ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి ఒకరు దేశ రాజధానిలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభాస్ దాస్ (42) అనే ఈ అధికారి పశ్చిమ ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో గల తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని ముందుగా ఆయన డ్రైవర్ చూశారు. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లారు. డ్రైవర్ వెంటనే ప్రభాస్ దాస్ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇంట్లో ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదని పోలీసులు తెలిపారు. ప్రభాస్ దాస్ ఎందుకింత తీవ్ర నిర్ణయం తీసుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. బీహార్ రాష్ట్రానికి చెందిన దాస్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవలే ఆయనకు దుబాయ్లోని భారత రాయబార కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. ఇంకా అక్కడకు వెళ్లి చేరడానికి ముందే.. బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.
ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య
Published Mon, May 12 2014 7:43 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement