగడుతోంది. దేశభక్తి వర్సస్ టుక్డే టుక్డే గ్యాంగ్ ఎన్నికలుగా వీటిని అభివర్ణిస్తూ ఎవరివైపు ఉంటారని ప్రశ్నిస్తోంది. కేజ్రీవాల్ ఇప్పటివరకు షహీన్‌బాగ్‌కు ఎందుకు రాలేదంటూ ఆప్‌ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న బీజేపీ నేతలైన పర్వేష్ వర్మను మూడు రోజులు, అనురాగ్ ఠాకూర్‌ని నాలుగు రోజుల పాటు ప్రచారం చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించినా కమలదళం తాను చేపట్టిన వ్యూహం ప్రకారమే ముందుకి అడుగులు వేస్తోంది. ఆచితూచి వ్యవహరిస్తున్న ఆప్ సీఏఏ అంశంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. హిందూ ఓట్లు ఎక్కడ కోల్పోతామోనన్న ఆందోళనలో ఉన్న కేజ్రీవాల్ దీనిపై ఎక్కడా పెదవి విప్పడం లేదు. షహీన్‌బాగ్ వెళ్లి ఆందోళనకారులకు మద్దతు తెలిపే ధైర్యం చేయలేదు. అయిదేళ్లలో తాను చేసిన పనులనే ప్రస్తావిస్తున్నారు. ఉచిత విద్యుత్, ఉచితంగా నీళ్లు, స్కూలు ఫీజుల నియంత్రణ, కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు వంటివే ప్రస్తావిస్తున్నారు. సుపరిపాలన అన్న సొంత ఎజెండాతోనే ముందుకు వెళుతున్నారు. పరువు కాపాడుకునే వ్యూహంలో కాంగ్రెస్ ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనలకి బహిరంగంగా మద్దతు తెలుపుతున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఆప్ రాజకీయాల్లోకి వచ్చాక రాజధానిలో ఇంచుమించుగా పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతున్న సమయంలో ఒక వర్గంలో నెలకొన్న సీఏఏ వ్యతిరేకతను తమకి అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. ఢిల్లీలో 8 నుంచి 10 స్థానాల్లో ముస్లిం ప్రాబల్యం ఉంది. కనీసం ఆ స్థానాలనైనా దక్కించుకొని పరువు కాపాడుకునే పనిలో ఉంది. షహీన్‌బాగ్ నిరసనకారుల్ని టుక్డే టుక్డే గ్యాంగ్ అంటూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపై ఎదురుదాడి మొదలు పెట్టింది. కేంద్రానివే దేశాన్ని విభజించే టుక్డే టుక్డే రాజకీయాలంటూ ప్రచారం ప్రారంభించింది. బీజేపీ అస్త్రం పని చేస్తుందా ? షహీన్‌బాగ్ బీజేపీ ట్రంప్ కార్డా లేదంటే, అసహనంతో కూడుకున్న అస్త్రమా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ షహీన్‌బాగ్ ఆందోళనలపై స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం వల్లే బీజేపీ జాతీయ భావాన్ని రగల్చడంలో ఎంతో కొంత పైచేయి సాధించిందని ఎన్నికల విశ్లేషకుడు ప్రదీప్ భండారీ అభిప్రాయంగా ఉంది. ఢిల్లీలో పెద్ద సంఖ్యలో ఉన్న ఎగువ మధ్యతరగతిలో సీఏఏపై పెద్దగా వ్యతిరేకత లేదు. మరోవైపు షహీన్‌బాగ్ నిరసనలతో ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువై సామాన్యులు పలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. అలాగని ఆమ్ ఆద్మీ పార్టీపై అధికార వ్యతిరేకత కూడా లేదు. అమిత్‌షా చాణక్య నీతిని కేజ్రీవాల్ ఎంతవరకు సమర్థవంతంగా తిప్పికొట్టగలరో అన్న దానిపైనే బీజేపీ అస్త్రం ఎంతవరకు పనిచేస్తుందో తెలుస్తుందని సీఎస్డీఎస్ రాజకీయ విశ్లేషకుడు సంజయ్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 8న మీరు ఈవీఎంల బటన్ ఎంత ఆగ్రహంతో ప్రెస్ చేయాలంటే దాని ప్రకంపనలు షహీన్‌బాగ్‌ను వణికించాలి. – కేంద్ర హోం మంత్రి అమిత్ షా షహీన్‌బాగ్‌లో నిరసనకారులు మీ ఇళ్లల్లోకి చొరబడొచ్చు. మీ చెల్లెళ్లు, కూతుళ్లపై అత్యాచారం చేయొచ్చు. చివరికి మిమ్మల్ని చంపేయొచ్చు కూడా. –బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ టుక్డే టుక్డే గ్యాంగ్‌కి షహీన్‌బాగ్ కేంద్రంగా మారింది. –కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ దేశద్రోహుల్ని కాల్చి చంపండి. –కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ -
‘ఎంపీ టికెట్‌కు సీఎం ఆరుకోట్లు డిమాండ్ చేశారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఆప్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వద్ద ఆరు కోట్ల రూపాయలను తీసుకుని టికెట్ ఇచ్చారని ఆప్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి బల్బీర్ జక్కర్ తనయుడు ఉదయ్ జక్కర్ ఆరోపించారు. మూడు నెలల కిత్రం తన తండ్రి ఆప్‌లో చేరారని, టికెట్ ఇచ్చే సమయంలో కేజ్రీవాల్ ఆరుకోట్లు డిమాండ్ చేశారని తెలిపారు. డబ్బు మొత్తం చెల్లించిన తరువాతనే తన తండ్రికి టికెట్ కేటాయించారని అన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని ఉదమ్ వెల్లడించారు. కాగా ఆయన వ్యాఖ్యలు ఆప్ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ఆప్ అభ్యర్థి తనయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఉదయ్ వ్యాఖ్యలు అవాస్తవం.. ఇదిలావుడంగా తన కుమారుడు చేసిన వ్యాఖ్యలు అవాస్తమని, కేజ్రీవాల్ తన వద్దనుంచి డబ్బు డిమాండ్ చేయలేదని స్పష్టంచేశారు. తన కుమారుడు తనతో చాలా తక్కువగా మాట్లాడుతాడని, ఆయన చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తన భార్యకు 2008లో విడాకులు ఇచ్చానని కూడా బల్బీర్ ప్రకటించారు. #WATCH Aam Aadmi Party's West Delhi candidate, Balbir Singh Jakhar's son Uday Jakhar: My father joined politics about 3 months ago, he had paid Arvind Kejriwal Rs 6 crore for a ticket, I have credible evidence that he had paid for this ticket. pic.twitter.com/grlxoDEFVk — ANI (@ANI) 11 May 2019 -
బైక్‌పై వెళుతూ రొమాన్స్..
-
నడిరోడ్డుపై రొమాన్స్.. వైరల్ వీడియో
బైక్‌పై వెళుతున్నప్పుడు ప్రియురాలు వెనుకుంటే కుర్రాళ్లకు పట్టపగ్గాలుండవు. బైక్ ముందున్న ట్యాంక్‌పై గాల్ ఫ్రెండ్ కూచుని ప్రియుడి కళ్లలో కళ్లు పెట్టి చూస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో వీడియోకు చిక్కింది ఈ రొమాంచిత దృశ్యం. లోకంతో తమకు పనిలేదన్నట్టుగా బిజీ రోడ్డుపై ఓ ప్రేమ జంట చేసిన ఈ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ ఢిల్లీలోని రాజౌరి గార్డన్ క్రాస్ రోడ్డులో ప్రేమ పక్షులు బైక్‌పై దూసుకెళ్లిన ఈ వీడియోను ఐపీఎస్ అధికారి హెచ్జీఎస్ ధలివాల్ ట్వీట్ చేశారు. ‘మోటారు వాహనాల చట్టంలో కొత్త సెక్షన్ తేవాల్సిన అవసరం ఉంద’ని క్యాప్షన్ పెట్టారు. గులామ్ సినిమాలో ‘జాదూ హై తేరా హీ జాదూ’ పాటలో ఆమిర్‌ఖాన్, రాణిముఖర్జీ చేసినట్టుగా ఫీట్ చేసిన ఈ ప్రేమికులు ఎవరో ఇప్పటివరకు తెలియలేదు. యువకుడు బైక్ నడుపుతుండగా ముందున్న ప్యూయల్ ట్యాంక్‌పై కూర్చొని యువతి తన రెండు చేతులను అతడి భుజానికి చుట్టేసి ప్రియుడి కళ్లలోకి చూస్తున్నట్టుగా వీడియోలో ఉంది. ఇద్దరూ హుషారుగా బైక్‌పై వెళ్లిపోవడం వీడియోలో కనిపించింది. చట్టప్రకారం ఇది నేరం కానప్పటికీ చాలా ప్రమాదకరం. రద్దీగా ఉన్న రోడ్డుపై ఇలాంటి విన్యాసాలతో ప్రమాదం కొనితెచ్చుకోవడం అవసరమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అయితే నడిరోడ్డుపై ఈ రొమాన్స్ ఏంటని నిలదీస్తున్నారు. -
మూడవ కాన్పులో కూడా కూతురు పుట్టిందని..
న్యూఢిల్లీ : మూడవ కాన్పులో కూడా కూతురు పుట్టిందన్న కోపంతో పసిబిడ్డను ఊపిరి ఆడకుండా చేసి చంపిందో తల్లి. ఈ సంఘటన పశ్చిమ ఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన అశార్ఫి మహతో, రీతా దేవి దంపతులకు ఇద్దరు సంతానం. ఇద్దరు కూడా ఆడపిల్లలు కావటంతో మూడో కాన్పులోనైనా మగబిడ్డ కావాలని భర్త మహతో పట్టుబట్టాడని రీతా దేవి ఆరోపించింది. గర్భవతిగా ఉన్న రీతా దేవి ఈ ఆదివారం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మూడోసారి కూడా ఆడబిడ్డ పుట్టిందన్న కోపంతో కొద్దిసేపటి తర్వాత శిశువును ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత పాప కదలటం లేదని డాక్టర్లకు ఫిర్యాదు చేసింది. శిశువును పరీక్షగా చూసిన డాక్టర్లకు ముక్కుపై, పెదాలపై నల్లటి మచ్చలు కనిపించాయి. దీంతో ఇది ఖచ్చితంగా హత్యేనని భావించిన వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు రీతా దేవిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మొదట హత్య చేయలేదని వాదించిన ఆమె కొద్దిసేపటికి నేరాన్ని అంగీకరించింది. మూడవసారి ఆడబిడ్డ పుట్టిందనే కోపంతో చంపేసినట్లు ఒప్పుకుంది. ఈ హత్యకు ఆమె భర్త మహతోకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. అయితే తాను మగబిడ్డ కావాలని భార్యను ఎప్పుడూ అడగలేదని మహతో అనటం గమనార్హం. -
ఇంట్లో ఫిర్యాదు చేశారని టీచర్ని దారుణంగా..
న్యూఢిల్లీ: తమ జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలోకి తీసుకొచ్చే ప్రత్యక్ష దైవం గురువు అంటే గౌరవం, మర్యాద లెక్కలేకుండా పోయి చాలా రోజులయింది. అయితే, అదే గురువుపై ప్రస్తుతం భయం కూడా పోవడమే కాకుండా విచక్షణ కూడా లేకుండా పోయిందని ఓ సంఘటన స్పష్టం చేసింది. ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తమ దుష్ప్రవర్తన గురించి ఇంట్లో ఫిర్యాదు చేసినందుకు ఓ ఉపాధ్యాయుడిపై ఇంటర్మీడియట్ విద్యార్థులు కత్తితో దాడి చేశారు. ఆరేడుగురు కలిసి ఆ ఉపాధ్యాయుడిని దారుణంగా పొడవడంతో ఆయన ప్రాణాలుకోల్పోయాడు. ఈ నేరానికి పాల్పడినవారిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయి ప్రాంతంలోగల గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూలు యాజమాన్యం చెప్పిన వివరాల ప్రకారం.. ముఖేశ్ కుమార్ అనే హిందీ టీచర్ సోమవారం పరీక్ష నిర్వహిస్తుండగా తరగతి గదిలోకి వచ్చిన విద్యార్థులు అక్కడే అతడిని కత్తితో పొడిచారు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. -
500 గుడిసెలు కూల్చేశారు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆక్రమణకు గురైన తమ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు రైల్వే అధికారులు దృష్టిని సారించారు. ఆదివారం ఉదయం పశ్చిమ ఢిల్లీలో రైల్వే పట్టాలకు సమీపంలో ఆక్రమణకు గురైన తమ స్థలాన్ని రైల్వే పోలీసుల సహాయంతో స్వాధీనం చేసుకునే కార్యక్రమం ప్రారంభించారు. దాదాపు 500 గుడిసెలను నేలమట్టం చేశారు. దీంతో బాధితులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఈ గుడిసెలు తొలగించే క్రమంలో ఓ చిన్నారి కూడా మృతిచెందినట్లు తెలిసింది. ఈ క్రమంలో రైల్వే అధికారులు గుడిసెల్లో నివసించే బడుగుల మధ్య వాగ్వాదం నెలకొని గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. అయితే, చట్ట ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని, నిబంధనలు పాటిస్తూనే తమ స్తలాలు స్వాధీనం చేసుకుంటున్నామని అధికారుల చెప్పారు. -
బాలికపై లైంగికదాడి
న్యూస్‌లైన్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అదే ప్రాంతానికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం పశ్చిమ ఢిల్లీలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో నివాసంలో 12వ తరగతి చదువుతున్న బాలిక కుటంబ సభ్యులతో కలిసి ఉంటుంది. ఉదయాన్నే తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన బాలుడు ఉదయం 10 గంటల సమయంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో పొరుగింటికి చెందిన మరో బాలిక అతడిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాధితురాలికి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం సఫ్ధర్‌జంగ్ పోలీసులు ఎఫ్ఐర్ నమోదు చేశారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య
ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి ఒకరు దేశ రాజధానిలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభాస్ దాస్ (42) అనే ఈ అధికారి పశ్చిమ ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో గల తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని ముందుగా ఆయన డ్రైవర్ చూశారు. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లారు. డ్రైవర్ వెంటనే ప్రభాస్ దాస్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంట్లో ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదని పోలీసులు తెలిపారు. ప్రభాస్ దాస్ ఎందుకింత తీవ్ర నిర్ణయం తీసుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. బీహార్ రాష్ట్రానికి చెందిన దాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవలే ఆయనకు దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. ఇంకా అక్కడకు వెళ్లి చేరడానికి ముందే.. బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. -
తల్లిని చంపిన యువకుడి అరెస్టు
కన్నతల్లిని పీక పిసికి చంపేసిన ఓ యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడు తల్లి సుమిత్ర (50)ను చంపేసి, ఆమె మృతదేహాన్ని మంచానికి ఉన్న పెట్టెలో పెట్టేశాడు. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి ప్రాంతంలోని ఓ ఇంటి మొదటి అంతస్థులో ఆమె మృతదేహం ఆదివారం మధ్యాహ్నం కనిపించింది. అదే ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో నివసించే సుమిత్ర పెద్దకొడుకు ఆమె మృతదేహాన్ని ముందుగా చూశాడు. మృతురాలి చిన్నకొడుకు రోహిత్ ఆమెతోనే కలిసి ఉండేవాడు. కానీ అతడు కనిపించకపోవడంతో పోలీసులు అతడికోసం గాలింపు మొదలుపెట్టారు. ఆదివారం రాత్రి పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్లో రోహిత్‌ను అరెస్టు చేశారు. తల్లి తనను తరచు కొట్టేదని, అందుకే భరించలేక ఆమెను పీకపిసికి చంపేశానని అతడు అంగీకరించాడు. -
'ఆమ్ ఆద్మీ' మంత్రి రాఖీ బిర్లా కారుపై దాడి
ఢిల్లీ రాష్ట్ర మంత్రి రాఖీ బిర్లా కారుపై కొందరు దాడి చేశారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని మంగోళ్ పూరి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అతి చిన్న వయస్సులో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రివర్గంలో రాఖీ చోటు సంపాదించారు. కొందరు రాఖీ కారును చుట్టుముట్టి హంగామా సృష్టించారు. అక్కడ జరిగిన గలాటాలో ఆమె ప్రయాణిస్తున్న కారు విండో స్క్రీన్ ను పగిలిపోయింది. ఈ ఘటనలో ఎవరూ గాయ పడలేదని పోలీసులు తెలిపారు. -
ఆహా అన్పించిన ఆప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీవాసులు ఎంతటి చైతన్యవంతులో చెప్పేందుకు ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ఆదివారం వెలువడిన తీర్పే నిదర్శనం. రాజధాని నగరమైన ఢిల్లీ మినీ భారత్‌ను తలపిస్తుంటుంది. కోటీశ్వరులతో పాటు, పొట్ట నింపుకోవడానికి కోటి కష్టాలు పడే పేదలున్న బస్తీలు కూడా ఇక్కడ అపారం. అన్నింటికి మించి భారత దేశంలోని వివిధ రాష్ట్రాల, ప్రాంతాలవారు ఇక్కడ స్థిరపడిన వారిలో ఉంటారు. ఇలా చూస్తే ఢిల్లీ అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఆయా రాష్ట్రాల, ప్రాంతాల, కులాల సమీకరణాలు పని చేస్తుంటాయి. అయితే వీటన్నింటిని పక్కకు నెడుతూ ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు అన్ని వర్గాలూ బాసటగా నిలిచాయి. 28 స్థానాల్లో ఆప్ గెలవగా, పదిహేనేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కరిష్మా తోడై బీజేపీ 32 స్థానాలు సాధించడం తెలిసిందే. ఢిల్లీ ఓటరు తీర్పును ప్రాంతాలవారీగా ఢిల్లీని సెంట్రల్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, నార్త్‌వెస్ట్ ఢిల్లీ, నార్త్ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, సౌత్‌ఢిల్లీ, సౌత్‌వెస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీగా విభజించి పరిశీలించవచ్చు. సెంట్రల్ ఢిల్లీ: 4 సీట్లలో ఆప్‌కు 3 సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ ప్రాంతంలో బల్లిమరన్, కరోల్‌బాగ్, న్యూఢిల్లీ, జంగ్‌పురా... ఇలా 4 అసెంబ్లీ స్థానాలుంటాయి. వీటిలో ఎక్కువ మంది ఓటర్లు కేంద్ర ప్రభుత్వోద్యోగులు, మురికివాడల ప్రజలే. వీటిలో న్యూఢిల్లీ సహా మూడింటిని ఆప్ చేజిక్కించుకుంది. బల్లిమరన్ను మాత్రం కాంగ్రెస్ కనాకష్టంగా నిలబెట్టుకుంది. ఉద్యోగులతోపాటు పేదలు, దిగువ మధ్యతరగతి వారు తిరుగులేని మెజారిటీతో ఆప్‌కు పట్టం కట్టారు. ఇన్నాళ్లుగా కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌గా ఉన్న ఇక్కడి జుగ్గీజోపిడీల ఓటర్లు సైతం కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్త్‌వెస్ట్, నార్త్ ఢిల్లీ...: 20 సీట్లలో ఆప్‌కు 7: ఈ ప్రాంతాల్లోని 20 స్థానాల్లో కొన్ని శివారు ప్రాంతాలు. వాటిలో చాలామంది ఓటర్లు కేజ్రీవాల్ స్వరాష్ట్రమైన హర్యానా వారే. దాంతో ఎక్కువ మంది ఆప్ వైపు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ స్థానాల్లో ఈసారి బీజేపీ, ఆప్ చెరో 7 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ మూడింటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెస్ట్ ఢిల్లీ, సౌత్‌వెస్ట్ ఢిల్లీ: 21 సీట్లలో ఆప్‌కు 9 21 స్థానాలున్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది! ఇక్కడ ఎక్కువగా పంజాబీలు, హర్యానాలతో పాటు దక్షిణాది ఓటర్లుంటారు. వీరంతా ఈసారి కాంగ్రెస్‌కు పూర్తి వ్యతిరేక ఫలితాలిచ్చారు. ఇక్కడ ఆప్ 9 స్థానాలు గెలిచింది. దళితులు,పేదలు ఎక్కువ ఉన్న ప్రాంతాల ఓటర్లంతా ఆప్‌వైపు మళ్లడం గమనార్హం. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో సిక్కులంతా బీజేపీకే మద్దతిచ్చారు. బీజేపీకి 11, దాని మిత్రపక్షం అకాలీదళ్‌కు 1 వచ్చాయి. సౌత్ ఢిల్లీలో...: 10 సీట్లలో ఆప్‌కు 5 ఇక్కడి 10 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువగా తమిళ, మలయాళీ, తెలుగు తదితర దక్షిణాది ఓటర్లతో పాటు ముస్లింల సంఖ్య చాలా ఎక్కువ. వీరిలో చాలామంది ఆప్కే ఓటేశారు. కాంగ్రెస్‌పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ ఆప్ పట్టు నిలుపుకుంది. మురికి వాడల్లోని లక్షలాది ఓట్లు గుండుగుత్తగా దాని ఖాతాలోకి వెళ్లాయి. ఆప్‌కు 5, మధ్యతరగతి ఓటర్లున్న ప్రాంతాల్లో బీజేపీకి 4 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ మాత్రం ముస్లిం ఓటర్లు కాస్త ఎక్కువగా ఉన్న ఆసిఫ్‌నగర్‌తో సరిపెట్టుకుంది. ఈస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీలో...: 15 సీట్లలో ఆప్‌కు 4 ఈస్ట్ ఢిల్లీవాసుల్లో అత్యధికులు ఉత్తరప్రదేశ్‌తో పాటు పర్వత ప్రాంతీయులు. వీరిలో ఢిల్లీ ఓటర్లలో కీలకంగా భావించే పూర్వాంచలీయులు ఉండే ప్రాంతాలు కూడా ఎక్కువే. ఈ ప్రాంతంలో 15 స్థానాల్లో బీజేపీ ఎనిమిది కైవసం చేసుకుంది. అనధికారిక కాలనీలు, బెంగాలీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆప్ 4 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌గా భావించే అనధికారిక కాలనీల్లో, మురికి వాడల్లో ఆప్‌కు భారీ మద్దతు లభించడం విశేషం. -
టీనేజ్ యువతులపై యువకుడు యాసిడ్ దాడి
వివాహ ప్రతిపాదనను నిరాకరించినందుకు ఇద్దరు టీనేజ్ యువతులపై ఓ యువకుడు యాసిడ్ దాడికి చేశాడు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని బేగంపూర్ లో చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం మార్కెట్ కు వెళుతున్న పార్వతి(18), గాయత్రి (16)లపై మనోజ్ అనే నిందితుడు యాసిడ్ తో దాడి చేసినట్టు పోలీసుల వెల్లడించారు. వివాహితుడు మనోజ్ చేసిన ప్రతిపాదనను పార్వతి నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. పార్వతికి 50 శాతం, గాయత్రికి 20 శాతం గాయలయ్యాయని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి సమీపంలోని ఓ ఆస్పత్రిలో వీరిద్దరికి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలం నుంచి పారిపోతున్న నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.