
ముంబై : నగరంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని ప్రేమించిదన్న కోపంతో కన్న కూతురినే గొంతునులిమి చంపింది ఓ కసాయి తల్లి. ఈ ఘటన దక్షిణ ముంబైలోని ఫైడోని ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీ. వాఘేలా అనే ఓ 40 ఏళ్ల మహిళ, కూతురు నిర్మలా అశోఖ్ వాఘేలా(23)తో కలిసి దక్షిణ ముంబైలోని ఫైడోనిలో నివాసం ఉంటుంది. నిర్మలా ఇటీవల ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. ఈ విషయం వాఘేలాకు తెలియడంతో ఆమెతో గొడవకు దిగింది. అతనితో తిరగొద్దని బెదిరించింది. అయినప్పటికీ నిర్మలా అతనితో రిలేషన్‌షిప్‌ను కొనసాగించింది. గత ఆదివారం రాత్రి ఈ విషయంపై తల్లీకూతుర్లకు గొడవ జరిగింది. తల్లితో వాదనలకు దిగిన నిర్మలా.. తాను ప్రేమించిన వాడితోనే వెళ్లిపోతానని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు బ్యాగు కూడా సర్దుకుంది. దీంతో కోపోద్రిక్తురాలైన వాఘేలా.. కూతురు గొంతు నులిమి చంపేసింది. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్‌లో లొంగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment