ముంబై: ఎన్‌న్సీపీ (అజిత్ పవార్) నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. అయితే.. బాబా సిద్ధిఖీ హత్యకేసు నిందితులు ఎవరైనా వదలిపెట్టమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. ఆయన మహారాష్ట్రలో లా అండ్ ఆర్డ్‌ర్ అదుపుతప్పిందే విమర్శలపై తాజాగా స్పందించారు.
‘‘బాబా సిద్ధిఖీ హత్య కేసుకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం, హోం శాఖ మూలాలను ఛేదిస్తోంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. బాబా సిద్ధిఖీ హత్య దురదృష్టకరం. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.ఈ ఘటనలో పలువురు నిందితులు ఇప్పటికే అరెస్టు చేశాం. ప్రభుత్వం, హోంశాఖ కేసు మూలాలు చేధిస్తోంది.. అందులో భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’అని అన్నారు.
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని.. అక్టోబర్ 12న ముంబైలోని నిర్మల్ నగర్ ప్రాంతంలో ఆయన కుమారుడి కార్యాలయం సమీపంలో ముగ్గురు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment