Frank
-
ప్రాంక్ చేసి నవ్విద్దాం అనుకుంటే..అదే చివరి నవ్వు అయిపాయే..!
సోషల్ మీడియ స్టార్డమ్ కోసం ఎలా పడితే అలా వీడియోలు చేసేస్తున్నారు. అసలు ఇది కరెక్టేనా సురక్షితంగానే చేస్తున్నామా అని కూడా ఆలోచించటం లేదు. వీడియో పోస్ట్ చేశామా..? వ్యూస్ వచ్చాయా..?, ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం. ఇంకేమీ చూడటం లేదు. ఎలాంటిదైనా చేయడానికి రెడీ. ముఖ్యంగా ప్రాంక్ వీడియోలు మరింత ప్రమాదరకంగా మారాయి. అవతల వాడిని తక్కువ చేయడం లేదా వెధవిని చేస్తే పకాలించి నవ్వడం అనేదే ధ్యాసగా చేసేస్తున్నారు. ఇలాంటివి ఒక్కోసారి ప్రమాదాల తోపాటు శత్రుత్వాన్ని తెచ్చిపెడతాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇలానే ఓ వ్యక్తి సరదాగా నవ్విద్దామని చేసిన ఫ్రాంక్ కాస్తా చిరునవ్వునే లాక్ చేసేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి షాపు ముందు హాయిగా కూర్చొని ఓ పవర్ఫుల్ గమ్(Superglue)ని తీసుకుని పెదాలపై వేసుకుంటాడు. ఆ తర్వాత వీడియో(Viral Video)లో చూడండి అన్నట్లుగా పెదాలను(Lips) దగ్గరకు చేసి ఉంచుతాడు. అవి లాక్ అవుతాయా లేదా టెస్ట్ చేద్దామనుకున్నాడు. కానీ నిజంగానే అతుక్కుపోవడంతో ఏం జరుగుతుందో అర్థ కాలేదు ఆ వ్యక్తికి. పాపం ఆ వ్యక్తి ఏమో హే..అతుక్కోలేదని ఎగిరి గంతేసి చెప్పి నవ్విద్దామనుకుంటే రివర్స్ అయిపోయింది. తనకు చిరునవ్వే లేకుండా చేస్తుందని అనుకోలేదు. పాపం పెదాలను ఎలా విడిపించాలో తెలియక ఏడ్చేశాడు. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఎలాంటివి చేస్తే మంచిది అనేది తెలియదా అని ఒకరూ, మంచి గుణపాఠం నేర్చుకున్నాడు. మళ్లీ చేయడు ఇలాంటివి అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Badis TV (@badis_tv) (చదవండి: డొనాల్డ్ ట్రంప్ కుటుంబ వృక్షం: తల్లిదండ్రులు వలసదారులు..) -
మహిళ ప్రాణం తీసిన ప్రాంక్ వీడియో?!
సరదా చేష్టలు చేసి.. వాటిని ప్రాంక్ వీడియోలుగా ప్రమోట్ చేసుకుని ఫాలోవర్స్‌ను పెంచుకుంటారు కొందరు. అయితే అలాంటి వీడియోలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇక్కడో ఘటన చెబుతోంది. కలిసి పని చేసే మహిళపై ప్రాంక్ వీడియో చేద్దామని ప్రయత్నించిన ఓ వ్యక్తి.. ఏకంగా ఆమె ప్రాణం పోయేందుకు కారణం అయ్యాడు. ముంబైకి 30 కిలోమీటర్ల దూరంలోని డోంబివాలిలోని గ్లోబ్ స్టేట్ భవనంలో ఓ మహిళ అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకుంది. కొలీగ్స్ ఆమెపై ప్రాంక్ వీడియో తీద్దామని ప్రయత్నిస్తుండగా.. మూడో అంతస్తు నుంచి పడి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు నాగినా దేవి మంజీరామ్‌గా గుర్తించారు. Woman falls off third floor of a complex in Maharashtra's Dombivli. This happened while the woman was with her friends. Another of her friends was saved by bystanders.The woman was identified as Gudiya Devi, who worked as a cleaner in the building. She is survived by a son… pic.twitter.com/tfKpjHFn4U— Vani Mehrotra (@vani_mehrotra) July 17, 2024ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు బిల్డింగ్‌లోని సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. అందులో రికార్డయిన వీడియోల ఆధారంగా ప్రాంక్ చేస్తుండగా జరిగిన ప్రమాదమని పోలీసులు ఒక అంచానికి వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, భవనంలోని మూడవ అంతస్తులో బాధితురాలు తన స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దేవితో పాటు మరొకరు సైతం బిల్డింగ్‌పై నుంచి కిందపడబోతుండగా.. పక్కనే ఉన్న వారు పట్టుకొని పైకి లాగడంతో ప్రమాదం నుంచి బయట పడ్డారు. కాగా, ఆ భవనంలో నాగినా దేవి సెక్యూరిటీగా పనిచేస్తున్నట్లు తెలిపింది. మరణంతో ఆమె కుమార్తె, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
పగటి పూట బొమ్మ.. రాత్రి కాగానే ‘దెయ్యం’లా హైవేపై..
దెయ్యం కథలు.. నమ్మకం ఉన్నా.. ‘ఛస్’ అని ఛీదరించుకున్నా వీటి గురించి ఆసక్తి కలగక మానదు. ఎందుకంటే ఆ కథల్లోని నేరేషన్ అలా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చెప్పుకోబోయే యూకే ‘బెట్టీ బైపాస్’ కొంత క్యూరియాసిటీని రేకెత్తించడం ఖాయం!. ఎందుకంటే ఈ దెయ్యం ఈమధ్యే పదేళ్లు పూర్తి చేసుకుంది కాబట్టి!. బర్మింగ్హమ్-వోర్‌సెయిస్టర్ సరిహద్దు. హైవే కావడంతో వాహనాల రద్దీ ఎక్కువే!. చెక్‌పోస్ట్‌కి దగ్గర్లో ఒక శాండ్విచ్ ట్రక్ ఉంటుంది. ఆ నిర్వాహకులు ఏర్పాటు చేసిన బెంచ్ మీద కనిపించే ఒక రూపాన్ని చూసి ఎవరైనా వణికిపోతుంటారు. కారణం.. గత పదేళ్లుగా ఆ రూపం అక్కడక్కడే తిరుగుతోంది. ఆ రూపం పేరు ‘బెట్టీ’.. పక్కనే పిల్లల్ని వేసుకుని తిరిగే ఓ వీల్ ఊయల కూడా ఉంటుంది. పగలు బెంచ్ మీద కనిపించే ఆ రూపం.. రాత్రిపూట దెయ్యంగా మారుతుందనే ప్రచారం నడుస్తుంది. అందుకే ఈ దారికి కూడా ‘బెట్టీ బైపాస్’ అని పేరొచ్చింది. బిడ్డను కోల్పోయిన ఆ తల్లి దెయ్యంగా మారి.. అలా హైవేపై తిరుగుతోందని, ఎవరో ఆమెను యాక్సిడెంట్ చేసి చంపేశారని, కాదు కాదు.. ఆమె భర్తే ఆమెను చంపేశాడని.. ఇలా రకరకాల ప్రచారాలు వినిపిస్తుంటాయి. బెట్టీ మీద సింపథీ ఉన్నా.. దెయ్యం అనే ఊహ మాత్రం చాలామందిని వణికించేది. దీంతో ఈ మిస్టరీని చేధించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా.. ఆ ఘోస్ట్ లేడీ వ్యవహారాన్ని ఎవరూ తేల్చలేకపోయారు. ఈలోపు ఆ నోటా ఈ నోటా పాకి ఈ దెయ్యం కథ.. దెయ్యాల మీద అన్వేషణ చేసే వాళ్లకు, అంతర్జాతీయ మీడియా హౌజ్ దృష్టికి చేరింది. ఎవరికి వాళ్లు ఈ మిస్టరీని చేధించాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో పగలబడి నవ్వుకున్నారు. కారణం.. అదొక ప్రాక్టికల్ జోక్ కాబట్టి! బెట్టీ ఒక షోకేజ్ బొమ్మ. దానిని అక్కడ తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి పేరు నిక్ హజ్బెండ్. ఆయన ఆ శాండ్విచ్ ట్రక్ యజమాని. ఓ ఛారిటీ షాప్ నుంచి ఆ షోకేజ్ బొమ్మను కొనుక్కొచ్చి.. దానికి బెట్టీ అనే పేరు పెట్టి రోజూ దానిని రకరకాల యాంగిల్స్‌లో అక్కడి బెంచ్‌ల మీద కూర్చోబెడుతున్నాడు. అలా పదేళ్లు గడిచిపోయింది. ఈలోపు హైవే మీద వెళ్లే చాలామంది.. ప్రత్యేకించి రాత్రిళ్లు ఆ బొమ్మను చూసి వణికిపోయేవాళ్లట. పైగా అది అక్కడక్కడే ఉండడం, నిక్ చెప్పిన కల్పిత కథలతో అదొక దెయ్యం అని బలంగా ఫిక్స్ అయిపోయారు. అలా బెట్టీ కథ చుట్టుపక్కల పాకేసింది. పాపం అనుకున్నారట.. ప్రాక్టికల్ జోక్స్‌తో ఇంట్లో వాళ్లను ఫూల్స్ చేసే నిక్.. జనాలందరినీ భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేశాడు. అయితే పగటిపూట ఆ ఫుడ్ ట్రక్ దగ్గర ఆగిన కొందరు.. బెట్టీ గురించి అడిగినప్పుడు వాళ్లకు రకరకాల కథలు చెప్పేవాడు. ఆమె భర్త చేతిలో మోసపోయినా ఒక అనాథ అని, అందుకే బిడ్డతో అక్కడ అలా కూర్చుంటుందని(సజీవంగా ఉందని నమ్మించాడు కూడా!) చెప్పడంతో చాలామంది ‘పాపం’ అని సాయం చేసేందుకు ముందుకు వచ్చేవాళ్లట. తీరా అదొక బొమ్మ అని తెలిశాక నిక్‌ను తిట్టుకుంటూ.. సరదాగా ఫొటోలు తీసుకుని వెళ్లిపోయేవాళ్లట. కొన్నాళ్ల తర్వాత నిక్, ఆ ప్రమ్(తిప్పే ఊయల)ని మాయం చేయడంతో బిడ్డ గురించి ఆరా తీసేవాళ్లట. వాళ్లకు ఆ బిడ్డ పెరిగి.. స్కూల్‌కు వెళ్తోందని చెప్పేవాడట. ఇలా జనాలందరికీ ఒక్కో రకమైన కథ చెప్పి బురిడీ కొట్టించేవాడు ఆ ట్రక్కు యజమాని. ఒకానొక టైంలో కౌన్సిల్ ఆఫీసర్లు సైతం ఆ అనాథ మహిళకు సాయం చేయాలని ముందుకొచ్చారట. కానీ, అదొక బొమ్మ అని తెలిశాక.. నిక్కు వార్నింగ్ఇచ్చి మరీ బెట్టీతో ఫొటోలు దిగి వెళ్లిపోయారట. మొత్తానికి బెట్టీ తన కుటుంబంలో ఒక భాగం అయ్యిందని, ఆ బొమ్మకు చేసిన 20 పౌండ్ల ఖర్చు తన వ్యాపారానికి ఎంతో సాయం ఇప్పుడు చేస్తోందని సంతోషపడుతున్నాడు నిక్. మొత్తానికి పదేళ్లపాటు జనాలను బురిడీ కొట్టించాడు ఈ పెద్దాయన. -
ఫేస్బుక్ ప్రియుడి కోసం బిడ్డ ప్రాణం బలి.. తీరా అతని కోసం వెతికితే..
తిరువనంతపురం: ప్రాంక్ సరదా మూడు నిండు ప్రాణాలను బలిగొంది. ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి కోసం ఓ బాలింత తన పసి బిడ్డను పొదల్లో వదిలి వెళ్లిపోయిన అమానుష సంఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాలు.. కొల్లాం జిల్లాలోని కల్లవుతుక్కల్ గ్రామానికి చెందిన రేష్మా అనే వివాహితకు ఫేస్బుక్లో ఆనంద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ ఎప్పడూ కలుసుకోలేదు. అయితే, అప్పటికే రేష్మా ఒక పండంటి మగ బిడ్డ జన్మనిచ్చింది. మరోవైపు ఫేస్బుక్ ప్రియుడు.. ఏదేమైనా ఇంట్లో నుంచి రావాలని. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో అతని మాటలు నమ్మిన రేష్మా తన బిడ్డను అడ్డు తొలగించుకుని ఆనంద్ తో వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. పసి బిడ్డను దగ్గరలో గల రబ్బరు తోటల్లో వదిలి వెళ్లిపోయింది. తరువాత పసిబిడ్డను స్థానికులు గమనించి ఆస్పత్రి కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ శిశువు మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా విస్మయకర విషయాలు వెలుగు చూశాయి. అసలు ట్విస్ట్ ఏంటంటే ఫేస్బుక్ ప్రియుడు ఆనంద్ జాడ లేకపోవడంతో రేష్మా తిరిగి ఇంటికి వచ్చింది. అదే సమయంలో పసికందు మృతి కేసులో పోలీసులు విచారణ చేపట్టి ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె ఫేస్బుక్ స్నేహితుడు ఆనంద్ కోసం వెతకడం మొదలు పెట్టారు. అయితే, ఆనంద్ అనే వ్యక్తి లేనే లేడని పోలీసుల విచారణలో తేలింది. ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఆనంద్ అనే పేరుతో ఎవరో చాటింగ్ చేసినట్టు వెల్లడైంది. ఆర్యా, గ్రీష్మా ఆత్మహత్య శిశువు మృతి కేసు విచారణ కొనసాగుతుండగానే రేష్మా బంధువులు ఆర్య, గ్రీష్మా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిమ్ కార్డు వివరాల ఆధారంగా రేష్మాతో ఫేస్బుక్ చాటింగ్ చేసింది ఆమె బంధువులు ఆర్య, గ్రీష్మా అని వెల్లడైంది. రేష్మాతో ‘ప్రాంక్’ చేద్దామని ఆ ఇద్దరూ ఆనంద్ అనే ఫేక్ ఫేస్బుక్ అకౌంట్‌తో కథంతా నడిపించారని ఆర్య, గ్రీష్మా స్నేహితుడొకరు పోలీసులకు చెప్పడంతో అసలు నిజం బయటపడింది. ‘ప్రాంక్’ పేరిట పసి ప్రాణం పోవడానికి కారకులం అయ్యామనే తీవ్ర మనోవేదనకు వారిద్దరూ బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దుబాయ్ వచ్చిన విష్ణు ఇక ఈ కథ మొత్తం దుబాయ్‌లో ఉంటున్న రేష్మా భర్తకు తెలియకపోవడం గమనార్హం. భార్య ప్రెగ్రెంట్‌గా ఉన్నప్పుడు దుబాయ్ వెళ్లిన విష్ణు ఆమెను జూన్‌లో అరెస్టు చేసినప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చాడు. తన బిడ్డ చనిపోవడం, ఆ కారణంగా మరో ఇద్దరు బంధువులు ప్రాణాలు తీసుకోవడం తెలుసుకున్న విష్ణు నిశ్ఛేష్టుడయ్యాడు. మరోవైపు తమ భార్యలు ఏ కారణంతో నదిలో దూకి చనిపోయారో తెలియని ఆర్యా, గ్రీష్మా భర్తలు నిజం బయటపెట్టినందుకు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. -
బ్యాట్స్‌మన్‌ను ప్రాంక్ చేసిన బౌలర్.. వీడియో వైరల్
లండన్: క్రికెట్లో అప్పుడప్పుడు ఫన్నీ మూమెంట్స్ చోటుచేసుకోవడం సహజం. అయితే బ్యాట్స్‌మన్, బౌలర్ మధ్య జరిగే కొన్ని చిలిపి సంఘటనలు మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. వివరాలు.. మంగళవారం చాంపియన్‌షిప్‌లో భాగంగా మిడిల్సెక్స్, హాంప్‌షేర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మిడిల్సెక్స్ బ్యాట్స్‌మన్ నిక్ గుబ్బిన్స్ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ మధ్యలో హాంప్‌షేర్ బౌలర్ కీత్ బార్కర్ వేసిన ఓవర్లో నిక్ బ్యాక్వర్డ్ దిశగా షాట్ ఆడాడు. రెండు పరుగులు తీయడానికి ప్రయత్నించగా.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు వెళ్లిన నిక్ క్రీజులో జారి పడ్డాడు. దీంతో మిడిల్సెక్స్ ఒక్క పరుగుకే పరిమితమైంది. ఇంతవరకు బాగానే ఉంది.. అసలు మజా ఇక్కడే జరిగింది. బంతి విసిరిన బార్కర్ వెనక్కి వస్తున్నాడు. అప్పటికే క్రీజులో కిందపడి ఉన్న నిక్కు హెల్ఫ్ చేస్తున్నట్లుగా తన హ్యాండ్ను అతనికి అందించాడు. అది చూసిన నిక్ అతనికి చేయి ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇంతలో బార్కర్‌కు ఏమనిపించిందో వెంటనే తన చేయిని వెనక్కి తీసుకొని వెళ్లిపోయాడు. ఆ తర్వాత నిక్ లేచి బార్కర్‌ను చూస్తూ ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో గ్రేడ్ క్రికెటర్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో హాంప్‌షేర్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన మిడిల్సెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసింది. ఆ తర్వాత హాంప్‌షేర్ తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగులు చేసి 36 పరుగులు ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మిడిల్సెక్స్ 101 పరుగులకే కుప్పకూలింది. 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హాంప్‌షేర్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చదవండి: డ్యాన్స్‌తో రచ్చ చేసిన చహల్ భార్య.. వీడియో వైరల్ ఆర్చర్ బనానా ఇన్‌స్వింగర్.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్ Alpha’s gonna alpha pic.twitter.com/VDCfMO6qZh — The Grade Cricketer (@gradecricketer) May 15, 2021 -
ఫ్రాంక్‌తో తల్లిని హడలుగొట్టిన కుమారులు
లండన్ : కన్న తల్లి మీద భయంకరమైన ఫ్రాంక్ చేసి హడలు గొట్టారు ఇద్దరు యువకులు. బ్రిటన్‌లో న్యూక్లియర్ వార్ జరుగుతోందంటూ ఆమెను భయపెట్టి కన్నీళ్లు పెట్టించారు. వివరాలు.. లండన్‌కు చెందిన షాన్ పెర్రెట్కు టిక్‌టాక్‌లో 2,50,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. షాన్ తరచూ ఫ్రాంక్ వీడియోలు చేస్తూ ఫాలోయర్లను ఆకట్టుకుంటుంటాడు. అయితే ఈ సారి కన్నతల్లి ట్రేసీ స్టెబ్బింగ్ మీద ఫ్రాంక్ చేయాలనుకున్నాడు. అందుకోసం సోదరుడు చార్లీ డెవిస్తో కలిసి పక్కా ప్లాన్ వేసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం ట్రేసీ టీవీ చూస్తున్న సమయంలో ఉన్నట్టుండి ‘‘ బీబీసీ అలర్ట్: యూకోలో న్యూక్లియర్ వార్ జరుగుతోంది. పౌరులెవరూ బయటకు రావద్దని విజ్క్షప్తి. టెలిఫోన్ లైన్లన్నీ డిస్ కనెక్ట్ చేయబడ్డాయి. అన్నీ దారులు, విమానాశ్రయాలు మిలిటరీ అవసరాలకోసం మూసివేయబడ్డాయి.’’ అని టీవీ స్క్రీన్‌పై రావటం మొదలుపెట్టింది. దీంతో ఆమె తీవ్ర భయాందోళనలకు గురైంది. ‘‘న్యూక్లియర్ యుద్ధమా? చాలా భయంగా ఉంది’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తల్లిలో చోటుచేసుకుంటున్న భావోద్వేగాలను వీడియో తీస్తున్న ఇద్దరూ లోలోపల నవ్వుకోసాగారు. ‘‘ అయితే మనం ఇంకెక్కడి కెళ్లి తలదాచుకోవాలి?’’ అంటూ ఏమీ ఎరగనట్లు తల్లిని ప్రశ్నించాడు షాన్. ఆమె భయంతో ఇంట్లోకి బయటకు తిరగసాగింది. ఆమెను మరింత భయపెట్టడం ఇష్టం లేక ఫ్రాంక్ చేసినట్లు చెప్పేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 1.4 మిలియన్ల వీక్షణలు సొంతం చేసుకుంది. చదవండి : డ్రైనేజీలో తండ్రి అస్థికలు కలిపిన కొడుకు.. కారణం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుప్పలుగా తల్లో పేలు! -
వైరల్: నీ భార్యను ఆ దేవుడే కాపాడాలి..
మెల్బోర్న్ : మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు.. అసలే అంతంత మాత్రం వ్యాపారం జరుగుతున్న ఓ రెస్టారెంట్‌పై ఫ్రాంక్ చేశాడో రాక్షసుడు. పెద్ద మొత్తంలో ఆహారం ఆర్డర్ చేసి తప్పుడు అడ్రస్ ఇచ్చి మోసం చేయటమే కాకుండా ఏంటని ప్రశ్నించినందుకు తిట్ల పురాణం మొదలెట్టాడు. వివరాలు.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన ఓ రెస్టారెంట్‌కు కొద్దిరోజుల క్రితం 21 ఆహార పొట్లాలకు ఆర్డర్ వచ్చింది. డెలివరీ తర్వాత డబ్బులు చెల్లిస్తానని సదరు వినియోగదారుడు చెప్పాడు. డెలివరీ బాయ్ ఆహార పొట్లాలను వినియోగదారుడు చెప్పిన అడ్రస్‌కు తీసుకెళ్లాడు. అది తప్పుడు అడ్రస్ అని తేలింది. దీంతో డెలివరీ బాయ్ అతడికి దీనిపై ‘‘మీరిచ్చిన అడ్రస్ తప్పుగా ఉంది’’ అని మెసేజ్ చేయగా.. ‘‘నాకు తెలుసు, .....’’ అంటూ వినియోగదారుడు బూతు మాట అన్నాడు. ఇక చేసేదేమీ లేక డెలివరీ బాయ్ ఆహార పొట్లాలను వెనక్కు తీసుకెళ్లాడు. ( ఓ అజ్ఞాత వాసి నీ వివరాలు పంపు!) రెస్టారెంట్ యజమాన్యం దీనిపై భావోద్వేగంగా స్పందిస్తూ.. ‘‘ మానవత్వం లేకుండా జోక్ వేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ స్థానిక చిరు వ్యాపారాన్ని దెబ్బ తీసినందుకు కృతజ్ఞతలు’’ అని మెసేజ్ చేసింది. ఫ్రాంక్ చేసిన వ్యక్తి తిరిగి స్పందిస్తూ.. ‘‘ మూర్ఖుడా.... మీ హోటల్ ఆహారాన్ని ఎవరూ కొనరు. నాకు ఇంటిపనులు చేసిపెట్టే భార్య ఉంది. మీ..... ఆహారం అవసరం లేదు’’ అంటూ రెచ్చిపోయాడు. చివరగా రెస్టారెంట్ యజమాన్యం ‘‘ నీ భార్యను ఆ దేవుడే కాపాడాలి’’ అన్న ఉద్ధేశం వచ్చేలా లాస్ట్ పంచ్ వేసింది. ఈ సంభాషణలకు సంబంధించిన స్ర్కీన్ షాట్లను తీసి రెడ్డిట్‌లో షేర్ చేయగా.. నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి క్రూరత్వానికి కూడా పెనాల్టీ వేయాలని అంటున్నారు. లాస్ట్ పంచ్ విషయంలో రెస్టారెంట్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. -
అమ్మ శ్రద్ధ
కథాసారం ప్రపంచంలో మనకు అమ్మ ఒక్కతే. అమ్మకు ప్రపంచంలో మనం ఒక్కరమే కాదు కదా! తండ్రి యుద్ధంలో ఉన్నాడు. పిల్లాడు ఎప్పుడోగానీ తండ్రిని చూడలేదు. బూట్ల చప్పుడు చేస్తూ వచ్చే ఖాకీ దుస్తుల శాల్తీలాగే ఆయన జ్ఞాపకం. శాంతా క్లాజ్‌లాగా ఇలా ఇంటికి వచ్చి అలా మాయమయ్యేవాడు. ఆ వచ్చినప్పుడు ఆయన అమ్మను దగ్గరికి తీసుకోవడం వాడికి అసౌకర్యంగా ఉండేది. ఆయన పొగతాగేవాడు. అంతకుమించిన పనిలేదన్నంత శ్రద్ధగా గడ్డం గీసుకునేవాడు. ఆయన పోయినప్పుడు వదలిపోయిన కత్తులు, బుల్లెట్ కేసుల లాంటి మిలిటరీ సామగ్రి అంతా బీరువా మీది పొడవైన పెట్టెలో ఉంచేది అమ్మ. ఆయనకు ఏదైనా అందుబాటులో ఉండాలి. పిల్లాడు తొలి కిరణాలు పడేవేళకు నిద్ర లేచేవాడు. మంచం మీంచి రెండు కాళ్లను కింద పెట్టేవాడు. మిసెస్ లెఫ్ట్, మిసెస్ రైట్ అని వాటికి పేర్లు పెట్టుకున్నాడు. అమ్మ, పిల్లాడు ఆ రోజు ఏమేం చేయాలో అవి చర్చిస్తాయి– ఇంటిని ఎలా అలంకరించాలి, క్రిస్మస్కు శాంతా క్లాజ్ ఏ ఇంట్లో ఏ బహుమతి ఇవ్వాలి లాంటివి. ఒక్కోసారి పాప సంగతి కూడా. అక్కడ కొత్త పాప లేని ఇల్లు వీళ్లదొక్కటే. పాపంటే మళ్లీ పదిహేడు షిల్లింగుల ఆరు పెన్నీల ఖర్చు అవుతుంది, నాన్న యుద్ధం నుంచి తిరిగొచ్చేవరకూ అంత ఖర్చు భరించలేము అంటుంది అమ్మ. కానీ రోడ్డు పై వైపు ఉండే జీనీ వాళ్ల ఇంట్లో ఒక పాప ఉంది. అందరికీ తెలుసు వాళ్ల దగ్గర కచ్చితంగా 17/6 లేవు. అది చవక పాప అయివుండాలి, అమ్మకు మంచి పాప కావాలేమో. జీనీ వాళ్లలాంటి పాప అయినాకూడా బానేవుంటుందిగా! బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత అమ్మ, వాడు టౌనులోకి వెళ్లారు. సెయింట్ ఆగస్టీన్ చర్చిలో ప్రార్థన చేశారు. నాన్నను యుద్ధం నుంచి క్షేమంగా ఇంటికి పంపమని దేవుణ్ని కోరుకుంది అమ్మ. ఒక ఉదయాన నాన్న రానేవచ్చాడు. అమ్మ ముఖం వెలిగిపోయింది. అంత సంబరపడాల్సింది ఏముందందులో? దేవుడు మన ప్రార్థనలు విన్నాడంది అమ్మ. ఇంకా అన్యాయం ఏమిటంటే, నాన్న ఏదో ఒకటి అమ్మతో మాట్లాడుతూనేవున్నాడు. వీడు వాళ్ల మాటలకు అడ్డు తగిలాడు. ‘లారీ, ఒక్క నిమిషం’ అంది అమ్మ. అనాసక్తి కలిగించే చుట్టుపక్కలవాళ్లు ఎవరైనా వచ్చినప్పుడు ఆమె ఇలా అంటుంది. అందుకే దానికి అంత ప్రాధాన్యత ఇవ్వక మళ్లీ ఏదో మాట్లాడబోయాడు. ‘లారీ, నిశ్శబ్దంగా ఉండు. నేను నాన్నతో మాట్లాడుతున్నా, నీకు వినబడట్లేదా?’ ఇదే మొదటిసారి వాడు ఇలాంటి ‘అశుభకరమైన మాటలు’ వినడం. ‘నాన్నతో మాట్లాడుతున్నా’. అయితే ఏమిటట! దేవుడు ఇలాగేనా ప్రార్థన విన్నది! అయితే ఆయన శ్రద్ధగా విన్నట్టు లేదు. ‘నాన్నతో ఎందుకు మాట్లాడుతున్నావు?’ ‘నాన్నా నేనూ మాట్లాడాల్సిన విషయాలున్నాయి. మళ్లీ అడ్డుపడకు’. మధ్యాహ్నం భార్య కోరిన మీదట వీడిని నడకకు తీసుకెళ్లాడు తండ్రి. నడక విషయంలో నాన్నకూ వాడికీ భేదాభిప్రాయాలున్నాయి. ట్రాములు, ఓడలు, గుర్రాలు ఇవేవీ ఆయనకు ఆసక్తి కలిగించవు. ఆయనంత వయసు వాళ్లు ఎదురైనప్పుడు మాత్రం మాట్లాడుతూ గోడకు చేరగిలబడతాడు. ఇక కదలడు. రెండోసారి అట్లా ఆగినప్పుడు పిల్లాడికి చిర్రెత్తుకొచ్చింది. కోటు, ప్యాంటు పట్టుకుని లాగాడు. కానీ నాన్నకు తిక్క రేగిందంటే, అమ్మలా కాదు, ‘లారీ, ఇలా విసిగించావనుకో, దెబ్బ పడుతుంది’ అన్నాడు. ఏడుపొచ్చినంత పనైంది. కానీ ఏడ్చినా ఆయన పట్టించుకుంటాడన్న నమ్మకం కలగలేదు. ఒక కొండరాయితో వాకింగ్ చేస్తున్నట్టే ఉంది. ఇక సాయంత్రం టీ సమయంలో మళ్లీ ‘నాన్నతో మాట్లాడుతున్నా’ కార్యక్రమం మొదలవుతుంది. ఈవ్నింగ్ పేపర్ దాన్ని మరింత సంక్లిష్టం చేస్తుంది. పేపర్లో నాన్న కాసేపు తల పెడతాడు. దాన్ని కిందపెట్టి అందులోంచి ఏదో కొత్త విషయం అమ్మకు చెబుతాడు. ఇది కచ్చితంగా నాటకం. అమ్మ తలను తిప్పించుకోవడంలో వాడు నాన్నతో పోటీ పడగలడు. కానీ ఈ పేపర్‌వాళ్లు అందరూ ఆయనకు సహకరిస్తుంటే ఇంకేం చేయగలడు! అయినా విఫలయత్నం చేశాడు. ‘నాన్న పేపర్ చదువుతున్నప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి’ అంది అమ్మ అసహనంగా. నిజంగానే అమ్మకు నాకన్నా కూడా ఆయనతో మాట్లాడటం ఎక్కువ ఇష్టం ఉండాలి, లేదా నిజాన్ని ఒప్పుకోవడానికి భయం అయినా కావాలని తలపోశాడు వాడు. ఆ రాత్రి అడిగాడు. ‘అమ్మా, నేను దేవుణ్ని ప్రార్థిస్తే నాన్నను మళ్లీ యుద్ధానికి పంపుతాడా?’ ‘పంపుతాడనుకోను’ నవ్వుతూ చెప్పింది అమ్మ. ‘ఎందుకమ్మా?’ ‘ఎందుకంటే యుద్ధం లేదు కాబట్టి.’ ‘కానీ ఆయన తలుచుకుంటే ఇంకో యుద్ధం సృష్టించలేడా?’ ‘ఆయనకు ఇష్టం ఉండదు. అయినా యుద్ధాన్ని దేవుడు తేడు నాన్నా, చెడ్డ మనుషులు తెస్తారు’. తెల్లారి వాడు నిద్ర లేచి, పెద్ద మంచం మీదికి వెళ్లాడు. అమ్మ పక్కలో ఖాళీ లేదు. మధ్యలో దూరాడు. నాన్న తన మంచం కన్నా ఎక్కువ ఆక్రమించుకున్నాడు. అందుకని వీడు కాళ్లతో తన్నాడు. నాన్న అటు జరిగి పడుకున్నాడు. వీడు నోట్లో వేలు వేసుకుని సౌకర్యంగా, ‘అమ్మా’ అని పిలవబోయాడు. ‘ష్, నాన్నను నిద్ర లేపకు’ గుసగుసగా చెప్పింది అమ్మ. ఇది కొత్త పరిణామం. ‘నాన్నతో మాట్లాడుతున్నా’ కన్నా ఇది మరింత ప్రమాదకరంగా కనబడింది. ‘ఎందుకు?’ ‘పాపం నాన్న అలసిపోయాడు’ పాపం నాన్న. ఈ మాట అసలు నచ్చలేదు వాడికి. ఈ రోజు చేయాల్సిన ఎన్నో ఆలోచనలతో వచ్చాడు. ‘కొత్త వలతో చేపలు పట్టడానికి వెళ్లాలి’... అమ్మ మాట్లాడకుమని చెబుతూనేవుంది. నాన్నకు మెలకువ వచ్చింది. అమ్మ చిత్రమైన గొంతుతో ‘టీ తాగుతారా?’ అంది. పిల్లాడు ఇంకేదో చెప్పబోయాడు. ‘నువ్వు పడుకో’ అంది అమ్మ. ఇక లాభం లేదు. అమ్మకు తాను దూరమవుతున్నాడు. ఇంతకుముందు తనకు విడి మంచం వేసినప్పడు, ఒక్క మంచం మీద పడుకునేదానికి వేరేది ఎందుకని అడిగితేనేమో, అది ఆరోగ్యకరం అని చెప్పింది. అలాంటిది ఈ కొత్త మనిషి వచ్చి అమ్మ ఆరోగ్యం పట్ల ఏ పట్టింపు లేకుండా ఇక్కడే పడుకుంటున్నాడు. కానీ అమ్మేమో అదో విషయంగా పట్టించుకోకపోగా, తననే మాట్లాడొద్దని చెబుతోంది. ఏమంటే, పాపం నాన్న అలసిపోయాడు. ఏమంటే, ఆయన బయటికి వెళ్లి డబ్బులు సంపాదించాలి. ఏమంటే, అలా సంపాదించకపోతే మనకు తినడానికి ఏమీవుండదు. అలా ఏమీలేకపోతే అడుక్కుతినాలి. కానీ ఇదేం బాగోలేదు. తన ప్రాధాన్యత తగ్గిపోయింది. అమ్మతో తన ఉషోదయపు చర్చలు ఆగిపోయినై. ఈ అన్యాయాన్ని సహించడానికి వీలు లేదు. మంచంలో అటూయిటూ కదిలాడు. కాళ్లూ చేతులూ గట్టిగా విదిలించాడు. నాన్న నిద్ర లేవనే లేచాడు. ‘ఈ పిల్ల రాకాసి నిద్రే పోడా?’ అన్నాడాయన లేస్తూ. ‘అది వాడికి అలవాటు... చూశావా లారీ, నువ్వు నాన్నను లేపావు, వెళ్లు నీ మంచం మీదికి’ అరిచింది అమ్మ. ‘అయితే ఆ అలవాటును వదిలించాలి’ అన్నాడాయన. ‘నోర్మూసుకో’ అన్నాడు వీడు. ఒక్క ఉదుటున మంచం మీంచి లేస్తూ, ‘ఏమన్నావురా పిల్లకాకి’ అన్నాడాయన. ‘మిక్ మిక్’ సముదాయించింది భార్య. ‘వాడికి నువ్వింకా అలవాటు కాలేదు’. ‘దెబ్బ పడితేగానీ అర్థం కాదు, చెడ్డీ పగలాలి’ అన్నాడాయన. ‘నువ్వే కొట్టుకో’ ఆయన సహనం కోల్పోయి ఒక దెబ్బ వేశాడు. అదేమీ గట్టిగా కొట్టిన దెబ్బ కాదు, అలా వేశాడంతే. కానీ వాడి గౌరవం మంట గలిసింది. ఆ క్షణం నుంచీ తండ్రీ కొడుకులిద్దరూ శత్రువులుగా మిగిలిపోయారు. తల్లీతండ్రీ మాట్లాడుకుంటున్నప్పుడు వీడు తన బొమ్మలతో ఆడుకునేవాడు, వాళ్లను పట్టించుకోనట్టుగా. వాడికి అర్థం కానిదేమిటంటే, అమ్మను ఆయనవైపు అంత ఆకర్షితురాలిని చేస్తున్న అంశం ఏమిటి? మొత్తం అంతా ఆ న్యూస్‌పేపర్లోనే ఉందా? అందుకని వాడు కూడా కూడబలుక్కుని అమ్మకు చదివి వినిపించడానికి ప్రయత్నించేవాడు. చివరికి ఒకరోజు అన్నాడు, ‘అమ్మా, నేను పెద్దయ్యాక ఏం చేస్తానో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకుంటా’. ఆమె నవ్వింది. తండ్రి ఓసారి తల తిప్పి చూశాడుగానీ పట్టించుకోలేదు. అది నటన అనుకున్నాడు వాడు. ‘మనకు చాలామంది పాపలు వస్తారు’ అని కొనసాగించాడు. ‘అది సరేగానీ ముందైతే మనకో పాప వస్తుంది. నీతో ఆడుకుంటుంది’ చెప్పింది అమ్మ. ఇక ఆమె పూర్తిగా ఇంటిపట్టునే ఉండటం మొదలైంది. వాడిని నడకకు తీసుకెళ్లడం మానేసింది. తండ్రి ఎక్కడ 17/6 సంపాదిస్తున్నాడో. సాయంత్రాలు ఇంట్లో కనబడేవాడు కాదు. ఎట్టకేలకు ఇంట్లోకి సానీ వచ్చాడు. వీడింకా ఘోరం. ఎప్పుడూ ఏడుస్తాడు. ఎప్పుడూ పడుకునే వుంటాడు. అమ్మ వెన్నంటే ఉండాలి. వాడు నిద్రలేవకూడదంటే మునిగాళ్ల మీద నడవాలి. వాణ్ని ఊయల ఊపాలి. ‘పాపం నాన్నను నిద్ర లేపొద్దు’ అనేది పోయి, ‘సానీని లేపొద్దు’ అనేది ఇంట్లో మాటైపోయింది. ఒకరోజు లారీ పక్కన ఎవరో పడుకున్నట్టు అనిపించింది. ముందు అమ్మ అనుకున్నాడు, కానీ నాన్న. అమ్మ మొత్తం శ్రద్ధ ఇప్పుడు సానీ మీదే. వాడు ఏడుస్తుంటే ఊరడిస్తోంది. అందుకే నాన్న ఇటు వచ్చాడు. తండ్రి మీద వాడికి జాలేసింది. ఇది వాడికి అనుభవమే కదా! తండ్రిని ఓదార్చుతున్నట్టుగా ఆయన చేతిని తన మీద వేసుకున్నాడు. ఫ్రాంక్ ఓ కానర్ (1903–1966) ఐరిష్ కథ ‘మై ఈడిపస్ క్లాంప్లెక్స్’ సారాంశం ఇది. ఐర్లాండ్‌కు చెందిన ఓ కానర్ సుప్రసిద్ధ కథకుడు, కవి. ‘గెస్ట్స్ ఆఫ్ ద నేషన్’, ‘బోన్స్ ఆఫ్ కంటెన్షన్’, ‘క్రాబ్ ఆపిల్ జెల్లీ’, ‘ట్రావెలర్స్ శాంపిల్స్’ ఆయన కథాసంకలనాల్లో కొన్ని. -
మీటూ దెబ్బకు సీట్లు ఖాళీ!
ఫిబ్రవరిలో రెండు చోట్ల ‘మీటూ’ ఎన్నికలు జరగ్గా.. మార్చి 13న ఒకటి, ఏప్రిల్ 24న మరొకటీ మీటూ ఎన్నికలు జరగబోతున్నాయి. టిమ్ మర్ఫీ అనే ఆయన తన వివాహేతర ప్రియసఖికి.. ‘అబార్షన్ చేయించుకో’ అని మెజేస్ ఇచ్చినందుకు, ట్రెంట్ ఫ్రాంక్స్ అనే ఆయన తన బిడ్డలకు అద్దెతల్లులుగా ఉండమని తన మహిళా సిబ్బందిని కోరినందుకు ఈ రెండు ఎన్నికలూ అవసరమయ్యాయి. ‘మీటూ’ ధర్మాగ్రహానికి మగవాడి దురహంకార సౌధాలు ఒకటొకటిగా బీటలు వారుతున్నాయి! దాగి ఉన్న బొద్దింకలను కూడా బయటికి రప్పించి, మట్టుపెట్టే ‘స్ప్రే’లా, ఈ స్త్రీల ఉద్యమమైన ‘మీటూ’.. ఒక్కొక్క పెద్దమనిషి నిజ స్వరూపాన్నీ రచ్చకీడుస్తోంది. సాటి మహిళలకు ఆత్మస్థయిర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటివరకు చిత్రపరిశ్రమలో ఉన్న లైంగిక హింసోన్మాదులపైనే జరుగుతున్న ‘మీటూ’ పోరాటం క్రమంగా పాలనా భవనాలలోకి సైతం ధైర్యంగా చొరబడి, కామ పిశాచాలైన ప్రజాప్రతినిధులను సీట్లలోంచి లాగి అవతల పడేస్తోంది! దాంతో ఇప్పుడు యు.ఎస్.లో తరచూ ఎన్నికలు జరగడం మామూలైపోయింది. లైంగిక వేధింపులకు పాల్పడిన సెనెటర్లు రాజీనామాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడడంతో వారి స్థానాలలో కొత్తవారిని ఎన్నుకునేందుకు దాదాపు ప్రతినెలా ఒక పోలింగ్ జరుగుతోంది! ఓక్లహోమాలో ఆ రాష్ట్ర సెనెటర్ (ఎగువసభ సభ్యుడు) తనను ముద్దుపెట్టుకోడానికి ప్రయత్నించినట్లు ఊబర్ మహిళా డ్రైవర్ ఒకరు ఆరోపించడంలో తాజాగా ఆయన పదవి గండంలో పడింది. కాలిఫోర్నియాలో ఆ రాష్ట్ర అసెంబ్లీమ్యాన్ (దిగువసభ సభ్యుడు), పాలనా విభాగాలలో పని నిమిత్తం వచ్చిన ఒక మహిళా లాబీయిస్టును ఆమె రెస్టురూమ్ వరకు వెంబడించి, ఆమె ఎదురుగానే స్వీయస్ఖలన చర్యకు పాల్పడడంతో అతడి సీటు కూడా ఖాళీ అయింది. మిన్నెసోటా రాష్ట్రంలో మరో లాబీయిస్టు.. ఒక ప్రజాప్రతినిధి తనను లైంగికంగా లోబరుచుకునేందుకు నిరంతరం తనపై ఒత్తిడి తెచ్చాడని, ఒక టెక్స్›్ట మెసేజ్ కూడా ఇచ్చాడని బయటపెట్టడంతో ఆయన స్థానంలోకి కొత్త వ్యక్తి అవసరమయ్యాడు! అతడు పంపిన మేసేజ్ సారాంశం ఇది: ‘‘ఏకాంతవేళ ఖరీదైన మద్యాన్ని స్వల్పంగా సేవించి, రుచికరమైన ఆహారాన్ని భుజించి, భోజనానికి ముందరో... తర్వాతో మైమరిపించే శయన మందిర సుఖాన్ని పొందాలని ఉందని నేను నీతో అంటే కనుక.. అది నిన్ను వణికించే విషయం అవుతుందా?’’ ఈ టెక్స్›్టని తీసుకెళ్లి ఆ లాబీయిస్టు నేరుగా స్టేట్ సెనెట్‌కు ఫిర్యాదు చేయడంతో నియోజకవర్గంలో ఆయనకు నూకలు చెల్లాయి.! ఇటీవలి కాలంలో ఇలా పన్నెండు మందివరకు స్టేట్ సెనెటర్లు, ఫెడరల్ సభ్యులు (కేంద్రంలో ఎగువ, దిగువ సభలైన ‘సెనెట్’, ‘హౌస్’ సభ్యులు) లైంగిక ఆరోపణలు ఎదుర్కొని, రాజీనామా చెయ్యడంతో ఆ స్థానాలను భర్తీ చెయ్యడం కోసం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి అమెరికన్ ప్రజలు ‘మీటూ ఎన్నికలు’గా నామకరణం చేశారు! -
అదృశ్యనౌక
మిస్టరీ * ఎప్పుడో మునిగిపోయిన ఓడ * ఇప్పుడెలా కనిపిస్తోంది? * ఎందుకు భయపెడుతోంది? నార్వే... 16వ శతాబ్దం... ‘‘హాయ్ డియర్... ఏం చేస్తున్నావ్? లంచ్ రెడీయా?’’... ఇంట్లో అడుగు పెడుతూనే భార్యను పలకరించాడు ఫ్రాంక్. ఎలిన్ మాట్లాడలేదు. సోఫాలో అలానే కూర్చుని ఉంది. ఎటో చూస్తోంది. ఆ కళ్లలో ఏదో భయం. నుదుటి మీద ఉన్న స్వేద బిందువుల్ని చూస్తుంటే ఆమె దేనికో భయపడుతోందని అర్థమవుతోంది. భార్యనాస్థితిలో చూసి కంగారు పడ్డాడు ఫ్రాంక్. గబగబా ఆమె దగ్గరకు వెళ్లాడు. ‘‘ఏంటి ఎలిన్... ఏమైంది? ఎందుకలా ఉన్నావ్? ఎందుకలా భయంగా చూస్తున్నావ్?’’ అన్నాడు పక్కనే కూర్చుంటూ. అప్పుడు కూడా ఎలిన్ మాట్లాడలేదు. మెల్లిగా తలతిప్పి భర్తవైపు చూసింది. మరుక్షణంలో ‘ఫ్రాంక్’ అంటూ అతడి గుండెలపై వాలిపోయి బావురుమంది. విస్తుపోయాడు ఫ్రాంక్. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఎలిన్ ఎందుకలా ఏడుస్తోందో తెలియక తికమకపడ్డాడు. ‘‘ఏమైంది డియర్? ఎవరికైనా ఏమైనా అయ్యిందా? ఏదైనా దుర్వార్త విన్నావా? మీ ఇంట్లోవాళ్లంతా బాగానే ఉన్నారా?’’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల్ని కురిపించాడు భార్యను గట్టిగా హత్తుకుంటూ. అతని ప్రశ్నలు పూర్తయ్యేసరికి కాస్త నెమ్మదించింది ఎలిన్. అందరూ బాగానే ఉన్నారన్నట్టు త లూపుతూనే తన చేతిలో ఉన్న ఉత్తరాన్ని భర్తకు చూపించింది ఎలిన్. దాన్ని అందుకుని చదవడం మొదలుపెట్టాడు ఫ్రాంక్. ‘‘డియర్ ఎలిన్... ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు పదే పదే గుర్తొస్తున్నావు. నిన్ను చూసి చాలా రోజులయ్యింది కదా! అందుకేనేమో... ఒక్కసారి కళ్లారా చూడాలని మనసు తహతహలాడుతోంది. వీలు చూసుకుని వస్తాను. ఫ్రాంక్‌ని అడిగానని చెప్పు. టేక్ కేర్ తల్లీ.... ఇట్లు మీ నాన్న ఎరిక్.’’ ఉత్తరం చదువుతూనే కొయ్యబారిపోయాడు ఫ్రాంక్. ‘‘ఏంటి ఎలినా ఈ ఉత్తరం?’’ అన్నాడు వణుకుతున్న స్వరంతో. ‘‘నాకూ అదే అర్థం కావడం లేదు ఫ్రాంక్. నాన్న ఏమిటి? ఉత్తరం రాయడం ఏమిటి? పోనీ పాత ఉత్తరమేదైనా ఇప్పుడు వచ్చిందా అంటే అదీ లేదు. కవర్ కొత్తగా ఉంది. ఇదెలా సాధ్యం?’’ ఫ్రాంక్ ఆలోచనలో పడ్డాడు. ఎందుకో అతడికీ భయంగానే ఉంది. ఆ ఉత్తరాన్ని చూసేకొద్దీ అతడికి వణుకు పుడుతోంది. అందుకే ఆ విషయాన్ని తేలిగ్గా తీసి పారేయబుద్ధి కాలేదు. వెంటనే లేచి నిలబడ్డాడు. ఎలినాని తీసుకుని పోలీస్ స్టేషన్‌కి బయలుదేరాడు. ‘‘ఒక ఉత్తరాన్ని చూసి ఇంత భయపడుతున్నారేంటి మీరు? ఏం... మీ నాన్నగారు ఉత్తరం రాయకూడదా?’’ ఇన్స్పెక్టర్ ప్రశ్నకి ముఖముఖాలు చూసుకున్నారు ఫ్రాంక్, ఎలినా. ‘‘రాయకూడదని, రాయరని కాదు సర్. రాయడానికి అసలు ఆయన లేరు. ఎప్పుడో చనిపోయారు.’’ ఈసారి ఇన్స్పెక్టర్ ఉలిక్కిపడ్డాడు. ‘‘ఏమంటున్నారు?’’ అన్నాడు చురుక్కున. ‘‘నిజం సర్. మా నాన్నగారు చనిపోయారు. అది కూడా ఇప్పుడు కాదు. ఎనభయ్యేళ్ల పైనే అయ్యింది. 1600 సంవత్సరంలో ఆయన ప్రయాణిస్తోన్న ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఒక్కరు కూడా మిగల్లేదు. మరి ఇప్పుడు ఆయన ఉత్తరం ఎలా రాస్తారు సర్?’’ ఎలినా చెప్పిన మాటలు వింటే చాలా విచిత్రంగా అనిపించింది ఇన్స్పెక్టర్కి. చనిపోయిన మనిషి ఉత్తరం ఎలా రాస్తాడు అన్న ఆలోచన అతని ఖాకీ గుండెని సైతం కాస్త కంగారు పెట్టింది. ‘‘ఒకవేళ ఆయన అప్పుడు చనిపోలేదేమో. తప్పించుకుని బయటపడ్డారేమో. ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఉత్తరం రాశారేమో’’ అన్నాడు లాజికల్‌గా ఆలోచిస్తూ. ‘‘ఆ ప్రమాదం జరిగేనాటికే ఆయనకు అరవయ్యేళ్లు దగ్గర పడ్డాయి. మరి ఇన్నేళ్లు ఆయన ఉండి ఉంటారంటారా? ఒకవేళ రాసినా ఉత్తరంలో ఆ విషయాలన్నీ రాస్తారు. కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ రాస్తారు. అవేమీ లేవే! కనీసం స్టాంపులు అంటించలేదు. పోస్టల్ ముద్ర కూడా లేదు.’’ ఫ్రాంక్ మాటలు విన్న తర్వాత ఇక మాట్లాడలేకపోయాడు ఇన్స్పెక్టర్. అతనికి ఏం చేయాలో తోచలేదు. ఉత్తరాన్ని అటూ ఇటూ తిప్పి చూశాడు. ఒకటికి రెండుసార్లు చదివి చూశాడు. ఏమీ తట్టలేదు. ఆ దంపతులిద్దరికీ ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ‘‘నేను ఎంక్వయిరీ చేస్తాను. మీరు వెళ్లండి’’ అని పంపించేశాడు. ఆ తర్వాత కూడా చాలాసేపు జుత్తు పీక్కున్నాడు ఇన్స్పెక్టర్. ఆ ఉత్తరం గురించి ఎంక్వయిరీ చేయడానికి కూడా ప్రయత్నించాడు. కానీ ఎంత వెతికినా ఏ ఒక్క ఆధారమూ దొరకలేదు. దొరకదన్న విషయం అతనికి తెలియదు. ఎందుకంటే ఎలిన్ తండ్రి చనిపోయింది ‘ఫ్లయింగ్ డచ్‌మ్యాన్ షిప్’ ప్రమాదంలో. ఆ ఓడ ఒక మిస్టరీ. ఆ ఓడకు జరిగిన ప్రమాదం ఒక మిస్టరీ. దానికి సంబంధించిన ప్రతి విషయమూ ఒక మిస్టరీ. ఆ సంగతి ఇన్స్పెక్టర్కి తెలియదు పాపం. తెలిసి ఉంటే అతడు అంత కష్టపడేవాడు కూడా కాదు. అసలింతకీ ‘ఫ్లయింగ్ డచ్‌మ్యాన్’ కథ ఏంటి? ఫ్లయింగ్ డచ్‌మ్యాన్... ఓ అందమైన ఓడ. 1600 సంవత్సరంలో ఓ రోజు అట్లాంటిక్ సముద్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కెప్టెన్ డెకెన్తో పాటు, కొందరు సిబ్బంది, కొందరు ప్రయాణీకులతో హుందాగా జలాలపై నడిచింది. కానీ ఆ ప్రయాణమే దాని ఆఖరు ప్రయాణమవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఓడ సముద్రం మధ్యలో సాగుతున్నప్పుడు హఠాత్తుగా తుపాను రేగింది. అలలు ఉవ్వెత్తున ఎగశాయి. ఓడను నిలువునా కుదిపేశాయి. తమ బలంతో దాన్ని ముక్కలు చేసేశాయి. వందలాది మందిని నీట ముంచేశాయి. వారి ప్రాణాలను గాలిలో కలిపేశాయి. అయితే కథ అక్కడితో ముగిసి పోలేదు. అక్కడే మొదలైంది. ఆ ఓడ కానీ, దాని శిథిలాలు కానీ ఎవరికీ దొరకలేదు. మృతదేహాలూ దొరకలేదు. కానీ కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత ఆ ఓడ, ఆ మనుషులు అందరినీ వెంటాడసాగారు. సిబ్బంది కుటుంబ సభ్యుల్లో కొందరికి వారి నుంచి ఉత్తరాలు వచ్చాయి. అది కూడా చాలా యేళ్లు గడిచిపోయాక. చని పోయినవాళ్లు ఉత్తరాలు ఎలా రాశారో ఎవరికీ అర్థం కాలేదు. ఆరా తీస్తే ఆ ఉత్తరాలు ఎక్కడ్నుంచి వచ్చాయో కూడా ఎవరికీ అర్థమయ్యేది కాదు. అదే భయానకమైన అనుభవం అంటే... అట్లాంటిక్ సముద్రంలో... ఓడ ప్రమాదానికి గురైన చోట చిత్ర విచిత్రాలు జరగడం మొదలయ్యింది. ఓడలు, పడవలు ఆ దారి గుండా వెళ్తునప్పుడు ఉన్నట్టుండి ఎదురుగా ‘ఫ్లయింగ్ డచ్‌మ్యాన్’ ప్రత్యక్షమయ్యేది. వేగంగా దూసుకొచ్చేది. అది తమ ఓడను గుద్దేస్తుందేమోనని కెప్టెన్లు కంగారు పడేవారు. కానీ అలా జరిగేది కాదు. కొన్నిసార్లు ఆ ఓడ గాలిలోకి కూడా లేచేదట. అది మాత్రమే కాక కెప్టెన్ డెకెన్ కూడా చాలామందికి కనిపించేవాడు. నీళ్లమీద నడిచేవాడు. గాలిలో ఎగిరేవాడు. ఒక్కోసారి పడవల్లో, ఓడల్లో కూడా ప్రత్యక్షమయ్యేవాడు. దాంతో అందరూ హడలిపోయేవారు. కానీ అదృష్టం ఏమిటంటే... ఎవరికీ ఏ ప్రమాదమూ సంభవించలేదు. డెకెన్ ఆత్మ కూడా ఎవరినీ ఇబ్బంది పెట్టేది కాదు. మొదట్లో వీటిని అందరూ భ్రమ అని కొట్టి పారేశారు. కానీ ఓడల్లో ప్రయాణిస్తు న్నప్పుడు కొందరు ప్రముఖులకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదరవడంతో విస్తృతంగా ప్రచారం జరిగింది. దాంతో పరిశోధనలు మొదలయ్యాయి. నిజ నిర్ధారణ చేసేందుకు బృందాలు బయలుదేరాయి. చివరికి వారిలో కూడా కొందరు ఆ దెయ్యపు ఓడని, డెకెన్ ఆత్మని చూసి జడుసుకున్నారు. దాంతో ఆ దారిలో వెళ్లాలంటేనే భయపడసాగారు. దెయ్యాలనీ భూతాలనీ నమ్మనివారు మాత్రం అదంతా వట్టి పుకారు అని కొట్టి పారేశారు. ఇలాంటి మిస్టరీల విషయంలో ఎప్పుడూ రెండు వాదనలు వినిపిస్తాయి. నిజమనే వారితో పాటు భ్రమ అనే వర్గం కూడా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం. ఒక్కసారి భయం మొదలయ్యాక దాన్ని తీసేయడం అంత తేలిక కాదు. అందుకే దెయ్యం అన్న మాట ఈ ఆధునిక యుగంలో కూడా ఎంతో మందిని వణికి స్తోంది. ఫ్లయింగ్ డచ్ మ్యాన్ ఉదంతం పుస్తకాలుగా, సినిమాలుగా మాటిమాటికీ ముందుకొచ్చి భయపెడుతూనే ఉంది. ఫ్లయింగ్ డచ్మ్యాన్ని ఘోస్ట్ షిప్, ఫాంటమ్ షిప్ అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. దీని గురించి అనేక రకాల వాదనలు ఉన్నాయి. సముద్రగర్భంలో ఓడ శిథిలాలు కనిపించలేదు. ఒక్కటంటే ఒక్క మృతదేహం కానీ, అవశేషాలు కానీ కనిపించలేదు. నేవీ రికార్డుల్లో కూడా ఫ్లయింగ్ డచ్‌మ్యాన్ గురించి సరైన ఆధారాలు లభించకపోవడంతో అసలు అలాంటి ఓడే లేదు అన్నారు కొందరు. ఒకవేళ అదే నిజమైతే మరి ఆ సిబ్బంది సంగతేంటి? వాళ్లందరూ ఓడలో వెళ్లారని వాళ్ల కుటుంబ సభ్యులు చెప్పారు. పైగా వాళ్లెవరూ ఎప్పుడూ ఇళ్లకు తిరిగా రాలేదు కూడాను. మరి అంతా అబద్ధమని, ఈ ఉదంతాన్ని భ్రమ అని ఎలా కొట్టి పారేయగలం?! ఈ ప్రశ్న దగ్గరే ప్రతిసారీ బ్రేక్ పడసాగింది. దాంతో ఈ ఓడ ఉదంతం నేటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.