ప్రేమించడమే పాపమా?.. ప్రియురాలిని కత్తితో పొడిచి.. | Boyfriend Stabs 20 Year Old To Death Near Mumbai | Sakshi
Sakshi News home page

ప్రేమించడమే పాపమా?.. ప్రియురాలిని కత్తితో పొడిచి..

Published Sat, Jul 27 2024 5:37 PM | Last Updated on Sat, Jul 27 2024 7:34 PM

Boyfriend Stabs 20 Year Old To Death Near Mumbai

ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ఓ యువకుడు అత్యంత కిరాతంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని  పోదల్లో పడేశాడు.  నవీ ముంబై సమీపంలోని ఉరాన్‌ రైల్వే స్టేషన్‌ చుట్టూ ఉన్న పొదల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో ఈ ఉదంతం శనివారం వెలుగుచూసింది. యువతి శరీరంపై అనేక గాయలు, కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.  మృతురాలిని యశశ్రీ షిండేగా గుర్తించారు.

ఉరాన్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు.. యశశ్రీ షిండే కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.  అయితే ఇటీవల వీరి ప్రేమ వ్యవహారంలో గొడవలు తలెత్తడంతో యువకుడు ఆమెను హత్య చేసినట్లు తేలింది.  మృతదేహాన్ని ఉరాన్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని పొదల్లో పడేసి అతడు పరారయ్యాడు. 

మరోవైపు యువతి కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. యువతి హత్యకు గురైన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశామని, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు  నవీ ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ పన్సారే తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement