ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ కేసు విషయంలో రోజుకో కొత్త వెలుగులోకి వస్తోంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు(షూటర్)ను విచారణ చేస్తున్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కీలక విషయాలు వెల్లుడిస్తున్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివ్ కుమార్ గౌతమ్.. సిద్ధిఖీపై కాల్పుల జరిపిన అనంతరం ఆయన మరణించారా? లేదా? అని ఆస్పత్రి బయట ఉండి నిర్ధారించుకున్నాడని పోలీసులు తెలిపారు.
అయితే.. కాల్పులు జరిగిన తర్వాత సిద్ధిఖీని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. ఆస్పత్రి బయట ఆయన మృతి నిర్థారణ కోసం సుమారు 30 నిమిషాల పాటు నిలబడి వేచి చూశానని నిందితుడు చెప్పినట్లు పేర్కొన్నారు. ‘‘సిద్ధిఖీపై కాల్పులు జరిగిన వెంటనే చొక్కా మార్చుకొని.. ఆసుపత్రి బయట 30 నిమిషాల పాటు జనం మధ్య నిలబడి ఉన్నా. సిద్ధిఖీ పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిసిన వెంటనే వెళ్లిపోయా’’ అని నిందితుడు శివ కుమార్ పోలీసులకు తెలిపాడు.
అక్టోబర్ 12 రాత్రి 9:11 గంటలకు ముంబైలోని బాంద్రాలో సిద్ధిఖీపై కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఆయన ఛాతీపై రెండు బుల్లెట్ గాయాలు తగలడంతో వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుల ప్రాథమిక ప్రణాళిక ప్రకారం.. ప్రధాన నిందితుడు శివకుమార్, అతని సహాయకులు ధర్మరాజ్ కశ్యప్, గుర్మైల్ సింగ్‌లను ఉజ్జయిని రైల్వే స్టేషన్‌లో కలవాల్సి ఉంది. అక్కడ బిష్ణోయ్ గ్రూప్ సభ్యుడు వారిని వైష్ణో దేవి వద్దకు తీసుకెళ్లాలి. అయితే.. కశ్యప్, సింగ్‌లు పోలీసులకు చిక్కడంతో వారి ప్లాన్ విఫలమైందని పోలీసులు తెలిపారు.
చదవండి: సిద్ధిఖీ కేసు: ‘కుదిరితే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జీషన్ సిద్ధిఖీ’
Comments
Please login to add a commentAdd a comment