glue
-
కేజ్రీవాల్ సతీమణిపై ‘ఆప్’ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఒక గ్లూ(జిగురు) అని మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) చీలకుండా కలిపి ఉంచుతున్నారని కొనియాడారు. ‘సునీతా కేజ్రీవాల్ పార్టీలో బాధ్యతలు తీసుకుంటే పార్టీని ఆమె జిగురులాగా కలిపి ఉంచుతారు. ఆప్‌ను ఇక ఎవరూ ఏం చేయలేరు. ఆమె కుటుంబ సభ్యురాలు కావడం వల్ల సీఎం కేజ్రీవాల్‌ను ఆమె జైలులో రోజు కలిసే చాన్స్ ఉంది. దీంతో ఢిల్లీ సమస్యలను ఆమె కేజ్రీవాల్ దృష్టికి తీసుకెళుతున్నారు. కేజ్రీవాల్ ఆదేశాలను పార్టీ సభ్యులకు తెలియజేస్తున్నారు. ఆప్ కార్యకర్తలకు అరవింద్ కేజ్రీవాల్‌తో ఉన్న బంధం వల్ల వారంతా సునీతా కేజ్రీవాల్ పట్ల సానుభూతితో పనిచేస్తున్నారు’అని భరద్వాజ్ అన్నారు. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో మార్చ్22న అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయినప్పటి నుంచి ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇండియా కూటమి ర్యాలీలోనూ ఆమె పాల్గొన్నారు. ఎన్నోసార్లు మీడియా సమావేశాల్లో మాట్లాడారు. కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 దాకా కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇదీ చదవండి.. ఎన్ఏఐ బృందంపై దాడిని సమర్థించిన ‘దీదీ’ -
ఐ డ్రాప్స్ స్థానంలో జిగురు.. యువతి విలవిల!
చాలాసార్లు తెలిసీతెలియక చేసే చిన్నపాటి పొరపాట్లు జీవిత పాఠాలను నేర్పుతాయి. ఇలాంటి పొరపాటు కారణంగా ఇటీవల ఒక మహిళ చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆమె పొరపాటున కంటి చుక్కలకు బదులు గాఢమైన జిగురు(సూపర్ గ్లూ)ను కంటిలో వేసుకుంది. ఆ తరువాత ఆమె పడరానిపాట్లు పడింది. కాలిఫోర్నియాలోని శాంటా రోసాకు చెందిన ఆ బాధిత మహిళ పేరు జెన్నిఫర్ ఎవర్సోల్. ఆ మహిళ తన కళ్లు బిగుసుకుపోయాయంటూ ఆసుపత్రికి చేరుకోగా, ఆమె పరిస్థితిని చూసిన వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. తొలుత ఆమె కళ్లు తెరుచుకునేందుకు మందు వేసినా ఫలితం లేకపోయింది. చివరికి వైద్యులు ఆమె కనురెప్పలను తొలగించి, ఆమెకు ఉపశమనం కల్పించారు. ఆమె కనురెప్పలు జిగురు కారణంగా పూర్తిగా అతుక్కుపోవడం వల్లే ఆమె కళ్లు మూసుకుపోయాయని తెలుస్తోంది. బాధితురాలు తన కళ్లు తీవ్రంగా మండుతున్నప్పుడు తాను పొరపాటు చేశానని గ్రహించింది. ఈ ఉదంతం గురించి ఆమెకు చికిత్స అందించిన వైద్యుడు మాట్లాడుతూ ఇలాంటి కేసును తన జీవితంలో తొలిసారి చూశానని అన్నారు. కాగా ఆ మహిళ తాను చేసిన చిన్న పొరపాటుకు కనురెప్పలు కోల్పోవాల్సి వచ్చింది. ఇది కూడా చదవండి: తుపాను సమయంలో ఫోన్ వాడకూడదా? దీనిలో నిజమెంత? -
షూస్ కొనే స్థోమత లేదు సాయం చేయండి: క్రికెటర్ ఆవేదన
''మేము చాలా దయనీయ స్థితిలో ఉన్నాం.. సిరీస్ ముగిసిన ప్రతీసారి విరిగిపోయిన మా షూస్‌కు గ్లూ రాసుకొని వాటిని కాసేపు ఎండబెడుతున్నాం.. ఆ తర్వాతి మ్యాచ్‌లకు మళ్లీ అవే షూతో సిద్ధమవుతున్నాం. ఇలా కొన్ని నెలలు పాటు చేస్తూనే ఉన్నాం. కనీసం షూ కొనే స్థోమత కూడా లేదు... ఎవరైనా స్పాన్సర్ ఉంటే సాయం చేయండి.. అప్పుడు మా షూస్‌కు గ్లూ పెట్టే అవసరం రాదు.'' ఇది జింబాబ్వే క్రికెటర్ ర్యాన్ బర్ల్ ఆవేదన. ఈ ఒక్క అంశం చాలు జింబాబ్వే క్రికెట్ బోర్డు ఎంత దయనీయ స్థితిలో ఉందో చెప్పడానికి. అయితే ర్యాన్ బర్ల్ పోస్టుకు స్పందించిన స్పోర్ట్స్ కంపెనీ పూమా షూస్.. అతనితో ఒప్పందం చేసుకోవడమే గాక జింబాబ్వే ఆటగాళ్లకు షూస్‌ను గిఫ్ట్‌గా పంపి తన ఉదారతను చాటుకుంది. ర్యాన్ బర్ల్ కన్నీటిపర్యంతమవుతూ పెట్టిన పోస్ట్ సగటు క్రికెట్ అభిమానులను కదిలిచింది. దీన స్థితిలో ఉన్న జింబాబ్వే క్రికెటర్లకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.'' బీసీసీఐ, ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా మీకు ఒక విజ్ఞప్తి.. దయచేసి జింబాబ్వేతో సిరీస్‌లు ఉంటే పోస్ట్‌పోన్ చేయకండి. ఇప్పుడు వారితో క్రికెట్ ఆడితే వచ్చే డబ్బు వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కచ్చితంగా జింబాబ్వే మంచి టీమ్.. కానీ అక్కడి కుళ్లు రాజకీయాలు క్రికెట్‌ను భ్రష్టు పట్టిస్తున్నాయి.జింబాబ్వేతో సిరీస్‌లు ఆడుతూ వారికి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది.'' ఒక అభిమాని ఆవేదన చెందాడు. ''జింబాబ్వే ఆటగాళ్ల పరిస్థితి చూసి బాధేస్తోంది. క్రికెట్లో కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యం అవసరం పడుతుందేమో. జెంటిల్మెన్ ఆటగా పిలుచుకునే క్రికెట్లో ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా చూడాలి. దయనీయ స్థితిలో ఉన్న జింబాబ్వే క్రికెటర్లను ఆదుకోవాలి'' అంటూ మరొకరు కామెంట్ చేశారు. ర్యాన్ బర్ల్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. మరి ఐసీసీతో పాటు బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్ బోర్డులు బర్ల్ పోస్టుకు స్పందిస్తాయేమో చూడాలి.జింబాబ్వే తరపున 2017లో అరంగేట్రం చేసిన ర్యాన్ బర్ల్ 3 టెస్టుల్లో 24 పరుగులు, 18 వన్డేల్లో 243 పరుగులతో పాటు 7 వికెట్లు, 25 టీ20ల్లో 393 పరుగులతో పాటు 11 వికెట్లు తీశాడు. ఇక ప్రపంచ దేశాల్లో పేదరికంతో అలమటిస్తున్న దేశాల్లో జింబాబ్వే ఒకటి. నల్లజాతీయులు అనే వివక్ష వారిని మరింత వెనక్కి నెట్టేసింది. దశాబ్దాలకు పైగా వారు కనీసం ఏ క్రీడల్లో కూడా ఆడేందుకు అనుమతించలేదు. అలాంటిది కాస్త కూస్తో జింబాబ్వేకు పేరు వచ్చింది క్రికెట్ ద్వారానే అని చెప్పొచ్చు. రెండు దశాబ్దాల కిందటి వరకు జింబాబ్వే జట్టులో కాస్త పేరున్న ఆటగాళ్లు ఎక్కువగా కనిపించేవారు. హిత్ స్ట్రీక్, ఆండీ ప్లవర్, గ్రాంట్ ఫ్లవర్,హెన్రీ ఒలాంగా, తైబూ, స్టువర్ట్ క్యాంప్‌బెల్ లాంటి ఆటగాళ్లు ఉండేవారు. వీరు ఉన్నంతకాలం జింబాబ్వే ఆటతీరు కాస్త మెరుగ్గానే ఉండేది. బలహీన జట్టుగా కనిపించినా.. కాస్త పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించేది. వీళ్లంతా రిటైర్ అయ్యాకా జింబాబ్వే ఆటతీరు మరింత తీసికట్టుగా తయారైంది. బంగ్లాదేశ్, ఐర్లాండ్, అప్ఘనిస్తాన్‌ల కంటే ఎంతో ముందు అంతర్జాతీయ క్రికెటలోకి వచ్చిన జింబాబ్వే వారి చేతిలో కూడా పరాజయం పాలై అనామక జట్టుగా తయారైంది. దీనికి తోడూ క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టడంతో 2019 జూలైలో ఐసీసీ జింబాబ్వేను ఆట నుంచి బహిష్కరించింది. దీంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. ఎంతలా అంటే కనీసం జింబాబ్వే క్రికెట్ బోర్డు వారి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు కూడా చెల్లించలేకపోయింది. ఆ తర్వాత 2019 అక్టోబర్‌లో ఐసీసీ జింబాబ్వేపై ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. తాజాగా పాకిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటించింది. రెండు టెస్టుల సిరీస్‌ను పాక్ 2-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. తర్వాత జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో గెలిచిన జింబాబ్వే మిగతా రెండు ఓడిపోయి 2-1 తేడాతో సిరీస్‌ను పాక్‌కు అప్పగించింది. చదవండి: ఈ వ్యక్తిని అందుకోవడం కష్టంగా ఉంది : వార్నర్ నెలరోజులు గది నుంచి బయటికి రాలేకపోయా: పృథ్వీ షా Any chance we can get a sponsor so we don’t have to glue our shoes back after every series 😢 @newbalance @NewBalance_SA @NBCricket @ICAssociation pic.twitter.com/HH1hxzPC0m — Ryan Burl (@ryanburl3) May 22, 2021 Such a sad state of affairs concerning Zimbabwe cricket. Democratization of Cricket is necessary. We can't allow the beautiful game of cricket to continue like the Super League in football. — Satrajeet Sen (@Sen_Satrajeet) May 23, 2021 @BCCI @ECB_cricket @CricketAus Please do not keep postponing your tours with Zim. It brings them much needed experience and money, with all the viewers watching. Zim sure had a great team, but even the current team has splendid potential. Let's not ignore them — Niranjan Jha (@njanjha17) May 22, 2021 -
ఐడ్రాప్స్ అనుకుని కంట్లో జిగురు వేసుకుంది..
వాషింగ్టన్: తొందరపాటుతో అప్పుడప్పుడు మనం చేసే పనులకు జీవితకాలం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. తాజాగా అమెరికాకు చెందిన ఓ మహిళకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఐ డ్రాప్స్ అనుకుని పొరపాటుగా కంట్లో జిగురు వేసుకుంది. శాశ్వతంగా చూపు కోల్పోయే పరిస్థితి కానీ అదృష్టం కొద్ది ఆ ప్రమాదం నుంచి బయటపడగలిగింది. ఆ వివరాలు.. మిచిగన్‌కు చెందిన యాసిడ్రా విలియమ్స్ కాంటక్ట్ లెన్స్ వినియోగిస్తుంది. ప్రతి రోజు రాత్రి నిద్ర పోయే ముందు వాటిని తొలగించి.. పడుకుంటుంది. అయితే పది రోజుల క్రితం ఆమె కాంటాక్ట్ లెన్స్ తీయకుండానే నిద్ర పోయింది. దాంతో అర్థరాత్రి సమయంలో కళ్లలో మంటగా అనిపించింది. దాంతో తన హ్యాండ్బాగ్లో ఉండే ఐడ్రాప్ బాటిల్ తీసుకుందామని దానిలో చేయి పెట్టింది. చేతికి దొరికిన డబ్బా తీసుకుని.. కంట్లో రెండు చుక్కలు వేసుకుంది. అయితే ఐడ్రాప్స్ వేసుకున్న తర్వాత విశ్రాంతిగా ఉండాల్సింది పోయి.. ఆమె కళ్లలో దురద, మంట పెరగసాగాయి. దాంతో ఆమె కళ్లు మూసుకుని వాటిని రుద్దసాగింది. ఆ తర్వాత చల్లని నీటితో కంటిని శుభ్రం చేసుకుందామని భావించి కళ్లు తెరవడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. అప్పుడు కానీ ఆమెకు తాను చేసిన తప్పిదం తెలియలేదు. సాధారణంగా యాసిడ్రా విలియమ్స్ తన హ్యాండ్ బాగ్‌లో ఐడ్రాప్స్ బాటిల్‌తో పాటు నెయిల్ గ్లూ(గోళ్లు విరిగితే అతుకుపెట్టుకోవడానికి వాడతారు) డబ్బాలను రెండింటిని తనతో తీసుకెళ్తుంది. ఇవి రెండు ఒకే పరిమాణంలో ఉంటాయి. దాంతో ఆమె కళ్లు దురద అనిపించిన వెంటనే హ్యాండ్‌బ్యాగ్‌లో చేయి పెట్టి చేతికి దొరికిన డబ్బా తీసుకుంది. లైట్ వేసి అదేంటో చెక్ చేయలేదు. అలా పొరపాటున ఐ డ్రాప్స్‌కు బదులుగా నెయిల్ గ్లూ కళ్లలో వేసుకుంది. ఇక యాసిడ్రా విలియమ్స్ అరుపులు విన్న కుటుంబ సభ్యులు వెంటనే పరిగెత్తుకు వచ్చి.. విషయం తెలుసుకుని ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేశారు. వైద్యులు ఆమె కళ్లకు శస్త్ర చికిత్స చేసి.. కంట్లో పడిన గ్లూ శుభ్రం చేశారు. అతుక్కుపోయిన కాంటాక్ట్లెన్స్ని తీశారు. వీటి వల్లనే ఆమె చూపు కోల్పోకుండా బయటపడగలిగిందని తెలిపారు. కాకపోతే కనురెప్పలను పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. చదవండి: బెడిసికొట్టిన ప్లాన్.. ప్లీజ్ మీరు ఇలా చేయకండి! -
ఆమెను నమ్మలేదు.. ఘోరంగా ఫేయిల్ అయ్యాడు!
వాషింగ్టన్ : తన జుట్టును అందంగా తీర్చిదిద్దటానికి గోరిల్లా గ్లూ వాడి ఆసుపత్రిపాలైన లూసియానా యువతి టెస్సికా బ్రౌన్ విషాద కథ సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఎంతలా అంటే దాన్ని చదివి నమ్మని ఓ వ్యక్తి తన మీద గోరిల్లా గ్లూ ప్రయోగించుకునేంత... ఆసుపత్రిపాలయ్యేంత. వివరాల్లోకి వెళితే.. లూసియానాకు చెందిన లెన్ మార్టిన్ అనే ర్యాపర్ కొద్దిరోజుల క్రితం టెస్సికా బ్రౌన్ విషాద కథను ఇంటర్నెట్లో చదివాడు. అయితే ఆ కథను అతడు నమ్మలేదు. ఫేక్ అని కొట్టిపారేశాడు. గోరిల్లా గ్లూ శక్తి ఎంటో నిరూపించటానికి తనపైనే ప్రయోగానికి పూనుకున్నాడు. ( బెడిసికొట్టిన ప్లాన్.. ప్లీజ్ మీరు ఇలా చేయకండి! ) ఓ ప్లాస్టిక్ కప్పుకు గ్లూ అంటించి దాన్ని మూతికి అతికించుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత దాన్ని తీస్తున్నారాలేదు. తీవ్రంగా ప్రయత్నించి విఫలమై ఆసుపత్రి మెట్లెక్కాడు. అతి కష్టం మీద దాన్ని తొలిగించారు వైద్యులు. ఈ నేపథ్యంలో అతడి పెదాలపై గాయం అయింది. ఆ గాయం కనుక మానకపోతే సర్జరీ ద్వారా గాయం అయిన భాగాన్ని తొలిగించాల్సి వస్తుందని వైద్యులు సూచించారు. View this post on Instagram A post shared by Len Martin (@lenise_martin3) -
బెడిసికొట్టిన ప్లాన్.. ప్లీజ్ మీరు ఇలా చేయకండి!
అందం అమ్మాయిల హక్కుగా ఫీల్ అవుతుంటారు. తయారవడం కోసం ఎన్ని గంటలైనా వెచ్చిస్తారు. అందంగా కనిపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అమ్మాయిలు ఎక్కువగా కేర్ తీసుకునే అంశాల్లో ముఖం తరువాతి స్థానం జుట్టుకే. పొడవైన, మృదువైన కురులంటే ఇష్టపడని వారంటూ ఉండరు. జుట్టు అందంగా, స్టైల్‌గా ఉండేందుకు చాలా మంది వివిధ రకాల క్రీమ్‌లు, స్ప్రేలు వాడుతుంటారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ యువతి వినూత్నంగా ఉంటుందని జుట్టుకు గ్లూ(జిగురు, గమ్) స్ప్రే వాడి ఇబ్బందుల్లో పడింది. లూజియానా రాష్ట్రానికి చెందిన టెస్సికా బ్రౌన్ అనే యువతి హెయిర్ స్ప్రే అయిపోయిందని గొరిల్లా గ్లూ అనే స్ప్రేను తన జట్టుకు రాసుకుంది. ఈ స్ప్రే తన జుట్టుకు వాడిన వెంటనే జుట్టు మొత్తం గ్లూ కారణంగా అతుక్కుపోయింది. తన జుట్టును తిరిగి సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ జుట్టు మాత్రం మామూలు స్థితికి రాలేదు. ఈ విషయాన్ని ఈ నెల 4వ తేదీన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా బ్రౌన్ వెల్లడించారు. ‘ఈ నెల రోజుల వ్యవధిలో తాను 15 సార్లు తలకు స్నానం చేశాను. కానీ జుట్టు మాత్రం మామూలు స్థితికి రాలేదు. నా జుట్టును చూడండి. అది ఏ మాత్రం కదలడం లేదు. నేను చెబుతోంది వింటున్నారా? ఇది చాలా బ్యాడ్ ఐడియా. మీరు మాత్రం హెయిర్ స్ప్రే అయిపోతే ఎప్పుడూ గొరిల్లా గ్లూ స్ప్రేను మాత్రం జట్టుకు ఉపయోగించకండి. వాడితే నా జుట్టులాగే అయిపోతుంది.’ అంటూ టెస్సికా చెప్పుకొచ్చింది. టెస్సికా వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 19 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. టెస్సికా పరిస్థితిని చూసి చలించిపోయిన కొంత మంది నెటిజన్లు అయ్యో పాపం అంటుంటే.. మరికొంతమంది ‘జుట్టు ఇప్పుడు మామూలు స్థితికి వచ్చిందా’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ పెడుతున్నారు. అలాగే జుట్టును ఎలా పరిష్కరించుకోవాలో కూడా సూచించారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన మార్పు రాకపోవడంతో సోమవారం ఆస్పత్రికి వెళ్లినట్లు టెస్సికా పేర్కొన్నారు. ఈ మేరకు వైద్యురాలితో కలిసి ఓ ఫోటోను షేర్ చేశారు. అయితే గ్లూ జుట్లులోని లోపలి పొరల్లోకి వెళ్లడం వల్ల చిక్సి చేయడం కష్టతరమైన పని అని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందుకు బ్రౌన్ కోసం గోఫండ్‌మే అకౌంట్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఒక్క రోజులోనే 9 వేల డాలర్లను వసూలు చేసింది. దీనిపై స్పందించిన బ్రౌన్ తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే హెయిర్ నార్మల్ అయ్యే వరకు ప్రార్థించాలని కోరారు. ఇక టిక్‌టాక్ ద్వారా పరిచయమైన ఈ యువతి ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా మాద్యమాలలో వైరల్ అవుతోంది. చదవండి: మాధురీ దీక్షిత్‌ను ఫిదా చేసిన యువతి నుదుటిపై పింక్ డైమండ్.. విలువెంతో తెలుసా! View this post on Instagram A post shared by Tessica (@im_d_ollady) -
కేన్సర్ చికిత్సలో నత్తలు..!
కాన్బెర్రా: సముద్రపు నత్తల గ్రంధులు స్రవించే జిగురు కేన్సర్ వ్యాధి చికిత్సకు సమర్థమైన మందుగా ఉపయోగపడుతుందని ఆ్రస్టేలియాలోని ఫ్లిండర్స్, సదరన్ క్రాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే నత్తల నుంచి నొప్పిని తగ్గించే మందులతోపాటు మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపయోగపడే ఇన్సులిన్‌ను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సముద్ర జీవుల్లో మనకు ఉపయోగపడే రసాయనాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకు కేథరీన్ అబోట్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టింది. బ్యాక్టీరియా నుంచి రక్షించుకునేందుకు గాను ఆ్రస్టేలియా ప్రాంతంలోని ఒక రకమైన నత్త తన గుడ్లలోకి ప్రత్యేకమైన పదార్థాన్ని విసర్జిస్తున్నట్లు వీరు గుర్తించారు. ఈ పదార్థాన్ని కేన్సర్ కణాలపై ప్రయోగించినప్పుడు అవన్నీ మరణించాయని తెలిపారు. నత్తల జిగురులోని 6-బీఆర్ అనే పదార్థం పేగు కేన్సర్ కణితుల సైజును తగ్గించగలదని ప్రయోగాల ద్వారా వెల్లడైంది. సహజ సిద్ధమైన పదార్థం స్థానంలో తాము కృత్రిమంగా తయారు చేసిన 6-బీఆర్‌ను జంతువులపై ప్రయోగించి సత్ఫలితాలు సాధించామని కేథరీన్ తెలిపారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఫలితాలను రూఢీ చేసుకుని మానవులపై ఈ రసాయనాన్ని ప్రయోగించేందుకు వీలు ఉందని అంచనా. -
దారుణం : ప్లాన్‌చేసి మరీ భార్యను!
విదిశా : నిత్యం తాగొచ్చి హింసించే ఆ నిందితుడు, ఇంట్లో ఎవరూ లేకుండా ప్లాన్‌చేసి మరీ భార్యను హత్యచేశాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని విదిశాలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా.. విదిశాలోని రాజ్‌పుత్ కాలనీలో హల్కేరామ్ కుష్వాహ, దుర్గాబాయ్ (35) కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. భార్యతో తరచు గొడవపడే కుష్వాహ శుక్రవారం రోజు తన ఇద్దరు కుమారులను బటయకు వెళ్లాలని సూచించాడు. తండ్రి మాట విన్న ఇద్దరు టీనేజర్లు సాయంత్ర ఇంటికి వచ్చి చూడగా తల్లి ఎలాంటి కదలిక లేకుండా పడిఉండటాన్ని గమనించారు. తండ్రి చేసిన దురాగతాన్ని అర్థం చేసుకున్న 15 ఏళ్ల బాలుడు తల్లి హత్యపై ఫిర్యాదు చేశాడని కోత్వాలి పీఎస్ ఇన్స్పెక్టర్ ఆర్ఎన్ శర్మ తెలిపారు. తాగొచ్చి అమ్మను నాన్న కొట్టేవాడని, గతంలో ఓసారి విషం పెట్టి చంపాలని చూశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుమారులు ఇంట్లో లేకుండా చేసి హత్య చేయాలని కుష్వాహ ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ ప్రకారమే.. వారిని బయటకు పంపించి నిద్రపోతున్న భార్యను హత్య చేశాడు. భార్య ముక్కు, నోరు, కళ్లల్లో గట్టిగా అతుక్కునే జిగురులాంటి పదార్థాన్ని నిందితుడు పోసి.. ఓ గుడ్డను గట్టిగా చుట్టాడు. తొలుత దుర్గాబాయ్ కళ్లు ముసుకుపోయిన తర్వాత ముక్కు, నోరు భాగాల్లో జిగురుపోసి ఊపిరాడకుండా చిత్రహింసలకు గురిచేసి భార్యను ఆ నిందితుడు హత్య చేశాడని ఇన్స్పెక్టర్ శర్మ వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2016 మే నెలలో మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు మద్యం సేవించి ఇదేతీరుగా నిద్రిస్తున్న భార్యను హత్య చేయడం పోలీసులను సైతం షాక్‌కు గురి చేసింది. -
గుండె చిల్లు...సూపర్ జిగురు!
పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు పడితే ..ఇక ఆ పిల్లలు మరణానికి చేరువైనట్లే. వీలైనంత వేగంగా చికిత్స చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ గుండెకుపడ్డ చిల్లును పూడ్చే క్రమంలో ఎన్నో ఇబ్బందులుంటాయి. కుట్లు వేస్తే లేదా మరో ఇతర పద్ధతిలో చికిత్స చేస్తే ఆ చిన్ని గుండెలోని కణజాలం దెబ్బతినే అవకాశముంటుంది. ఈ చిక్కులన్నింటినీ సూపర్ జిగురుతో పరిష్కారించవచ్చునని అంటోంది బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ‘హైడ్రోఫోబిక్ లైట్-యాక్టివేటెడ్ అథెసివ్ (హెచ్ఎల్ఏఏ)’ అనే ఈ జిగురును ఓ పట్టీ(ప్యాచ్)పై వేసి గుండె రంధ్రం వద్ద అతికిస్తే చాలు.. సెకెన్లలో రంధ్రాన్ని పూడిపోయేందుకు సాయపడుతుంది. పట్టీని అతికించిన వెంటనే అతినీలలోహిత కాంతిని ప్రసరింపచేస్తే.. ఐదు సెకన్లలోనే జిగురు యాక్టివేట్ అయి రక్తం లీకేజీని అరికడుతుందట. రక్తం ప్రవహిస్తున్నా.. తేమగా ఉన్నా.. గుండె కొట్టుకుంటున్నా ఈ జిగురు పట్టీ కణజాలాన్ని గట్టిగా పట్టి ఉంచుతుందట. రంధ్రం పూడి, గాయం మానిన తర్వాత ప్యాచ్‌తో సహా ఇది సహజంగా విచ్ఛిన్నం అవుతుంది. దీనివల్ల ఎలాంటి దుష్ర్పభావమూ ఉండదట. నత్తల వంటి అనేక జీవులు నీటిలో తడిచిపోకుండా.. త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు జిగుర్లను స్రవిస్తుంటాయి. అలాంటి జీవులను స్ఫూర్తిగా తీసుకునే శాస్త్రవేత్తలు ఈ సూపర్ జిగురును తయారు చేయడం అసలు విశేషం. వెయ్యిలో ఎనిమిది మందికి చిల్లు... పుట్టుకతో వచ్చే గుండె సంబంధ లోపాలను ‘కాన్జెనిటల్ హార్ట్ డి ఫెక్ట్స్’గా పేర్కొంటారు. గుండెకు రంధ్రాలతో పుట్టడం వీటిలో ఒకటి. సాధారణంగా ప్రతి 1000 మందిలో 8 మందికి పుట్టుకతోనే గుండెలో రంధ్రాలు ఏర్పడే అవ కాశం ఉంది. ఇలాంటి గుండె సమస్యలకు మేనరిక వివాహాలు, జన్యుపరమైన వారసత్వం, గర్భవతిగా ఉన్నప్పుడు తీవ్ర జ్వరం రావడం, మందులు వికటించడం, ధూమపానం, ఆల్కహాల్ సేవించడం వంటి వి కారణాలు. గుండెలో రంధ్రాలు ఏర్పడేవారిలో 70 శాతం మందికి మందులు వాడితే ఆటోమేటిక్‌గా మూసుకుపోతాయి. 20 శాతం మందికి ఆపరేషన్ల ద్వారా నయం చేయొచ్చు. కానీ మిగతా 10 శాతం మందిలో మాత్రం కొన్నిసార్లు ఆపరేషన్లు చేసినా ప్రయోజనం ఉండకపోవచ్చు. - డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ హద్రోగ నిపుణులు, హైదరాబాద్