Mumbai crime branch Police
-
సిద్ధిఖీ కేసు: మృతి నిర్ధారణయ్యే వరకు ఆస్పత్రి దగ్గరే..
ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ కేసు విషయంలో రోజుకో కొత్త వెలుగులోకి వస్తోంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు(షూటర్)ను విచారణ చేస్తున్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కీలక విషయాలు వెల్లుడిస్తున్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివ్ కుమార్ గౌతమ్.. సిద్ధిఖీపై కాల్పుల జరిపిన అనంతరం ఆయన మరణించారా? లేదా? అని ఆస్పత్రి బయట ఉండి నిర్ధారించుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే.. కాల్పులు జరిగిన తర్వాత సిద్ధిఖీని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. ఆస్పత్రి బయట ఆయన మృతి నిర్థారణ కోసం సుమారు 30 నిమిషాల పాటు నిలబడి వేచి చూశానని నిందితుడు చెప్పినట్లు పేర్కొన్నారు. ‘‘సిద్ధిఖీపై కాల్పులు జరిగిన వెంటనే చొక్కా మార్చుకొని.. ఆసుపత్రి బయట 30 నిమిషాల పాటు జనం మధ్య నిలబడి ఉన్నా. సిద్ధిఖీ పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిసిన వెంటనే వెళ్లిపోయా’’ అని నిందితుడు శివ కుమార్ పోలీసులకు తెలిపాడు.అక్టోబర్ 12 రాత్రి 9:11 గంటలకు ముంబైలోని బాంద్రాలో సిద్ధిఖీపై కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఆయన ఛాతీపై రెండు బుల్లెట్ గాయాలు తగలడంతో వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుల ప్రాథమిక ప్రణాళిక ప్రకారం.. ప్రధాన నిందితుడు శివకుమార్, అతని సహాయకులు ధర్మరాజ్ కశ్యప్, గుర్మైల్ సింగ్‌లను ఉజ్జయిని రైల్వే స్టేషన్లో కలవాల్సి ఉంది. అక్కడ బిష్ణోయ్ గ్రూప్ సభ్యుడు వారిని వైష్ణో దేవి వద్దకు తీసుకెళ్లాలి. అయితే.. కశ్యప్, సింగ్‌లు పోలీసులకు చిక్కడంతో వారి ప్లాన్ విఫలమైందని పోలీసులు తెలిపారు.చదవండి: సిద్ధిఖీ కేసు: ‘కుదిరితే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జీషన్ సిద్ధిఖీ’ -
సిద్ధిఖీ కేసు: ‘కుదిరితే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జీషన్ సిద్ధిఖీ’
ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం)నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కీలక విషయాలను ముంబై పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో అతనితోపాటు, నలుగురు సహాయకులను ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. శివకుమార్‌ను విచారించిన సమయంలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో టచ్‌లో ఉన్న విషయాలు, మిస్టర్ సిద్ధిఖీని చంపిన తర్వాత ఎలా పారిపోయాడనే విషయాలను నిందితుడు శివకుమార్ పోలీసులకు వివరించాడు. కుదిరితే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జీషన్ సిద్ధిఖీని కాల్చివేయమని అన్మోల్ బిష్ణోయ్ తమకు ఆదేశించాడని శివకుమార్ చెప్పినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ‘ముందు ఎవరిని చూసినా కాల్చేయండి’ అని అన్మోల్ శివకుమార్‌తో చెప్పాడని తెలిపారు. సిద్ధిఖీ హత్యకు ముందు.. కెనడాలో ఉన్న ఎన్ఐఏ ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అన్మోల్ బిష్ణోయ్‌తో ప్రధాన నిందితుడు శివ కుమార్ టచ్‌లో ఉన్నాడని తెలిపారు. ‘దేవుడు, సమాజం’ కోసం తాను ఏం చేయబోతున్నానో.. అన్మోల్ తనతో చెప్పాడని శివకుమార్ చెప్పినట్లు ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. అయితే.. సిద్ధిఖీని కాల్చిచంపిన ముగ్గురిలో ఒకరి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లో జీషన్ సిద్ధిఖీ ఫొటో కనిపించిందని పోలీసులు పేర్కొన్నారు.బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ప్రధాన నిందితుడు శివ కుమార్ గౌతమ్ వెంటనే బట్టలు మార్చుకొని అదృశ్యం అయ్యాడని. అతన్ని ఎవరూ గుర్తించలేదని ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. ఘటనాస్థలం నుంచి కుర్లాకు ఆటోలో ప్రయాణించి.. అక్కడి నుంచి థానేకు లోకల్ రైలు ఎక్కినట్లు తెలిపారు. థానే నుంచి రైలులో పూణెకు వెళ్లి ప్రయాణంలో తన మొబైల్ ఫోన్‌ను పారేశాడని చెప్పారు. ఇక.. శివ కుమార్ సుమారు ఏడు రోజుల పాటు పూణేలో ఉండి, ఆపై రైలులో ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి వెళ్లారు. ఆ తర్వాత ఐదు రోజుల పాటు అక్కడే ఉండి రాష్ట్ర రాజధాని లక్నో చేరుకున్నాడు. లక్నోలో కొత్త మొబైల్ కొని తన సహాయకులను సంప్రదించాడు. అక్కడ 11 రోజులు గడిపిన తర్వాత, అతను తన స్వస్థలమైన బహ్రైచ్కు వెళ్లి తన సహాయకులను కలుసుకున్నాడు. దీంతో వారు సమీపంలోని గ్రామంలో అతనికి భద్రత కల్పించారని పోలీసులు వెల్లడించారు. ఇక.. దేశం విడిచి పారిపోయే ముందు అతను మొదట మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని వెళ్లి, ఆపై జమ్మూలోని వైష్ణో దేవికి వెళ్లాలని ప్లాన్ చేసినట్లు శివ కుమార్ పోలీసులకు తెలిపాడు.ఆదివారం నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నించిన ప్రధాన నిందితుడు శివకుమార్‌ను బహ్రైచ్‌లో అతని నలుగురు సహాయకులతో కలిసి పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబరు 12న ముంబైలో సిద్ధిఖీని కాల్చిచంపిన ముగ్గురు షూటర్లలో శివకుమార్ కూడా ఉన్నాడు. అయితే.. హర్యానా నివాసి గుర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్‌లను పోలీసులు అరెస్టు చేయగా.. శివ కుమార్ పారారైన విషయం తెలిసిందే. -
సిద్ధిఖీ కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర ఎన్సీపీ ( అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య కేసులో సిద్ధిఖీపై కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు శివకుమార్‌ను ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేసినట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. బాబా సిద్ధిఖీ హత్య చేసినప్పటి నుంచి నిందితుడు శివకుమార్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అతను నేపాల్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), ముంబై క్రైమ్ బ్రాంచ్ చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు.శివకుమార్ బాబా సిద్ధిఖీపై కాల్పలు జరపడానికి 9.9 ఎంఎం పిస్టల్‌ను ఉపయోగించినటట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 12న బాంద్రా ఈస్ట్‌లోని తన కుమారుడు ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్ కార్యాలయ భవనం బయట ఉన్న సమయంలో సిద్ధిఖీపై మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. శివకుమార్ అరెస్ట్‌తో.. సిద్ధిఖీ హత్యలో ప్రమేయమున్న ముగ్గురు షూటర్లు అరెస్టు అయ్యారని పోలీసులు తెలిపారు. ఇక.. శివకుమార్ అరెస్టుతో సిద్ధిఖీ హత్య కేసులో ఇప్పటి వరకు మొత్తం 23 మందిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా శివకుమార్‌కు ఆశ్రయం కల్పించి.. నేపాల్‌కు పారిపోవడానికి సహకరించినందుకు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.ఇక..విచారణలో శివ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. తనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు అంగీకరించాడు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఆదేశాల మేరకే ఈ హత్య జరిగిందని శివ కుమార్ వెల్లడించారు. అన్మోల్ బిష్ణోయ్‌తో తన పరిచయాన్ని లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడుగా భావిస్తున్న శుభమ్ లోంకర్ పలుసార్లు సులభతరం చేశాడని పేర్కొన్నాడు. బాబా సిద్ధిఖీపై కాల్పులు జరపడానికి ముందు తనతోపాటు మిగితా షూటర్లతో అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉన్నాడని తెలిపాడు. నిందితులతో కమ్యూనికేట్ చేయడానికి అన్మోల్ బిష్ణోయ్ సోషల్ మీడియా అప్లికేషన్ స్నాప్‌చాట్‌ను ఉపయోగించినట్లు ఇప్పటికే ముంబై పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అన్మోల్ బిష్ణోయ్.. బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిక్ ఫొటోను కూడా షూటర్లతో పంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ‘భాను’ అని కూడా పిలువబడే అన్మోల్ బిష్ణోయ్ నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుంచి పారిపోయాడు. గత సంవత్సరం కెన్యాలో, ఈ ఏడాది కెనడాలో కనిపించటం గమనార్హం.మరోవైపు.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం బయట కాల్పుల ఘటన, 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసుకు సంబంధించి అన్మోల్ బిష్ణోయ్‌ను పోలీసులు వెతుకుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తన మోస్ట్ వాంటెడ్ జాబితాలో అన్మోల్ బిష్ణోయ్ పేరును చేర్చింది. అతన్ని అరెస్టు చేయడానికి ఏదైనా సమాచారం ఇస్తే రూ. 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.చదవండి: సిద్ధిఖీ కేసులో నిందితులెవరినీ వదలం: సీఎం షిండేచదవండి: ‘నాన్న హత్యపై సల్మాన్ ఖాన్ చాలా బాధపడ్డారు’ -
అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్.. భారత్‌కు రప్పించే ప్రయత్నాలు
ముంబై: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఉన్నట్లు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్ కదలికలకు సంబంధించి అక్కడి పోలీసులు సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో అమెరికా అధికారులు ముంబై పోలీసులను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనతో సహా పలు కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్ (25) ప్రమేయం ఉన్న నేపథ్యంలో అతన్ని భారత్‌కు వేగంగా రప్పించేందుకు ముంబై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అతన్ని భారత్‌కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ.. ముంబై పోలీసులు గత నెలలో ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సల్మాన్ ఖాన్ కేసులో అభియోగాలను ఎదుర్కొనేందుకు అన్మోల్ బిష్ణోయ్‌ను తిరిగి భారతదేశానికి తీసుకురావాలనే తమ ఉద్దేశాన్ని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. అతడిని భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలను పోలీసులు వేగవంతం చేశారు.ఇక.. ఇటీవల జరిగిన బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితులతోనూ అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉండటం గమనార్హం. అన్మోల్ బిష్ణోయ్ సోదరుడు గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న విషయం తెలిసిందే.అన్మోల్ బిష్ణోయ్‌పై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డ్అన్మోల్ బిష్ణోయ్ సంబంధించిన సమాచారం అందించిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. ఏప్రిల్‌లో నటుడు సల్మాన్ ఖాన్ ముంబై నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో ప్రమేయం ఉన్నందున కారణంతో అన్మోల్ బిష్ణోయ్‌ను మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. -
సిద్ధిఖీ కేసు: మరో నలుగురి నిందితుల అరెస్ట్.. కీలక విషయలు వెల్లడి
ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో పురోగతి వస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు బుధవారం మరో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు.. షూటర్, ప్రధాన సూత్రధారికి మధ్య లింక్ కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక నిందితుడిని హర్యానాలో, ముగ్గురిని పుణెలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజా జరిగిన అరెస్టులతో ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్న హత్యకేసు నిందితుల సంఖ్య మొత్తం 14 మందికి చేరింది.హర్యానాలోని కైతాల్‌లో అరెస్టు చేసిన నిందితుడిని అమిత్ హిసంసింగ్ కుమార్ (29)గా గుర్తించారు. కస్టడీలో ఉన్న ఇతర నిందితుల విచారణలో ఈ హత్యానేరంలో అతని పాత్ర కూడా ఉన్నట్లు తెలిసిందని తెలిపారు. హత్య సూత్రధారి, షూటర్‌కు మధ్య కీలకమైన లింక్ కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పుణెలో అదుపులోకి తీసుకున్న మరో ముగ్గురిని రూపేష్ రాజేంద్ర మోహోల్ (22), కరణ్ రాహుల్ సాల్వే (19), శివమ్ అరవింద్ కోహద్ (20)గా గుర్తించారు. ఈ కేసులో వారి ప్రమేయం కూడా ఉన్నట్లు నిర్ధారించారు. వీరిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారని ఓ అధికారి తెలిపారు.Baba Siddique Murder case | Accused Amit Hisamsing Kumar was sent to custody of Mumbai Crime Branch till November 4 by the court. During the interrogation, Amit said that he had full knowledge about the murder conspiracy. 4th accused Zeeshan Akhtar had told Amit that someone…— ANI (@ANI) October 24, 2024కీలక నిందితుడైన జీషన్ అక్తర్ సూచనల మేరకు నిందితుడు అమిత్ కుమార్ బ్యాంకు ఖాతాకు రూ. 2.50 లక్షలు బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇక.. అతను హర్యానాలోని కైతాల్లోవైన్ షాప్ నడుపుతున్నాడు. కైతాల్ ప్రాంతంలో అతనిపై ఇప్పటికే నాలుగు దాడులు, అల్లర్లకు సంబంధించిన కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. జూన్ 2024లో బెయిల్‌పై బయటకు వచ్చి జీషన్ అక్తర్‌కు.. అమిత్ కుమార్ ఆశ్రయం ఇచ్చారు. సిద్దిఖీని హత్య చేసే కాంట్రాక్టు జీషన్ లభించటంతో అమిత్‌తో కలిసి ప్లాన్‌పై చర్చించినట్లు పోలీసులు తెలిపారు.చదవండి: సిద్ధిఖీ హత్య కేసు: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడితో నిందితుల చాట్హత్యను అమలు చేయడానికి డబ్బు అవసరం ఉండటంతో కాంట్రాక్టు ఇచ్చిన వ్యక్తి నుంచి అమిత్ కుమారు బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమ చేయించుకున్నాడు. దీంతో అమిత్ కుమార్ బ్యాంక్ ఖాతాలో రూ. 2.5 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. అయితే ఈ హత్య కుట్రలో అమిత్ ప్రమేయం కూడా ఉందని పోలీసులు తెలిపారు.నిందితుడు అమిత్ కుమార్‌ను బుధవారం కోర్టులో హాజరుపరచగా, విచారణ నిమిత్తం అతన్ని నవంబర్ 4వ తేదీ వరకు పోలీసు కస్టడీ విధించింది. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను క్రైం బ్రాంచ్ విచారిస్తోంది. ఇక.. ప్రధాన నిందితుడు షూటర్ శివ కుమార్ గౌతమ్, ప్రధాన కుట్రదారులు శుభమ్ లోంకర్, జీషన్ అక్తర్ ఇంకా పరారీలో ఉన్నారు. అక్టోబరు 12న ముంబైలో బాబా సిద్ధిఖీని హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
సిద్దిఖీ హత్యకు పుణెలో కుట్ర
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్దిఖీని కాల్చిచంపడానికి పుణెలో కుట్ర జరిగిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. íసిద్దిఖీని గుర్తించడానికి వీలుగా ఆయన ఫొటో, చిత్రం ముద్రించిన ఫ్లెక్సీని షూటర్లకు అందజేశారు. ఈ హత్యలో పుణెకు చెందిన సోదరులు ప్రవీణ్ లోంకర్, శుభమ్ లోంకర్ల పాత్ర ఉందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. నిందితులు దొరకితే హత్యకు కారణాలు తెలుస్తాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. లోంకర్ సోదరులే హత్యకు పాల్పడిన షూటర్లకు రూ.50 వేల చొప్పున అడ్వాన్సు అందించారని, నిందితుల మధ్య సమావేశాలను ఏర్పాటు చేశారని, హత్యకు కావాల్సిన ఏర్పాట్లను చూశారని చెప్పారు. శుభమ్‌కు చెందిన డైరీలో ప్రవీణ్ పనిచేస్తున్నాడని.. అక్కడే షూటర్లు శివకుమార్ గౌతమ్, ధర్మరాజ్ కశ్యప్‌లను హత్య కోసం నియమించుకున్నారని తెలిపారు. అడ్వాన్సుగా అందిన మొత్తం నుంచి నిందితులు ఒక మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసి.. దాని పైనే సిద్దిఖీ నివాసం, ఆఫీసుల వద్ద, ఆయన దినచర్య పైనా రెక్కీ నిర్వహించారని వివరించారు. గుర్మైల్ బల్జీత్‌సింగ్ (హరియాణా), ధర్మరాజ్ కశ్యప్ (ఉత్తరప్రదేశ్), ప్రవీణ్ లోంకర్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితులకు దిశానిర్దేశం చేసిన మొహమ్మద్ యాసిన్ అక్తర్ కోసం. సిద్దిఖీని కాల్చిచంపిన గౌతమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సిద్ధిఖీ హత్య కేసు: ‘ ఆ నిందితుడు మైనర్ కాదు’
ముంబై: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హ్యత కేసులో నిందితుల్లో ఒకరైన ధర్మరాజ్ కశ్యప్‌కు ముంబై పోలీసులు ఆసిఫికేషన్ టెస్ట్ (వయసు నిర్ధారణ) నిర్వహించగా మైనర్ కాదని తేలిందని పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడు కశ్యప్‌ను ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టు ముందు పోలీసులు హాజరుపర్చారు.Baba Siddique murder case: Ossification test confirms accused Dharmaraj Kashyap is not minor; sent to police custodyRead @ANI Story | https://t.co/ozKl30zuSo#MumbaiPolice #BabaSiddiqueShotDead #Maharashtra pic.twitter.com/QaljPVVnUe— ANI Digital (@ani_digital) October 13, 2024 దీంతో కోర్టు కశ్యప్‌ను సైతం అక్టోబర్ 21 వరకు పోలీసు కస్టడీని అనుమతి మంజూరు చేసింది. అయితే ఆదివారం నిందితుడు కశ్యప్ మైనర్ అని అతని న్యాయవాది పేర్కొనడంతో ఎస్ప్లానేడ్ కోర్టు ఆసిఫికేషన్ పరీక్షను ఆదేశించించిన విషయం తెలిసిందే. నిన్ననే మరో నిందితుడు గుర్మైల్ సింగ్‌ను కోర్టు.. అక్టోబర్ 21 వరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి పంపింది. చదవండి: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్యఇక.. ఈ హత్య కేసులో మూడో నిందితుడు శివకుమార్ అనే మూడో షూటర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ హత్య కేసులో మరో నిందితుడి ప్రమేయం ఉందని, అతన్ని మొహమ్మద్ జీషాన్ అఖ్తర్‌గా గుర్తించినట్లు పోలీసుల తెలిపారు.చదవండి: బాబా సిద్ధిఖీ హత్య కేసు: నిందితుడికి 7 రోజుల కస్టడీ -
'రాజ్‌కుంద్రా ఫోన్లో 119 నీలి చిత్రాలు.. రూ.9 కోట్లకు బేరం'
Raj Kundra Was Planning To Sell Adult Videos For Rs 9 Crores: నీలి చిత్రాల కేసులో అరెస్టయిన శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా జైలు జీవితం గడిపిన ఆయన నేడు (మంగళవారం) విడుదలై బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఇంటికి వెళ్లేముందు రాజ్‌కుంద్రా కళ్లలో నీళ్లు తిరిగాయి. తప్పు చేశానన్న అపరాధ భావం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. చదవండి : రాజ్‌కుంద్రాకు బెయిల్: భర్తతో శిల్పా విడిపోతుందా? ఇదిలా ఉండగా.. రాజ్‌కుంద్రా గురించి ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. విచారణలో భాగంగా కుంద్రా మొభైల్, లాప్టాప్, హార్డ్ డ్రైవ్ లను పరిశీలించామని, అందులో 119 నీలి చిత్రాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ వీడియోలను కుంద్రా రూ.9 కోట్లకు బేరానికి కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. కాగా ఫిబ్రవరిలో ముంబై శివారులోని ఓ బంగ్లాలో పోర్న్ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి అక్కడున్న 11మందిని అరెస్ట్ చేశారు. ఐదు నెలల పాటు దర్యాప్తు అనంతరం పోర్న్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఇందులో శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా హస్తం ఉందన్న ఆరోపణలతో జులై 19వ తేదీన ముంబై పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా జైలు నుంచి విడుదలైన కుంద్రాతో శిల్పా వైవాహిక జీవితం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. చదవండి: వచ్చే నెలలో నిశ్చితార్థం: కారు ప్రమాదంలో నటి మృతి During the investigation (in a pornography case), police found 119 porn videos from businessman Raj Kundra's mobile, laptop, and a hardrive disk. He was planning to sell these videos for Rs 9 crores: Mumbai Police Crime Branch pic.twitter.com/ZZNL5aY3EG — ANI (@ANI) September 21, 2021 -
భర్తతో గొడవ, పోలీసుల ముందు ఏడ్చేసిన శిల్పా
పోర్నోగ్రఫీ కేసులో విచారణను ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌కుంద్రాను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు కేసుకు సంబంధించి అతడి భార్య, ప్రముఖ నటి శిల్పాశెట్టిని కూడా విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్ కుంద్రాను వెంటబెట్టుకొని జుహులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులకు కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కుంద్రా, శిల్పాశెట్టిలను విచారిస్తుండగా శిల్పాశెట్టి కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంతో తమ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని చెబుతూ పోలీసుల ముందు శిల్పా ఎమోషనల్ అయిందట. అంతేకాకుండా ఈ కేసు వల్ల కొన్ని అగ్రిమెంట్స్ క్యాన్సిల్ అయ్యాయని, దీంతో తీవ్రంగా నష్టపోయామని శిల్పా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక విచారణ నిమిత్తం ఇంటికి వచ్చిన రాజ్‌కుంద్రాతో శిల్పా వాగ్వాదానికి దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే పోలీసుల విచారణలో మాత్రం భర్తను వెనకేసుకొచ్చిందని, రాజ్‌కుంద్రా శృంగారభరితమైన సినిమాలు తీస్తారే తప్ప పోర్న్ (అశ్లీల / నీలి చిత్రాలు) తీయరని శిల్పా తన వాంగ్మూలంలో వివరించింది. ఇక హాట్‌షాట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే కంటెంట్‌పై తనకి ఎలాంటి అవగాహన లేదని, దాంట్లో తన ప్రమేయం ఏ మాత్రం లేదని వెల్లడించింది. కాగా, ముంబై మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం రాజ్‌కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించింది. దాదాపు 48 టెరాబైట్(టీబీ)ల అశ్లీల ఫొటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
పోర్నోగ్రఫీ కేసులో ఏ క్షణమైనా శిల్పాశెట్టి అరెస్ట్!
ముంబై : పోర్నోగ్రఫీ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌కుంద్రా కేసు మరో మలుపు తిరిగింది. ముంబై జుహూలోని శిల్పాశెట్టి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. వారి వెంట రాజ్‌కుంద్రా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించిన మరింత లోతుగా విచారించేందుకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు శిల్పాశెట్టిని ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. శిల్పాశెట్టి..వియాన్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు. ఇటీవలె అంధేరి వెస్ట్‌లోని వియాన్ కార్యాలయానిపై దాడిచేసిన పోలీసులు భారీగా పోర్న్ వీడియోల డేటాను సేకరించారు. అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన కుంద్రా పోలీసు కస్టడీని ముంబై మేజిస్ట్రేట్ జూలై 27వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా కుంద్రా నోరు విప్పడం లేదని తెలుస్తుంది. దీంతో కేసు దర్యాప్తులో భాగంగా శిల్పాను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్‌కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో శిల్పాశెట్టి ప్రమేయం ఏమైనా ఉందా అన్నదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కేసుతో శిల్పాకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని జాయింట్ పోలీస్ కమిషనర్ మిలింద్ భరంబే గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఏడాదిన్నరలో వంద పోర్న్ వీడియోలు తయారు చేసినట్లు కుంద్రాపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కుంద్రా పోర్న్ యాప్‌కు 20 లక్షల మంది సబ్స్రైబర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
అనూహ్య బ్యాగ్, లాప్టాప్ ఎత్తుకెళ్లాలనుకున్నాడు
-
బ్యాగ్, లాప్టాప్ ఎత్తుకెళ్లాలనుకున్నాడు
* అనూహ్య హంతకుడిమొదటి ఉద్దేశం ఇదే * సామగ్రితో బైక్‌పై ఉడాయించాలనుకున్నాడు * అవకాశం లేకపోవడంతోనే ఆమెను ఎక్కించుకున్నాడు ముంబై: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య (23) హత్య కేసులో నిందితుడైన చంద్రభాన్ సనప్ పోలీసుల విచారణలో కీలక వివరాలు వెల్లడించినట్లు ఓ జాతీయ ఆంగ్ల చానల్ తమ వెబ్సైట్లో పొందుపరిచింది. ముంబై క్రైం బ్రాంచికి చెందిన ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం...వాస్తవానికి చంద్రభాన్ అనూహ్య బ్యాగ్, ల్యాప్‌టాప్‌ను చోరీ చేయాలనే పథకం వేసుకున్నాడు. ఆమెపై అత్యాచారయత్నం లేక హత్య చేయాలన్న ఉద్దేశం ఎంతమాత్రం లేదు. ప్లాట్ఫారం నుంచి బైక్ ఉన్న చోటుకు ఆమెను తీసుకొచ్చాక వస్తువులతో అతను ఉడాయించాలనుకున్నాడు. ఆమె బ్యాగ్‌ను లాక్కొని పెట్రోల్ ట్యాంక్‌పై పెట్టుకొని ఇంజిన్ స్టార్ట్ చేశాడు. దీంతో అతను సామానుతో ఉడాయిస్తాడని కంగారుపడిన అనూహ్య వెంటనే బైక్‌పై ఎక్కి కూర్చుంది. ఆమె స్పర్శ తగలడంతో చంద్రభాన్కు అనూహ్యను రేప్ చేయాలన్న దుర్బుద్ధి పుట్టింది. ట్యాక్సీలో తీసుకెళ్తానన్న చంద్రభాన్ చివరకు బైక్‌పై తీసుకెళ్తాననేసరికి అనూహ్య అవాక్కైందని అధికారి చెప్పారు. విచారణలో చంద్రభాన్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది. చంద్రభాన్: మేడం...మీరు ఎక్కడకి వెళ్లాలి?. అతని మాటలను అనూహ్య తొలుత పట్టించుకోలేదు. చంద్రభాన్: మేడం...ఎక్కడికి వెళ్లాలో చెప్పండి? నేను ట్యాక్సీ డ్రైవర్‌ను. చౌకగానే తీసుకెళ్తా అనూహ్య: అంధేరీ వెస్ట్ చంద్రభాన్: మంచిదైంది. నేను కూడా అంధేరీ వెళ్తున్నా. నా ట్యాక్సీ కూడా అక్కడిదే. 300 తీసుకుంటా. చంద్రభాన్ మాటలకు అనూహ్య స్పందించేలోగానే అతను ఆమె ట్రాలీ బ్యాగ్‌ను లాక్కుంటూ నడవడం మొదలుపెట్టాడు. దీంతో అనూహ్య అతని వెంట నడవడం మొదలుపెట్టింది. సెల్ఫోన్లో కుటుంబ సభ్యుడితో మాట్లాడుతూ అతని వివరాలు చెబుతున్నట్లు నటించింది. వారిద్దరూ స్టేషన్ బయటకు వచ్చాక ట్యాక్సీ బదులు బైక్ వద్ద చంద్రభాన్ నిలబడటం చూసి అనూహ్య అవాక్కైంది. ‘‘ట్యాక్సీ అని చెప్పావు ఇది బైక్ కదా’’ అంది. అందుకు చంద్రభాన్ స్పందిస్తూ ‘‘మేడం...ఇంత చౌకగా ట్యాక్సీలో ఈ వేళ ఎవరు దింపుతారు. పదండి. నా దగ్గర పెట్రోల్ కొట్టించేందుకు డబ్బులు కూడా లేవు. అందుకే ప్రయాణికుల కోసం వెతుకుతున్నా’’ అన్నాడు. అయితే ఆటో లేక ట్యాక్సీ కోసం అనూహ్య కాసేపు చూసినా ఏదీ కనిపించలేదు. దీంతో చంద్రభాన్ ఆమె బ్యాగ్‌ను వాహనంపై పెట్టుకున్నాడు. దీంతో ఆమె అతని బైక్ ఎక్కి కూర్చుంది. ఆ తర్వాత ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే జంక్షన్‌పై కంజూర్‌మార్గ్ వద్ద చంద్రభాన్ బైక్‌ను ఎడమ వైపు మలుపు తిప్పకపోవడంతో కంగారుపడిన అనూహ్య అతన్ని ప్రశ్నించింది. ‘‘ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తన్నావు? దీనికి చంద్రభాన్ బదులిస్తూ ‘‘మేడం ఇది షార్ట్‌కట్. మిమ్మల్ని 10 నిమిషాల్లో అంధేరీకి చేరుస్తా’’ అన్నాడు. అనూహ్య తండ్రిని కలిసిన ముంబై పోలీసు అధికారి మచిలీపట్నం, న్యూస్‌లైన్: అనూహ్య హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ముంబై కుర్లా పోలీస్‌స్టేషన్ క్రైం బ్రాంచ్ సీనియర్ ఇన్స్పెక్టర్ రాణే బుధవారం మచిలీపట్నం వచ్చారు. అనూహ్య తండ్రి ప్రసాద్‌ను కలిసి తమ వద్ద ఉన్న సమాచారాన్ని తెలిపి, ఫొటోలను చూపారు. అనూహ్య రైల్వే స్టేషన్లో దిగిన సమయంలో సీసీ కెమెరా ఫుటేజ్‌లు, ఆమె పక్కనే నడుస్తున్న చంద్రభాన్ ఫోటోను చూపారు. అనూహ్య హత్య తర్వాత చంద్రభాన్ గడ్డం పెంచుకుని, వేషం మార్చుకుని తిరిగిన విధానాన్ని వివరించారు. అనూహ్య మృతదేహం లభ్యమైన రెండో రోజునే చంద్రభాన్‌ను అదుపులోకి తీసుకున్నామని, అప్పటికి అతను గడ్డం పెంచుకుని ఉండటంతో గుర్తించలేకపోయామని వివరించారు. -
బాలీవుడ్ నటి హత్య కేసులో మరో మలుపు
ముంబై: సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసు మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు లైలా ఖాన్ తండ్రిగా చెలామణి అవుతున్న నాదిర్ షా పటేల్ ఆమె సొంత తండ్రి కాదని వెల్లడయింది. లైలా ఖాన్, ఆమె తోబుట్టువులు ఆయనకు జన్మించిన వారు కాదని డీఎన్ఏ పరీక్షలో నిర్ధారణయింది. డీఎన్ఏ నివేదికను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం కోర్టుకు సమర్పించారు. లైలా ఖాన్‌తో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఐదుగురిని 2011లో దారుణంగా కాల్చి చంపారు. ఈ ఆరు మృతదేహాలు పోలీసుల వద్ద ఉన్నాయి. అంత్యక్రియలు నిర్వహించేందుకు తన వారి భౌతికాయాలు తనకు అప్పగించాలని నాదిర్ షా గత నెలలో సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అంతకుముందు మృతదేహాలను తీసుకునేందుకు అతడు నిరాకరించాడు. కాగా, ఈ ఆరు హత్యలు లైలా ఖాన్ సవతి తండ్రి పర్వేజ్ తక్ చేసినట్టు 2012, అక్టోబర్ 3న పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు.