ప్రాంక్‌ చేసి నవ్విద్దాం అనుకుంటే..అదే చివరి నవ్వు అయిపాయే..! | Man's Superglue Prank Goes Wrong Seals His Lips Goes Viral | Sakshi
Sakshi News home page

ప్రాంక్‌ చేసి నవ్విద్దాం అనుకుంటే..అదే చివరి నవ్వు అయిపాయే..!

Published Tue, Jan 21 2025 5:14 PM | Last Updated on Tue, Jan 21 2025 5:26 PM

Man's Superglue Prank Goes Wrong Seals His Lips Goes Viral

సోషల్‌ మీడియ స్టార్‌డమ్‌ కోసం ఎలా పడితే అలా వీడియోలు చేసేస్తున్నారు. అసలు ఇది కరెక్టేనా సురక్షితంగానే చేస్తున్నామా అని కూడా ఆలోచించటం లేదు. వీడియో పోస్ట్‌ చేశామా..? వ్యూస్‌ వచ్చాయా..?, ఫాలోవర్స్‌ ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం. ఇంకేమీ చూడటం లేదు. ఎలాంటిదైనా చేయడానికి రెడీ. ముఖ్యంగా ప్రాంక్‌ వీడియోలు మరింత ప్రమాదరకంగా మారాయి. 

అవతల వాడిని తక్కువ చేయడం లేదా వెధవిని చేస్తే పకాలించి నవ్వడం అనేదే ధ్యాసగా చేసేస్తున్నారు. ఇలాంటివి ఒక్కోసారి ప్రమాదాల తోపాటు శత్రుత్వాన్ని తెచ్చిపెడతాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇలానే ఓ వ్యక్తి సరదాగా నవ్విద్దామని చేసిన ఫ్రాంక్‌ కాస్తా చిరునవ్వునే లాక్‌ చేసేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

ఆ వీడియోలో ఓ వ్యక్తి షాపు ముందు హాయిగా కూర్చొని ఓ పవర్‌ఫుల్‌ గమ్‌(Superglue)ని తీసుకుని పెదాలపై వేసుకుంటాడు. ఆ తర్వాత వీడియో(Viral Video)లో చూడండి అన్నట్లుగా పెదాలను(Lips) దగ్గరకు చేసి ఉంచుతాడు. అవి లాక్‌ అవుతాయా లేదా టెస్ట్‌ చేద్దామనుకున్నాడు. కానీ నిజంగానే అతుక్కుపోవడంతో ఏం జరుగుతుందో అర్థ కాలేదు ఆ వ్యక్తికి. 

పాపం ఆ వ్యక్తి ఏమో హే..అతుక్కోలేదని ఎగిరి గంతేసి చెప్పి నవ్విద్దామనుకుంటే రివర్స్‌ అయిపోయింది. తనకు చిరునవ్వే లేకుండా చేస్తుందని అనుకోలేదు. పాపం పెదాలను ఎలా విడిపించాలో తెలియక ఏడ్చేశాడు. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఎలాంటివి చేస్తే మంచిది అనేది తెలియదా అని ఒకరూ, మంచి గుణపాఠం నేర్చుకున్నాడు. మళ్లీ చేయడు ఇలాంటివి అంటూ కామెంట్‌లు చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబ వృక్షం: తల్లిదండ్రులు వలసదారులు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement