ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన కుమార్తె | daughter killed mother with her lover | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన కుమార్తె

Published Sat, Nov 25 2017 8:20 AM | Last Updated on Sat, Nov 25 2017 8:20 AM

daughter killed mother with her lover  - Sakshi

నిందితులు హర్షాబన్నూర, శ్రీకాంత్‌చమ్మార

బనశంకరి: బాగల్‌కోటే జిల్లా,  కరూరు పట్టణంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన మహిళ కేసు కొత్త మలుపు తిరిగింది. సదరు మహిళను కన్న కూతురే  తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు  వెలుగుచూసింది. వివరాలు... కరూరు పట్టణంలో అక్టోబరు 31న సంగవ్వ(50) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే ఆమె హత్యకు గురైనట్లు  కుటుంబసభ్యులు కరూరుపోలీస్‌స్టేషన్‌లో నవంబర్‌2న ఫిర్యాదు చేశారు. విచారణలో నివ్వెరపోయే విషయాలు వెలుగు చూశాయి.  సంగవ్వ కుమార్తె హర్షాబన్నూరు శ్రీకాంత్‌ చమ్మార అనే వ్యక్తిని ప్రేమించింది. ఈక్రమంలో  అక్టోబరు 31న  శ్రీకాంత్‌ చమ్మార తన మామ సవలప్పతో కలిసి కరూరుకు వెళ్లి సంగవ్వతో మాట్లాడారు.

అయితే తన కుమార్తెను  ఇచ్చి వివాహం చేయడానికి సంగవ్వ అంగీకరించలేదు. దీంతో కోపోద్రిక్తులైన కుమార్తె హర్షాబన్నూర తన ప్రియుడు శ్రీకాంత్‌చమ్మార, సవలప్పలతో  కలిసి సంగవ్వను గొంతునులిమి హత్యచేసి ఉడాయించారు.  సంగవ్వ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హర్షాబన్నూర, శ్రీకాంత్‌చమ్మార, సవలప్పను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా హత్యోదంతం వెలుగు చూసింది. దీంతో  హర్షాబన్నూర, శ్రీకాంత్‌చమ్మార, సవలప్పను శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement