mother murder
-
తల్లి గొంతు నులిమి, బంగారం బాత్రూంలో దాచి..
సాక్షి, భద్రాచలం అర్బన్: తల్లిని హతమార్చిన తనయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలం పట్టణ సీఐ స్వామి బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన యర్రంశెట్టి బసవపార్వతమ్మ(65) పట్టణంలోని ఓంకార్ పండ్ల దుకాణంపై నిర్మించిన రేకుల షెడ్లో ఒంటరిగా నివసిస్తోంది. ఇద్దరు కుమారులు వెంకటరత్నంనాయుడు, శ్రీనివాసరావులు భద్రాచలంలోనే వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. చిన్నకుమారుడు శ్రీనివాసరావు జామాయిల్ కర్ర వ్యాపారం చేసి నష్టపోయాడు. దీంతో భద్రాచలానికే చెందిన రమేష్ అనే వ్యక్తి వద్ద అప్పు తీసుకుని నష్టాన్ని పూడ్చుకున్నాడు. కొద్దికాలం తర్వాత అప్పు చెల్లించాలని రమేష్ అతనిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో శ్రీనివాసరావు తల్లి వద్దకు వెళ్లి డబ్బులు కావాలని అడిగాడు. ఈ క్రమంలో పార్వతమ్మ తన వాటాకు వచ్చిన భవనాన్ని విక్రయించగా వచ్చిన డబ్బుల్లో శ్రీనివాసరావుకు రూ.9 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఆ నగదు తీసుకెళ్లి రమేష్‌కు చెల్లించాడు. తల్లికి మూడు నెలలపాటు వడ్డీ కూడా ఇచ్చాడు. అనంతరం వడ్డీ, అసలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడు. దీంతో బసవపార్వతమ్మ మందలించగా, తల్లి కూడా అప్పుల బాధను అర్థం చేసుకోకుండా, డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నదని మనస్తాపం చెందాడు. విషప్రయోగం చేసి హతమార్చేందుకు కుట్ర పన్నాడు. కానీ అది బెడిసికొట్టింది. దీంతో గొంతునులిమి చంపివేశాడు. 2020, డిసెంబర్ 23న అర్ధరాత్రి 12:30 గంటలకు తన తల్లి ఇంటికి వెళ్లి, చేతులతో గొంతునొక్కి హతమార్చాడు. తల్లి మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవి దిద్దులు, అప్పునకు సంబంధించిన ప్రాంశరీ నోటు తీసుకుని వెళ్లిపోయాడు. బంగారం బాత్రూరంలో దాచి పెట్టి, స్నానం చేసి ఇంట్లో నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు మళ్లీ తల్లి ఇంటికి వెళ్లి పరిస్థితిని గమనించి వచ్చాడు. అనంతరం స్థానికులు ఆమె మృతి చెంది ఉన్నట్లు గమనించి శ్రీనివాసరావుకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా.. ఏమీ తెలియనట్లే అక్కడకు వెళ్లాడు. బీపీ, షుగర్ ఎక్కువై తల్లి మరణించి ఉంటుందని సహజ మరణంగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. కానీ తల్లి మృతిపై అనుమానంతో పెద్దకుమారుడు వెంకటరత్నం ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సేకరించిన వివరాలు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సహజ మరణం పొందినట్లు నివేదిక ఇవ్వాలని తల్లి మృతదేహానికి పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ను బెదిరించిన విషయం పోలీసులకు తెలిసింది. దీంతో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతన్ని నుంచి బంగారం, స్కూటీనీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ స్వామి తెలిపారు. చదవండి: 9 మంది భార్యలున్న వ్యక్తిపై కుమారుడి దాడి -
తల్లి గొంతు కోసి..
-
తల్లి గొంతు కోసి తల తీసుకొని పరారీ
సాక్షి, నాగర్‌కర్నూల్: మద్యానికి బానిసైన కొడుకు కన్నతల్లిని అతిదారుణంగా చంపిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొల్లాపూర్ మండలం సింగోటంలో సంగణమోని చంద్రమ్మ (65) తన కొడుకు రాముడు (40) ఒకే ఇంట్లో ఉంటున్నారు. మద్యానికి బానిసైన కొడుకు తల్లితో రోజూ డబ్బుల కోసం గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని తల్లితో గొడవకు దిగాడు. (గుంటూరు జిల్లాలో దారుణ హత్య) అనంతరం తల్లి నిద్రిస్తున్న సమయంలో కొడవలితో విచక్షణ రహితంగా ఆమె గొంతు కోసి తలను తీసుకొని పరారయ్యాడు. కాగా.. నిందితుడికి ఇద్దరు భార్యలు ఉండగా, పది సంవత్సరాల కిందనే వారు భర్తని వదిలేశారని బంధువులు తెలిపారు. ప్రతి రోజు అర్థరాత్రి వరకు గొడవ పెట్టుకొని తల్లితో డబ్బులు తీసుకునేవాడని తెలిపారు. నిందితుడు గ్రామస్తులతో ఎప్పుడూ గొడవ పడుతూ.. అర్ధరాత్రి సమయంలో తలుపులు కొడుతూ భయబ్రాంతులకు గురిచేసే వాడని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నపరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
కన్న తల్లినే హత్య..
సాక్షి, వికారాబాద్: జిల్లాలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రబుద్దుడు కన్న తల్లినే పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన బంట్వరం మండలంలోని రోంపల్లి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొడుకు మస్తాన్ తన తల్లి మహబూబ(58) గొడవ పడ్డారు. కోపంతో రగిలిపోయిన మస్తాన్ కూరగాయలు తరిగే కత్తితో తల్లిపై దాడి చేశాడు. దీంతో అరుస్తూ రోడ్డు మీదికి వచ్చిన తల్లి మహబూబను స్థానికులు తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మహబూబ మరణించిందని డాక్టర్లు వెల్లడించారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి పోలీసులు మస్తాన్‌పై కేసు నమోదు చేశారు. ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా తల్లిని హత్య చేసిన నిందితుడు మస్తాన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన కుమార్తె
బనశంకరి: బాగల్‌కోటే జిల్లా, కరూరు పట్టణంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన మహిళ కేసు కొత్త మలుపు తిరిగింది. సదరు మహిళను కన్న కూతురే తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు వెలుగుచూసింది. వివరాలు... కరూరు పట్టణంలో అక్టోబరు 31న సంగవ్వ(50) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే ఆమె హత్యకు గురైనట్లు కుటుంబసభ్యులు కరూరుపోలీస్స్టేషన్లో నవంబర్2న ఫిర్యాదు చేశారు. విచారణలో నివ్వెరపోయే విషయాలు వెలుగు చూశాయి. సంగవ్వ కుమార్తె హర్షాబన్నూరు శ్రీకాంత్ చమ్మార అనే వ్యక్తిని ప్రేమించింది. ఈక్రమంలో అక్టోబరు 31న శ్రీకాంత్ చమ్మార తన మామ సవలప్పతో కలిసి కరూరుకు వెళ్లి సంగవ్వతో మాట్లాడారు. అయితే తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి సంగవ్వ అంగీకరించలేదు. దీంతో కోపోద్రిక్తులైన కుమార్తె హర్షాబన్నూర తన ప్రియుడు శ్రీకాంత్‌చమ్మార, సవలప్పలతో కలిసి సంగవ్వను గొంతునులిమి హత్యచేసి ఉడాయించారు. సంగవ్వ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హర్షాబన్నూర, శ్రీకాంత్‌చమ్మార, సవలప్పను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా హత్యోదంతం వెలుగు చూసింది. దీంతో హర్షాబన్నూర, శ్రీకాంత్‌చమ్మార, సవలప్పను శుక్రవారం అరెస్ట్ చేశారు. -
కన్నతల్లిని చంపేసిన కవల సోదరులు
దుబాయ్: ఉగ్రవాద సంస్థల్లో చేరొద్దన్నందుకు కన్నతల్లిని కవల సోదరులు హత్య చేసిన దారుణోదంతం సౌదీ అరేబియాలోని రియాద్ లో చోటు చేసుకుంది. ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)లో చేరొద్దన్నందుకు తల్లితో పాటు తండ్రి, సోదరుడిని నిందితులు హతమార్చేందుకు ప్రయత్నించారు. జూన్ 24న ఈ ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల వయసు కలిగిన కవల సోదరులు ఖలీద్, సలేహ్ అల్-ఒరైనీ ఈ దురాగతానికి ఒడిగట్టారు. సిరియా వెళ్లి ఐసిస్ లో చేరతామని చెప్పగా కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. దీంతో తల్లి హైలా(67)తో పాటు 73 ఏళ్ల వయసున్న తండ్రిని, 22 ఏళ్ల వయసున్న సోదరుడిపై కత్తితో దాడి చేశారు. తల్లి ప్రాణాలు కోల్పోగా.. తండ్రి, సోదరుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఐసిఎస్ లో చేరొద్దన్నందుకు నిందితులు ఈ కిరాతకానికి ఒడిగట్టారని సౌదీ మీడియా వెల్లడించింది. సరిహద్దు దాటి యెమెన్ కు పారిపోతుండగా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ దేశంలో ఐసిఎస్ సానుభూతిపరుల సంఖ్య పెరుగుతుండడం పట్ల సౌదీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని కుటుంబ సభ్యులను హత్య చేసిన ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు ఐదు జరిగాయని 'అక్బర్ 24' వెబ్సైట్ వెల్లడించింది. -
తల్లిని చంపి పూడ్చిపెట్టారు!
ఆస్తిపై వ్యామోహంతో కొడుకు, కూతురు కలిసి కన్న తల్లినే కడతేర్చిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతేడాది గోష్ మహల్ లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన తాజాగా బయటపడింది. లక్ష్మీబాయి తన కొడుకు ఖదిర్ అలియాస్ బాబు, కూతురు కిరణ్మయిలతో కలిసి గోషామహల్లో నివాసముండేది. అయితే లక్ష్మీబాయి తన భర్త చనిపోవడంతో కొద్ది కాలం పిల్లలతో కలిసి ఒంటిరిగా జీవనం సాగించింది. తరువాత కాలంలో లక్ష్మీబాయికి జలీల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త రెండో వివాహానికి దారితీసింది. జలీల్‌ను వివాహం చేసుకున్న తరువాత కుటుంబంలో కలతలు చెలరేగాయి. గోషామహల్లో వారు నివాసముంటున్న ఇంటిని తన పేరుమీద రాయాల్సిందిగా బాబు తల్లిపై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలోనే గతేడాది జనవరిలో తల్లిని హత్య చేశాడు. దీనిపై అప్పట్లో కేసు నమోదుచేసుకున్న పోలీసులకు కన్న కూతురు, కొడుకు కలిసి తల్లిని హత్యచేశారని నిర్థారించారు. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
తల్లిని చంపి... ఇంట్లోనే పాతిపెట్టారు
హైదరాబాద్: అమ్మ ప్రేమను మరిచారు... పేగు బంధాన్ని మర్చిపోయారు. లాలిస్తూ తినిపించిన గోరు ముద్దలూ గుర్తుకు లేవు. కన్నతల్లిని కడతేర్చడమే కాదు, తాము ఉండే ఇంట్లోనే తవ్వి పాతి పెట్టేశారు అన్నా చెల్లెళ్లు. ఏడాది క్రితం నగరంలోని బేగంబజార్ ప్రాంతంలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగు చూసింది. ఈ ఘటనలో అన్నా చెల్లెళ్లు, బాబు, కిరణ్‌తో పాటు హత్యకు సహకరించిన నజామ్ అనే వ్యక్తిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వివరాలు....బాబు, కిరణ్(మహిళ) చిన్నప్పుడే తండ్రి మరణించడంతో, వారి తల్లి మతం మారి ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. పిల్లలను కూడా మతం మార్చించగా... పెద్దయిన తర్వాత వారు తిరిగి హిందూ మతంలోకి మారినట్లు తెలుస్తోంది. దీనిపై వేధింపులు ఎక్కువ కావడంతో 2014 జనవరి 1న తల్లిని హత్యచేశారని పోలీసులు తెలిపారు. -
తల్లిని చంపిన యువకుడి అరెస్టు
కన్నతల్లిని పీక పిసికి చంపేసిన ఓ యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడు తల్లి సుమిత్ర (50)ను చంపేసి, ఆమె మృతదేహాన్ని మంచానికి ఉన్న పెట్టెలో పెట్టేశాడు. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి ప్రాంతంలోని ఓ ఇంటి మొదటి అంతస్థులో ఆమె మృతదేహం ఆదివారం మధ్యాహ్నం కనిపించింది. అదే ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో నివసించే సుమిత్ర పెద్దకొడుకు ఆమె మృతదేహాన్ని ముందుగా చూశాడు. మృతురాలి చిన్నకొడుకు రోహిత్ ఆమెతోనే కలిసి ఉండేవాడు. కానీ అతడు కనిపించకపోవడంతో పోలీసులు అతడికోసం గాలింపు మొదలుపెట్టారు. ఆదివారం రాత్రి పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్లో రోహిత్‌ను అరెస్టు చేశారు. తల్లి తనను తరచు కొట్టేదని, అందుకే భరించలేక ఆమెను పీకపిసికి చంపేశానని అతడు అంగీకరించాడు. -
ప్రేమ పెళ్లి వద్దన్నందుకు.. తల్లిని కడతేర్చిన తనయుడు
రంగారెడ్డి జిల్లాలో దారుణం గండేడ్, న్యూస్‌లైన్: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానంటే నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు కన్నతల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా గండేడ్ మండలం మహమ్మదాబాద్‌లో జరిగింది. తాండూరుకు చెందిన ఫాతిమా(50) భర్త చనిపోవడంతో కుమారుడు చాంద్‌పాషాతో కలిసి మహమ్మదాబాద్‌లో నివాసం ఉంటోంది. వీరిద్దరూ ఓ కాటన్‌మిల్లులో పనిచేస్తున్నారు. తాండూరుకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవాలని చాంద్‌పాషాకు ఫాతిమా సూచించింది. అందుకు నిరాకరించిన అతడు.. ఓ అమ్మాయిని ప్రేమించానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. ఈ విషయమై సోమవారం ఘర్షణ జరగ్గా ఆవేశానికి లోనైన పాషా.. తల్లిని హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదులోకి తీసుకున్నారు.