daughter killed
-
మణిపూర్‌లో బయటపడుతున్న దారుణాలు.. రోజుకొకటి..
ఇంఫాల్: మే 3న విద్యార్థి సంఘాల ఘర్షణతో మొదలైన మణిపూర్ అల్లర్లు అటుపై దారుణ రక్తపాతానికి దారి తీశాయి. అనేక జీవితాలను చిన్నాభిన్నం చేసి ఎన్నో కుటుంబాలను చెల్లాచెదురు చేశాయి. ఇక అక్కడి మహిళలపై ఎన్ని అమానుష సంఘటనలు జరిగాయో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఒక మహిళ తన కూతురు కోసం ఆరా తీసే క్రమంలో జవహర్ లాలా నెహ్రూ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ కి ఫోన్ చేయగా అక్కడివారు "సజీవంగా కావాలా? నిర్జీవంగా కావాలా?" అని అడిగేసరికి తన మాట గొంతులోనే ఆగిపోయిందని చెప్పుకొచ్చింది. రాష్ట్రంలో హింసాకాండ ప్రారంభమైన నాటి నుండి పరిస్థితిని కొంత నియంత్రణలో ఉంచేందుకు అక్కడ ఇంటర్నెట్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది అక్కడి ప్రభుత్వం. పరిస్థితి సద్దుమణిగిన కారణంగా ఈ మధ్యనే ఆ నిబంధనలను సడలించి ఇంటర్నెట్ సేవలను పునః ప్రారంభించింది. అప్పటి నుండి ఆనాటి హింసాకాండలో జరిగిన ఆటవిక సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంటర్నెట్ సేవలు తిరిగి ప్రారంభించిన తర్వాత మొదటగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ దారుణం జరిగిన మరుసటి రోజునే ఒక కార్ వాషింగ్ షోరూంలో మరో ఇద్దరు యువతులపై అల్లరిమూకలు కిరాతకానికి పాల్పడిన సంఘటన తోపాటు ఒక స్వాతంత్య్ర సమరయోధుడి భార్యను సజీవ దహనం చేసిన మరో అకృత్యం బయటపడింది. ఇటీవల ఒక మహిళ జవహర్ లాల్ నెహ్రూ ఆసుపత్రిలో కొంతమంది బాధితులు ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుని తన కూతురి ఆచూకీ కోసం వారికి ఫోన్ చేయగా.. అక్కడి మహిళ ఫోన్ లిఫ్ట్ చేసి.. ప్రాణాలతో కావాలా? మృతదేహమైనా ఫర్వాలేదా? అని అడిగారని ఆ మాట వినగానే కళ్ళు చేతులు ఆడలేదని. తర్వాత తన కూతురు చనిపోయిందన్న విషయం తెలిపారని చెప్పి కన్నీరుమున్నీరైంది. మే 5న కార్ వాష్ షోరూంలో హత్యాచారానికి గురైన ఇద్దరి యువతుల్లో ఒకరు తన కూతురని తెలిశాక షాక్‌లో ఉండిపోయానని తెలిపింది. తన కుటుంబంలో అందరికీ విషయం తెలిసినా కూడా తాను హార్ట్ పేషెంటు కావడంతో తనకు చెప్పకుండా దాచారని, నా భర్త అయితే ఇప్పటికీ కూతురు కోసం సేనాపతి హాస్పిటల్లో ఎదురు చూస్తున్నారని వాపోయింది. కూతురు డెడ్ బాడీ తమకు ఇంకా అందాల్సి ఉందని తెలిపింది. ఇలాంటి ఘటనలు మణిపూర్‌లో కోకొల్లలు. దేశం మొత్తాన్ని కుదిపేసిన ఈ అల్లర్లలో జరిగిన ఒక్కో దారుణం వెలుగులోకి వస్తోంటే మనుషుల్లో మానవత్వం పూర్తిగా మసకబారిందాని అనిపించక మానదు. ఇది కూడా చదవండి: మణిపూర్‌లో మరో ఘోరం.. ఫ్రీడం ఫైటర్ భార్య సజీవ దహనం -
మద్యానికి బానిసై సైకోగా మారి.. కూతుర్ని గొడ్డలితో నరికిచంపిన తండ్రి..
సాక్షి, పెద్దపల్లి: తండ్రి మద్యం మత్తు, రాక్షసత్వానికి పదేళ్ల చిన్నారి బలైపోయింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల సదానందం భార్య పదినెలల క్రితం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరికి కొడుకు అంజి, కూతురు రజిత(10) ఉన్నారు. రజిత ప్రస్తుతం ఐదోతరగతి చదువుతోంది. సదానందం కొన్నాళ్లుగా మద్యానికి బానిసై, గ్రామంలో సైకోగా ప్రవర్తిస్తున్నాడు. పలువురిపై దాడికి సైతం దిగాడు. గురువారం ఉదయం మద్యంమత్తులో ఇంటికి వచ్చిన సదానందం కూతురు రజితపై దాడి చేశాడు. గొడ్డలితో చిన్నారి మెడపై వేటువేయడంతో అక్కడికక్కడే చనిపోయింది. రక్తపు మరకలతో ఉన్న గొడ్డలిని తీసుకుని సమీపంలోని కిరాణాదుకాణానికి వెళ్లాడు. దుకాణ యజమాని దూపం శ్రీనివాస్‌పై దాడి చేయగా తీవ్రగాయమైంది. అనంతరం సదానందం ఇంటికి వెళ్లిపోయాడు. కొడుకు అంజి ఇంటికి రాగా.. రక్తపుమడుగులో ఉన్న తన సోదరి మృతదేహాన్ని చూసి కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితుడిని పోలీసువాహనంలో స్టేషన్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. నిందితుడు బండరాళ్లు అడ్డుపెట్టి.. కారంతో దాడిచేసి పోలీస్‌వాహనం ముందుకెళ్లకుండా కర్రలు, బండరాళ్లు అడ్డుపెట్టారు. వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. హంతకుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మంథని సీఐ సతీశ్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఎంత చెప్పినా వినలేదు. ఈ క్రమంలో కొందరు పోలీసులపై కారంపొడి చల్లి దాడికి దిగారు. మూడుగంటలపాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అదనపు బలగాలను దింపారు. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ అక్కడికి చేరుకొని నిందితుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు శాంతించారు. బాలిక మేనమామ కొత్తపల్లి సుమన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. చదవండి: పుట్టగానే తండ్రి వదిలేశాడు.. టెన్త్‌లో 10 జీపీఏతో సత్తాచాటిన కవలలు -
యూట్యూబర్‌ను కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇచ్చిన తండ్రి..కోపంతో దారుణంగా
బాగ్ధాద్: ఇరాక్‌కు చెందిన 22 ఏళ్ల యూట్యూబర్ టిబా అల్ అలీ దారుణ హత్యకు గురైంది. కన్నతండ్రే ఆమెను కిరాతకంగా హతమార్చాడు. డ్రగ్స్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి గొంతునులుమి అంతం చేశాడు. అనంతరం స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందనే అవమానం భరించలేకే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఏం జరిగిందంటే..? టిబ 2017లోనే ఇళ్లు వదిలి టర్కీకి వెళ్లిపోయింది. సిరియాకు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే జనవరిలో తన సొంత దేశం ఇరాక్ జట్టు ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు స్వదేశానికి తిరిగివచ్చింది. ఈ సమయంలోనే ఆమెను తండ్రి కిడ్నాప్ చేసి వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. అయితే టిబా తన తల్లితో మాట్లాడేందుకు ఒప్పుకుందని, స్నేహితురాలి ఇంట్లో ఆమెను కలిసేందుకు అంగీకరించిందని తెలుస్తోంది. కానీ తండ్రి ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రం వాగ్వాదం చెలరేగింది. అయితే టిబాకు తండ్రి డ్రగ్స్ ఇవ్వడంతో ఆమె కాసేపటికే సృహకోల్పోయింది. అనంతరం ఆమె నిద్రలో ఉండగానే గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. చదవండి: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి.. -
Crime News: గోరుముద్దలు కాస్త కాలకూట విషమై..
ఎల్ఎన్ పేట (హిరమండలం): జన్మనిచ్చిన అమ్మే ఆ పాప ఆయుష్షు ఆపేసింది. ఊపిరినిచ్చిన తల్లి ఉసురు తీసింది. గోరుముద్దలు తినిపించిన చేతితోనే విషం పెట్టింది. తానూ ఆ విషమే తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రజని(27) అనే మహిళ ఆత్మహత్య చేసుకుని తన కుమార్తె జ్యోత్స్న(3)కు కూడా విషమిచ్చింది. ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఒడిషా హిరమండలం మేజర్ పంచాయతీ శుభలయ కాలనీ ఎస్టీ వీధికి చెందిన తంప వెంకటరమణ తాపీ మేస్త్రీగా పని చేస్తుంటారు. ఈయనకు జలుమూరు మండలం జమినివలసకు చెందిన రజనీతో 2015లో వివాహమైంది. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ బతుకుతుండేవారు. వీరికి హర్షిణి (5), జ్యోత్స్న (3) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటరమణ వలస వెళ్తూ ఉండేవారు. ఇటీవలే సొంతూరు వచ్చేశారు. ఈ నెల 2వ తేదీ శుక్రవారం వెంకటరమణ రోజూ లాగానే తన పనికి వెళ్లిపోయారు. ఇంటిలో చిన్నపిల్ల జ్యోత్స్న అపస్మారక స్థితిలో ఇరుగుపొరుగు వారికి కనిపించడంతో వారు పాపను హిరమండలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని వెంకటరమణకు చెప్పగా.. ఆయన హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. పాప పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో స్థానిక డాక్టర్లు 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ గొడవలో ఉండగానే వెంకటరమణకు మరోసారి బంధువులు ఫోన్ చేశారు. రజనీ ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని, ఆమె కూడా అపస్మారక స్థితిలో ఉందని చెప్పారు. దీంతో ఆయన తన బావమరుదులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి రజనీని హిరమండలం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. రిమ్స్‌లోనే చిన్నారి జ్యోత్స్న శనివారం అర్ధరాత్రి తర్వాత కన్నుమూయగా.. ఆదివారం రజనీ మృతి చెందారు. రజనీ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని, పాపకు కూడా అదే విషం ఇచ్చిందని వారికి వైద్యులు తెలిపినట్లు సమాచారం. భర్త వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హిరమండలం ఇన్చార్జి ఎస్ఐ ఎం.గోవింద్ తెలిపారు. అఘాయిత్యానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. -
కన్న తండ్రిని కూతురే కడతేర్చింది
కుషాయిగూడ(హైదరాబాద్): తమ ప్రేమకు అడ్డు చెప్తున్నాడని ఓ కూతురు ప్రియుడితో కలసి తండ్రిని హత్య చేసింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జూలైలో జరిగిన ఈ ఘటనపై పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. ఈ దర్యాప్తులో అసలు కథ బయటపడింది. ఇన్స్పెక్టర్ మన్మోహన్ శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. పల్సం రామకృష్ణ (49) భార్య, కూతురుతో కాప్రాలో నివాసం ఉంటూ స్థానిక గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నారు. రామకృష్ణ (ఫైల్) గత జూలై 20న తలకు బలమైన గాయాలతో రామకృష్ణ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మరో పెద్దాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇంట్లో జారిపడి తలకు గాయమైందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆ మేరకు కేసు నమోదు చేశారు. ఆశ్చర్యపర్చిన పోస్టుమార్టం నివేదిక.. అయితే, రామకృష్ణ పోస్టుమార్టం నివేదికలో ఆశ్యర్యపరిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి గొంతు నులిమినట్లుగా, బలంగా కొట్టినట్లుగా గాయాలు ఉన్నట్లుగా తేలింది. దీంతో అనుమా నం వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి.. మృతుడి భార్య, కుటుంబసభ్యులను విచారించారు. దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో నారాయణగూడలోని ఓ అపార్ట్మెంట్లో వీరు ఉండేవారు. రామకృష్ణ కూతురు (మైనర్ బాలిక) అపార్ట్మెంట్ వాచ్‌మన్ కొడుకు చెట్టి భూపాల్ (20)తో ప్రేమలో పడింది. విషయం తెలిసిన బాలిక తండ్రి పలుమార్లు మందలించారు. ఈ క్రమంలో భూపాల్ ఆ బాలికకు మాయమాటలు చెప్పి.. రామకృష్ణ ఇంట్లో రూ.1.75 లక్షలు చోరీ చేశాడు. ఖరీదైన బైక్, సెల్‌ఫోన్, బట్టలు కొనుక్కొని మైనర్ బాలికతో జల్సాలు చేశాడు. దీనిపై రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు భూపాల్‌ను రిమాండ్ తరలించారు. కూతురి ప్రేమ వ్యవహారం బయటపడుతుందని... అనంతరం రామకృష్ణ కాప్రాకు మకాం మార్చాడు. గత జూలైలో జైలు నుంచి విడుదలైన భూపాల్ తిరిగి బాలికతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అతడినే పెళ్లి చేసుకోవాలని బాలిక కూడా నిర్ణయించుకుంది. దీంతో తమ ప్రేమకు అడ్డుగా ఉన్న రామకృష్ణను హత్యచేయాలని భావించారు. భూపాల్ తన ఇద్దరు మిత్రులతో కలసి రామకృష్ణ హత్యకు పథకం వేశాడు. తినే ఆహారంలో మత్తు మందు కలిపితే హత్య చేయడం సులువుగా ఉంటుందని ఆలోచించారు. జూలై 19 సాయంత్రం వీరు మత్తుగోలీల పౌడర్‌ను కూతురుకు అందజేశారు. తల్లిదండ్రులు తినే ఆహారంలో ఆ పౌడర్‌ను ఆమె కలపడంతో వారు నిద్రలోకి వెళ్లిపోయారు. భూపాల్ తన మిత్రులతో రాత్రి ఒంటి గంట సమయంలో కాప్రాకు చేరుకున్నాడు. నిద్రలో ఉన్న రామకృష్ణ ముఖంపై భూపాల్, గణేష్ బ్లాంకెట్ వేసి అదిమిపట్టుకోగా, ప్రశాంత్ కత్తితో తలపై బలంగా పొడిచాడు. నొప్పితో మేల్కొన్న రామకృష్ణను చూసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తేరుకున్న కుటుంబసభ్యులు రామకృష్ణను ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. కూతురి ప్రేమ విషయం బయటకు వస్తుందన్న ఆలోచనతో మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పకుండా దాచారు. అయితే, పోస్టుమార్టం నివేదికతో దర్యాప్తు జరిపిన పోలీసులు వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారు. తండ్రి హత్యకు ఫ్లాన్ చేసిన కూతురు, భూపాల్, గణేష్, ప్రశాంత్‌తో పాటుగా ప్రశాంత్‌ను రక్షించాలనే ప్రయత్నం చేసిన అతడి తండ్రి విజయ్‌పాల్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. -
తల్లి ఇంట్లో ఉండగా ప్రియుడికి ఫోన్ చేసి రప్పించి ఎంత పనిచేసింది..
సాక్షి, రాజేంద్రనగర్: ఓ మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని ఉరివేసి చంపేసింది. నిందితులు ఇరువురు మైనర్లు కావడంతో ఈ విషయం మరింత కలచివేస్తోంది. రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం..మృతురాలు యాదమ్మ(42) తన భర్త, పిల్లలతో కలిసి చింతల్మెట్ సమీపంలో నివాసిస్తోంది. భర్త రోజూవారి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. వీరికి 17 ఏళ్ల కూతురు సంతానం. ఆమె 17 ఏళ్ల మైనర్ బాలుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతూ పరిచయం ఏర్పరచుకుంది. విషయం తెలుసుకున్న తల్లి ఇరువురిని మందలించింది. చదవండి: ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ!’ శరత్‌పై దాడి మృతి చెందిన యాదమ్మ సోమవారం ఉదయం తల్లి ఇంట్లో ఉండగానే సదరు బాలిక ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. దాదాపు గంట పాటు ఇరువురు బాలిక తల్లితో గొడవపడి బయటకు రావడంతో అనుమానం వచ్చిన స్థానిక మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇరువుర్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ గంగాధర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కాల్ రికార్డర్‌తో కన్నమేశాడు.. భార్యతో కలిసి తండ్రి ఇంట్లోనే.. -
ప్రేమించిందని కన్న కూతురినే..
ముంబై : నగరంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని ప్రేమించిదన్న కోపంతో కన్న కూతురినే గొంతునులిమి చంపింది ఓ కసాయి తల్లి. ఈ ఘటన దక్షిణ ముంబైలోని ఫైడోని ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీ. వాఘేలా అనే ఓ 40 ఏళ్ల మహిళ, కూతురు నిర్మలా అశోఖ్ వాఘేలా(23)తో కలిసి దక్షిణ ముంబైలోని ఫైడోనిలో నివాసం ఉంటుంది. నిర్మలా ఇటీవల ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. ఈ విషయం వాఘేలాకు తెలియడంతో ఆమెతో గొడవకు దిగింది. అతనితో తిరగొద్దని బెదిరించింది. అయినప్పటికీ నిర్మలా అతనితో రిలేషన్‌షిప్‌ను కొనసాగించింది. గత ఆదివారం రాత్రి ఈ విషయంపై తల్లీకూతుర్లకు గొడవ జరిగింది. తల్లితో వాదనలకు దిగిన నిర్మలా.. తాను ప్రేమించిన వాడితోనే వెళ్లిపోతానని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు బ్యాగు కూడా సర్దుకుంది. దీంతో కోపోద్రిక్తురాలైన వాఘేలా.. కూతురు గొంతు నులిమి చంపేసింది. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్లో లొంగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. -
కూతురిని చంపి.. తల్లి ఆత్మహత్య
కొత్తకోట రూరల్: బ్రెయిన్ స్ట్రోక్‌తో భర్త మరణం.. చుట్టిముట్టిన ఆర్థిక ఇబ్బందులు.. వెరసి ఓ తల్లి తన కూతురికి కూల్‌డ్రింక్‌లో విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన మండలంలోని పాలెంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన జానకమ్మ, సవరయ్య దంపతుల కూతురు నిర్మల(30)ని పాలెం గ్రామానికి చెందిన నర్సింహకు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి కూతురు సింధూ(8) ఉంది. అయితే, రెండేళ్ల కిందట భర్త నర్సింహ బ్రేన్ స్ట్రోక్‌తో చనిపోయాడు. అప్పటి నుంచి నిర్మల, ఆమె కూతురు ఇద్దరూ తల్లిగారి ఊరు ఆరేపల్లిలో ఉంటున్నారు. అయితే, ఉగాది పండుగ కావడంతో అత్తగారి ఊరైన పాలెంకు వచ్చారు. కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలిపి.. ఏమైందో తెలియదు కానీ, ఆదివారం రాత్రి పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలిపి మొదట కూతురు సింధూకు ఇచ్చి, అనంతరం తల్లి నిర్మల తాగి ఇంట్లోనే నిద్రించారు. రాత్రి 10గంటల సమయంలో కూతురు సింధూ కడుపునొప్పిగా ఉందని చెప్పగా.. ఏంకాదులే ఉదయం ఆస్పత్రికి వెళ్దామని చెప్పి తల్లి నిద్రపుచ్చింది. అనంతరం గాడనిద్రలో ఉన్న పాప మృతిచెందిందో లేదోనన్న అనుమానంతో తల్లి కత్తితో రెండు సార్లు పొడిచినట్లు గాట్లు కూడా ఉన్నాయి. తెల్లవారుజామున 4గంటల సమయంలో నిర్మల అత్త సవరమ్మ లేచి చూసేసరికి మంచంపై సింధూ ఒక్కతే కనపడడంతో నిర్మల ఎక్కడ ఉందోనని బయటికి వచ్చి చూసింది. అప్పటికే నిర్మల అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది. గ్రామస్తులు మొదట నిర్మలను ఆటోలో ఎక్కించుకుంటుండగా.. నిద్రలో ఉన్న సింధూ లేస్తే తల్లికోసం ఏడుస్తదేమోనన్న ఉద్దేశంతో తనను లేపేందుకు వెళ్లి చూడగా సింధూ అప్పటికే మృతిచెంది ఉంది. వెంటనే తల్లి కూతుళ్లను ఆటోలో వనపర్తి ఆస్పత్రికి తరలిస్తుండగా తల్లి నిర్మల కూడా మార్గమధ్యంలోనే మృతిచెందిందని గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్ఐ రవికాంత్‌రావు గ్రామస్తులతో ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకొని క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు. ఇదిలాఉండగా, భర్త చనిపోయాక నిర్మలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండేవని గ్రామస్తులు పేర్కొన్నారు. బాధితురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెంకటేశ్వర్రావు తెలిపారు. -
తల్లి చంపితే.. తండ్రి పాతి పెట్టాడు
ఇబ్రహీంపట్నం : నవమాసాలు మోసి కన్న బిడ్డనే... ఆ కసాయి తల్లి కడతేర్చింది. అల్లరి చేస్తుందనే కారణంతో మూగ చెవుడుతో పుట్టిన ఏడేళ్ల కూతుర్ని అత్యంత అమానుషంగా ఇటుక రాయితో కొట్టి చంపింది. ఆనక భర్తతో కలిసి మృతదేహాన్ని పాతి పెట్టి అదృశ్యమైందంటూ డ్రామాలాడింది. మానవత్వాన్ని ఎక్కిరించే ఈ సంఘటన యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని తన కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మల్లారెడ్డి ఈ ఘాతుకానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలు బల్లటి చత్రియ, హేతురాంలు యాచారం మండల పరిధిలోని చింతుల్ల శివార్లలోని బీఎన్సీ ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. 5 నెలల క్రితమే వీరు వచ్చారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడున్నారు. మూగ చెవుడుతో పుట్టిన ఏడేళ్ల ఊర్మిళ వీరికి మూడో సంతానం. మూగచెవుడు కావడం, ఈ చిన్నారి అల్లరి ఎక్కువగా చేస్తుండటం.. పొరుగువారితో తరచూ గొడవ పడుతుండటంతో తల్లి చత్రియ(39) బిడ్డను చంపాలని నిర్ణయించుకుంది. దీంతో 26వ తేదీ మధ్యాహ్నం ఆ చిన్నారి గుడిసెలో నిద్రిస్తుండగా ఇటుకతో తలపై కొట్టి చంపింది. సమీపంలోని చెట్టుకింద నిద్రిస్తున్న భర్త హేతురాంను లేపి ఈ విషయాన్ని చెప్పింది. మృతదేహన్ని ఏం చేయాలో వారికి అర్థంకాలేదు. దీంతో సమీపంలోని ఇటుకబట్టీల్లో కాల్చేసిన బూడిద పొట్టు కుçప్పను తవ్వి అందులో చిన్నారి మృతదేహాన్ని తండ్రి హేతురాం పాతిపెట్టాడు. అనంతరం చిన్నారి తప్పిపోయిందంటూ డ్రామాలాడారు తప్ప పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకురాలేదు. ఈ విషయం తెలిసిన బట్టీ యాజమాని ఆ చిన్నారి తల్లిదండ్రులతో 27న యాచారం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు కింద ఫిర్యాదు చేయించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐ కృష్ణంరాజుకు తల్లిదండ్రులపైనే అనుమానం కలిగింది. ఇటుక బట్టీల వద్ద దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు అనుమానం మరింత బలపడింది. తల్లి చత్రియను బిడ్డ ఎక్కడుందో చెప్పాలని గట్టిగా అడుగగా... కాల్చి ఉన్న పొట్టు కుప్పలో ఆ చిన్నారి చేయి కనబడుతుందని పోలీసులకు తెలిపింది. అక్కడికి వెళ్లి తవ్విచూడగా ఊర్మిళ మృతదేహం లభ్యమైంది. కానీ తల్లిదండ్రుల్లో బిడ్డ చనిపోయిన బాధ కలగకపోవడంతో వారిపై మరింత అనుమానం పోలీసులకు బలపడింది. డాగ్ స్క్వాడ్స్‌ను రప్పించగా సమీపంలోని చత్రియ గుడిసెలోకి వెళ్లింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా తల్లిదండ్రులే ఆ చిన్నారిని హతమార్చారని తేలింది. దీంతో చత్రియ, హేతురాం(45)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును సమయస్ఫూర్తితో ఛేదించిన సీఐ కృష్ణంరాజును ఏసీపీ మల్లారెడ్డి అభినందించారు. -
వీడిన రామలక్ష్మి హత్య మిస్టరీ
గరివిడి: మండలంలోని కొండలక్ష్మీపురంలో ఈ నెల 5వ తేదీన జరిగిన గొర్లె రామలక్ష్మి(65) హత్య కేసు మిస్టరీ వీడింది. పట్టుబడిన నిందితులను బొబ్బిలి డీఎస్పీ పి.సౌమ్యలత ఆధ్యర్యంలో గరివిడి ఎస్సై శ్రీనివాస్ బుధవారం మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ సౌమ్యలత అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామలక్ష్మికి చేతబడి ఉందన్న అనుమానంతో హంతకులు పథకం ప్రకారం హతమార్చారు. గతంలో గ్రామంలో ఉన్న చిన్నారులు, పెద్దలు, పశువులు అనారోగ్యం పాలవుతుండటానికి ప్రధాన కారణం రామలక్ష్మి చేతబడేనని నిందితుల నమ్మకం. ముఖ్యంగా హత్యకు వారం ముందు వట్టిగళ్ల ఆదినారాయణకు చెందిన ఆవు మృతి చెందింది. తన ఆవు చనిపోవడానికి రామలకే‡్ష్మ కారణమని భావించిన ఆదినారాయణ ఆమెను అంతమొందించడానికి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆమె కుమార్తె తాడ్డి పెంటమ్మతో చర్చించాడు. దీంతో పెంటమ్మ తన తల్లికి చిల్లంగి, చేతబడి ఉందని అనుమానం ఉంటే పల్లు పీకేయమని, లేదంటే ఇళ్ల చుట్టూ కొయ్యలు పాతిపెట్టమని సలహాఇచ్చింది. అయితే ఆ విషయాలకు సంతృప్తి చెందని ఆదినారాయణ ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించాడు. అలాగే రామలక్ష్మి పేరిట బ్యాంకు ఖాతాలో రూ.90 వేలు ఉన్నట్లు కుమార్తె పెంటమ్మ తెలుసుకుంది. తల్లిని చంపేస్తే ఆ పైకం తనకే చెందుతుందన్న దురాశతో ఆదినారాయణతో చేతులు కలిపింది. దీంతో వీరిద్దరూ ఆదినారాయణ కుమారుడు వట్టిగల్ల జయరాజు, దాసరి సతీష్‌ల సహకారం తీసుకున్నారు. అదే గ్రామానికి చెందిన ఆవాల దేముడురాజుకు రూ. 50 వేలు ఇస్తామని ఆశ చూపించి రెండు రోజుల్లో రామలక్ష్మిని చంపేయాలని కోరారు. దీంతో ఈ నెల 5వ తేదీన గ్రామంలో తన తోటలో మొక్కలకు నీళ్లు పోస్తున్న రామలక్ష్మిని దేముడురాజు పీక కోసి హత్య చేశాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని సంఘటనా స్థలానికి 500 మీటర్ల దూరంలో ఉన్న తాటిచెట్ల పొదల్లో దాచేశాడు. అనంతరం రామలక్ష్మి శవాన్ని కుమార్తె పెంటమ్మ తన భుజాలపై వేసుకొని ఇంటికి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే రామలక్ష్మి మృతిపై అనుమానాలున్న పోలీసులు తనదైన శైలిలో విచారణ చేపట్టడంతో నిందితులు పట్టుబడ్డారు. కార్యక్రమంలో చీపురుపల్లి సీఐ సీహెచ్. శ్యామలరావు, ఎస్సై శ్రీనివాస్ ఉన్నారు. -
దారుణం : కూతురి కోసం కాల్స్ వస్తుండటంతో..
సాక్షి, విజయవాడ : ఫోన్ కాల్స్ వ్యవహారం ఓ విద్యార్థిని ప్రాణాలు పోవడానికి కారణమయింది. కూతురి కోసం ఎడతెరిపిలేకుండా కాల్స్ వస్తుండటంతో సహనం కోల్పోయిన తండ్రి ఉన్మాదిలా మారి.. కన్నబిడ్డనే పొట్టనపెట్టుకున్నాడు. విజయవాడలో సంచలనం రేపిన ఈ ఘటనలో నిందితుడిని సింగ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏం జరిగింది? : స్థానిక ఉడా కాలనీలో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తోన్నాడు రమణ. అతనికి పదోతరగతి చదివే కూతురు(కృష్ణవేణి) ఉంది. ఇటీవలికాలంలో కృష్ణవేణి కోసమంటూ రమణ మొబైల్‌కి కాల్స్ ఎక్కువగా వచ్చాయి. ఇదే విషయమై నాలుగురోజుల కిందట ఇంట్లో గొడవజరిగింది. ఆ కాల్స్‌కు, తనకు ఎలాంటి సంబంధం లేదని కూతురు తెగేసి చెప్పింది. అయినాసరే వినిపించుకోకుండా ఉన్మాదిలా మారిన రమణ.. కూతురిని విచక్షణారహితంగా కొట్టాడు. కణత భాగంలో బలంగా దెబ్బతగలడంతో కృష్ణవేణి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అనారోగ్యంతో చనిపోయిందటూ అంత్యక్రియలు.. : కాగా, తండ్రి కొట్టడం వల్లే కృష్ణవేణి చనిపోయిన విషయాన్ని దాచిపెట్టిన కుటుంబీకులు.. అనారోగ్యం వల్లే ప్రాణాలు కోల్పోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. ఆమేరకు అంత్యక్రియలు జరిపించేందుకు సిద్ధమయ్యారు. చుట్టుపక్కలవారు అందించిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకిదిగారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిర్వహించగా.. కణతపై దెబ్బవల్లే కృష్ణవేణి ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. దీంతో కేసు నమోదుచేసుకుని నిందితుడు రమణను అదుపులోకి తీసుకున్నారు. -
తండ్రిని హతమార్చిన కుమార్తె
తిరువొత్తియూరు: అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి బాగోగులు చూసుకోలేక హత్య చేసిన కుమార్తె, ఆమె మిత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. సేలం అరసి పాళయం చిన్న గౌండర్ వీధికి చెందిన మురుగన్ టీ మాస్టర్. ఇతని భార్య కమల(40). వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కమల ఓ మిల్లులో పనిచేస్తోంది. ఈమె తండ్రి పళణిస్వామి(85) అనారోగ్యంతో బాధపడతున్నాడు. ఇతడు కమల పని చేసే పిండి మిల్లు వద్దకు వచ్చి తనను ఎవరూ చూసుకోవడం లేదని కుమార్తెను అసభ్యంగా తిట్టడంతో పాటు ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రం చేస్తున్నట్టు తెలిసింది. దీంతో విరక్తి చెందిన కమల గత శనివారం మిత్రుడు అంబాపేటకు చెందిన షణ్ముగం (40)తో కలిసి పళనిస్వామిపై పిండి బస్తా వేసి హత్య చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పల్లపట్టి పోలీసులు కేసు నమోదు చేసి కమల, షణ్ముగంను బుధవారం అరెస్టు చేశారు. -
ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన కుమార్తె
బనశంకరి: బాగల్‌కోటే జిల్లా, కరూరు పట్టణంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన మహిళ కేసు కొత్త మలుపు తిరిగింది. సదరు మహిళను కన్న కూతురే తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు వెలుగుచూసింది. వివరాలు... కరూరు పట్టణంలో అక్టోబరు 31న సంగవ్వ(50) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే ఆమె హత్యకు గురైనట్లు కుటుంబసభ్యులు కరూరుపోలీస్స్టేషన్లో నవంబర్2న ఫిర్యాదు చేశారు. విచారణలో నివ్వెరపోయే విషయాలు వెలుగు చూశాయి. సంగవ్వ కుమార్తె హర్షాబన్నూరు శ్రీకాంత్ చమ్మార అనే వ్యక్తిని ప్రేమించింది. ఈక్రమంలో అక్టోబరు 31న శ్రీకాంత్ చమ్మార తన మామ సవలప్పతో కలిసి కరూరుకు వెళ్లి సంగవ్వతో మాట్లాడారు. అయితే తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి సంగవ్వ అంగీకరించలేదు. దీంతో కోపోద్రిక్తులైన కుమార్తె హర్షాబన్నూర తన ప్రియుడు శ్రీకాంత్‌చమ్మార, సవలప్పలతో కలిసి సంగవ్వను గొంతునులిమి హత్యచేసి ఉడాయించారు. సంగవ్వ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హర్షాబన్నూర, శ్రీకాంత్‌చమ్మార, సవలప్పను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా హత్యోదంతం వెలుగు చూసింది. దీంతో హర్షాబన్నూర, శ్రీకాంత్‌చమ్మార, సవలప్పను శుక్రవారం అరెస్ట్ చేశారు. -
బాబాయి.. బాలిక హత్య?
అమృతలూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఐదేళ్ల బాలిక, ఆమె బాబాయి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం సంచలనం రేకెత్తించింది. అమృతలూరు–పెదపూడి గ్రామాల మధ్య తెనాలి–చెరుకుపల్లి ఆర్అండ్బీ రహదారి పక్కనే చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. అమృతలూరుకు చెందిన రాపర్ల సుబ్బి కృష్ణ, ఝాన్సీవల్లి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సురేష్ బాబుకు వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమారుడి సతీష్ వివా హం అయి ఏడాది కూడా పూర్తి కాలేదు. సోదరులిద్దరూ గత కొన్నేళ్లుగా గ్రామ దేవత పుట్లమ్మ తల్లిగుడి పక్కనే ఉన్న షాపును అద్దెకు తీసుకొని ఎరువులు, పురుగు మందుల దుకాణ వ్యాపారం సాగిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాపర్ల సతీష్‌కు, యలవర్రులో ఎస్సీ మాల వర్గానికి చెందిన సజనకుమారితో పెద్దల వివాహం ఈ ఏడాది మార్చి లో చేశారు. అయితే వివాహమైన కొద్ది కాలానికే కుటుంబాల మధ్య కలహాలు రావడంతో దంపతులిద్దరూ విడివిడిగా వారి గ్రామాల్లో ఉంటున్నారు. మధ్యలో భార్య తాలూకు పెద్దలు అమృతలూరులోని సతీష్ కుటుంబం వద్దకు వచ్చి మా ట్లాడినా వారి చర్చలు విఫమయ్యాయి. దీంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఏం జరిగింది? రాపర్ల సతీష్‌కు అన్న రెండో కుమార్తె చరితాచౌదరి అంటే ఎనలేని ప్రేమ. ఎక్కడకు వెళ్లినా వెంటబెట్టుకుపోÄయేవాడు. ఈ నేపథ్యంలో ఎరువుల షాపు కావడంతో తెనాలిలో ఆడిట్ ఉందని, దీపావళి సామగ్రిని పిల్లలకు తీసుకువస్తానని చరితాచౌదరిని మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని సోమవారం సాయంత్రం తెనాలికి పయనమయ్యాడు. రాత్రికి కూడా రాకపోవడంతో సతీష్‌కు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో, కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. తెనాలి వైపు రోడ్డుకు ఇరువైపులా వెతుకులాట సాగించారు. అయినా వారి జాడ కనిపించలేదు. తెల్లారైనా ఇంటికి చేరుకుంటారని ఎదురు చూస్తున్నారు. ఇంతలో పొలాల వైపు వెళ్తున్న కొందరు అమృతలూరు – పెదపూడి గ్రామాల మధ్యలో ఎత్తివేసిన వైన్ షాపు దుకాణం వద్ద బాలిక మృతదేహం, షాపు ముందు సతీష్ మృతదేహాలను గుర్తించారు. వెంటనే గ్రామమంతటా తెలియడంతో అందరూ ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానిక పోలీసులు రంగప్రవేశం చేశారు. ఒంటిపై గాయాలు.. మృతుడు సతీష్ వద్ద ఒక బ్లేడు, కొంత నగదు, సెల్‌ఫోన్ ఉన్నాయి. అతని చేతిపై బ్లేడుతో కోసిన గాట్లు ఉన్నాయి. బలవంతంగా అతనిని కట్టివేసి ఏదైనా కూల్‌డ్రింక్‌లో సైనేడ్ కలిపి తాగించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరినైనా గుర్తు పడుతుందేమోనని ముక్కుపచ్చలారని బాలికను కర్కశంగా చంపివేసి ఉంటారని భావిస్తున్నారు. మృతులిద్దరి మెడలపై నల్లటి ఆయిల్ పూసి ఉంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పలువురు ఇది హత్యేనని చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో, పోలీసుల విచారణలో వాస్తవాలు వెల్లడి కావాల్సి ఉంది. ఘటనా స్థలికి గుంటూరు నుంచి వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్ బృందం వచ్చి ఘటనా స్థలిలో ఉన్న ఆధారాలను సేకరించారు. ఆధారాల సేకరణ ఘటనా స్థలికి తెనాలి డీఎస్పీ ఎం.స్నేహిత, తెనాలి వన్‌టౌన్ సీఐ బెల్లం శ్రీనివాసరావు, చుండూరు ఇన్చార్జి సీఐ బత్తుల కల్యాణరాజు, అమృతలూరు, చుండూరు ఎస్సైలు ఆర్ఎస్. శ్రీనివాస్, కె.విక్టర్‌లు, ఇన్చార్జి ఆర్ఐ ఎంవీఆర్ బ్రహ్మం సందర్శించి ఆధారాలను సేకరించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దహన సంస్కారాలు, చేశారు. బాలికను పూడ్చి పెట్టారు. మృతుని సోదరుడు సురేష్‌బాబు ఫిర్యాదు మేరకు అమృతలూరు ఎస్ఐ ఆర్ఎస్ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. చుండూరు ఇన్చార్జి సీఐ బత్తుల కల్యాణరాజు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య మీద కోపంతో.. కూతురి దారుణహత్య
బిహార్‌లోని కతిహార్ జిల్లాలో ఓ వ్యక్తి తన సొంతకూతురినే దారుణంగా కొట్టి, పీకపిసికి చంపేశాడు. తన భార్య తనను వదిలిపెట్టి వేరే వ్యక్తిని పెళ్లాడిందన్న కోపంతోనే అతడు ఇదంతా చేశాడు. ఈ ఘటన రాష్ట్ర రాజధాని పట్నాకు 304 కిలోమీటర్ల దూరంలో గల కతిహార్ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. మహ్మద్ ముస్తాక్ (40) అనే వ్యక్తిని అతడి భార్య ఇటీవల వదిలేసింది. ఎనిమిదేళ్ల కూతురు సుహానీ మాత్రం అతడితోనే ఉంటోంది. అంతలో తన భార్య ఢిల్లీలో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని అతడికి తెలిసింది. దాంతో విపరీతంగా కోపం వచ్చిన ముస్తాక్.. తన కూతుర్ని బాగా కొట్టాడు. ఇంకా కోపం తగ్గక.. ఆమె పీక పిసికి చంపేశాడని టౌన్ పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ అనుపమ్ కుమార్ చెప్పారు. రోజుకూలీ అయిన ముస్తాక్‌పై అతడి అత్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టుచేసి, జైల్లో పెట్టారు. ముస్తాక్ భార్య దుఖ్నీ ఖాతూన్ (35) భర్తను వదిలిపెట్టి ఐదు నెలల క్రితం ఒక కొడుకు, కూతురితో కలిసి ఢిల్లీ వెళ్లిపోయింది. అప్పటినుంచి తన సోదరి వద్ద ఉంటోంది. వాళ్లకు మరో ముగ్గురు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాళ్లంతా ముస్తాక్తోనే ఉంటున్నారు. 20 ఏళ్ల క్రితం పెళ్లయినప్పటి నుంచి ముస్తాక్ తన అత్తవారింట్లోనే ఉంటున్నాడు. ఆదాయం సరిపోకపోవడంతో తరచు భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుండేవి. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఖాతూన్.. ఐదు నెలల క్రితం భర్తను వదిలిపెట్టి ఢిల్లీ వెళ్లిపోయింది. -
తాగొచ్చి.. కూతుర్ని చంపేశాడు!
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ తండ్రి కూతురినే కడతేర్చిన ఉదంతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన పత్తివాడ సురేశ్–జ్యోతి మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఓ పాప పుట్టిన తర్వాత దంపతుల మధ్య గొడవలు జరగడంతో జ్యోతి పుట్టింటికి వెళ్లిపోయింది. తాగుడు మానేస్తానని భార్యా బిడ్డలను బాగా చూసుకుంటానని పెద్ద మనుషుల సమక్షంలో సురేశ్ అంగీకరించాడు. రెండున్నరేళ్ల వయసు గల కుమార్తె కీర్తి, భార్యను నెలరోజుల క్రితం నగరానికి తీసుకువచ్చాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 23లోని ఓ ఇంట్లో వాచ్‌మన్‌గా చేరాడు. మొదటి నుంచి భార్యపై అనుమానం పెట్టుకున్న సురేశ్ తరచూ గొడవలు పడేవాడు. ఈ క్రమంలో శనివారంరాత్రి మద్యం మత్తులో ఉన్న సురేశ్ మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. ఇదే సమయంలో కీర్తి ఏడవడంతో ఆమెను ఇంటి బయట ఉన్న గార్డెన్‌లోకి తీసుకుపోయాడు. సురేశ్ విచక్షణారహితంగా కుమార్తె ఛాతీ, మొహంపైన కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లింది. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆదివారం ఉదయం జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు సురేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. కిరోసిన్‌తో ఆడుకుంటూ చిన్నారి మృతి హైదరాబాద్: కిరోసిన్ డబ్బాతో ఆడుకుంటుండగా కిరోసిన్ ఒంటిపై పడింది. పాపం.. ఆ చిన్నారికేం తెలుసు.. తెలియక పక్కనే ఉన్న అగ్గిపెట్టెను వెలిగించింది. అంతే.. ఆ చిన్నారి మంటలకు ఆహుతైంది. ఈ ఘటన రాజధాని యాకుత్‌పురాలో జరిగింది. వనస్థలిపురం సాహెబ్నగర్కి చెందిన మహ్మద్ హజీ, హజ్రా ఉన్నిసా దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు. కాగా, శనివారం యాకుత్‌పురాలోని ఉన్నిసా సోదరుడు మహ్మద్ వాజిద్ ఖురేషి ఇంటికి శుభకార్యం నిమిత్తం వెళ్లారు. సాయంత్రం సమయంలో ఉన్నిసా చిన్న కుమార్తె ఆఫ్సాఉన్నిసా(3) మేడపైకి వెళ్లింది. అక్కడ వంట చేసుకొనేందుకు ఉంచిన కిరోసిన్ డబ్బాతో ఆడుకుంటుండగా అందులోని కిరోసిన్ చిన్నారిపై పడింది. పక్కనే ఉన్న అగ్గి పెట్టె్టను తీసి వెలిగించడంతో చిన్నారికి మంటలం టుకున్నాయి. దీంతో పెద్దగా కేకలు పెట్టడంతో అంతా మేడపైకి పరుగెత్తారు. మంటలార్పి గాయాలతో ఉన్న ఆఫ్సాను వెంటనే ఉస్మాని యా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున చిన్నారి మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పాపం.. తండ్రి కూతుర్ని చంపేలా చేశారు
ముంబై: పక్కింటి వాళ్లతో జరిగిన ఘర్షణ కన్నకూతురి ప్రాణాలు తీసింది. తోపులాటలో తండ్రి మీదపడటం వల్ల అతని చేతిలో ఉన్న కత్తి ఛాతీలోకి దిగడంతో కళ్లెదుటే కూతురు మరణించింది. ముంబైలోని మోతీలాల్ నగర్ స్లమ్ ఏరియాలో ఈ విషాదకర సంఘటన జరిగింది. రాజేష్ (41) అనే వ్యక్తి డ్రైవర్. అతని కూతురు మేఘన అఘవానె (17) కాలేజీలో చదువుకుంటోంది. సోమవారం రాత్రి రాజేష్, పక్కింటివాళ్లు చిన్న విషయానికి గొడవ పడ్డారు. ఆ సమయంలో రాజేష్ చేతిలో కూరగాయలు కోసే కత్తి ఉంది. ఘర్షణ సందర్భంగా పక్కింటివాళ్లు తోయడంతో రాజేష్ అదుపు తప్పి కూతురుపై పడ్డాడు. ఆయన చేతిలో ఉన్న కత్తి మేఘన ఛాతీలోకి దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్దారించారు. పోలీసులు కేసు నమోదు చేసి రాజేష్ పక్కింటివారిని ఆరుగురిని అరెస్ట్ చేశారు. -
నా కూతురు తప్పు చేసింది.. చంపేశాను
కరాచీ: పాకిస్తాన్లో ప్రేమ అన్నది పెద్ద నేరంగా మారుతోంది. కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారిని వేటాడి చంపేస్తారు. అక్కడ పరువుహత్యలు సాధారణమవుతున్నాయి. తాజాగా ఓ తల్లి కన్నకూతురును దారుణంగా చంపేసింది. అనంతరం వీధిలోకి వచ్చి తన కూతురు తప్పు చేసిందని, అందుకే చంపానని ఆమె ఏడుస్తూ చెప్పింది. లాహోర్‌లో ప్రవీణ్ రఫిక్ అనే మహిళకు 18 ఏళ్ల కూతురు జీనత్ ఉంది. జీనత్ హాసన్ ఖాన్ అనే మెకానిక్‌ను ప్రేమించింది. జీనత్ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పినా గత నెలలో కోర్టు మేజిస్ట్రేట్ ముందు వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత జీనత్ నాలుగు రోజులు భర్త ఇంట్లో ఉంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లి జీనత్‌కు ఎలాంటి హానీ తలపెట్టమని, విందు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. జీనత్‌కు ఇష్టం లేకపోయినా భయపడుతూ పుట్టింటికి వచ్చింది. ప్రేమపెళ్లి చేసుకున్నందుకు జీనత్‌ను కుటుంబ సభ్యులు వేధించడం మొదలుపెట్టారు. హాసన్‌ను మరచిపోవాలని తల్లి బెదిరించగా, జీనత్ అంగీకరించలేదు. దీంతో జీనత్ తల్లి ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టింది. అనంతరం వీధిలోకి వచ్చి గట్టిగా అరుస్తూ తన కూతురును చంపేసినట్టు ఇరుగుపొరుగు వారికి చెప్పింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పాకిస్తాన్లో ప్రతిఏటా దాదాపు 1000 మంది మహిళలు పరువుహత్యలకు బలవుతున్నారు. తాము కుదిర్చిన వివాహాన్ని చేసుకోకపోయినా, తమకు ఇష్టంలేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న అమ్మాయిలను కుటుంబ సభ్యులు చంపుతున్నారు. -
కూతురి మరణవార్త విని తండ్రి గుండె ఆగింది..
లక్నో: కూతురు చనిపోయిందన్న వార్త వినగానే ఓ తండ్రి గుండె శాశ్వతంగా ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... షాలిని అనే మహిళ స్థానిక సుఖ్ పుర ప్రాంతంలో నివాసం ఉండేది. ఈ క్రమంలో తన తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిందన్న సమాచారం తెలుసుకుంది. వారణాసి లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి నాథుని రామ్ ని చూసిరావాలని ఇంటిపక్కన ఉండే ఓ యువకుడు జితేంద్ర యాదవ్ తో కలిసి బైకుపై బయలుదేరింది. మార్గమధ్యలో వీరు వెళ్తోన్న బైక్ ను ఓ ట్రక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో షాలిని అక్కడికక్కడే మృతిచెందగా, జితేంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షాలిని తండ్రికి కూతురు మరణవార్త చెవినపడింది. తనను చూడాలని వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకున్నాడు. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తండ్రి నాథుని రామ్(66) మరోసారి గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఆయన నెయిబ్ ప్రాంతానికి గతంలో ఎమ్మార్వోగా విధులు నిర్వహించి పదవి విరమణ చేశారు. తండ్రి, కూతురు ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. -
కూతురుని చంపి, తల్లి ఆత్మహత్య
చౌటుప్పల్ : భర్త వేధింపులకు తాళలేక 11నెలల పసిగుడ్డును చంపి, ఓ మాతృమూర్తి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన కాసోజు అనిత (21), రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాటసింగారం గ్రామానికి చెందిన కొండోజు ప్రవీణ్‌చారి (26)తో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఈమెకు ప్రస్తుతం 11నెలల పాప స్పందన ఉంది. ప్రవీణ్‌చారి కులవృత్తి చేస్తున్నాడు. అనితకు తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తాత నానమ్మలే పెంచిపెద్దచేశారు. ఇంటర్మీడియట్ వరకు చదివించి పెళ్లిచేశారు. పెళ్లయిన నాటినుంచి ప్రవీణ్‌చారి వరకట్నం కోసం వే ధిస్తున్నాడు. గత 15రోజుల క్రితం అనిత కూతురుతో కలిసి, పుట్టింటికి వచ్చింది. సోమవారం ఉదయం తాత నానమ్మలతో అత్తవారింటికి వెళ్తున్నానని చెప్పింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, కూతురు ఊపిరి ఆడకుండ చేసి చంపింది. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాతనానమ్మలు వచ్చి చూసి, లబోదిబోమన్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలను నమోదు చేసుకున్నారు.పోస్టుమార్టం నిమిత్తం మృ తదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'దెయ్యం పట్టిందని మాపై దాడి చేశాడు'
-
'దెయ్యం పట్టిందని మాపై దాడి చేశాడు'
విజయనగరం: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యతోపాటు కన్న కూతురు(3)పై ఓ భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ ఘటనలో కుమార్తె మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన మహిళను విజయనగరంలోని ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి... పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఎస్ కోట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించారు. దెయ్యం పట్టిందని కారణంగానే తమపై భర్త దాడి చేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. దాంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.