ముంబై: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హ్యత కేసులో నిందితుల్లో ఒకరైన ధర్మరాజ్ కశ్యప్‌కు ముంబై పోలీసులు ఆసిఫికేషన్ టెస్ట్ (వయసు నిర్ధారణ) నిర్వహించగా మైనర్ కాదని తేలిందని పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడు కశ్యప్‌ను ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టు ముందు పోలీసులు హాజరుపర్చారు.
Baba Siddique murder case: Ossification test confirms accused Dharmaraj Kashyap is not minor; sent to police custody
Read @ANI Story | https://t.co/ozKl30zuSo#MumbaiPolice #BabaSiddiqueShotDead #Maharashtra pic.twitter.com/QaljPVVnUe— ANI Digital (@ani_digital) October 13, 2024
దీంతో కోర్టు కశ్యప్‌ను సైతం అక్టోబర్ 21 వరకు పోలీసు కస్టడీని అనుమతి మంజూరు చేసింది. అయితే ఆదివారం నిందితుడు కశ్యప్ మైనర్ అని అతని న్యాయవాది పేర్కొనడంతో ఎస్ప్లానేడ్ కోర్టు ఆసిఫికేషన్ పరీక్షను ఆదేశించించిన విషయం తెలిసిందే. నిన్ననే మరో నిందితుడు గుర్మైల్ సింగ్‌ను కోర్టు.. అక్టోబర్ 21 వరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి పంపింది.
చదవండి: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్య
ఇక.. ఈ హత్య కేసులో మూడో నిందితుడు శివకుమార్ అనే మూడో షూటర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ హత్య కేసులో మరో నిందితుడి ప్రమేయం ఉందని, అతన్ని మొహమ్మద్ జీషాన్ అఖ్తర్‌గా గుర్తించినట్లు పోలీసుల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment