మహిళ ప్రాణం తీసిన ప్రాంక్‌ వీడియో?! | Woman Falls From 3rd Floor In Mumbai | Sakshi
Sakshi News home page

వీడియో: ప్రాంక్‌ వీడియోలు తీస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త.. ఇలా కూడా జరగొచ్చు!

Published Wed, Jul 17 2024 2:12 PM | Last Updated on Wed, Jul 17 2024 3:13 PM

Woman Falls From 3rd Floor In Mumbai

సరదా చేష్టలు చేసి.. వాటిని ప్రాంక్‌ వీడియోలుగా ప్రమోట్‌ చేసుకుని ఫాలోవర్స్‌ను పెంచుకుంటారు కొందరు. అయితే అలాంటి వీడియోలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇక్కడో ఘటన చెబుతోంది. కలిసి పని చేసే మహిళపై ప్రాంక్‌ వీడియో చేద్దామని ప్రయత్నించిన ఓ వ్యక్తి.. ఏకంగా ఆమె ప్రాణం పోయేందుకు కారణం అయ్యాడు. 

ముంబైకి 30 కిలోమీటర్ల దూరంలోని డోంబివాలిలోని గ్లోబ్ స్టేట్ భవనంలో ఓ మహిళ అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకుంది. కొలీగ్స్‌ ఆమెపై ప్రాంక్‌ వీడియో తీద్దామని ప్రయత్నిస్తుండగా.. మూడో అంతస్తు నుంచి పడి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు నాగినా దేవి మంజీరామ్‌గా గుర్తించారు.  

ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు  పోలీసులు బిల్డింగ్‌లోని సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. అందులో రికార్డయిన వీడియోల ఆధారంగా ప్రాంక్‌ చేస్తుండగా జరిగిన ప్రమాదమని పోలీసులు ఒక అంచానికి వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  ప్రారంభించారు.  

ప్రాథమిక విచారణ ప్రకారం, భవనంలోని మూడవ అంతస్తులో బాధితురాలు తన స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దేవితో పాటు మరొకరు సైతం బిల్డింగ్‌పై నుంచి కిందపడబోతుండగా.. పక్కనే ఉన్న వారు పట్టుకొని పైకి లాగడంతో ప్రమాదం నుంచి బయట పడ్డారు.  కాగా, ఆ భవనంలో నాగినా దేవి సెక్యూరిటీగా పనిచేస్తున్నట్లు తెలిపింది.  మరణంతో ఆమె కుమార్తె, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement