తల్లిని చంపిన యువకుడి అరెస్టు | Youth who killed mother arrested | Sakshi
Sakshi News home page

తల్లిని చంపిన యువకుడి అరెస్టు

Published Mon, Mar 31 2014 7:40 PM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM

Youth who killed mother arrested

కన్నతల్లిని పీక పిసికి చంపేసిన ఓ యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడు తల్లి సుమిత్ర (50)ను చంపేసి, ఆమె మృతదేహాన్ని మంచానికి ఉన్న పెట్టెలో పెట్టేశాడు. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి ప్రాంతంలోని ఓ ఇంటి మొదటి అంతస్థులో ఆమె మృతదేహం ఆదివారం మధ్యాహ్నం కనిపించింది. అదే ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో నివసించే సుమిత్ర పెద్దకొడుకు ఆమె మృతదేహాన్ని ముందుగా చూశాడు.

మృతురాలి చిన్నకొడుకు రోహిత్ ఆమెతోనే కలిసి ఉండేవాడు. కానీ అతడు కనిపించకపోవడంతో పోలీసులు అతడికోసం గాలింపు మొదలుపెట్టారు. ఆదివారం రాత్రి పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్లో రోహిత్ను అరెస్టు చేశారు. తల్లి తనను తరచు కొట్టేదని, అందుకే భరించలేక ఆమెను పీకపిసికి చంపేశానని అతడు అంగీకరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement