
ముంబై: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ శనివారం హత్యకు గురయ్యారు. ఆయనపై జరిగిన కాల్పుల కేసులో నిందితుడు గుర్‌మైల్ సింగ్‌ను ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టులో ఆదివారం హాజరుపర్చగా.. అక్టోబర్ 21 వరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి అనుమతి ఇచ్చింది.
ఈ కేసులో నిందితులైన గుర్‌మైల్ సింగ్(23), ధర్మరాజ్ సింగ్ కశ్యప్(17)లను ముంబై పోలీసులు ఈరోజు ఉదయం ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టులో హాజరుపరిచారు. ఎస్ప్లానేడ్ కోర్టు రెండో నిందితుడు మైనర్ కావటంతో ఆసిఫికేషన్ టెస్ట్ చేసిన తర్వాత మళ్లీ తమ ముందు హాజరుపర్చాలని ఆదేశించింది. ఆసిఫికేషన్ టెస్ట్ అనేది.. వ్యక్తి ఎముకలను ద్వారా వయస్సును అంచనా వేసే వైద్య పరీక్ష. ఇద్దరు నిందితులను పోలీసులు ముంబై క్రైం బ్రాంచ్‌కు తరలించారు.
Mumbai: One accused in Baba Siddique firing case sent to custody till October 21
Read @ANI Story | https://t.co/DljJNa4h7x#BabaSiddique #MumbaiCourt pic.twitter.com/s9uXQAZ8nw— ANI Digital (@ani_digital) October 13, 2024
నిందితుల తరఫు న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘పోలీసులు నిందితుడిని ఈరోజు కోర్టులో హాజరుపర్చారు. మేము దానిని వ్యతిరేకించాం. కోర్టుకు ఇవ్వగలిగిన ఆధారాలను ఇచ్చాం. కోర్టు ఆ కారణాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అక్టోబరు 21 వరకు కస్టడీ విధించింది. ఇక రెండో నిందితుడిని ఆసిఫికేషన్ టెస్ట్ తర్వాత మళ్లీ హాజరు పర్చాలని ఆదేశించింది. పోలీసులు 14 రోజుల కస్టడీకి అడిగారు. కానీ కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణ అవసరమని కోర్టు భావిస్తే కస్టడీని మరికొన్ని రోజులు పెంచే అవకాశం ఉంది’ అని తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఈ కేసుకు సంబంధించి మరో నిందితుడిని గుర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. నాలుగో నిందితుడి పేరు మహ్మద్ జీషన్ అక్తర్ అని వెల్లడించారు. ఇప్పటికే మూడో నిందితుడైన యూపీకి చెందిన శివకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు.. బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ముంబైలో శాంతిభద్రతల పరిస్థితిని దారుణం ఉందని..దానికి నిదర్శణమే బాబా హత్ అని మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ అన్నారు. నేరాల విషయంలో మహారాష్ట్ర.. ఉత్తరప్రదేశ్, బీహార్ మార్గంలో వెళుతుందని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను రాజీనామా చేయాలని వాడెట్టివార్ డిమాండ్ చేశారు.